శ్వేతా శారద
అందాల పోటీల విజేత | |
జననము | చండీగఢ్, భారతదేశం | 2000 మే 24
---|---|
విద్య | ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ |
వృత్తి |
|
ఎత్తు | 1.80 m (5 ft 11 in) |
జుత్తు రంగు | బ్రౌన్ హెయిర్ |
కళ్ళ రంగు | బ్రౌన్ |
బిరుదు (లు) | మిస్ యూనివర్స్ ఇండియా 2023 (మిస్ దివా 2023|) |
ప్రధానమైన పోటీ (లు) | మిస్ దివా 2023 (విజేత) మిస్ యూనివర్స్ 2023 (టాప్-20) |
శ్వేతా శారదా (హిందీ: श्वेता शार्दा); (జననం 2000 మే 24) భారతీయ మోడల్, నర్తకి. పలు అందాల్లో పోటీల్లో సత్తా చాటిన ఆమె మిస్ యూనివర్స్ ఇండియా 2023 కిరీటాన్ని గెలుచుకుంది.[1][2] అమెరికాలోని ఎల్ సాల్వడార్లో 2023 నవంబరు 18న నిర్వహించిన మిస్ యూనివర్స్ 2023 పోటీలో ఆమె భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.[3] అయితే, ఆమె టాప్-20లోనే ఆగింది.
కాగా, నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ మిస్ యూనివర్స్ 2023 టైటిల్ కైవసం చేసుకుంది.[4] ఆమెకు మాజీ విశ్వ సుందరి బొన్ని గాబ్రియేల్ ఈ కిరీటాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపింది.[4]
కెరీర్[మార్చు]
చండీగఢ్‌లో 2000 మే 24న జన్మించిన శ్వేత శారద మోడల్‌గా, డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టింది. వృత్తిరీత్యా డ్యాన్సర్ కావాలనే తన కలను సాకారం చేసుకోవడానికి 16 ఏళ్ల వయసులో ముంబైకి వెళ్లింది. ఆమె డాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ దీవానే, డ్యాన్స్+లతో సహా అనేక రియాలిటీ షోలలో పాల్గొన్నది. ఆమె ఝలక్ దిఖ్లా జా 10లో కొరియోగ్రాఫర్‌గా కూడా చేసింది.[5]
సొంతంగా నృత్యకారిణిగా ఎదిగి బహుముఖ ప్రజ్ఞ, సాంకేతిక నైపుణ్యాలకు ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమె కొరియోగ్రాఫర్ గా వివిధ టెలివిజన్ కార్యక్రమాలు, మ్యూజిక్ వీడియోలు చేసింది. అలాగే అనేక నృత్య కార్యక్రమాలకు ఆమె కొరియోగ్రఫీ చేసింది.[6][7]
ఆమె బాలీవుడ్ నటుడు శంతను మహేశ్వరి సరసన జుబిన్ నౌటియాల్, తులసి కుమార్ లు ఆలపించిన "మస్త్ ఆంఖీన్" మ్యూజిక్ వీడియోలోనూ నటించింది.[8][9]
ముంబైలోని ది లలిత్‌లో 2023 ఆగస్టు 28న జరిగిన గ్రాండ్ ఫినాలేలో, ఆమె మిస్ దివా యూనివర్స్ 2023గా ఎంపిక కాగా, ఆమెకు మిస్ దివా యూనివర్స్ 2022 దివితా రాయ్ కిరీటాన్ని అలంకరించింది. [10]
ఇవీ చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "Shweta Sharda is Miss Diva Universe 2023: See all pictures of her crowning moment". Hindustan Times (in అమెరికన్ ఇంగ్లీష్). 28 August 2023.
- ↑ "Shweta Sharda wins Miss Diva Universe 2023 title. Who is she?". India Today (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.
- ↑ "Shweta Sarada : మన శ్వేతకు దక్కేనా 'విశ్వసుందరి' కిరీటం! | Vishwasundari Shveta get the crown". web.archive.org. 2023-11-19. Archived from the original on 2023-11-19. Retrieved 2023-11-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ 4.0 4.1 "విశ్వ సుందరి కిరీటం 'షెన్నిస్ పలాసియోస్' సొంతం |". web.archive.org. 2023-11-19. Archived from the original on 2023-11-19. Retrieved 2023-11-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Jhalak Dikhhla Jaa 10 EXCLUSIVE: Paras Kalnawat will dance to the tunes of choreographer Shweta Sharda while Rubina Dilaik and Sanam Johar pair-up to perform some sizzling dance moves!". Pinkvilla Telly (in ఇంగ్లీష్). 25 August 2022. Retrieved 29 August 2023.
- ↑ "Chandigarh girl Shweta Sharda is LIVA Miss Diva Universe 2023". Onmanorama (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.
- ↑ "Who is Shweta Sharda, the Miss Diva Universe 2023 winner?". Indian Express Limited (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.
- ↑ "Shantanu Maheshwari's Latest 'Mast Aankhein' Has Catchy Lyrics, Soothing Melody". Outlook (Indian magazine) (in ఇంగ్లీష్). Retrieved 24 February 2023.
- ↑ "Tulsi Kumar, Jubin Nautiyal come together for 'Mast Aankhein'". Daijiworld Media (in ఇంగ్లీష్). Retrieved 21 February 2023.
- ↑ "LIVA Miss Diva 2023 Crowning Moments!". beautypageants.in (in ఇంగ్లీష్). Retrieved 28 August 2023.