Coordinates: 24°13′08″N 69°04′52″E / 24.219°N 69.081°E / 24.219; 69.081

షకుర్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షకుర్ సరస్సు
1819 లో వచ్చిన భూకంపం ద్వారా ఏర్పడిన షకుర్ సరస్సు
షకుర్ సరస్సు is located in Gujarat
షకుర్ సరస్సు
షకుర్ సరస్సు
అక్షాంశ,రేఖాంశాలు24°13′08″N 69°04′52″E / 24.219°N 69.081°E / 24.219; 69.081
ఉపరితల వైశాల్యం300 km2 (120 sq mi)[1]

షకుర్ సరస్సు పాకిస్తాన్ దక్షిణ అంచున ఉన్న గుజరాత్, సింధ్ ప్రావిన్స్ సరిహద్దులో ఉంది. దీని విస్తీర్ణం 300 చదరపు కిలోమీటర్లు. సరస్సులోని 90 చదరపు కిలోమీటర్ల భాగం పాకిస్తాన్ పరిధిలోకి వస్తుంది. సరస్సులో ఎక్కువ భాగం అంటే 210 చదరపు కిలోమీటర్లు భారతదేశంలోనే ఉంది.

ఆవిర్భావం[మార్చు]

సరస్సు 1819 లో భారీ భూకంపం సంభవించినప్పుడు నారా నదికి (పురాన్ నది లేదా కోరి నది అని కూడా పిలుస్తారు) వచ్చిన వరద ద్వారా దాని దక్షిణ భాగంలో ఏర్పడింది. పాకిస్థాన్ సరిహద్దు అయిన రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంది.

పర్యావరణం[మార్చు]

ఉపగ్రహం నుండి అల్లాహ్ బండ్ స్థానం

రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో నీటిని నిలుపుకోవడం, ఉప్పు వెలికితీసే విధానం స్థానిక పర్యావరణంపై వినాశకరమైన ప్రభావాలను కలిగిస్తోంది. సహజ వన్యప్రాణుల జనాభాను తగ్గించడం, అడవి ఆవాసాలు, మడ అడవులను కొట్టివేయడం, అటవీ నిర్మూలన చేయడం వంటి పనులు అక్కడి ప్రాంతీయ పర్యావరణ వ్యవస్థను దెబ్బతీశాయి.[2]

వివాదాలు[మార్చు]

ఈ ప్రాంతంలోని భూభాగాల పై భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చాలా రోజుల వరకు వాదోపవాదాలు జరిగాయి. కచ్ ప్రాంతంలోని సరిహద్దులు చివరికి ఫిబ్రవరి 19, 1968 న పరిష్కరించబడ్డాయి. రాణ్ ఆఫ్ కచ్ నైరుతి దిశలో ఉన్న సర్ క్రీక్ ప్రాంతం ఇప్పటికీ వివాదాస్పదంగా ఉంది..[3]

మూలాలు[మార్చు]

  1. "LBOD project in Southern Pakistan is a social and ecological disaster - 'People's Tribunals' of 2008 and 2007". South Asia Citizens Watch. 11 November 2008. Archived from the original on 2 ఏప్రిల్ 2019. Retrieved 18 April 2019.
  2. "Environmental changes in Coastal Areas of Sindhi". Centre for Science and Environment (CSE). 2 December 2010. Archived from the original on 2015-09-23. Retrieved 2015-12-28.
  3. "Rann of Kutch 1965". GlobalSecurity.org. Retrieved 28 December 2015.