షోనాలి నాగరాణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
షోనాలి నాగరాణి
అందాల పోటీల విజేత
జూలై 2012 వాచ్ టైమ్స్ మ్యాగజైన్ ప్రారంభోత్సవంలో షోనాలి నాగరాణి
జననమున్యూఢిల్లీ, భారతదేశం
వృత్తి
  • నటి
  • టెలివిజన్ హోస్ట్
  • అందాల పోటీ టైటిల్ హోల్డర్
క్రియాశీల సంవత్సరాలు2003–ప్రస్తుతం
ఎత్తు1.73 m (5 ft 8 in)
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2003

షోనాలి నాగరాణి (ఆంగ్లం: Shonali Nagrani) ఒక భారతీయ నటి, టీవీ హోస్ట్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఆమె హిందీ భాషా చిత్రాలలో నటిస్తుంది. ఆమె 2003లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో ప్రవేశించింది. అక్కడ ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని పొందింది, మిస్ ఇంటర్నేషనల్ 2003లో పోటీ చేసిన ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది.[1] మోడల్‌గా కనిపించడంతో పాటు, ఆమె వరుసగా నాలుగు సంవత్సరాలు ఐపిఎల్ లకు ఆతిథ్యం ఇచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా 2011, 2012 సంవత్సరాలకు "50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్"లలో ఒకరిగా ఆమె ఎంపిక చేయబడింది.

వ్యక్తిగత జీవితం[మార్చు]

షోనాలి నాగరాణి ఢిల్లీలోని సింధీ కుటుంబానికి చెందినది. ఆమె బెంగ్‌డుబి, బాగ్‌డోగ్రాలోని గుడ్ షెపర్డ్ ఇంగ్లీష్ స్కూల్‌లో, న్యూ ఢిల్లీలోని ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంది. ఆమె తండ్రి రిటైర్డ్ ఇండియన్ నేవల్ ఆఫీసర్.

ఆమె 2003లో న్యూఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజీ నుండి డిగ్రీ పట్టభద్రురాలైంది. 2013లో, తన ప్రియుడు షిరాజ్ భట్టాచార్యను కేరళలో ఆమె వివాహం చేసుకుంది.[2][3]

కెరీర్[మార్చు]

మోడలింగ్[మార్చు]

ఆమె ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2003 కిరీటాన్ని పొందింది. దీంతో, ఆమె 2003 మిస్ ఇంటర్నేషనల్‌లో భారతదేశ ప్రతినిధిగా ఎంపికైంది. తత్ఫలితంగా ఆమె జపాన్‌లోని టోక్యోలో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ 2003లో 1వ రన్నరప్‌గా నిలిచింది.

2003లో భారతదేశ అధికారిక పర్యటనలో జరిగిన రిసెప్షన్‌లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌ (Prince of Wales)ను కలిసే అవకాశం కూడా ఆమెకు లభించింది. అప్పటి నుండి, ఆమె చురుకైన మోడల్‌గా ఉంది, అనేక మోడలింగ్ కంపెనీల ప్రదర్శనలలో పాల్గొన్నది.[4] టైమ్స్ ఆఫ్ ఇండియా 2011, 2012లలో ఆమె "50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్"లలో ఒకరిగా ఎంపికైంది.

టెలివిజన్[మార్చు]

షోనాలి నాగరాణి భారతీయ, బ్రిటిష్ టెలివిజన్‌లలో వ్యాఖ్యాతగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె జూమ్ టీవీలో పాప్‌కార్న్ హోస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. ఇండియన్ ఐడల్ క్రిస్మస్ స్పెషల్ ఎపిసోడ్‌కు ఆమె ప్రెజెంటర్‌గా వ్యవహరించింది. 2007లో, స్టార్ వన్‌లో గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో ఆమె పాల్గొన్నది. ఆమె 2007లో స్టార్ ప్లస్ దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డులలో, ఆ తర్వాత సోనీ టీవి మలేషియాలో నిర్వహించిన జిఐఐఎమ్ఎ లో కూడా మెరిసింది. ఇంకా, ఆమె సోనీలో మిస్టర్ అండ్ మిసెస్ టీవీకి హోస్ట్‌గా చేసింది. స్టార్ వన్‌లో సలామ్-ఎ-ఇష్క్ అనే జంట ఆధారిత రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా కూడా ఆమె పనిచేసింది.

ఆమె ఫిల్మీ కాక్‌టెయిల్, దుమ్‌దార్ హిట్‌లను హోస్ట్ చేసింది. ఆమె 2009లో ఖత్రోన్ కే ఖిలాడీ పోటీలో కలర్స్‌లో కూడా ఉంది. 2011లో, రియాలిటీ టీవీ షో బిగ్ బ్రదర్, బిగ్ బాస్ భారతీయ వెర్షన్ ఐదవ సీజన్‌లో ఆమె ఒక ప్రముఖ పోటీదారు.

క్రికెట్[మార్చు]

ఆమె 2006 నుండి క్రికెట్ షోలకు చురుకైన హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. అదే సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీని హోస్ట్ చేయడం ద్వారా ఆమె కెరీర్ ప్రారంభించింది. ఆమె భారతీయ ప్రేక్షకుల కోసం 2007 క్రికెట్ ప్రపంచ కప్‌ను నిర్వహించింది. 2008లో, ఆమె ఎక్స్‌ట్రా ఇన్నింగ్స్ టి20 అనే పేరుతో ఒక షోను నిర్వహించింది. 2009లో, ఆమె ఈఎస్‌పి‌ఎన్ టివి, స్టార్ క్రికెట్‌లో పెద్ద బ్రాండ్‌ల కోసం పనిచేసింది.

మాట్ స్మిత్‌తో కలిసి ఐపిఎల్ కవరేజీని 2011లో సహ-హోస్ట్ చేసింది. అక్కడ ఆమె స్టూడియో అతిథులతో పాటు విశ్లేషకురాలిగా వ్యవహరించింది. అప్పటి నుండి, ఆమె యూకె టెలివిజన్‌లో వరుసగా నాలుగు సీజన్‌లకు ఐపిఎల్ హోస్ట్ గా చేసింది.

సినిమా[మార్చు]

ఆమె హిందీ భాషా చిత్రాలలో పలు సహాయక పాత్రలు పోషించింది. ఆమె మొదట ఇమ్రాన్ హష్మీతో కలిసి 2005 చలనచిత్రం జెహెర్‌తో తన అరంగేట్రం చేసింది, అయితే ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ఆమె వైదొలగవలసి వచ్చింది.[5] ఆమె దిల్ బోలే హడిప్పా! (2009), రబ్ నే బనాదీ జోడీ (2008)లలో నటించింది.

వెబ్ సిరీస్[మార్చు]

ఆమె 2021లో అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమ్ చేసిన తాండవ్, జీ5లో వచ్చిన సన్‌ఫ్లవర్ లలోనూ నటించింది.

మూలాలు[మార్చు]

  1. "Catch-Up With The Past Miss Indias". The Times Of India. Archived from the original on 25 December 2010. Retrieved 11 December 2010.
  2. "Shonali Nagrani wedding album". intoday.in. 1 March 2013. Retrieved 1 March 2013.
  3. "Shonali Nagrani to tie the knot". The Times of India. 16 September 2012. Archived from the original on 11 April 2013. Retrieved 16 September 2012.
  4. "Indian designs going places". The Hindu. Chennai, India. 1 June 2004. Archived from the original on 29 September 2004.
  5. "Shonali acts funny – Entertainment". DNAindia.com. 15 May 2007. Retrieved 28 November 2011.