Coordinates: 25°16′56″N 83°00′00″E / 25.2821062°N 82.9999769°E / 25.2821062; 82.9999769

సంకట మోచన్ హనుమాన్ దేవాలయం (వారణాసి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంకట మోచన్ హనుమాన్ దేవాలయం
संकट मोचन हनुमान मंदिर
సంకట మోచన్ హనుమాన్ ఆలయ ప్రవేశం
సంకట మోచన్ హనుమాన్ ఆలయ ప్రవేశం
సంకట మోచన్ హనుమాన్ దేవాలయం (వారణాసి) is located in Varanasi district
సంకట మోచన్ హనుమాన్ దేవాలయం (వారణాసి)
వారణాసి జిల్లా మ్యాప్‌లో ఆలయ స్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు25°16′56″N 83°00′00″E / 25.2821062°N 82.9999769°E / 25.2821062; 82.9999769
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
ప్రదేశంవారణాసి
సంస్కృతి
దైవంహనుమంతుడు, శ్రీ రాముడు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుహిందూ ఆర్కిటెక్చర్
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ16వ శతాబ్దం
సృష్టికర్తతులసీదాస్

సంకట మోచన్ హనుమాన్ ఆలయం, ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో ఉన్న హనుమంతుడికి అంకితం చేయబడిన దేవాలయం. ఇది అస్సీ నది ఒడ్డున ఉంది. "సంకట్ మోచన్" అంటే "సమస్యల నివారిణి" అని అర్థం.[1]

చరిత్ర[మార్చు]

ఆలయ కట్టడ పనులు 16 వ శతాబ్దంలో ప్రసిద్ధ హిందూ ధర్మ బోధకుడు, కవి, సాధువు శ్రీ గోస్వామి తులసీదాస్ ద్వారా ప్రారంభించబడ్డాయి.[2]

తీవ్రవాద సంఘటన[మార్చు]

సాధారణంగా భక్తులు సందర్శిస్తున్న రోజుల్లోనే వారణాసిలో 2006 మార్చి 7 న మూడు పేలుళ్లు సంభవించాయి. దీని వల్ల తీవ్రంగా నష్టం జరిగింది.[3]

ప్రస్తుత ఆలయం[మార్చు]

నిరంతరం ప్రస్తుత ఆలయంలో భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తూ దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. 2006 తీవ్రవాద సంఘటన తరువాత, ఒక శాశ్వత పోలీసు పోస్ట్ ను ఆలయం లోపల ఏర్పాటు చేశారు.[4]

సంకట్ మోచన్ ఫౌండేషన్[మార్చు]

సంకట్ మోచన్ ఫౌండేషన్ (SMF) వీర భద్ర మిశ్రా, ఆలయ మహంత్ (పూజారి) ద్వారా 1982 లో స్థాపించబడింది, ఇది గంగా నదిని రక్షించేందుకు పనిచేస్తుంది.[5]

సంకట్ మోచన్ సంగీత్ సమరోహ[మార్చు]

ఏప్రిల్ నెలలో ప్రతి సంవత్సరం, ఆలయం "సంకట్ మోచన్ సంగీత్ సమరోహ" పేరుతో ఒక శాస్త్రీయ సంగీత, నృత్య సంగీత ఉత్సవం నిర్వహిస్తుంది. దీనిలో భారతదేశంలోని సంగీతకారులు, ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ పండుగ 88 సంవత్సరాల క్రితం నుండి నిర్వహించబడుతోంది.[6]

మూలాలు[మార్చు]

  1. Chaturvedi, B. K. (31 December 2002). Tulsidas (Mystics Saints of India). Allahabad: Books For All. ISBN 8173862508.
  2. Callewaert, Winand M. (2000). Banaras: vision of a living ancient tradition. Hemkunt Press. p. 90. ISBN 81-7010-302-9.
  3. "Blasts in Sankatmochan temple and railway station kill dozen, several injured". Indian Express. 8 March 2006.
  4. "Varanasi temple gets permanent police post". Indian Express. 14 March 2006.
  5. "Adult Award Winner in 1992: Veer Bhadra Mishra". en:Global 500 Roll of Honour website. Archived from the original on 2011-06-22. Retrieved 2022-04-17.
  6. "Sankat Mochan music concert begins". The Times of India. 4 Apr 2010.