సంకల్పం (1995 సినిమా)
స్వరూపం
సంకల్పం (1995 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ.ఎమ్.రత్నం |
---|---|
తారాగణం | జగపతి బాబు, జయసుధ, గౌతమి, సుదాకర్ |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సూర్యచిత్ర |
భాష | తెలుగు |
సంకల్పం 1995 లో విడుదలైన సినిమా. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్‌లో ఎ.ఎం.రత్నం నిర్మించి దర్శకత్వం వహించాడు. ఇందులో జగపతి బాబు, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. కోటి సంగీతం సమకూర్చాడు. ఇది తెలుగులో ప్రకాష్ రాజ్ కు తొలి చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పాలైంది.[1][2]
ఒక వ్యక్తి రాజకీయ బలం లేకుండా సొంతముగా ఏదైనా పరిశ్రమ నిజాయితీగా చట్టబద్దముగా స్థాపించాలనుకొన్నపుడు అతనికి అధికారులనుండి ఎదురయ్యే ఇబ్బందులు, కష్టాలు, ఎలా ఉంటాయో తెలియ చెపుతూ సాగే చిత్రం ఈ సంకల్పం. జగపతి బాబు ఈ పాత్రని పోషించాడు. అతనికి ఇలాంటి ఇబ్బందులు కష్టాలు ఎదురైనపుడు వాటిని అతడు అధిగమించడం ఆసంకల్పంలో అతనికి స్నేహితుడిగా సహాయం చేసే పాత్రలో సుదాకర్, అతని ప్రయత్నంలో నిజాయితీని గమనించి అతనికి సహాయంచేసే మరొక పాత్రలో జయసుధలు నటించారు. అతనిని ప్రేమించే మరదలిగా గౌతమి నటించింది.
నటీనటులు
[మార్చు]పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయనీ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "అచ్చట్లో ముచ్చట్లో" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:52 |
2. | "చిన్నారి అనసుకు" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:53 |
3. | "ధీం తనక్కు" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 5:09 |
4. | "కురిసింది వానా" | వడ్డేపల్లి కృష్ణ | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. పి. పల్లవి | 5:00 |
5. | "మెత్తగా హత్తుకో" | భువనచంద్ర | ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర | 4:01 |
మొత్తం నిడివి: | 23:55 |
మూలాలు
[మార్చు]- ↑ "Heading". The Cine Bay. Archived from the original on 2021-06-15. Retrieved 2020-08-17.
- ↑ "Heading-2". gomolo. Archived from the original on 2018-06-12. Retrieved 2020-08-17.