సబ్రీ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ustad Sabri Khan
उस्ताद साबरी खान
ఉస్తాద్ సబ్రీ ఖాన్
page=81
ఉస్తాద్ సబ్రీ ఖాన్
వ్యక్తిగత సమాచారం
జననం21 మే 1927
మొరదబాద్,ఉత్తరప్రదేశ్, భారతదేశం.
మరణం2015 డిసెంబరు 1(2015-12-01) (వయసు 88)
న్యూఢిల్లీ, భారతదేశం
సంగీత శైలిభారతీయ క్లాసికల్ సంగీతం, హిందుస్థానీ క్లాసికల్ సంగీతం.
వాయిద్యాలుసారంగి

ఉస్తాద్ సబ్రీ ఖాన్ (21 మే 1927 – 1 డిసెంబరు 2015) ప్రసిద్ధ సారంగి వాద్యకారుడు. 1947 ఆగస్టు 15 అర్ధ రాత్రి స్వాతంత్ర్య ఉత్సవాలు జరిగినప్పుడు సబ్రీ ఖాన్ సారంగీ వాయించారు. నెహ్రూ అంతిమ ఘడియల్లో ఉన్నప్పుడు కూడా సబ్రీ సారంగీ వాయించారు. ఆయనకు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు లభించాయి.[1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన మే 21 1927ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాదు లో జన్మించారు.[2] ఆయన సైనియా మొరాదాబాద్ ఘరానాకు చెందిన వారు. ఈ ఘరానా మొఘల్ సామ్రాజ్య చక్రవర్తి అక్బర్ కొలువులోని ప్రసిద్ధ సంగీతకారుడు తాన్‌సేన్ యొక్క సాంప్రదాయానికి చెందినది. సారంగీ వాద్యానికి ఆయన కొత్త ఊపిరులూదారు. సారంగీ వాద్యం వేశ్యా వాటికలకు పరిమితమైందన్న అప్రదిష్ట ఉన్నప్పుడు సబ్రీ ఖాన్ వాద్యానికి అపారమైన గౌరవ ప్రతిష్ఠలు తెచ్చి పెట్టారు. సారంగీ అత్యంత క్లిష్టమైన వాయిద్యం అంటారు. ఆ రోజుల్లో ఆయన ఉస్తాద్ ఆమిర్ ఖాన్, బడే గులాం అలీ ఖాన్, బేగం అఖ్తర్, పండిత్ ఓం ప్రకాశ్ ఠాకూర్ మొదలైన సంగీత విద్వాంసుల కచేరీలలో సారంగీ వాయించారు. ఆకాశ వాణితో ఆయనకు 50 ఏళ్ల అనుబంధం ఉంది.

సారంగీ అంట్ సౌ రంగీ (వంద రంగులతో కూడింది) అన్న భాష్యం చెప్పిన విద్వాంసుడు సబ్రీ ఖాన్. గొప్ప వయొలిన్ విద్వాంసుడైన యెహూదీ మెనుహిన్ తో కలిసి జుగల్బందీలో సబ్రీ ఖాన్ సారంగి వాయించడం వల్ల ఆ వాద్యానికి పశ్చిమ దేశాలలో అపారమైన ఆదరణ వచ్చింది.[3]

సారంగీ అంట్ సౌ రంగీ (వంద రంగులతో కూడింది) అన్న భాష్యం చెప్పిన విద్వాంసుడు సబ్రీ ఖాన్. గొప్ప వయొలిన్ విద్వాంసుడైన యెహూదీ మెనుహిన్ తో కలిసి జుగల్బందీలో సబ్రీ ఖాన్ సారంగి వాయించడం వల్ల ఆ వాద్యానికి పశ్చిమ దేశాలలో అపారమైన ఆదరణ వచ్చింది.

సబ్రీ ఖాన్ కుమారుడు, మనవడు సుహైల్ యూసుఫ్ ఖాన్ కూడా సారంగి కళాకారులే. 2007 నవంబర్ 7న నార్వేలో జరిగిన ఓస్లా ప్రపంచ సంగీతోత్సవంలో సబ్రీ ఖాన్ తన కుమారుడు, మనవడితో కలిసి కచేరీ చేయడం అపూర్వమైన సన్నివేశం.

కుటుంబం

[మార్చు]

ఆయనకు నలుగురుకుమారులు, ఐదుగురు కుమార్తెలు. వారికుమారులలో సర్వార్ సాబ్రి( తబలా వాద్యకారుడు), జమాల్ సర్వార్ సబ్రి (ఛార్టెడ్ అకౌంటెంత్), కమల్ సబ్రి (సారంగి వ్యాద్యకారుడు), గుల్ఫం సబ్రి (తబలా వాద్యకారుడు). ఆయన మనుమలు కూడా సంగీతకారులు. వారిలో సుహైల్ యూసుఫ్ ఖాన్ (సారంగి), ఫైసల్ (తబలా), షరీఖ్(తబలా), జునైద్ (గిటార్), నాబీల్(సారంగి)

ఆయన డిసెంబరు 1 2015న న్యూఢిల్లీలోని తన స్వగృహంలో మరణించారు.[4]

పురస్కారాలు, సత్కారాలు

[మార్చు]
పద్మశ్రీపురస్కారం
  • సాహిత్య కళాపరిషత్ అవార్డు.
  • శోభన కళా సంగం అవార్డు – 1985
  • బేగం అక్తర్ అవార్డు.
  • సంగీత నాటక అకడమి అవార్డు – 1986
  • ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అవార్డు, లక్నో – 1990
  • పద్మశ్రీ అవార్డు - భారతదేశ అధ్యక్షునిచే 1992లో
  • ఉస్తాద్ చంద ఖాన్ అవార్డు – 2002
  • సంగీత భూషణ అవార్డు - 2002
  • లైఫ్ టైం అచీవ్‌మెంటు అవార్డు - LEGENDS OF INDIA – DMA – ఢిల్లీ – 2003
  • నేషనల్ ఆర్టిస్టు అవార్డు - ఆల్ ఇండియా రేడియో ప్రసార్ భారతి అవార్డు – 2004
  • పద్మభూషణ అవార్డు – 2006
  • ఠాగూర్ రత్న అవార్డు - బెంగాల్ గవర్నర్ గారిచే -2012

ఆయనకు అనేక జాతీయ అవార్డులతో పాటు పద్మశ్రీ 1992లోనూ, పద్మవిభూషణ్ 2006 లోనూ వచ్చాయి.[5]

మూలాలు

[మార్చు]
  1. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.
  2. Hunt, Ken. "Sabri Khan – Biography". Allmusic. Retrieved 2009-03-16.
  3. "ఉస్తాద్ సబ్రీ ఖాన్‌ అస్తమయం". Archived from the original on 2015-12-08. Retrieved 2016-01-14.
  4. "Ustad Sabri Khan Saheb has passed away earlier this morning. 21st May 1927 - 1st Dec 2015". Suhail Yusuf Khan (New Delhi). 2015. Retrieved 1 December 2015.
  5. "Padma Awards". Ministry of Communications and Information Technology (India). Retrieved 2009-03-08.

ఇతర లింకులు

[మార్చు]