Jump to content

సభావత్ రాములు నాయక్

వికీపీడియా నుండి

రాములు నాయక్ సభావత్ (9 జనవరి 1965) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 2014 నుండి 2018 వరకు తెలంగాణ తొలి శాసనమండలి సభ్యుడు[1].తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్య వ్యవస్థాపకులలో ఒకరు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ముఖ్య పాత్ర పొషించాడు.

సభావత్ రాములు నాయక్‌
సభావత్ రాములు నాయక్


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014 నుండి 2018 వరకు

ఎమ్మెల్సీ
నియోజకవర్గం నారాయణఖేడ్ శాసన మండలి

వ్యక్తిగత వివరాలు

జననం 9 జనవరి 1965
ర్యాలమడుగు తండా నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు లక్ష్మన్ నాయక్,చాందిబాయి
జీవిత భాగస్వామి రాధబాయి
సంతానం నరెందర్,రాజేందర్,జితేందర్, సైలెందర్
నివాసం హైదరాబాద్

జీవిత విషయాలు

[మార్చు]

రాములు నాయక్ 1965,జనవరి 09 న మెదక్ జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ర్యాలమడుగు తండా లో జన్మించాడు.బంజారా లంబాడీ [2]సామాజీక వర్గానికి చెందిన రాజకీయ నాయకుడు.రాములు నాయక్ కు రాధబాయితో వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, నరేందర్,రాజేందర్,జితేందర్,సైలేందర్ ఉన్నారు.

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్లొని ముఖ్య పాత్ర పోషించారు. కేసీఆర్ కు నమ్మినబంటుగా ఉండేవాడు.2001 లో కేసీఆర్ స్థాపించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకులలో ఒకరు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెన్నంటి ఉండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక సార్లు అరేస్టు అయ్యి జైలుకు వెళ్ళాడు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

రాములు నాయక్ హైదరాబాదులోని కార్మిక శాఖలో జూనియర్ అసిస్టెంట్ పని చేస్తు రాజకీయానికి ఆకర్శీతులై కాన్షీరామ్ స్థాపించిన బహుజన సమాజ్ పార్టీ కాన్షిరామ్ నాయకత్వంలో 1994లో హైదరాబాదులోని సుందరయ్య భవన్ లో బహుజన సమాజ్ పార్టీలో చేరారు. అనంతరం ప్రత్యేక తెలంగాణా కోసం కేసీఆర్ చేస్తున్న ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ కు కుడిభుజంగా వ్యవహరించారు. 2001 లో కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి లో వ్యవస్థకులలో ఒకరుగా ఉంటు ఉద్యమంలో పాల్గొని అనేక సార్లు అరెస్టు అయ్యి జైలుకు వెళ్ళాడు. తెలంగాణ వచ్చిన తర్వాత బోథ్ నియోజకవర్గం ఎస్టీ టికెట్ కోసం ప్రయత్నించారు. దానిని పొందడంలో విఫలం కావడంతో ఆ ఉద్యమనాయకుని తెలంగాణ రాష్ట్ర సమితి గవర్నర్ కోటాలో నారాయణఖేడ్ శాసన మండలి కి ఎమ్మెల్సీగా నామినేట్ చెసింది. 2014 నుండి 2018 వరకు నారాయణఖేడ్ నుండి ఎమ్మెల్సీగా పని చేశాడు.‌అనంతరం 18 అక్టోబర్ 2018 లో నారాయణఖేడ్ శాసన మండలి సభ్యుడు నాయక్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని[3] తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం ఆయన పై వేటు వేయడంతో[4] 14 అక్టోబర్ 2018లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి ఆర్.సి.కుంతీయ నాయకత్వంలో రాములు నాయక్ దేశ రాజధాని ఢీల్లిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షయంలో 28 అక్టోబర్ 2018 న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు[5].ఉమ్మడి వరంగల్, ఖమ్మం,నల్గొండ జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా[6] [7]పొటిచేశారు.ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో టిపిసిసి ఉపాధ్యక్షుడుగా ఉన్నారు.

మూలాలు

[మార్చు]
  1. "MLC Ramulu Nayak - Latest News in Telugu, Photos, Videos, Today Telugu News on MLC Ramulu Nayak | Sakshi". www.sakshi.com. Retrieved 2024-07-11.
  2. "గిరిజనుడ్ని కాబట్టే సస్పెండ్ చేశారు.. రాములు నాయక్ కంటతడి". Samayam Telugu. Retrieved 2024-07-11.
  3. Ganeshan, Balakrishna (2018-10-18). "'KTR destroyed my 20-year career in 20 minutes': TRS founding member, MLC Ramulu Naik". The News Minute (in ఇంగ్లీష్). Retrieved 2024-07-11.
  4. "ఎమ్మెల్సీ రాములు నాయక్ పై వేటు". Telugu Times - USA NRI Telugu News Telugu News Papers In USA (in ఇంగ్లీష్). Retrieved 2024-07-11.
  5. Staff, Scroll (2018-10-27). "Telangana Assembly polls: TRS leaders Narsa Reddy and Ramulu Naik join Congress". Scroll.in (in ఇంగ్లీష్). Retrieved 2024-07-11.
  6. ABN (2021-03-01). "అరాచక పాలనకు చరమగీతం పాడుదాం". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-11.
  7. "మొదటి ప్రాధాన్యత ఓటు తో రాములు నాయకులు గెలిపించండి". Prajapalana News (in ఇంగ్లీష్). Archived from the original on 2024-07-11. Retrieved 2024-07-11.