సర్దార్ సరోవర్ ఆనకట్ట
సర్దార్ సరోవర్ ఆనకట్ట | |
---|---|
అధికార నామం | సర్దార్ సరోవర్ ఆనకట్ట |
ప్రదేశం | నవగాం, కేవడియా, నర్మద జిల్లా, గుజరాత్ |
అక్షాంశ,రేఖాంశాలు | 21°49′49″N 73°44′50″E / 21.83028°N 73.74722°E |
స్థితి | పనిచేస్తోంది |
నిర్మాణం ప్రారంభం | 1987 ఏప్రిల్ |
ప్రారంభ తేదీ | 2017 సెప్టెంబరు 17 |
యజమాని | గుజరాత్ ప్రభుత్వం |
నిర్వాహకులు | సర్దార్ సరోవర్ నర్మదా నిగం లిమిటెడ్ |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | గ్రావిటీ డ్యామ్ |
నిర్మించిన జలవనరు | నర్మదా నది |
ఎత్తు (పునాది) | 163 మీ. (535 అ.) |
పొడవు | 1,210 మీ. (3,970 అ.) |
Spillways | 30 (Chute spillway (auxiliary) – 7 : 18.30 m x 18.00 m, Service Spillway – 23 : 18.30 m x 16.75 m) |
Spillway type | Ogee |
Spillway capacity | 86,944 m3/s (3,070,400 cu ft/s) |
జలాశయం | |
సృష్టించేది | సర్దార్ సరోవర్ జలాశయం |
మొత్తం సామర్థ్యం | 9.460 కి.మీ3 (7,669,000 acre⋅ft) (334.12 tmc ft) |
క్రియాశీల సామర్థ్యం | 5.760 కి.మీ3 (4,670,000 acre⋅ft) (203.44 tmc ft) |
క్రియారహిత సామర్థ్యం | 3.700 కి.మీ3 (3,000,000 acre⋅ft) |
పరీవాహక ప్రాంతం | 88,000 కి.మీ2 (34,000 చ. మై.) |
ఉపరితల వైశాల్యం | 375.33 కి.మీ2 (144.92 చ. మై.) |
గరిష్ఠ పొడవు | 214 కి.మీ. (133 మై.) |
గరిష్ఠ వెడల్పు | 16.10 కి.మీ. (10.00 మై.) |
గరిష్ఠ నీటి లోతు | 140m |
సాధారణ ఎత్తు | 138 మీ. (453 అ.) |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | Sardar Sarovar Narmada Nigam Limited |
టర్బైన్లు | Dam: 6 × 200 MW Francis pump-turbine Canal: 5 × 50 MW Kaplan-type[1] |
Installed capacity | 1,450 MW |
వార్షిక ఉత్పత్తి | Varies from 1 Billion kWh in surplus rainfall year to 0.86 Billion kWh in deficit year. |
సర్దార్ సరోవర్ ఆనకట్ట గుజరాత్ రాష్ట్రంలో నర్మదా జిల్లాలోని కేవడియా పట్టణానికి సమీపంలో నర్మదా నదిపై నిర్మించిన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు నీరు, విద్యుత్తు అందించడానికి ఈ ఆనకట్టను నిర్మించారు.
భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ 1961 ఏప్రిల్ 5 న ఈ ప్రాజెక్టుకు పునాది వేసాడు.[2] ప్రపంచ బ్యాంకు అందించిన US$20 కోట్ల రుణాన్ని ఉపయోగించి నీటిపారుదలని పెంచడం, జలవిద్యుత్ ఉత్పత్తి చేయడం కోసం 1979 లో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. [3] ఆనకట్ట నిర్మాణం 1987 లో ప్రారంభమైంది. అయితే నిర్వాసితుల ఆందోళనలపై నర్మదా బచావో ఉద్యమం నేపథ్యంలో 1995 లో భారత సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. 2000-01లో ప్రాజెక్టును పునరుద్ధరించారు. అయితే SC నుండి ఆదేశాల ప్రకారం 111 మీటర్ల తక్కువ ఎత్తుతో ఇది మొదలైంది. ఆ తర్వాత 2006 లో 123 మీటర్లకు, 2017 లో 139 మీటర్లకు ఎత్తును పెంచారు. సర్దార్ సరోవర్ ఆనకట్ట పొడవు 1210 మీటర్లు.[4] ఈ ఆనకట్టను 2017 లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించాడు.[5] ఆనకట్ట లోని నీటి మట్టం చివరికి 2019 సెప్టెంబరు 15 న అత్యధిక సామర్థ్యమైన 138.7 మీటర్లకు చేరుకుంది.[6][7]
నర్మదా నదిపై తలపెట్టిన 25 ఆనకట్టలలో ఒకటైన సర్దార్ సరోవర్ ఆనకట్ట, అతిపెద్ద నిర్మాణం. దాని నిర్మాణంలో ఉపయోగించిన కాంక్రీటు పరిమాణం పరంగా, అమెరికా లోని కొలంబియా నదికి అడ్డంగా ఉన్న గ్రాండ్ కౌలీ డ్యామ్ తర్వాత, ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద కాంక్రీట్ డ్యామ్.[8][9] ఇది నర్మదా లోయ ప్రాజెక్టులో ఒక భాగం. నర్మదా నదిపై భారీ నీటిపారుదల, జలవిద్యుత్ బహుళ-ప్రయోజన డ్యామ్‌ల శ్రేణి నిర్మాణంతో కూడిన ఒక పెద్ద హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు ఇది. భారత సర్వోన్నత న్యాయస్థానం (1999, 2000, 2003)లో అనేక కేసుల తర్వాత, 2014 నాటికి నర్మదా నియంత్రణ అథారిటీ తుది ఎత్తులో మార్పులను ఆమోదించింది. తొలుత అనుకున్న 80 మీ. (260 అ.) నుండి ఎత్తును పెంచుకుంటూ చివరికి 163 మీ. (535 అ.) ఎత్తుకు చేరింది.[10][11] ఈ ప్రాజెక్టు ద్వారా 19 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగునీటిని కలుగుతుంది. ఇందులో ఎక్కువ భాగం కచ్, సౌరాష్ట్రలోని కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయి.
ఆనకట్ట ప్రధాన విద్యుత్కేంద్రంలో ఆరు 200 మెగావాట్ల (MW) ఫ్రాన్సిస్ పంప్-టర్బైన్లు విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అదనంగా, ప్రధాన కాలువ కోసం ఒక పవర్ ప్లాంట్‌లో ఐదు 50MW కప్లాన్ టర్బైన్ -జనరేటర్లు ఉన్నాయి. మొత్తం విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం 1,450 MW. [12] ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఆనకట్టకు ఎదురుగా ఉంది. వల్లభ్‌భాయ్ పటేల్‌కు నివాళిగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.[13]
భౌగోళికం
[మార్చు]ఈ ఆనకట్ట గుజరాత్‌లోని నర్మదా జిల్లాలో, గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కెవాడియా గ్రామంలో ఉంది. ఆనకట్టకు పశ్చిమాన, మధ్యప్రదేశ్ లోని మాళ్వా పీఠభూమి ఉంది. ఇక్కడ నర్మదా నది కొండల ప్రాంతాలను విడదీసి, మాథ్వార్ కొండలలో ముగుస్తుంది.[14]
ఆనకట్ట 1,210 మీటర్ల పొడవు, 163 మీటర్ల ఎత్తు ఉంది. సర్దార్ సరోవర్ జలాశయ స్థూల సామర్థ్యం 0.95 మిలియన్ హెక్టారు మీటర్లు, ప్రత్యక్ష నిల్వ సామర్థ్యం 0.586 మిలియన్ హెక్టార్ మీటర్లు. జలాశయం, 214 కి.మీ. ల సగటు పొడవుతో, 1.7 కి.మీ. వెడల్పుతో మొత్తం సుమారు 37,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. ఆనకట్ట పైన నది పరీవాహక ప్రాంతం 88,000 చదరపు కిలోమీటర్లు. దీని స్పిల్‌వేకు సెకనుకు 87,000 క్యూబిక్ మీటర్ల ప్రవాహ సామర్థ్యం ఉంది.[15] ఇంటిగ్రేటెడ్ రివర్ బేసిన్ ప్లానింగ్, డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవడానికి ఈ ఆనకట్ట ఒక కేస్ స్టడీ వంటిది.[16]
చరిత్ర
[మార్చు]ఈ ప్రాజెక్టును భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిపాదించాడు. 1961లో జవహర్‌లాల్ నెహ్రూ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల గుండా అరేబియా సముద్రం వరకు ప్రవహించే నర్మదా నది వినియోగాన్ని అధ్యయనం చేయడానికి అప్పటి కేంద్ర ప్రభుత్వం ఒక సమగ్ర సర్వే నిర్వహించింది.[17]
నది పరీవాహక ప్రాంతంలో మూడు రాష్ట్రాలు (గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్) ఉన్నందున నీరు ఇతర ముఖ్యమైన వనరులను పంచుకోవడంలో వివాదాలు ఉన్నాయి. చర్చలు సఫలం కాకపోవడంతో 1969 లో నర్మదా జల వివాద ట్రిబ్యునల్‌ను (NWDT) స్థాపించారు. అన్ని నివేదికలను పరిశీలించాక, NWDT 1979 లో తీర్పు ఇచ్చింది.[18]
గుజరాత్‌కు ప్రాజెక్టు ప్రాముఖ్యత
[మార్చు]ఈ డ్యామ్‌ను 'గుజరాత్‌కు జీవనాడి' అంటారు. గుజరాత్ కమాండ్ ఏరియాలో డెబ్బై ఐదు శాతం కరువు పీడిత ప్రాంతంగా పరిగణించబడుతుంది. ఈ ఆనకట్ట కచ్, సౌరాష్ట్ర ప్రాంతాలకు తాగునీటిని అందిస్తుంది. 2021 లో మొదటిసారిగా సర్దార్ సరోవర్ ఆనకట్ట వేసవిలో నీటిపారుదల కొరకు నీటిని అందించింది.[19]
నర్మదా కాలువ
[మార్చు]ఆనకట్ట ద్వారా సాగునీరు అందుతుంది. గుజరాత్‌లో 12 జిల్లాలు, 62 తాలూకాలు, 3,393 గ్రామాల్లోని 17,920 కి.మీ2 (6,920 చ. మై.) (వీటిలో 75% కరువు పీడిత ప్రాంతాలు) విస్తీర్ణం లోనూ రాజస్థాన్‌లోని బార్మర్, జలోర్ జిల్లాలలోని 730 కి.మీ2 (280 చ. మై.) విస్తీర్ణం లోనూ శుష్క ప్రాంతాలకు సాగునీటిని అందిస్తుంది. ఆనకట్ట నుండి గుజరాత్‌లోని 9490 గ్రామాలు, 173 పట్టణ కేంద్రాలకు రాజస్థాన్‌లో 1336 గ్రామాలు, 3 పట్టణాలకు త్రాగునీటిని అందిస్తారు. నదీ తీరంలో 30,000 హె. (74,000 ఎకరం) విస్తీర్ణంలో ఉన్న 210 గ్రామాలకూ, 400,000 జనాభా ఉన్న బరూచ్ నగరానికీ ఈ ఆనకట్ట, వరద నుండి రక్షణ కలిగిస్తుంది.[20] సౌరాష్ట్ర నర్మదా అవతరన్ నీటిపారుదల అనేది, ఈ కాలువ నీటిని ఉపయోగించి చాలా ప్రాంతాలకు సాగునీరు అందించే ఒక ప్రధాన కార్యక్రమం.
సౌర విద్యుత్ ఉత్పత్తి
[మార్చు]2011 లో గుజరాత్ ప్రభుత్వం, కాలువపై సౌర ఫలకాలను ఉంచడం ద్వారా సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రణాళికలను ప్రకటించింది. ఇది చుట్టుపక్కల గ్రామాలకు విద్యుత్తును అందించేందుకు, నీరు ఆవిరవడాన్ని తగ్గించేందుకూ సహాయపడుతుంది. మొదటి దశలో 25 కి.మీ పొడవున కాలువపై ప్యానెల్‌లను అమర్చి, 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పుతారు.[21]
స్టాట్యూ ఆఫ్ యూనిటీ
[మార్చు]సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్ ప్రభుత్వం ఆనకట్ట ముందు అతని విగ్రహాన్ని నిర్మించింది. ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా మారింది.[22]
క్రియాశీలత
[మార్చు]ఈ ఆనకట్ట భారతదేశంలోని అత్యంత వివాదాస్పదమైన వాటిలో ఒకటి. దాని పర్యావరణ ప్రభావం, నికర ఖర్చులకు-తగ్గ-ప్రయోజనాలపై విస్తృతంగా చర్చ జరిగింది.[23] ప్రపంచ బ్యాంకు మొదట్లో నిధులు సమకూర్చింది, అయితే రాష్ట్ర ప్రభుత్వాలు రుణంతో ముడిపడీ ఉన్న పర్యావరణ తదితర అవసరాలను పాటించకపోవడంతో, 1994 లో భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు బ్యాంకు ఈ ఋణాన్ని ఉపసంహరించుకుంది.[24] 1980 ల చివరి నుండి నర్మదా ఆనకట్ట వివాదాలకు, నిరసనలకు కేంద్రంగా ఉంది. [25]
అలాంటి ఒక నిరసన, స్పానర్ ఫిల్మ్స్ వారి డాక్యుమెంటరీ డ్రోన్డ్ అవుట్ (2002) ప్రధాన స్థానాన్ని ఆక్రమించింది. ఇది నర్మదా ఆనకట్టకు మార్గం ఇవ్వకుండా ఇంట్లోనే ఉండి మునిగిపోవాలని నిర్ణయించుకున్న ఒక గిరిజన కుటుంబాన్ని చిత్రీకరించింది. [26] దానికి ముందు ఆనంద్ పట్వర్ధన్, సిమంతిని ధురు లు ఎ నర్మదా డైరీ (1995) అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని నిర్మించారు. నర్మదా బచావో ఆందోళన్ ("నర్మద రక్షణ ఉద్యమం") సర్దార్ సరోవర్ ఆనకట్ట నిర్మాణంలో ప్రత్యక్షంగా ప్రభావితమైన వారికి "సామాజిక పర్యావరణ న్యాయం " కోసం చేసిన ప్రయత్నాలు ఈ చిత్రంలో ప్రముఖంగా ఉన్నాయి. ఇది ఉత్తమ డాక్యుమెంటరీగా 1996 ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకుంది.[27]
నిరసనల్లో ప్రధానమైన పాత్ర పోషించిన వ్యక్తి, NBA నాయకురాలు మేధా పాట్కర్.[28] ఆమెపై మనీలాండరింగ్ ఆరోపణలు రావడంతో, నిరసనలో ఆమె పాత్రపై ప్రశ్నలు వచ్చాయి.[29] నిరసనలో పాల్గొన్న ఇతర ప్రముఖ వ్యక్తులు బాబా ఆమ్టే, అరుంధతీ రాయ్, అమీర్ ఖాన్.[30]
ఎత్తు పెంచారు
[మార్చు]- 1999 ఫిబ్రవరిలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఆనకట్ట ఎత్తును 80 మీ. (260 అ.) నుండి 88 మీ. (289 అ.) కు పెంచడానికి అనుమతినిచ్చింది. .
- 2000 అక్టోబరులో మళ్లీ సుప్రీంకోర్టు, 2 - 1 మెజారిటీ తీర్పులో ఆనకట్టను 90 మీ. (300 అ.) వరకు నిర్మించేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది.[10]
- 2002 మేలో నర్మదా కంట్రోల్ అథారిటీ ఆనకట్ట ఎత్తును 95 మీ. (312 అ.) కి పెంచడానికి ఆమోదించింది.
- 2004 మార్చిలో అథారిటీ, ఆనకట్త ఎత్తును మరో 15 మీ. (49 అ.) పెంచేందుకు అనుమతించింది. దాంతో ఆనకట్ట ఎత్తు 110 మీ. (360 అ.) కి పెరుగుతుంది.
- 2006 మార్చిలో నర్మదా కంట్రోల్ అథారిటీ, ఆనకట్ట ఎత్తును 110.6 మీ. (363 అ.) నుండి 121.9 మీ. (400 అ.) కు పెంచడానికి అనుమతిని ఇచ్చింది. 2003 లో ఆనకట్ట ఎత్తును మళ్లీ పెంచేందుకు భారత సుప్రీంకోర్టు నిరాకరించిన తరువాత ఇది జరిగింది.
- 2013 ఆగస్టులో భారీ వర్షాల వలన జలాశయ మట్టం 131.5 మీ. (431 అ.) కు పెరిగడంతో, నర్మదా నదికి ఎగువన ఉన్న 7,000 మంది గ్రామస్థులను తరలించవలసి వచ్చింది.[31]
- ఆనకట్ట ఎత్తును 121.9 మీ. (400 అ.) నుండి మీటర్ల నుండి 138.6 మీ. (455 అ.) కు పెంచడానికి 2014 జూన్‌లో, నర్మదా కంట్రోల్ అథారిటీ తుది అనుమతి ఇచ్చింది.[32]
- నర్మదా కంట్రోల్ అథారిటీ 2017 జూన్ 17 న 30 గేట్లను మూసివేసి, ఆనకట్ట ఎత్తును పూర్తి ఎత్తు 163 మీటర్లకు పెంచాలని నిర్ణయించింది.
- నర్మదా జిల్లాలోని కెవాడియా వద్ద ఉన్న సర్దార్ సరోవర్ డ్యామ్‌లోని నీటి మట్టం 2019 సెప్టెంబరు 15 న అత్యధిక సామర్థ్యమైన 138.7 మీటర్లకు చేరుకుంది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Pumped-Storage Hydroelectric Plants — Asia-Pacific". IndustCards. Archived from the original on 8 December 2012. Retrieved 20 January 2012.
- ↑ "56 years of Sardar Sarovar Dam: Narendra Modi dedicates Jawaharlal Nehru's temple of resurgent India to nation". Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
- ↑ Original report – Narmada dam development project (PDF). Washington DC: World Bank. 6 February 1985. Archived from the original (PDF) on 4 April 2019. Retrieved 4 April 2019.
- ↑ "Sardar Sarovar Dam: Years of dispute, finally full height". 18 September 2017. Archived from the original on 17 May 2019. Retrieved 17 May 2019.
- ↑ "Modi Inaugurates World's Second Biggest Dam On His Birthday". Huffingtonpost. 17 September 2019. Archived from the original on 19 November 2020. Retrieved 13 November 2020.
- ↑ 6.0 6.1 "Sardar Sarovar dam water level touches its highest mark". The Economic Times. 15 September 2019. Archived from the original on 9 December 2020. Retrieved 16 September 2019. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "The Economic Times" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Sardar Sarovar Dam Water Level Touches its Highest Mark, PM Modi to Visit Site on Sept 17". News18. 15 September 2019. Archived from the original on 21 September 2019. Retrieved 16 September 2019.
- ↑ "PM Modito inaugurate world's second biggest dam on September 17". The Indian Express. Indo-Asian News Service. 14 September 2017. Archived from the original on 4 July 2019. Retrieved 31 December 2018.
- ↑ "Narendra Modi inaugurates Sardar Sarovar Dam". Al Jazeera. 17 September 2017. Archived from the original on 6 November 2018. Retrieved 31 December 2018.
- ↑ 10.0 10.1 "BBC News — SOUTH ASIA — Go-ahead for India dam project". BBC. Archived from the original on 25 March 2008. Retrieved 8 March 2010. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "go" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Sardar Sarovar Power Complex". Narmada Control Authority. Archived from the original on 30 March 2012. Retrieved 20 January 2012.
- ↑ "World bank projects in India – Narmada development". World Bank. Archived from the original on 4 April 2019.
- ↑ "Did You Know How Height of Sardar Patel's 'Statue of Unity' Was Decided? | Day 3 Onboard 'Garvi Gujarat'". News 18. 3 March 2023. Archived from the original on 25 April 2023. Retrieved 25 April 2023.
- ↑ "Sardar Sarovar Dam Narmada View · RPJW+VQH, Narmada, Gujarat 393140, India". Sardar Sarovar Dam Narmada View · RPJW+VQH, Narmada, Gujarat 393140, India (in ఇంగ్లీష్). Archived from the original on 17 October 2022. Retrieved 2022-10-17.
- ↑ "Sardar Sarovar Dam (SSD), Gujarat - Water Technology". www.water-technology.net. Archived from the original on 19 October 2022. Retrieved 2022-10-19.
- ↑ . "River Basin Management: A Case Study of Narmada Valley Development with Special Reference to the Sardar Sarovar Project in Gujarat, India".
- ↑ "A short history of the Sardar Sarovar Dam on river Narmada". The Indian Express (in ఇంగ్లీష్). 2017-09-17. Archived from the original on 19 October 2022. Retrieved 2022-10-19.
- ↑ "History of NWDT | Sardar Sarovar Narmada Nigam Limited". sardarsarovardam.org. Archived from the original on 19 October 2022. Retrieved 2022-10-19.
- ↑ "Explained: How Sardar Sarovar Dam is providing irrigation water in summer for the first time in history". The Indian Express (in ఇంగ్లీష్). 2021-06-09. Archived from the original on 19 October 2022. Retrieved 2022-10-30.
- ↑ "Main Features of the Dam". supportnarmadadam.org. Archived from the original on 14 December 2009. Retrieved 15 April 2010.
- ↑ "Soon, solar power panels on Narmada canal:Modi". dna. Archived from the original on 8 October 2011. Retrieved 15 October 2011.
- ↑ "Statue of Unity". gujrattourism (in ఇంగ్లీష్). Archived from the original on 3 November 2022. Retrieved 2022-11-03.
- ↑
Verghese, Boobli George (30 November 2000). "The verdict and after". DownToEarth. Archived from the original on 12 November 2017.
{{cite news}}
: CS1 maint: unfit URL (link) - ↑ World Bank (1995). "Annex 2: Government Cancellation of Bank Loan". Project Completion Report: India: Narmada River Development — Gujarat: Sardar Sarovar Dam and Power Project: Annexes to Part I, and Part III. p. 148 (page 23 of 61 of Annex 2).
- ↑ Scudder, Thayer (2003), India's Sardar Sarovar Project (SSP) (PDF), unpublished manuscript, archived from the original (PDF) on 27 May 2020
- ↑ "Drowned Out: The first 10 minutes of Drowned Out". OneWorldTV. 28 July 2009.
- ↑ "A Narmada Diary". Archived from the original on 21 February 2008. Retrieved 13 June 2008.
- ↑ Friends of River Narmada.
- ↑ "FIR against social activist Medha Patkar in Madhya Pradesh". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-07-10. Archived from the original on 17 November 2022. Retrieved 2022-11-17.
- ↑ "A short history of the Sardar Sarovar Dam on river Narmada". The Indian Express (in ఇంగ్లీష్). 2017-09-17. Archived from the original on 19 October 2022. Retrieved 2022-11-20.
- ↑ "7000 villagers relocated after water level in Narmada dam crosses 130m". Express News Service. 25 August 2013. Archived from the original on 31 August 2013. Retrieved 25 August 2013.
- ↑ "NCA permits raising Narmada dam height after eight years". The Times of India. 12 June 2014. Archived from the original on 12 June 2014. Retrieved 12 June 2014.