Jump to content

సాగర్ ఖండ్రే

వికీపీడియా నుండి
సాగర్ ఈశ్వర్ ఖండ్రే

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 -
ముందు భగవంత్ ఖుబా
నియోజకవర్గం బీదర్

వ్యక్తిగత వివరాలు

జననం (1997-12-29) 1997 డిసెంబరు 29 (వయసు 26)
బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు ఈశ్వర ఖండ్రే, గీతా
బంధువులు భీమన్న ఖండ్రే (తాత)[1]
నివాసం *భాల్కి
వృత్తి రాజకీయ నాయకుడు

సాగర్ ఈశ్వర్ ఖండ్రే (జననం 29 డిసెంబర్ 1997) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీదర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికై 18వ లోక్‌సభలో అడుగుపెట్టాడు.[2][3][4]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సాగర్ ఖండ్రే 29 డిసెంబర్ 1997న కర్ణాటక రాష్ట్రం, బెంగళూరులో ఈశ్వర ఖండ్రే, గీతా దంపతులకు జన్మించాడు. ఆయన బెంగుళూరు క్రైస్ట్ కాలేజీ నుండి బీబీఏ & ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సాగర్ ఖండ్రే తన తండ్రి ఈశ్వర ఖండ్రే అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పని చేస్తూ కరోనా సమయంలో తన తండ్రితో కలిసి బీదర్ ప్రాంతంలో పర్యటించి ప్రజలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీదర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భగవంత్ ఖుబాపై 128875 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికై 18వ లోక్‌సభలో అడుగుపెట్టాడు. ఈ ఎన్నికల్లో సాగర్‌కు 6,66,317 ఓట్లు వచ్చాయి. బీజేపీ మంత్రి భగవంత్ ఖూబాకు 5,37,442 ఓట్లు వచ్చాయి.[5][6]

మూలాలు

[మార్చు]
  1. The Hindu (22 March 2024). "Spotlight on candidates whose grandfathers have made a big mark in politics" (in Indian English). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bidar". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  3. Eenadu (22 March 2024). "యువతకే కాంగ్రెస్‌ పెద్దపీట". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  4. Eenadu (30 April 2024). "ఉత్తర కర్ణాటకలో 'కొత్త' రాజకీయం". Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  5. The Hindu (4 June 2024). "Political greenhorn defeats two-time BJP MP in Bidar" (in Indian English). Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.
  6. "Children of Congress Ministers' Defeat BJP Leaders" (in ఇంగ్లీష్). 4 June 2024. Archived from the original on 2 July 2024. Retrieved 2 July 2024.