Coordinates: 34°27′42″N 74°59′53″E / 34.461709°N 74.997935°E / 34.461709; 74.997935

సాత్ సర్ సరస్సు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాత్ సర్ సరస్సు
సాత్ సర్ సరస్సు is located in Jammu and Kashmir
సాత్ సర్ సరస్సు
సాత్ సర్ సరస్సు
ప్రదేశంగందర్బల్ జిల్లా, జమ్మూ కాశ్మీరు భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు34°27′42″N 74°59′53″E / 34.461709°N 74.997935°E / 34.461709; 74.997935
సరస్సు రకంఆల్ఫైన్ సరస్సు
సరస్సులోకి ప్రవాహంమంచు కరగడం
వెలుపలికి ప్రవాహంభూగర్భంలోకి
గరిష్ట పొడవు3.2 kilometres (2.0 mi) (మొదటి సరస్సు నుండి ఏడవ సరస్సు వరకు)
గరిష్ట వెడల్పు0.9 kilometres (0.56 mi) (లోయ వెడల్పు)
ఉపరితల వైశాల్యం4 km2 (1.5 sq mi) (మొత్తం వైశాల్యం)
ఉపరితల ఎత్తు3,610 metres (11,840 ft)

సాత్ సర్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్ జిల్లాలో ఉంది. సాత్ సర్ అనగా ఏడు సరస్సులు అని అర్థం. ఈ ఏడు చిన్న సరస్సులను కలిపి ఒకే సరస్సుగా పిలుస్తారు.[1]

భౌగోళికం[మార్చు]

ఈ సరస్సులు ఇరుకైన ఆల్పైన్ లోయలో ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి, 4 కిలోమీటర్లు (2.5 మైళ్ళు) పొడవు, 1 కిలోమీటర్ (0.62 మైళ్ళు) వెడల్పు కలిగి ఉన్నాయి. ఇది తులైల్ వ్యాలీ, సింద్ వ్యాలీలకు మధ్య సహజ పర్వత మార్గం గా ఉంది. సాత్ సర్ సరస్సుల చుట్టూ పచ్చటి పచ్చికభూములు ఉన్నాయి, ఇవి వేసవిలో గొర్రెల కాపరులకు నిలయంగా ఉంటాయి.[2]

పరిసరాలు[మార్చు]

సాత్ సర్ సరస్సు ప్రధానంగా చుట్టూ ఉన్న మంచు కొండలు కరగడం ద్వారా ఏర్పడుతుంది. వేసవి చివరలో, శరదృతువులో, అవపాతం కారణంగా రెండు లేదా మూడు సరస్సులు సాధారణంగా ఎండిపోతాయి. ఈ సరస్సుల నుండి ఒక ప్రవాహం ఉద్భవించి భూగర్భంలోకి ప్రవహిస్తుంది. ప్రక్కనే ఉన్న హిమానీనదం నుండి ఒక ప్రవాహం ఉద్భవించి దక్షిణ దిశగా ప్రవహించి, సింధు నదికి ప్రధాన కుడి ఉపనది అయిన చుర్నార్ మీదుగా వంగాత్ నల్లాలో కలుస్తుంది.[3][4]

పూలు,చేపలు[మార్చు]

చలికాలంలో, సాత్ సర్ సరస్సులు తీవ్రమైన మంచుతో కప్పబడి ఉంటాయి. వసంత ఋతువు చివర్లో ఈ సరస్సు చుట్టూ అనేక రకాల పూల మొక్కలు వికసించి ఉంటాయి. వీటిని చూడటానికి పర్యాటకులు ఎంతో ఆస క్తి చూపుతారు.[5]ఈ సరస్సులో చేపల పెంపకం కూడా ఉంటుంది వీటిని ప్రభుత్వ అనుమతి పొందిన జాలర్లు పట్టుకుంటారు.[6]

ప్రయాణం[మార్చు]

సాత్ సర్ సరస్సులు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. శీతాకాలంలో, భారీ మంచు కారణంగా ట్రెక్‌లు మూసివేయబడతాయి. శ్రీనగర్ నుండి 65 కి.మీ ప్రయాణం ద్వారా ఈ సరస్సులను చేరుకోవచ్చు. ఈ మార్గం గందర్‌బల్, వేయిల్ మీదుగా నారనాగ్ ట్రెక్కింగ్ క్యాంప్‌ వరకు ఉంటుంది. త్రినాఖుల్, బాద్పత్రిల ఆల్పైన్ పచ్చికభూములు, నుండ్‌కోల్, గంగ్ బాల్ సరస్సులు ఈ మార్గంలోనే ఉన్నాయి. దీనికి ప్రత్యామ్నాయ ట్రెక్ చటర్‌గుల్ గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఇది నారనాగ్‌కు పశ్చిమాన 10 కి.మీ., పొడవు గల మహ్లిష్ గడ్డి మైదానాల గుండా వెళుతుంది. ఈ సరస్సును బందిపోరా నుండి కూడా చేరుకోవచ్చు. చాలా మంది పర్యాటకులు నారనాగ్ ట్రెక్ నుండి మొదలుకొని గడ్సర్ సరస్సు, విశాన్సర్ సరస్సు, సోనామార్గ్ వంటి ఈ ప్రాంతంలోని అనేక ఆల్పైన్ సరస్సులను సందర్శించడానికి ఆసక్తి చూపుతారు.[7][1][4][8]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Hidden Lakes of Kashmir". IndianTrekking.com. Retrieved 10 July 2012.
  2. Wood, Levison (2016-01-04). Walking the Himalayas: An adventure of survival and endurance (in ఇంగ్లీష్). Hodder & Stoughton. ISBN 9781473626270.
  3. Stacey, Allan (1988). Visiting Kashmir. Hippocrene Books. p. 111. ISBN 9780870525681.
  4. 4.0 4.1 Sharma, Shiv (2008). India – A Travel Guide. Diamond Pocket Books (P) Ltd. p. 212. ISBN 9788128400674.
  5. J & K Yearbook & Who's Who. Rabir Publications. 1970. p. 486.
  6. "Know your Kashmir". Comrade Inn. Archived from the original on 8 జూలై 2013. Retrieved 10 July 2013.
  7. "Angling and Sport Fishing". Go Adventure Sports. Retrieved 10 July 2013.
  8. Kohli, M. S. (1983). The Himalayas: Playground of the Gods – Trekking, Climbing and Adventures. Indus Publishing. p. 45. ISBN 9788173871078.