Jump to content

సాబిత్రి ఛటర్జీ

వికీపీడియా నుండి
సాబిత్రి ఛటర్జీ
2014 మార్చి 31న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వేడుకలో ప్రణబ్ ముఖర్జీ నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్న సాబిత్రి ఛటర్జీ
జననం (1937-02-22) 1937 ఫిబ్రవరి 22 (వయసు 87)
కొమిల్లా, బ్రిటీష్ ఇండియా, (ప్రస్తుత బంగ్లాదేశ్)
వృత్తినటి
తల్లిదండ్రులు
  • శశధర్ ఛటర్జీ (తండ్రి)
పురస్కారాలుబిఎఫ్‌జెఏ
సంగీత నాటక అకాడమీ అవార్డు
బంగా బిభూషణ్
పద్మశ్రీ

సాబిత్రి ఛటర్జీ, (జననం 22 ఫిబ్రవరి 1937[1]) బెంగాలీ నాటక, సినిమా నటి. 60 ఏళ్ళకు పైగా నటనారంగంలో ఉంది. రెండుసార్లు బిఎఫ్‌జెఏ అవార్డులను అందుకున్నది. బెంగాలీ నాటకరంగంలో సాబిత్రి చేసిన కృషికి 1999లో సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 2013లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం బంగా బిభూషణ్ పురస్కారం అందించింది. 2014లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[2]

జననం

[మార్చు]

సాబిత్రి 1937లో ప్రస్తుత బంగ్లాదేశ్‌లోని కొమిల్లా జిల్లాలోని కమలాపూర్‌లోని ఒక చిన్న పట్టణంలో జన్మించింది. పదిమంది సోదరీమణులలో సాబిత్రీ చిన్నది. బిక్రమ్‌పూర్‌లోని కనక్సర్ అనే కులిన్ బ్రాహ్మణ గ్రామానికి చెందిన ప్రసిద్ధ కులిన్ రార్హి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి శశధర్ ఛటర్జీ భారతీయ రైల్వేలో స్టేషన్ మాస్టర్‌గా పనిచేశాడు. బెంగాల్ విభజన సమయంలో, సాబిత్రి కోల్‌కతాలోని సినిమా నిర్మాణ కేంద్రమైన టోలీగంజ్‌లో ఉన్న తన సోదరి ఇంటికి పంపబడింది. టోలీగంజ్‌లో పెరగడం వల్ల ఆనాటి సినీనటులను చూసే అవకాశం వచ్చింది.[1][3]

సినిమారంగం

[మార్చు]

సాబిత్రి ఛటర్జీ పదవ తరగతి చదువుతున్నప్పుడు, తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన శరణార్థులపై ఉత్తర సారథి గ్రూప్ థియేటర్ కు కను బెనర్జీ దర్శకత్వం వహించిన నాతున్ ఇహుడిలో అనే నాటకంలో నటించింది. ఈ నాటకాన్ని 1953లో సినిమాగా తీసినపుడు అందులో సాబిత్రి కూడా నటించింది.[1] 1951లో అగ్రదూత్ దర్శకత్వంలో ఉత్తమ్ కుమార్ నటించిన సహజాత్రి సినిమాలో నటించి గుర్తింపు పొందింది. 1952లో సుధీర్ ముఖర్జీ తీసిన పషర్ బారి సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది.[1]

అవార్డులు

[మార్చు]
  • బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (బిఎఫ్‌జెఏ) 1967లో "కల్ తుమీ అలేయా" సినిమాలో సహాయ పాత్రలో ఉత్తమ నటిగా అవార్డు
  • బిఎఫ్‌జెఏ అవార్డు - 1972లో "మాల్యదన్" సినిమాలో సహాయ పాత్రలో ఉత్తమ నటి
  • 1999లో బెంగాలీ నాటకరంగంలో కృషికి నటనకు సంగీత నాటక అకాడమీ అవార్డు
  • కళాకర్ అవార్డులు- 2003లో జీవితకాల సాఫల్య పురస్కారం
  • 2012లో కళ్యాణి యూనివర్సిటీ నుంచి డి.లిట్ పట్టా
  • భారతీయ సినిమాకు చేసిన కృషికి 2013లో బంగా బిభూషణ్ అవార్డు
  • సినిమారంగంలో చేసిన కృషికి 2014లో పద్మశ్రీ పురస్కారం[4]

సినిమాలు

[మార్చు]
  1. మాతి (2018)
  2. తమర్ బాయ్‌ఫ్రెండ్ (2016) . . . నందిని మిత్ర[5]
  3. ప్రాక్తన్ (2016)
  4. హైవే (2014)
  5. హేమ్లాక్ సొసైటీ (2012)
  6. పోడోఖెప్ (2006). . . శోబిత
  7. తపస్య (2006)
  8. హర్ జీత్ (2000)
  9. బహదూర్ (1992)
  10. ఆనందలోక్ (1988)
  11. మమోని (1986)
  12. రాజనందిని (1980)
  13. బ్రోజోబులి (1979)
  14. ఫూల్ సజ్యా (1975)
  15. మౌచక్ (1974)
  16. హీరే మానిక్ (1979)
  17. సే చోఖ్ (1976)
  18. శేష్ పర్బా (1972)
  19. ధన్యే మేయే (1971)
  20. మాల్యదాన్ (1971). . . పాటల్
  21. ప్రథమ ప్రతిశ్రుతి (1971)
  22. నిషి పద్మ (1970). . . పద్మ
  23. కళంకిత నాయక్ (1970)
  24. మంజరి ఒపేరా (1970). . . మంజరీ దేవి
  25. పాఠే హోలో దేఖా (1968)
  26. గృహదహ (1967). . . మృణాల్
  27. కల్ తుమీ అలేయా (1966). . . సోనాబౌడి
  28. అంతరాల్ (1965)
  29. జయ (1965). . . జయ
  30. మోమర్ అలో (1964). . . దీప
  31. షెస్ అంకో (1963). . . లతా బోస్
  32. ఉత్తరాయణ్ (1963)
  33. భ్రాంతి బిలాస్ (1963)
  34. నవ్ దిగంత (1962)
  35. దుయ్ భాయ్ (1961)
  36. హాట్ బరాలీ బంధు (1960)
  37. కుహక్ (1960)
  38. రాజా-సజ (1960)
  39. గాలి తేకే రాజ్‌పథ్ (1959)
  40. మారుతీర్థ హింగ్లాజ్ (1959)
  41. దాక్ హర్కరా (1958)
  42. దక్తర్ బాబు (1958)
  43. పునర్ మిలన్ (1957)
  44. అబోయర్ బియే (1957)
  45. డానర్ మర్యాద (1956). . . ఉష
  46. నబజన్మ (1956)
  47. పరధిన్ (1956)
  48. రాత్ భోరే (1956)
  49. రైకమల్ (1955)
  50. గోధూలి (1955)
  51. పరేష్ (1955)
  52. ఉపహార్ (1955). . . కృష్ణుడు
  53. అన్నపూర్ణార్ మందిర్ (1954)
  54. అనుపమ (1954)
  55. బిధిలిపి (1954). . . సంధ్య
  56. బ్రతచారిణి (1954)
  57. చంపదంగర్ బౌ (1954)
  58. కళ్యాణి (1954)
  59. మొయిలా కగాజ్ (1954)
  60. కజారి (1953)
  61. లఖ్ టాకా (1953)
  62. నతున్ యాహుది (1953)
  63. సుభద్ర (1952). . . లలన
  64. బసు పరిబార్ (1952)
  65. పాషర్ బారి (1952)
  66. లేడీస్ సీటు
  67. ప్రోటీన్నిధి
  68. ప్రొతిషోద్
  69. ఒబాక్ పృథిబి
  70. నోటున్ డైనర్ ఆలో
  71. డినాంటర్ అలో
  72. బలుచోరి
  73. మోంత్రోముగ్ధో
  74. ముక్తిస్నాన్

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "Sabitri Chatterjee - Upperstall.com". Retrieved 2022-03-10.
  2. "Padma Awards Announced". Press Information Bureau, Ministry of Home Affairs. 25 January 2014. Retrieved 2022-03-10.
  3. "We had no food for days on end: Sabitri Chatterjee - Times of India". The Times of India. Retrieved 2018-01-22.
  4. "Padma Awards Announced". Press Information Bureau, Ministry of Home Affairs, Government of India. 25 January 2014. Archived from the original on 8 February 2014. Retrieved 2022-03-10.
  5. "Actor Sabitri Chatterjee to star in rom-com opposite Abir Chatterjee". Hindustan Times. 30 November 2016. Retrieved 2022-03-10.

బయటి లింకులు

[మార్చు]