సికిందర్
సికిందర్ | |
---|---|
దర్శకత్వం | ఎన్. లింగుస్వామి |
రచన | ఎన్. లింగుస్వామి, బృంద సారథి |
నిర్మాత | ఎన్. లింగుస్వామి, లగడపాటి శ్రీధర్, ఎన్. సుభాష్ చంద్రబోస్ |
తారాగణం | సూర్య, సమంత, విద్యుత్ జమాల్, మనోజ్ బాజ్‌పాయ్ |
ఛాయాగ్రహణం | సంతోష్ శివన్ |
కూర్పు | ఆంథోనీ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థలు | రామలక్ష్మీ సినీ క్రియేషన్స్, తిరుపతి బ్రదర్స్ |
పంపిణీదార్లు | షణ్ముఖ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | ఆగస్ట్ 15, 2014 |
సినిమా నిడివి | 170 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తమిళ |
బడ్జెట్ | ₹50 crore (US$6.3 million) |
బాక్సాఫీసు | ₹95 crore (US$12 million) |
సికిందర్ 2014 ఆగస్టు 15 న విడుదలైన తమిళం నుండి డబ్బింగ్ చేయబడిన తెలుగు సినిమా. దీనికి అంజాన్ (2014) అనే సినిమా మూలం.
కథ
[మార్చు]రాజు భాయ్ (సూర్య) ముంబైలో ఓ మాఫియా డాన్. రాజుభాయ్ ను వెతుక్కుంటూ కృష్ణ (సూర్య) వెతుక్కుంటూ వైజాగ్ నుంచి ముంబైకి చేరుకుంటాడు. ముంబైలో రాజు భాయ్, అతని స్నేహితుడు చందు (విద్యుత్ జమ్వాల్) ల స్నేహం, మాఫియా సామ్రాజ్యం గురించి కృష్ణకు తెలుస్తుంది. రాజు భాయ్ స్నేహితుడు చందును ముంబైని శాసించే ఇమ్రాన్ భాయ్ (మనోజ్ బాజ్‌పాయ్) చంపేస్తాడు. తన గ్రూప్ లో కొందరు చేసిన నమ్మక ద్రోహా వల్లే చందు మరణానికి కారణమని రాజుభాయ్ తెలుసుకుంటాడు. అయితే రాజుభాయ్ ని కూడా ఇమ్రాన్ గ్రూప్ కాల్చేస్తుంది. ఇమ్రాన్ గ్రూప్ జరిపిన కాల్పుల్లో గాయపడిన రాజుభాయ్ ఏమయ్యాడు? రాజుభాయ్ ను కృష్ణ కలిశాడా? రాజుభాయ్, కృష్ణను ఎందుకు వెతుక్కుంటూ వచ్చాడు? ఇమ్రాన్ భాయ్ మాఫియా సామ్రాజ్యానికి ఎవరు చెక్ పెట్టారు? తన స్నేహితుడు చందు మరణానికి రాజుభాయ్ ప్రతీకారం తీర్చుకున్నాడా అనే ప్రశ్నలకు సమాధానమే 'సికిందర్' చిత్ర కథ.
నటవర్గం
[మార్చు]- సూర్య (నటుడు) - ద్విపాత్రాభినయం
- సమంత
- మనోజ్ బాజ్ పాయ్
- విద్యుత్ జమ్వాల్
- దిలీప్ తాహిల్
- రాజ్ పాల్ యాదవ్
- మరియం జకారియా (ఐటమ్ సాంగ్)
సాంకేతికవర్గం
[మార్చు]- ఫోటోగ్రఫి: సంతోష్ శివన్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- ఎడిటింగ్: ఆంథోని
- నిర్మాత: లగడపాటి శ్రీధర్, సుభాష్ చంద్రబోస్, సిద్దార్థ్ రాయ్ కపూర్
- దర్శకత్వం:ఎన్. లింగుస్వామి