సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం
సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం | |
---|---|
Location | డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్, భారతదేశం |
Nearest city | మనిభంగ్ జంగ్ |
Coordinates | 27°07′N 88°04′E / 27.117°N 88.067°E |
Area | 78.6 |
Established | 1986 |
Governing body | భారత ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం |
సిన్గాలిలా జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మనేభాన్ జంగ్ నగరానికి చేరువలో డార్జిలింగ్ అనే ప్రాంతంలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనాన్ని 1986 లో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించారు. దీనిని 1992 లో జాతీయ ఉద్యానవనంగా గుర్తించారు. ఇది మొత్తం 78.6 చ. కిలోమీటర్ల వైశాల్యం లో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం చాలాకాలంగా మానేభంజాంగ్ నుండి సందక్ఫు (పశ్చిమ బెంగాల్ యొక్క ఎత్తైన శిఖరం), ఫలుట్ వరకు ట్రెక్కింగ్ మార్గంగా ఉపయోగించబడింది.
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనంలో ఎర్ర పాండా, చిరుత పులులు, జింకలు, పసుపు గొంతు మార్టెన్, అడవి పంది, పాంగోలిన, పికా, హిమాలయాల్లో నివసించే నల్ల ఎలుగుబంట్లు వంటి ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి.[2]
భౌతిక భౌగోళికం
[మార్చు]పశ్చిమ బెంగాల్లో ఉన్న రెండు ఎత్తైన శిఖరాలు సందక్ఫు (3630 మీ), ఫలుట్ (3600 మీ) ఈ ఉద్యానవనంలో ఉన్నాయి. ఈ ఉద్యానవనం గుండా రామ్మామ్, సిరిఖోలా నదులు ప్రవహిస్తున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ Das, A.P.; Ghosh, Chandra (March 2011). "Plant wealth of Darjiling and Sikkim Himalayas vis-à-vis Conservation". NBU Journal of Plant Sciences. 5 (1). University of Bengal: 25–33. Retrieved 18 December 2014.
- ↑ Wikramanayake, Eric; et al. (2002). Terrestrial Ecoregions of the Indo-Pacific: A Conservation Assessment. Washington, D.C.: Island Press. ISBN 1-55963-923-7.