సి. ఎన్. మంజునాథ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా. సి. ఎన్. మంజునాథ్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు డీ.కే. సురేశ్
నియోజకవర్గం బెంగళూరు గ్రామీణ

వ్యక్తిగత వివరాలు

జననం (1957-09-23) 1957 సెప్టెంబరు 23 (వయసు 66)
చోలేనహళ్లి, చన్నరాయపట్నం తాలూకా , హాసన్ జిల్లా , కర్ణాటక , భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు నంజప్ప గౌడ, శంభమ్మ
జీవిత భాగస్వామి అనసూయ
బంధువులు హెచ్.డి.దేవెగౌడ (మామ)
హెచ్. డి. కుమారస్వామి (బావ)
సి.ఎన్. బాలకృష్ణ (సోదరుడు)
వృత్తి శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో మాజీ డైరెక్టర్ & రాజకీయ నాయకుడు
పురస్కారాలు పద్మశ్రీ
2019లో బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి రాజ్యోత్సవ ప్రశస్తి గౌరవ డాక్టరేట్

చోలేనహళ్లి నంజప్ప మంజునాథ్ (జననం 23 సెప్టెంబర్ 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]

మంజునాథ్ మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవెగౌడ కుమార్తె అనుసూయను వివాహం చేసుకున్నాడు. ఆయన శస్త్రచికిత్సా ప్రక్రియ, బెలూన్ మిట్రల్ వాల్వులోప్లాస్టీలో, అక్యురా బెలూన్ కాథెటర్‌ని ఉపయోగించి గరిష్ట ప్రక్రియలను చేసిన సేవలకుగాను 2007లో పద్మశ్రీ అందుకున్నాడు.[3][4]


మంజునాథ్ 2024 జనవరిలో పదవీ విరమణ చేయడానికి ముందు 18 సంవత్సరాల పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని శ్రీ జయదేవ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌కు డైరక్టర్‌గా పని చేశాడు.[5][6]

రాజకీయ జీవితం

[మార్చు]

డా.మంజునాథ్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బెంగళూరు గ్రామీణ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి డీ.కే. సురేశ్ పై 2,69,647 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. TimelineDaily (26 March 2024). "From Cardiologist To Politician: Dr. CN Manjunath's Poll Debut For BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bangalore Rural". Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  3. Free Press Journal. "Renowned Cardiologist & Padma Shri Awardee Dr. C. N. Manjunath's 66th Birthday" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  4. The Indian Express (15 March 2024). "The doctor is in: Who is C N Manjunath, the latest from Deve Gowda clan in politics?" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  5. Deccan Herald (19 July 2023). "Karnataka: Dr C N Manjunath gets tenure extension at Jayadeva" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  6. The New Indian Express (19 July 2023). "In 16 years, Dr Manjunath made Jayadeva a quality hospital in Bengaluru" (in ఇంగ్లీష్). Archived from the original on 30 July 2024. Retrieved 30 July 2024.
  7. The Hindu (4 June 2024). "Debutant C.N. Manjunath trumps D.K. Suresh" (in Indian English). Retrieved 30 July 2024.