సీదిరి అప్పలరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీదిరి అప్పలరాజు

పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి
పదవీ కాలం
26 జులై 2020 – ప్రస్తుతం
ముందు గౌతు శ్యామసుందర శివాజీ
నియోజకవర్గం పలాస

వ్యక్తిగత వివరాలు

జననం (1990-06-24)1990 జూన్ 24
దేవునల్తాడ గ్రామం, వజ్రపుకొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జీవిత భాగస్వామి శ్రీదేవి
నివాసం కాశీబుగ్గ, పలాస

డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. సీదిరి అప్పలరాజు ప్రస్తుతం పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

జననం, విద్యాభాస్యం

[మార్చు]

సీదిరి అప్పలరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, వజ్రపుకొత్తూరు మండలం, దేవునల్తాడ గ్రామంలో జన్మించాడు. ఆయన 1నుంచి 7వ తరగతి వరకు ఎంపీయూపీ స్కూల్‌, దేవునాల్తాడ గ్రామంలో చదివాడు, ఆయన 7వ తరగతిలో జిల్లాలో రెండో ర్యాంకు సాధించాడు. 8 నుంచి 10తరగతి వరకు సింహాచలం (అడివివరం స్కూల్‌) గురుకుల పాఠశాలలో పూర్తి చేశాడు. అప్పలరాజు పదో తరగతిలో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించాడు. ఆయన గాజువాక మార్గదర్శి ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసి, ఓపెన్‌ కేటగిరిలో ఎంబీబీఎస్‌ సీటు సాధించాడు. కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వెంటనే ఎంట్రన్స్‌ పరీక్షలో పాసై విశాఖ ఆంధ్రా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ లో పీజీ పోర్ర్తీ చేసి, పదేళ్లకు పైగా పలాసలో వైద్య సేవలందించాడు.[3][4]

రాజకీయ జీవితం

[మార్చు]

2017లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశంపార్టీ అభ్యర్థి గౌతు శిరీషపై 16,247 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాడు. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితుడయ్యాడు. సీదిరి అప్పలరాజు 2020 జులై 22న మంత్రిగా నియమితుడై, జులై 26న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పశు సంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[5][6] ఆయన 2022 ఏప్రిల్ 11న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రెండోసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు.[7][8][9]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (26 July 2020). "బాధ్యతలు చేపట్టిన సీదిరి అప్పలరాజు". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  2. Sakshi (22 July 2020). "'రాజు' మంత్రి అయ్యారు!". Sakshi. Archived from the original on 20 September 2020. Retrieved 10 May 2021.
  3. 10TV (21 July 2020). "ఫస్ట్ చాన్స్‌లోనే కేబినెట్‌లోకి.. కొత్త మంత్రులు వీరే, రేపే కేబినెట్ విస్తరణ andhra pradesh cabinet expansion". 10TV (in telugu). Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  4. Sakshi (23 July 2020). "మంత్రులుగా చెల్లుబోయిన, సీదిరి". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  5. Outlook India (22 July 2020). "Two ministers inducted in AP cabinet". outlookindia.com/. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  6. Sakshi (22 July 2020). "మంత్రులుగా అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ ప్రమాణం". Sakshi. Archived from the original on 10 May 2021. Retrieved 10 May 2021.
  7. Sakshi (11 April 2022). "చరిత్రలో ఏ ఒక్కరికీ దక్కని ప్రాధాన్యం సీదిరి అప్పలరాజు సొంతం". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  8. Sakshi (11 April 2022). "ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపులు". Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.
  9. 10TV (11 April 2022). "ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు" (in telugu). Archived from the original on 11 April 2022. Retrieved 11 April 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)