Jump to content

సుగాలీ నృత్యం

వికీపీడియా నుండి

సుగాలీ లంటే లంబాడీ లు. ఈ నృత్యాన్ని, లంబాడీ, బంజారా తండా నృత్యమని పిలుస్తారని డా. చాగిచర్ల కృష్ణారెడ్డి గారు తమ జానపద నృత్య కళా గ్రందంలో ఉదహరించారు. అయితే వీరు ఆంధ్ర ప్రదేశ్ లో గిరిజనులుగానే మిగిలిపోయారు. పల్లెలకు దూరంగా కొండ కోనల్లో నివసిస్తూ కట్టెలు కొట్టి అమ్ముకుంటూ, కూలి పనులతో జీవనం సాగిస్తారు. వీరు కష్టజీవులు. పండగలు, పబ్బాలూ సాంప్రదాయ రీతిలో చేసుకుంటారు.

వీరి వేషధారణలో, స్త్రీలు ప్రత్యేకమైన దుస్తుల్ని ధరిస్తారు. లంబాడీలను చూచిన వారికి వారి వేషధారణ విదితమే. వీరు తెలంగాణా ప్రాంతంలో ఎక్కువగా వున్నా, అనంతపురం జిల్లాలో కూడా వున్నారు. వీరు ధర్మవరం మండలంలో ప్రతి సంవత్సరం కాముని పున్నమి రోజున తప్పకుండా నృత్యం చేస్తారు. మత్తు పానీయాలు బాగా సేవించి స్త్రీలు నృత్యం చేస్తారు. వీరి నృత్యంలో ముఖ్యంగా చేతులు చూపించటం, వలయా కారంగా తిరగటం చేస్తారు. ఈ నృత్యాన్ని స్త్రీ పురుషులిరువురు కలిసే చేస్తారు. ఒక పురుషుడు ప్రత్యేకంగా డప్పు కొడతాడు. డప్పు వరుసలకు అనుకూలంగా స్త్రీలు రక రకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతారు. వీరి నృత్య బ్రుందంలో 10 మంది వరకూ పాల్కొంటారు. వారి సంప్రదాయ దుస్తుల్ని ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. చప్పట్లు చరుస్తూ వలయాకారంగా శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. లయ ప్రకారం చప్పట్లు చరుస్తూ వుంటే మిగతా వారు పాటలను ఆలాపిస్తారు. వీరి పాటలన్నీ వారి గురువైన 'సేవలాల్ మీదనే పాడతారు. ప్రధమంగా అందరూ నిలబడి ముందుకు వంగి చేతులతో చప్పట్లు కొడుతూ ఈ విధంగా పాడతారు.

లంబాడీ స్త్రీలు

కోయినారియే కోచళో సోసో
కోయినారియే కూణిన చోడో
కోయినారియే శంక్రనచోడో
కోయినారియే కాయ్ ఆంకుదీచ
కోయినారితే రవియ్యదీచ

అంటూ గిర్రున తిరిగి శరీరాన్ని క్రిందికి పైకి వంచుతూ లేస్తూ చేతుల్ని పైకెత్తి చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ అదే సమయంలో పాడే పాటను ఒకరు పాడుతుండగా, మిగిలిన వారంతా ఈ విధంగా వంత పాడతారు.

బాలే పెంచనే వెంటాపర్ రెడి బోలిరీచ
రెడి బోలరీచక్ జినందేకరేచ
సావుకార్ భీకియ్వార్ రోరలూటోరేచ
బాయే పెంచనే వెంటాపర్ రెడి బోలిరేచ

రెడి బోలిరీచక్ జనండేకరేచ
సావుకార్ హనుమంత రెడ్డిర్ చోర లూటోరేచ

అంటూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. సుగాలీలు నివసించే ప్రాంతాన్ని తండా అంటారు. వీరిని లంబాడీలు అని పిలుస్తారరు.

యిచి కూడా చూడండి

[మార్చు]

సూచికలు

[మార్చు]

యితర లింకులు

[మార్చు]