సుచిత్రా కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుచిత్రా కృష్ణమూర్తి
సుచిత్రా కృష్ణమూర్తి
జననం (1975-11-27) 1975 నవంబరు 27 (వయసు 48)
వృత్తినటి, రచయిత్రి, పెయింటర్, గాయిని
జీవిత భాగస్వామి
శేఖర్ కపూర్
(m. 1999; div. 2007)

సుచిత్రా కృష్ణమూర్తి ప్రముఖ నటి, గాయకురాలు, పెయింటర్, మోడల్, రచయిత్రి.[1][2][3]

జీవిత విశేషాలు[మార్చు]

ఈమె ముంబాయిలో ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి కృష్ణమూర్తి ఇన్‌కం టాక్స్ కమీషనర్. తల్లి సులోచన మంచి గాయకురాలు. ఈమె అన్నయ్య డాక్టరు. ఒక అక్కకు గేమ్స్ కంపెనీ ఉంది. మరో అక్క శాస్త్రీయ సంగీత కళాకారిణి.[4] సుచిత్ర కూడా గ్వాలియర్ ఘరానా శైలిలో శాస్త్రీయ సంగీతాన్ని పది సంవత్సరాలు అభ్యసించింది. సంగీతం, నాట్యం, నటనల మీద మోజు పెంచుకున్న ఈమెకు తాను చదువుకునే రోజులలోనే చునౌతీ అనే టి.వి.సీరియల్‌లో నటించడానికి అవకాశం వచ్చింది. తండ్రి అభ్యంతర పెట్టినా తల్లి ప్రోత్సాహంతో దానిలో నటించింది. టి.వి.లో నటిస్తూ, మోడల్‌గా రాణిస్తున్న సుచిత్రకు "కభీహా కభీనా" సినిమాలో తొలిసారిగా నటించే అవకాశం దక్కింది. ఈ సినిమా షూటింగు మధ్యలో ఉండగా తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పు కనిపించడంతో ఇంట్లోంచి బయటకు వచ్చి ఒంటరిగా జీవనపోరాటాన్ని సాగించింది. తన పంతొమ్మిదవ యేట ప్రముఖ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన శేఖర్ కపూర్‌ను కలిసిన సుచిత్ర తనకన్నా 30 యేళ్లు పెద్దవాడైనా అతడిని ప్రేమించి 1999లో వివాహం చేసుకుంది. వీరికి కావేరీ కపూర్ అనే కుమార్తె కలిగింది. సుచిత్ర, శేఖర్ కపూర్‌లు 2007లో విడిపోయారు.

వృత్తి[మార్చు]

సుచిత్రా కృష్ణమూర్తి

ఈమె తన నటజీవితాన్ని 1987-88లో "చునౌతీ" అనే టెలివిజన్ సీరియల్‌తో ప్రారంభించింది. ఈమె కామిక్‌స్ట్రిప్ పీనట్స్ ఆధారంగా తీసిన "పీనట్స్: ది మ్యూజికల్"లో లూసీ పాత్రను ధరించింది.

ఈమె 90వ దశకం తొలినాళ్లలో పామోలివ్ సోప్, క్లియర్‌సిల్, సన్‌రైజ్ కాఫీ, లిమ్కా, కాల్గేట్ టూత్‌పేస్ట్ వంటి వ్యాపార ప్రకటనలలో మోడల్‌గా రాణించింది. 1994లో ఈమె షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన "కభీ హా కభీ నా" సూపర్ హిట్ కావడంతో ఈమె దశ తిరిగింది.

ఈమె తన నటజీవితంతో పాటుగా సంగీతరంగంలో కూడా కృషి చేసింది. ఈమె 1990లలో హిమేశ్ రేషమ్మియా సంగీత దర్శకత్వంలో డోలే డోలే[5], ధూమ్‌తర, ఆహా, జిందగీ వంటి పాప్ ఆల్బమ్‌లను విడుదల చేసింది.[6]

ఈమె వివాహం తర్వాత కొంత విరామం తీసుకుని 10 యేళ్ల తర్వాత 2005లో "మై వైఫ్'స్ మర్డర్" అనే సినిమాతో అనిల్ కపూర్‌ జోడీగా నటించింది. 2009లో "కర్మ, కన్‌ఫెషన్స్ అండ్ హోలీ" అనే ఇండో అమెరికన్ సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది.

2010లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన "రణ్" సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, రితేష్ దేశ్‌ముఖ్‌లతో కలిసి నటించింది.[7] ఈ సినిమాలో సుచిత్ర నళినీ నళినీ కాశ్యప్ అనే మీడియా ఎక్జిక్యూటివ్ పాత్రను ధరించింది.[8]

ఈమె మంచి పేయింటర్. ఈమె భారతదేశం, లండన్, న్యూయార్క్‌లలో పెయింటింగ్‌లో శిక్షణను తీసుకుంది. ఈమె తన పెయింటింగులను మనదేశంలోను, ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలలోను అనేక గ్యాలరీలలో ప్రదర్శించింది.

ఈమె రచయిత్రిగా మొదట తన బ్లాగులలో వ్రాయడం మొదలు పెట్టింది. ఈమె తన మొట్టమొదటి నవల "ద సమ్మర్ ఆఫ్ కూల్" 2009 జనవరిలో పెంగ్విన్ ఇండియా ప్రచురించింది. ఇది తాను వ్రాయనున్న స్వప్నలోక్ సొసైటీ అనే నాలుగు నవలల సిరీస్‌లో మొదటి నవల.[9] ఈ పరంపరలో రెండవ నవల "ద గుడ్ న్యూస్ రిపోర్టర్" 2009లో, మూడవ నవల "ద ఘోస్ట్ ఆన్ ద లెడ్జ్" 2016లో వెలువడ్డాయి.

ఈమె తన జీవిత చరిత్రను డ్రామా క్వీన్ రచించింది. ఇది 2013 నవంబరులో విడుదలైంది.[10][11] ఇది విడుదలైన మొదటి వారంలోనే మొదటి ముద్రణ ప్రతులన్నీ అమ్ముడుపోయాయి.[12]

సుచిత్ర డ్రామా క్వీన్ పేరుతో తన జీవిత చరిత్రను ఆధారంగా ఒక సంగీత రూపకాన్ని రచించింది. దీనిని నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ముంబాయి డిసెంబరు 2016లో మొదటిసారి ప్రదర్శించింది.[13] [14] ఇది దేశవ్యాప్తంగా పలు ప్రదర్శనలకు నోచుకుంది.

కోర్టు కేసు[మార్చు]

ఈమె హెచ్.ఎస్.బి.సి (ది హాంగ్‌కాంగ్ అండ్ షాంగై బ్యాంకింగ్ కార్పొరేషన్) కు వ్యతిరేకంగ 2012లో కోర్టులో దావా వేసింది. ఆ బ్యాంకు నిధులను దుర్వినియోగం చేస్తున్నదని తద్వారా తనకు తీవ్ర ఆర్థిక నష్టం సంభవిస్తున్నదని ఆరోపించింది.[15] ఆమె ఈ కేసు గురించి సుమారు 2 సంవత్సరాలు పోరాడింది. చివరకు 2014 మార్చి నెలలో ఈమెకు అనుకూలంగా తీర్పు లభించింది. బ్యాంకు ఈమెకు కలిగిన నష్టాన్ని భరించాల్సి వచ్చింది. [16][17]

ఫిల్మోగ్రఫీ[మార్చు]

  • రణ్ (2010) - నళినీ కాశ్యప్
  • కర్మ ఔర్ హోలీ (2009) - సుజాత
  • ఆగ్ (2007) - కవిత
  • మై వైఫ్'స్ మర్డర్ (2005) - షీలా
  • విశ్వ (1999) (కన్నడ సినిమా)
  • కష్మకష్ టి.వి.సీరియల్ (1995) - ఆషి
  • వాదే ఇరాదే (1994)
  • జజ్‌బాత్ (1994) - వర్ష
  • కభీ హా కభీ నా (1994) - అన్నా
  • కిలుక్కంపెట్టి (1991) - అను పిళ్లై (మలయాళ సినిమా)

మూలాలు[మార్చు]

  1. Paromita Pain (20 January 2009). "Emotion packed". Young World. The Hindu. Archived from the original on 23 January 2009. Retrieved 2014-03-03.
  2. Deepti Kaul (27 January 2009). "Book review: Swapnalok Society-The Summer of cool". Hindustan Times. Archived from the original on 2009-02-19. Retrieved 2014-03-03.
  3. Roshni Olivera (21 March 2005). "I have Shekhar's blessings: Suchitra". Times of India. Archived from the original on 2012-10-23. Retrieved 2014-03-03.
  4. ఆదెళ్ళ శివకుమార్ (1 December 2001). "ఆమె పేరే సంచలనం సుచిత్రా కృష్ణమూర్తి". హాసం - హాస్య సంగీత పత్రిక. 1 (5): 10–11.
  5. "YouTube". YouTube. Retrieved 2017-02-17.
  6. "Zindagi - Suchitra Krishnamoorthi". YouTube. 2009-03-22. Retrieved 2017-02-17.
  7. "I wanted to marry Ram Gopal Varma: Suchitra Krishnamoorthi". The Times of India. 19 November 2013. Retrieved 2014-03-03.
  8. "Suchitra Krishnamoorthi writes a new book based on her personal experiences". Mid-day.com. 16 November 2013. Retrieved 2014-03-03.
  9. Pain, Paromita (8 February 2009). "I was always good at writing". Chennai, India: The Hindu. Archived from the original on 2009-02-14. Retrieved 2009-02-08.
  10. Suchitra Krishnamoorthi (20 November 2013). Drama Queen. Hachette India. ISBN 978-9350096697.
  11. Khalid Mohamed (17 November 2013). "A spicy, saucy tell-all tale it is". Deccan Chronicle. Retrieved 2014-03-03.
  12. "Suchitra Krishnamoorthi opens up about her candid new book". Hindustan Times. 10 డిసెంబరు 2013. Archived from the original on 3 మార్చి 2014. Retrieved 3 మార్చి 2014.
  13. "Suchitra Krishnamoorthi staging an acting comeback with a play - Mumbai Mirror". Mumbaimirror.indiatimes.com. 2016-09-02. Retrieved 2017-04-26.
  14. Wadhwa, Seema. "Why Suchitra Krishnamoorthi Led Drama Queen Is A Winner". Curiosity Cult. Archived from the original on 2017-01-04. Retrieved 2017-04-26.
  15. Swati Deshpande (1 January 1970). "HSBC settles actor Suchitra Krishnamoorthi's case". The Times of India. Retrieved 2014-03-21.
  16. "Suchitra Krishnamoorthi settles case with HSBC". Financial Express. 12 June 2012. Retrieved 2014-03-21.
  17. "Suchitra Krishnamoorthi settles case with HSBC". Economic Times. 15 March 2014. Retrieved 2014-03-21.

బయటి లింకులు[మార్చు]