సుదీప్తా చక్రవర్తి
స్వరూపం
సుదీప్తా చక్రవర్తి | |
---|---|
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | బరివాలీ |
జీవిత భాగస్వామి | రాజేష్ శర్మ (2005–2009) అవిషేక్ సాహా (2014–ప్రస్తుతం) |
పిల్లలు | 1 |
సుదీప్తా చక్రవర్తి, బెంగాలీ సినిమా నటి. బరివాలీ సినిమాలో నటించి ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.
జీవిత విషయాలు
[మార్చు]మాధ్యమిక విద్యను అలీపూర్ మల్టీపర్పస్ గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ నుండి పూర్తిచేసిన సుదీప్తా, ఫోర్ట్ విలియంలోని కేంద్రీయ విద్యాలయ స్కూల్ పరీక్షను పూర్తిచేసింది. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆంగ్లంలో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రురాలైంది.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సుదీప్తాకు 2005లో నటుడు రాజేష్ శర్మతో వివాహం జరిగింది. వారిద్దరు 2009లో విడాకులు తీసుకున్నారు. 2014లో అవిషేక్ సాహాని వివాహం చేసుకుంది. సుదీప్తా సోదరి బిదీప్తా చక్రవర్తి నటిగా రాణిస్తోంది.[2] సుదీప్త సంఘాత్ సినిమా ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది.
నటించినవి
[మార్చు]సినిమాలు
- జ్యేష్ఠోపుత్రో (2019)
- స్వెటర్ (2019)
- 61 గార్పర్ లేన్ (2017)
- ధనంజయ్ (2017)
- షోరోరిపు (2016)
- రాజకహిని (2015)
- ఓపెన్ టీ బయోస్కోప్ (2014)
- బునో హన్ష్ (2014)
- చార్ (2014)
- హాఫ్ సీరియస్ (2013)
- కేరాఫ్ సర్ (2013)
- గోయ్నార్ బక్షో (2013)
- అబోషేషే (2012)
- నోబెల్ చోర్ (2012)
- ఉరోచితి (2011)
- హిట్‌లిస్ట్ (2009)
- సంగ్‌షోయ్ (2006)
- కాల్‌పురుష్ (2005)
- రోబిబార్ బైకెల్బెలా (2004)
- మోండో మేయర్ ఉపాఖ్యాన్ (2002)
- బరివాలీ (2000)
- సంఘాత్
- బగు మన్నా
- బైకేలే భోరేర్ షోర్షే ఫూల్[3]
- కాచర్ దేవల్
- శృతి అలేఖ్య
- సీ యూ
టెలివిజన్
[మార్చు]- బిగ్ బాస్ బంగ్లా (2013)
- ఖేలా
- బిన్ని ధనేర్ ఖోయ్
- జోల్ నుపూర్
- నానా రోంగర్ డింగులి
అవార్డులు
[మార్చు]- బరివాలీ (2000) సినిమాకు ఉత్తమ సహాయ నటి విభాగంలో ఉత్తమ సహాయ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- బరివాలీ సినిమాకు ఉత్తమ సహాయ నటి విభాగంలో ఉత్తమ సహాయ నటిగా బిఎఫ్ జెఏ అవార్డు
- 'బరివాలి' సినిమాకు ఉత్తమ సహాయ నటిగా బెంగాలీ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అవార్డు (2001)
- ఈటివి ఫిల్మ్ అవార్డు, 2001 - 'బరివాలీ' చిత్రానికి ఉత్తమ సహాయ నటి
- కళాకర్ అవార్డ్, 2000 – బెంగాలీ ప్రైవేట్ న్యూస్ బులెటిన్ 'ఖాస్ ఖోబోర్'కి ఉత్తమ న్యూస్ క్యాస్టర్
- కళాకర్ అవార్డ్, 2001 – 'బారివాలి' చిత్రానికి గాను ఉత్తమ వర్ధమాన నటి
- ఆనందలోక్ అవార్డు, 2001 – మహిళా మ్యాగజైన్ షో 'శ్రీమోతి' (ఈటివి బంగ్లా)కి ఉత్తమ యాంకర్
- ఆనందలోక్ అవార్డు, 2005 – డైలీ ఫిక్షన్ సీరియల్ 'మానసి' (ఆకాష్ బంగ్లా)కి బెస్ట్ మేక్ ఓవర్
- ప్రతిదిన్ టెలి సమ్మాన్, 2005 – మహిళల గేమ్ షో 'ధన్ని మేయే' (జీ బంగ్లా)కి ఉత్తమ యాంకర్
- ప్రతిదిన్ టెలి సమ్మాన్, 2006 – రోజువారీ ఫిక్షన్ సీరియల్ మానసి (ఆకాష్ బంగ్లా) కోసం ప్రతికూల పాత్రలో ఉత్తమ ప్రదర్శన
- జీ గౌరవ్ అవార్డు, 2007 – డైలీ ఫిక్షన్ సీరియల్ 'ఖేలా' (జీ బంగ్లా)కి ఉత్తమ నటి
- జీ గౌరవ్ అవార్డు, 2012 – రంగస్థల నాటకం 'బైకేలే భోరేర్ షోర్షే ఫూల్'కి ఉత్తమ నటి
మూలాలు
[మార్చు]- ↑ "Interview". Archived from the original on 2013-08-23. Retrieved 2022-03-07.
- ↑ "Bidipta's not embarrassed to act out intimate scenes". The Times of India. Archived from the original on 2013-12-08. Retrieved 25 October 2012.
- ↑ "It's a six-year itch: Sudipta Chakraborty". The Times of India. Archived from the original on 2013-01-03. Retrieved 24 September 2012.