Jump to content

సుప్రియ శ్రీన‌తే

వికీపీడియా నుండి
సుప్రియ శ్రీన‌తే
వ్యక్తిగత వివరాలు
జననంమహారాజ్‌గంజ్, ఉత్తర ప్రదేశ్
జాతీయతఇండియన్
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్[1][2]
నైపుణ్యంరాజకీయ నాయకురాలు, జర్నలిస్ట్[3][4][5]

సుప్రియ శ్రీన‌తే (ఆంగ్లం: Supriya Shrinate) ఒక భారతీయ రాజకీయవేత్త. మాజీ పాత్రికేయురాలు. ఆమె భారత జాతీయ కాంగ్రెస్‌కు జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేసారు.[6][7] ఆమె 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లోని మహరాజ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసింది.[8][9][10][11] 2022లో ఆమె కాంగ్రెస్ పార్టీ సోష‌ల్ మీడియా విభాగం అధిప‌తి.

18 ఏళ్ల పాటు సుప్రియ శ్రీన‌తే జర్నలిస్టుగా పనిచేసింది. ఆమె ఇండియా టుడేతో తన వృత్తిని ప్రారంభించింది, తర్వాత ఆమె ఇన్డీటీవిలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరింది. ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చినప్పుడు టైమ్స్ గ్రూప్ వారి ఈటీ నౌలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నది.[12][13][14][15]

జీవితం తొలి దశలో

[మార్చు]

సుప్రియ శ్రీన‌తే మాజీ ఎంపీ హర్షవర్ధన్ కుమార్తె.[16] ఆమె లక్నోలోని లోరెటో కాన్వెంట్ పాఠశాలలో చదువుకుంది. ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్‌తో పట్టభద్రురాలైంది.[17]

జర్నలిజం

[మార్చు]

ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టుగా సుప్రియ శ్రీన‌తే పనిచేసింది. 2001లో ఇండియా టుడే టీవీ ఛానల్ ప్రత్యేక కరస్పాండెంట్‌గా తన వృత్తిని ప్రారంభించింది. 2004లో ఎన్డీటీవీలో అసిస్టెంట్ ఎడిటర్‌గా చేరింది. 2008లో ఈటి నౌలో చీఫ్ ఎడిటర్ - న్యూస్‌గా వ్యవహరించింది. ఆమె అదే సంవత్సరం ఈటి నౌకి పాలసీ ఎడిటర్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా ఎంపికైంది.[18]

రాజకీయం

[మార్చు]

2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుప్రియ శ్రీన‌తే ఈటి నౌలో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా తన పదవికి రాజీనామా చేసింది.[19][20][21] ఆమె భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర ప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గం మహరాజ్‌గంజ్ నుంచి పోటీ చేసి 72,516 ఓట్లతో మూడో స్థానంలో నిలిచింది.[22] 2019లో ఆమె ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యింది.[23] కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా ఆమె టీవీ చర్చల్లో పాల్గొన్నది.[24][25][26] ఆమె భారత జాతీయ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కూడా పాల్గొంది.[27] అదే సంవత్సరం సుప్రియ శ్రీన‌తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ఛైర్మన్‌గా నియమితులయ్యింది.[28]

మూలాలు

[మార్చు]
  1. "कांग्रेस ने Supriya Shrinate को All India Congress Committee का प्रवक्ता नियुक्त किया, जानिए कौन हैं सुप्रिया". News Nation (in హిందీ). Retrieved 2019-09-21.
  2. "Supriya Shrinate appointed as spokesperson of All India Congress Committee". Wion (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
  3. "Congress Appoints TV Journalist Supriya Shrinate as AICC Spokesperson". News 18 (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
  4. "Cong Chooses Journo Over Jailed Ex-Minister's Daughter for UP Seat". Quint (in ఇంగ్లీష్). Retrieved 2019-03-29.
  5. "Supriya Shrinate appointed AICC spokesperson; ex-journalist contested 2019 Lok Sabha polls from UP's Maharajganj". First Post (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
  6. "Congress names former-TV journalist Supriya Shrinate as spokesperson". Business Standard (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
  7. "Supriya Shrinate appointed spokesperson of All India Congress Committee". India Tv (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
  8. "Congress fields journalist Supriya Shrinate from UP's Maharajganj". India Today (in ఇంగ్లీష్). Retrieved 2019-03-29.
  9. "Cong fields journo Supriya Shrinate from Maharajganj". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2019-03-29.
  10. "Supriya Shrinate(Indian National Congress(INC)):Constituency-MAHARAJGANJ (UTTAR PRADESH) - Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-07-27.
  11. "Modi government adding salt to injury by keeping commodity prices high: Congress". The Hindu (in ఇంగ్లీష్). Retrieved 2021-07-14.
  12. "Journalist turned politician, Supriya Shrinate is the newest Congress spokesperson". HW News (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
  13. "Cong appoints former journalist Supriya Shrinate as spokesperson". UNI (in ఇంగ్లీష్). Retrieved 2019-09-21.
  14. "सरकार एक लोन मेला और लगवा दे ताकि लोग लोन लेकर पेट्रोल-डीजल और रसोई गैस खरीद सकें: कांग्रेस". India Tv (in హిందీ). Retrieved 2021-07-01.
  15. "न्यूज़ ऐंकर सुप्रिया को कांग्रेस का टिकट मिलने की पूरी कहानी". Lallantop (in హిందీ). Archived from the original on 2020-09-25. Retrieved 2019-03-29.
  16. "कांग्रेस ने पूर्व पत्रकार सुप्रिया श्रीनाते को राष्ट्रीय प्रवक्ता बनाया, पिता भी दो बार सांसद रहे". Bhaskar (in హిందీ). Retrieved 2021-07-27.
  17. "Supriya Shrinate: Age, Biography, Education, Husband, Caste, Net Worth & More - Oneindia". www.oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 10 November 2021.
  18. "Supriya Shrinate steps down as Executive Editor, ETNow; joins Congress - Exchange4media". Indian Advertising Media & Marketing News – exchange4media (in ఇంగ్లీష్). Retrieved 10 November 2021.
  19. Rampal, Nikhil (30 March 2019). "Can journalist-turned-politician Supriya Shrinate anchor UP's Maharajganj Lok Sabha seat?". India Today (in ఇంగ్లీష్). Retrieved 10 November 2021.
  20. "LS Polls: Congress fields journalist Supriya Shrinate from Maharajganj". Deccan Chronicle (in ఇంగ్లీష్). 29 March 2019. Retrieved 10 November 2021.
  21. "'If You Want to Curb Fake News, Control BJP's IT Cell': Supriya Shrinate on IT Rules". The Wire. Retrieved 10 November 2021.
  22. "Maharajganj Elections 2019: Uttar Pradesh Lok Sabha Constituency Poll Dates, Parliamentary Election, Candidates". Firstpost. Retrieved 5 December 2021.
  23. "Congress appoints Supriya Shrinate as spokesperson". The Indian Express (in ఇంగ్లీష్). 21 September 2019. Retrieved 10 November 2021.
  24. Sharma, Unnati (31 May 2021). "Congress' Supriya Shrinate calls BJP's Sambit Patra 'naali ka keeda', he trends #GaliWaliMadam". ThePrint. Retrieved 10 November 2021.
  25. "बीच में मत बोलिये- न्यूज एंकर से बोलीं सुप्रिया श्रीनेत, मिला जवाब- कांग्रेस की रैली नहीं चल रही". Jansatta (in హిందీ). Retrieved 10 November 2021.
  26. "Punjab: No space for anger in politics, Supriya Shrinate tells Captain Amarinder; ex-CM hits back". PTC News (in ఇంగ్లీష్). 23 September 2021. Retrieved 10 November 2021.
  27. "Sonia Gandhi, Manmohan Singh among Congress star campaigners for phase-1 UP polls". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-01-24. Retrieved 2022-04-14.
  28. "Congress appoints Supriya Shrinate as new social media head". India TV (in ఇంగ్లీష్). 2022-06-20. Retrieved 2022-06-20.