Jump to content

సుబ్రతా గుహ

వికీపీడియా నుండి
సుబ్రతా గుహ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1946-01-31)1946 జనవరి 31
కలకత్తా, బెంగాల్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2003 నవంబరు 5(2003-11-05) (వయసు 57)
ముంబై, మహారాష్ట్ర
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 114)1967 జూన్ 8 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1969 డిసెంబరు 12 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 4 85
చేసిన పరుగులు 17 1067
బ్యాటింగు సగటు 3.40 12.70
100లు/50లు 0/0 0/3
అత్యధిక స్కోరు 6 75
వేసిన బంతులు 674 6068
వికెట్లు 3 299
బౌలింగు సగటు 103.66 20.29
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 18
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 4
అత్యుత్తమ బౌలింగు 2/55 7/18
క్యాచ్‌లు/స్టంపింగులు 2/– 45/–
మూలం: Cricinfo

సుబ్రత గుహ (1946 జనవరి 31 - 2003 నవంబరు 5) 1967 - 1969 మధ్య నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు.[1]

గుహ మీడియం-ఫాస్ట్ ఓపెనింగ్ బౌలరు. అతను కలకత్తా యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు, 1966-67లో పర్యటనకు వచ్చిన వెస్ట్ ఇండియన్స్‌పై సాధించిన ఏకైక విజయానికి కారణమయ్యాడు. ఆ మ్యాచ్‌లో అతను సెంట్రల్, ఈస్ట్ జోన్‌ల జట్టు తరఫున ఆడుతూ 64కి 4 వికెట్లు, 49కి 7 వికెట్లు తీసుకున్నాడు. [2] తరువాతి ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఒకే టెస్ట్‌లో ఆడినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేదు. 1969-70లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో కూడా పెద్దగా రాణించలేదు.[3] అయితే, అతను రంజీ ట్రోఫీలో బెంగాల్ తరపున విజయవంతంగా బౌలింగ్ చేయడం కొనసాగించాడు, 14.61 సగటుతో 209 వికెట్లు, 1972-73లో అస్సాంపై 18 పరుగులకు 7 వికెట్లు సాధించాడు. [4] [5]

గుహ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాడు. అతను, నీలంను 1971 లో వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు. వారి కుమారులలో ఒకరైన కునాల్, నటి నేత్ర రఘురామన్‌ను పెళ్ళి చేసుకున్నాడు. [6] 2003 నవంబరులో 57 వ ఏట గుహ, గుండెపోటుతో మరణించాడు.[6]

మూలాలు

[మార్చు]
  1. "Subrata Guha". CricketArchive. Retrieved 23 November 2022.
  2. "Combined East & Central v West Indies 1966-67". Cricinfo. Retrieved 26 August 2019.
  3. Wisden 2004, pp. 1543–44.
  4. "Assam v Bengal 1972-73". Cricinfo. Retrieved 26 August 2019.
  5. "Subrata Guha". Cricinfo. Retrieved 23 November 2022.
  6. 6.0 6.1 Mukherjee, Abhishek. "Subrata Guha: Bengal's greatest seamer, lost in era of spin". Cricket Country. Retrieved 23 November 2022.