సుమిత్రా ఆనంద్‌ తనోబా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుమిత్రా ఆనంద్‌ తనోబా
సుమిత్రా ఆనంద్‌ తనోబా


పదవీ కాలం
2021 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 15 మే 1970
ఆరేపల్లి గ్రామం, పాపన్నపేట మండలం, మెదక్ జిల్లా , తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి తానోబా ఆనంద్‌రావు
సంతానం మహతి
నివాసం చిన్న మల్లారెడ్డి గ్రామం, కామారెడ్డి జిల్లా
పూర్వ విద్యార్థి ఎంఏ (ఉస్మానియా యూనివర్సిటీ)
వృత్తి రాజకీయ నాయకురాలు, విద్యావేత్త

సుమిత్రా ఆనంద్‌ తనోబా తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు, తెలుగు భాషా పండిట్ మరియు విద్యావేత్త. ఆమె 2021, మే 19న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యురాలిగా నియమితురాలైంది. ఈ పదవిలో ఆమె ఆరేళ్లపాటు ఉంటుంది.[1][2][3]ఆమె 21 మే 2021న భాద్యతలు చేపట్టింది.[4]

జననం, విద్యాభాస్యం[మార్చు]

సుమిత్రా 1970, మే 15న తెలంగాణ రాష్ట్రం, మెదక్ జిల్లా , దుబ్బాక మండలం, ఆరేపల్లి గ్రామంలో విఠాబాయి, మాణిక్‌రావు దంపతులకు జన్మించింది.[5] ఆమె జిల్లా కేంద్రంలోని ప్రాచ్య సాయంత్రం కళాశాలలో డిగ్రీ కోర్సు పూర్తి చేసింది. అనంతరం తెలుగు పండిట్‌ కోర్సు పూర్తి చేసింది.[6]

వృత్తి జీవితం[మార్చు]

సుమిత్రానంద్‌ 1998 డీఎస్సీలో తెలుగు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం సంపాదించింది. మెదక్‌లో నాలుగేళ్ల పాటు విధులు నిర్వహించి అంతర్‌జిల్లాల బదిలీల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని లింగాయపల్లి పాఠశాలకు వచ్చింది. ఆమె ప్రస్తుతం లింగంపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది.[7]

ఇతర పదవులు[మార్చు]

 • తెలుగుదేశం ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఆర్టీఏ సభ్యురాలిగా పని చేసింది.
 • తెలంగాణ టీచర్స్‌ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించింది.
 • తెలంగాణ జాగృతి ఆవిర్భావం అనంతరం నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పని చేసింది.
 • తెలంగాణ భాషావేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు
 • ఆరె సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
 • తెలంగాణ రచయితల వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు
 • తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు

ఉద్యమాలు[మార్చు]

 • ఉపాధ్యాయుల సమస్యలపై చేపట్టిన ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర పోషించింది.
 • తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంది.
 • సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంది.
 • మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై పోరాటాలు చేసింది.

మూలాలు[మార్చు]

 1. Eenadu, ప్రధానాంశాలు (20 May 2021). "టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి". EENADU. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021. Check date values in: |archivedate= (help)
 2. NTV-Telugu News (19 May 2021). "తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను నియమించిన కేసీఆర్". NTV-Telugu News. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021. Check date values in: |archivedate= (help)
 3. The New Indian Express (20 May 2021). "Telangana government appoints Janardhan Reddy as TSPSC chief". The New Indian Express. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021. Check date values in: |archivedate= (help)
 4. Namasthe Telangana (21 May 2021). "టీఎస్‌పీఎస్సీ సభ్యురాలిగా ప్రమాణం చేసిన సుమిత్రానంద్‌". Namasthe Telangana. Archived from the original on 22 మే 2021. Retrieved 22 May 2021. Check date values in: |archivedate= (help)
 5. Namasthe Telangana, సంగారెడ్డి (19 May 2021). "ఉద్యమకారులకు గుర్తింపు". Namasthe Telangana. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021. Check date values in: |archivedate= (help)
 6. Namasthe Telangana, నిజామాబాద్ జిల్లా (19 May 2021). "టీఎస్‌ పీఎస్సీ సభ్యురాలిగా సుమిత్రానంద్‌". Namasthe Telangana. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021. Check date values in: |archivedate= (help)
 7. EENADU, ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి (20 May 2021). "సుమిత్రానందం." EENADU. Archived from the original on 20 మే 2021. Retrieved 20 May 2021. Check date values in: |archivedate= (help)