సుర్జీత్ పతర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డా.సుర్జిత్ పతర్
Dr. Surjit Patar
ਡਾ. ਸੁਰਜੀਤ ਪਾਤਰ
జననం (1945-01-14) 1945 జనవరి 14 (వయసు 79)
పత్తర్ కలాన్, జలంధర్ జిల్లా, పంజాబ్
విద్యసాహిత్యంలో పి.హెచ్.డి, గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్ సర్
వృత్తిరచయిత, కవి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పంజాబీ కవిత్వం

సుర్జిత్ పతర్ (ਸੁਰਜੀਤ ਪਾਤਰ) పంజాబీ భాషకు చెందిన రచయిత, కవి. వీరి కవిత్వం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుంది. ప్రాంతీయతా గోడలను దాటి విశ్వజనీన సత్యాలను ఆవిష్కరిస్తుంది.[1] వీరు ఏడు కవితా సంపుటులను వెలువరించారు. అనేక యూరోపియన్ నాటకాలను, నెరుడా కవిత్వాన్ని పంజాబీ భాషలోకి అనువదించారు. ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్ వంటి వివిధ పురస్కారాలను అందుకొన్నారు.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ జిల్లాకు చెందిన పత్తర్ గ్రామ నివాసి. అందువల్ల ఆయన ఇంటిపేరు కూడా పతర్ అయినది. ఆయన కపుర్తలా లోని రణధీర్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసారు. పాటియాలా లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని చేసారు. ఆయన సాహిత్యంలో పి.హెచ్.డి ని అమృత్‌సర్ లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయంలో "ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఫోక్‌లోర్ ఇన్ గురునానక్ వాణి" అంశంపై చేసారు. తరువాత ఆయన విద్యారంగంలో ప్రవేశించారు. లూధియానా లోని పంజాబ్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పదవీవిరమణ చేసారు. ఆయన 1960ల మధ్యలో రచనలు ప్రారంభించారు. ఆయన రాసిన కవిత్వాలలో ముఖ్యమైనవి "హవా విచ్ లిఖే హర్ఫ్" (గాలిలో రాసిన పదాలు), "బిర్క్ అర్జ్ కరె" , "హనెరె విచ్ సులగ్ది వర్న్‌మాలా", "లఫ్జాన్ ది డర్గా", "పత్జర్ ది పజెబ్", "సర్జమీన్".

ఆయన గిరీష్ కర్నాడ్ వ్రాసిన "నాగ్‌మందల" నాటకాన్ని పంజాబీలోనికి అనువదించారు. ఆయన "బెర్టోల్ట్ బ్రెచ్ట్", "పాబ్లో నెరుడా" వ్రాసిన కవితలను అనువదించారు.

ఆయన చండీగర్ లోని పంజాబీ సాహితీ అకాడమీ అధ్యక్షునిగా యున్నారు. అంతకు ముందు లూధియానాలోని పంజాబీ సాహితీ అకాడమీ అధ్యక్షునిగా పనిచేసారు.

సినిమాలు[మార్చు]

అయన "షహీద్ ఉద్దం సింగ్", "విదేశ్" అనే పంజాబీ చిత్రాలకు సంభాషణలు వ్రాసారు.

పురస్కారాలు[మార్చు]

పద్మశ్రీపురస్కారం
సాహిత్య అకాడమీ పురస్కారం అందుకుంటున్న పతర్
 • 1979 పంజాబీ సాహిత్య అకాడమి పురస్కారం
 • 1993: సాహిత్య అకాడమీ పురస్కారం (హనెరె విచ్ సుల్గ్‌ది వర్న్‌మలా పుస్తకానికి)
 • 1999: పాన్‌చంద్ పురస్కారం (భారతీయ భాషా పరిషత్, కోల్‌కతా ద్వారా)
 • 1999 భారతీయ భాషా పరిషత్, కోల్‌కతా
 • 2007-2008 ఆనద్ కావ్ సమ్మాన్
 • 2009: సరస్వతి సమ్మాన్ ( కె.కె.బిర్లా ఫౌండేషన్ ద్వారా).[2]
 • 2009 గంగాధర్ నేషనల్ అవార్డ్ ఫర్ పోయిట్రీ, సంబల్ పూర్ విస్వవిద్యాలయం, ఒరిస్సా
 • 2012: పద్మశ్రీ పురస్కారం. (సాహిత్య, విద్య రంగాలకు చేసిన సేవలకు గానూ)[3]
 • 2014: సుసుమాగ్రజ్ లిటెరరీ అవార్డు -2014[4]

మూలాలు[మార్చు]

 1. Singh, Surjit (Spring–Fall 2006). "Surjit Patar: Poet of the Personal and the Political" (PDF). Journal of Punjab Studies. 13 (1): 265. Retrieved 4 January 2009. His poems enjoy immense popularity with the general public and have won high acclaim from critics.
 2. Jatinder Preet (30 April 2010). "Saraswati Samman for Patar". Punjab Panorama. Archived from the original on 4 నవంబరు 2013. Retrieved 30 April 2010.
 3. "Padma Awards". pib. 27 January 2013. Retrieved 27 January 2013.
 4. "Punjabi litterateur Surjit Patar conferred Kusumagraj Award". Business Standard. 7 March 2014. Retrieved 8 August 2015.

ఇతర లింకులు[మార్చు]