Jump to content

సూరజ్‌భాను సోలంకి

వికీపీడియా నుండి
సూరజ్‌భాను సోలంకి

పదవీ కాలం
1989-1996
నియోజకవర్గం ధార్

వ్యక్తిగత వివరాలు

జననం (1960-04-04)1960 ఏప్రిల్ 4
భోపాల్ , మధ్యప్రదేశ్
మరణం 2021 మార్చి 21(2021-03-21) (వయసు 60)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి గీతాంజలి సోలంకి
మూలం [1]

సూరజ్ భాను సోలంకి (4 ఏప్రిల్ 1960 - 21 మార్చి 2021) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ధార్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సూరజ్ భాను సోలంకి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లోపని చేసి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ధార్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఉమ్రావ్ సింగ్ పర్వత్ సింగ్ పై 11771 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ధీరేంద్రసింగ్ చౌహాన్ పై 39479 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. సూరజ్ భాను సోలంకి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు

మరణం

[మార్చు]

సూరజ్‌భాను సోలంకి భోపాల్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో 2021 మార్చి 21న మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Zee News (21 March 2021). "महू-धार से दो बार सांसद रहे सूरजभानु सिंह का 60 की उम्र में निधन, दिल्ली में ली अंतिम सांस". Archived from the original on 19 August 2024. Retrieved 19 August 2024.
  2. "Ex Congress MP Suraj Solanki dies of cardiac arrest in Bhopal". 21 March 2021. Retrieved 14 October 2024.
  3. Deccan Herald (21 March 2021). "Former Congress MP Suraj Solanki dies of cardiac arrest in Bhopal" (in ఇంగ్లీష్). Archived from the original on 9 November 2024. Retrieved 9 November 2024.