Jump to content

సైమన్ మరాండి

వికీపీడియా నుండి
సైమన్ మరాండి

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
పదవీ కాలం
13 జూలై 2013 – 28 డిసెంబర్ 2014

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1977 - 1989
2009 - 2014
2017 - 2019
నియోజకవర్గం లితిపరా

పదవీ కాలం
1989 – 1996
ముందు సేథ్ హెంబ్రామ్
తరువాత థామస్ హన్స్డా
నియోజకవర్గం రాజ్‌మహల్

వ్యక్తిగత వివరాలు

జననం (1947-12-25)1947 డిసెంబరు 25
దుమారియా, సాహిబ్‌గంజ్ జిల్లా, బీహార్ (ఇప్పుడు జార్ఖండ్)
మరణం 2021 ఏప్రిల్ 13(2021-04-13) (వయసు 73)
రవీంద్రనాథ్ ఠాగూర్ హాస్పిటల్, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్
రాజకీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా
జీవిత భాగస్వామి సుశీల హన్స్దా
నివాసం దుమారియా, సాహిబ్‌గంజ్ జిల్లా, జార్ఖండ్
వృత్తి సామాజిక కార్యకర్త, వ్యవసాయవేత్త, క్రీడాకారుడు, పారిశ్రామికవేత్త, నిర్వహణ సలహాదారు
మూలం [1]

సైమన్ మరాండీ జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

సైమన్ మరాండీ విద్యార్థి దశ నుండే రాజకీయాల్లోకి వచ్చి 1977లో జరిగిన బీహార్ శాసనసభ ఎన్నికలలో లితిపరా శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి మారంగ్ ముర్ముపై 149 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత జార్ఖండ్ ముక్తి మోర్చా పేరిట తరపున 1980, 1985, 2009 శాసనసభ ఎన్నికలలో, 2017లో జరిగిన ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2]

సైమన్ మరాండీ 2014 శాసనసభ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరి,[3] ఆ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 2013 నుండి 2014 వరకు హేమంత్ సొరేన్ మంత్రివర్గంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు. సైమన్ మరాండీ 1989, 1991లో రాజ్‌మహల్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.

మరణం

[మార్చు]

సైమన్ మరాండీ అనారోగ్యంతో కారణంగా కోల్‌కతాలోని ఆర్‌ఎన్ ఠాగూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2021 ఏప్రిల్ 13న మరణించాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. India Today (4 August 2013). "Jharkhand CM Hemant Soren expands Cabinet, inducts six ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  2. Hindustan Times (13 April 2017). "Jharkhand bypolls: JMM Simon Marandi wins in Littipara" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  3. India TV News (10 August 2014). "Veteran JMM leader Simon Marandi joins BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  4. The Times of India (14 April 2021). "JMM stalwart Simon Marandi dies at 74". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.