Jump to content

స్ఖలనం

వికీపీడియా నుండి
(స్కలనం నుండి దారిమార్పు చెందింది)
Diagram of the male pelvic and reproductive organs

స్ఖలనం లేదా స్కలనం (Ejaculation) అనగా సంభోగంలో స్త్రీపురుషులిద్దరూ భావప్రాప్తిని చేరిన సమయంలో వారి జననేంద్రియాల నుండి ద్రవాలు విడుదలైన ప్రక్రియ. ఇది పురుషులలో జననేంద్రియ వ్యవస్థ నుండి వీర్యం స్త్రీ యోనిలోనికి ప్రవేశిస్తుంది. ఇది స్త్రీలు గర్భం ధరించడానికి చాలా ముఖ్యమైన క్రియ. అరుదుగా స్ఖలనం నిద్రలోనే తెలియకుండా జరగవచ్చును.

భాషా విశేషాలు

తెలుగు భాషలో స్ఖలనము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] స్ఖలనము [ skhalanamu ] skhalanamu. సంస్కృతం n. Stumbling, slipping, tripping, dripping, trickling, చ్యుతి, తొట్రుపడడము, జారడము, రేతస్ఖలనము. emission of semen. "పదస్ఖలనంబున" by a slip of the foot. Mandhata. iii. 161. స్ఖలించు skhalinḍsu. v. n. To slip. జారు. To stumble, తొట్రుపడు. స్ఖలితము skhalitamu. adj. Slipped, fallen, gone, shaken. Stuttering. చ్యుతమైన, జారిన, తొట్రుపడిన. "మద స్ఖలితాత్ముడొ పుట్టు వెర్రియో." KP. vi. 16. అస్ఖలిత బ్రహ్మచారి one who has no connection with women. స్ఖలితత్వము skhali-tatvamu. n. An error, omission, trip, slip. తప్పు, పొరపాటు, తొట్రుపాటు, జారడము. స్ఖాలిత్యము skhālityamu. n. An error, omission. తప్పు. పొరపాటు.

ప్రేరణ

రతిక్రీడ తరువాత యోనిలో స్ఖలనం

స్ఖలనం కన్నా ముందు రతికార్యం కోసం ప్రేరణ అవసరం. దీనివలన పురుషాంగం దృఢంగా తయారౌతుంది. ఈ ప్రేరణ యోని ద్వారా గాని, నోరు లేదా స్వయంతృప్తిలో వారి చేతులతో గాని కలిగించవచ్చును. పురుషులలో సుమారు 5–10 నిమిషాలు పడుతుంది.[2][3] కొంతమంది దీనిని పొడిగించగలుగుతారు. స్కలనం తొందరగా జరిగితే దానిని శీఘ్ర స్ఖలనం అని, అదే పొడిగించబడితే దానిని దీర్ఘ స్ఖలనం అని అంటారు. కొన్ని సార్లు భావప్రాప్తి కలిగిన తర్వాత స్ఖలనం జరుగదు దీనిని పొడి భావప్రాప్తి (dry orgasm) అంటారు.

స్ఖలనం

Ejaculation example

పురుషుడు ప్రేరణలో కొంత స్థాయికి చేరిన తర్వాత స్ఖలించడం జరుగుతుంది. నాడీ వ్యవస్థ ఆధీనంలో వీర్యం వృషణాల నుండి ఒక జెట్ మాదిరిగా విడుదలౌతుంది.[4] ఇది ప్రసేకము ద్వారా బయటకు వస్తుంది.[5] ఈ మొత్తం ప్రక్రియ కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది.

అయితే సామాన్యంగా భావప్రాప్తి తర్వాత వీర్యం 10 to 15 సంకోచాల ద్వారా బయటకు వస్తుంది. దీనిని ఆ వ్యక్తి గుర్తించలేకపోవచ్చును. ఈ స్థాయిలో దీనిని నిరోధించలేము.[6] వీనిలో మొదటి రెండు సంకోచాలతోనే ఎక్కువ పరిమాణంలో వీర్యం బయటకు వస్తుంది.[7]

Alfred Kinsey స్కలించిన వీర్యం ఎంత దూరం పోతుందో కొలిచాడు. ఇది ఎక్కువమందిలో ఒకటి రెండు అడుగుల దూరం పోతే అరుదుగా ఐదు ఆరు అడుగులు దూసుకుపోయింది.[8] మాస్టర్స్ అండ్ జాన్సన్ రిపోర్ట్ కూడా దీనిని నిర్ధారించినది.[9] అయితే ఈ దూరానికి రతి కార్యంలో సాఫల్యతకు సంబంధం లేదు.

సమస్యలు

  • శీఘ్ర స్ఖలనం (Premature ejaculation) : పురుషులలో ఈ సమస్య మూలంగా తొందరగా స్ఖలనం జరిగి పురుషాంగం దృఢత్వాన్ని కోల్పోతుంది. అప్పటికి స్త్రీకి భావప్రాప్తి కలగకపోవడం మూలంగా అసంతృప్తిని కలిగిస్తుంది.
యోని నుండి స్కలనం చేయబడిన వీర్యం కారుతుంది
Ejaculated semen drips from the vagina

మూలాలు

  1. బ్రౌన్ నిఘంటువు ప్రకారం స్ఖలనము పదప్రయోగాలు.[permanent dead link]
  2. Waldinger, M.D.; Quinn, P.; Dilleen, M.; Mundayat, R.; Schweitzer, D.H.; Boolell, M. (2005). "A Multinational Population Survey of Intravaginal Ejaculation Latency Time". Journal of Sexual Medicine. 2 (4): 492–497. doi:10.1111/j.1743-6109.2005.00070.x. PMID 16422843.
  3. Giuliano, F.; Patrick, D.; Porst, R.; La Pera G.; Kokoszka A.; Merchant, S.; Rothman, M.; Gagnon, D.; Polverejan, E. (2008). "Premature Ejaculation: Results from a Five-Country European Observational Study". European Urology. 53 (5): 1048–1057. doi:10.1016/j.eururo.2007.10.015. PMID 17950985.
  4. Bruce M. Koeppen; Bruce A. Stanton (2008). Berne & Levy Physiology. Philadelphia, PA: Elsevier/Mosby. ISBN 978-0-323-04582-7.
  5. Walter F. Boron; Emile L. Boulpaep (2005). Medical Physiology: A Cellular and Molecular Approach. Philadelphia, PA: Elsevier/Saunders. ISBN 1-4160-2328-3.
  6. Bolen, J. G. (1980-12-09). "The male orgasm: pelvic contractions measured by anal probe". Archives of Sexual Behavior (6): 503–21. doi:10.1007/BF01542155. PMID 7458658.
  7. Gerstenburg, T. C.; Levin, RJ; Wagner, G (1990). "Erection and ejaculation in man. Assessment of the electromyographic activity of the bulbocavernosus and ischiocavernosus muscles". British Journal of Urology. 65 (4): 395–402. doi:10.1111/j.1464-410X.1990.tb14764.x. PMID 2340374.
  8. Kinsey, A. C.; Pomeroy, W. B.; Martin, C. E.; Gebhard, P. H. (1998). Sexual Behavior in the Human Female. Indiana University Press. p. 634. ISBN 978-0253334114.
  9. Masters, W.H.; Johnson, V.E. (1970). Human Sexual Response. Boston: Little, Brown and Company.
"https://te.wikipedia.org/w/index.php?title=స్ఖలనం&oldid=4031509" నుండి వెలికితీశారు