స్మృతి ఇరాని
స్మృతి ఇరాని | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 31 May 2019 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
---|---|---|---|
ముందు | మేనకా గాంధీ | ||
టెక్స్టైల్స్ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
సమాచార ప్రసార శాఖ
| |||
పదవీ కాలం 18 July 2017 – 24 May 2018 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ముందు | వెంకయ్య నాయుడు | ||
తరువాత | రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ | ||
కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి
| |||
పదవీ కాలం 26 మే 2014 – 5 జులై 2016 | |||
ప్రధాన మంత్రి | Narendra Modi | ||
ముందు | పల్లం రాజు | ||
తరువాత | ప్రకాష్ జవదేకర్ | ||
లోక్‌సభ సభ్యురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 23 మే 2019 | |||
ముందు | రాహుల్ గాంధీi | ||
నియోజకవర్గం | అమేథీ | ||
రాజ్యసభ సభ్యురాలు
| |||
పదవీ కాలం 19 ఆగష్టు 2011 – 23 మే 2019 | |||
ముందు | ప్రవీణ్ నాయక్ | ||
తరువాత | ఖాళీ | ||
నియోజకవర్గం | గుజరాత్ | ||
భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షురాలు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 ఆగష్టు 2011 | |||
అధ్యక్షుడు | రాజనాధ సింగ్ అమిత్ షా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఢిల్లీ, భారత్ | 1976 మార్చి 23||
జాతీయత | Indian | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | జుబిన్ ఇరాని | ||
సంతానం | 3 | ||
నివాసం | Mumbai | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు నటి (మాజీ)[1] |
స్మృతి ఇరాని ఒక భారతీయ టెలివిజన్ నటి, రాజకీయ నాయకురాలు. 2014 లో నరేంద్ర మోది ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వార్తలలో నిలిచింది.[2]
బాల్యం
[మార్చు]స్మృతి తండ్రి ఓ పంజాబీ. ఆయన ఓ బెంగాలీ అమ్మాయిని ప్రేమించాడు. అయితే రెండు వైపుల వాళ్ళూ వాళ్ళ ప్రేమను ఒప్పుకోకపోవడంతో బయటకొచ్చి పెళ్ళి చేసుకుని ఇద్దరూ కొత్త జీవితం ప్రారంభించారు. దక్షిణ దిల్లీ శివార్లలో వారి నివాసం. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక పశువుల కొట్టాన్ని చూసుకునే పనికి కుదురుకున్నారు. స్మృతి అక్కడే జన్మించింది. ఆమె తరువాత మరో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఒక పక్క చదువుకుంటూనే పేదరికం కారణంగా కొన్ని కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. పదో తరగతిలో ఉన్నప్పుడు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేది. పదో తరగతి, ఆపై ఇంటర్మీడియట్ అరవై శాతం పైగా మార్కులతో పాసైనా ఆర్థిక పరిస్థితులు సహకరించక పోవడం వల్ల కళాశాలకు వెళ్ళడం మానేసి దూరవిద్యలో చదవడం మొదలు పెట్టింది.
ఉద్యోగ వేట, వృత్తి
[మార్చు]తల్లిదండ్రులిద్దరూ పనికి వెళుతుండటంతో ఇంటి పనులన్నీ స్మృతి చేసేది. పదహారేళ్ళ వయసున్నప్పుడు దిల్లీలోని జన్‌పథ్ వీధుల్లో సౌందర్య సాధనాలను మార్కెటింగ్ చేసే ఉద్యోగం చేసింది. ఒక స్నేహితురాలి సలహాతో తన ఫోటోను ఎవరికి తెలియకుండా మిస్ ఇండియా పోటీలకు పంపింది. అది మొదటి వడపోతలో ఎంపికైంది. కానీ తదుపరి పోటీల్లో ముంబై వెళ్ళాల్సి వచ్చింది. తల్లిదండ్రులను దానికి కావాల్సిన రెండు లక్షల రూపాయలను అప్పుగా తీసివ్వమని కోరి ముంబై చేరింది.
స్వంతంగానే పోటీలకు తయారవడం మొదలుపెట్టింది. పోటీలో అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ చివరి ఐదు మందిలో చోటు సంపాదించింది కానీ మిస్ ఇండియా కిరీటం మాత్రం చేజారింది. కానీ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. రెండు లక్షల రూపాయల అప్పు తీర్చవలసి వచ్చింది. దానికోసం వివిధ ఉద్యోగాల కోసం ప్రయత్నించింది. జెట్ ఎయిర్ వేస్ లో ఎయిర్ హోస్టెస్ గా ప్రయత్నించింది కానీ ఆ ఉద్యోగం రాలేదు. బ్రతుకుదెరువు కోసం బాంద్రాలోని మెక్‌డోనాల్డ్స్ లో ఉద్యోగానికి చేరింది. అక్కడ టేబుళ్ళు, ఫ్లోర్లు శుభ్రం చేయడం నుంచి ఆర్డర్లను సప్లై చేయడం వరకు అన్ని పనులు చేసింది. ఇది చేస్తూనే మోడలింగ్ అవకాశాల కోసం స్టూడియోల కోసం తిరుగుతూనే ఉంది.
కొద్ది రోజుల తర్వాత ఓ శానిటరీ నాప్‌కిన్ ప్రకటనకో కనిపించే అవకాశం వచ్చింది. తర్వాత టీవీలో రెండు సినిమా కార్యక్రమాలకు యాంకరింగ్ చేసే అవకాశం లభించింది. ఈ కార్యక్రమాలను చూసిన శోభా కపూర్ స్మృతిని తన కూతురు ఏక్తా కపూర్కు పరిచయం చేసింది. దాంతో ఆమెకు క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ అనే సీరియల్ లో తులసి అనే పాత్రకి ఎంపికైంది. అదే ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఎనిమిదేళ్ళ పాటు ఆ సీరియల్ లో కనిపించింది. టీవీ నటులకు అత్యుత్తమ అవార్డుగా భావించే ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డును వరసగా ఐదు సార్లు అందుకుని చరిత్ర సృష్టించింది. తరువాత సొంతంగా ఉగ్రాన్య ప్రొడక్షన్స్ పేరుతో నిర్మాణ సంస్థ నెలకొల్పి టీవీ సీరియల్స్ నిర్మించింది.
రాజకీయాలు
[మార్చు]ఆమె తాతయ్య ఆరెస్సెస్ లో పని చేసేవాడు. తల్లి జనసంఘ్ లో కార్యకర్తగా ఉండేది. స్మృతి కూడా చిన్నప్పటి నుంచే ఆరెస్సెస్ లో సభ్యురాలు. నిర్మాతగా ఉన్నతస్థాయిలో ఉన్నపుడే రాజకీయరంగంలోకి అడుగుపెట్టింది. 2003 లో బిజెపిలో చేరింది. 2004 ఎన్నికల్లో దిల్లీ చాందినీ చౌక్ నుంచి కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పై పోటీ చేసింది. కానీ నెగ్గలేదు. ఆమె బిజెపికి ఓటుబ్యాంకు సంపాదించిపెట్టింది. తర్వాత ఆమెను మహారాష్ట్ర యువత విభాగానికి అధ్యక్షులుగా నియమించింది. కొన్నాళ్ళకు బిజెపి జాతీయ కార్యదర్శిగా, బిజెపి మహిళా కార్యదర్శిగా, బిజెపి మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగింది. 2014 లో మోది ప్రభుత్వంలో మానవ వనరుల శాఖకు మంత్రి అయ్యింది.
కుటుంబం
[మార్చు]తనకంటే వయసులో చాలా పెద్దవాడైన చిన్ననాటి స్నేహితుడు జుబిన్ ఇరానీని వివాహ మాడింది. అప్పటికి ఆమెకు 25 ఏళ్ళ వయసు. వారికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి జోహ్ర్ అమ్మాయి జోయిష్.[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-09-26. Retrieved 2019-06-15.
- ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ ఈనాడు ఆదివారం ఫిబ్రవరి 22, 2015
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with GND identifiers
- 1976 జననాలు
- మహిళా రాజకీయ నాయకులు
- జీవిస్తున్న ప్రజలు
- భారతీయ జనతా పార్టీ రాజకీయ నాయకులు
- భారతీయ టెలివిజన్ నటులు
- 16వ లోక్‌సభ సభ్యులు
- ఉత్తర ప్రదేశ్ నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- భారత మంత్రివర్గంలో మహిళా సభ్యులు