స్వామినారాయణ దేవాలయం (చికాగో)
స్వామినారాయణ దేవాలయం (చికాగో) | |
---|---|
భౌగోళికం | |
దేశం | యునైటెడ్ స్టేట్స్ |
రాష్ట్రం | ఇల్లినాయిస్ |
ప్రదేశం | బార్ట్లెట్ |
సంస్కృతి | |
దైవం | స్వామి నారాయణ రాధాకృష్ణ సీత-రాముడు శివుడు-పార్వతి |
వాస్తుశైలి | |
నిర్మాణ శైలులు | శిల్పశాస్త్రం |
చరిత్ర, నిర్వహణ | |
నిర్మించిన తేదీ | ఆగస్టు, 2004 |
సృష్టికర్త | ప్రముఖ్ స్వామి మహారాజ్ |
వెబ్‌సైట్ | chicago.baps.org |
స్వామినారాయణ దేవాలయం, ఇల్లినాయిస్లో స్వామినారాయణ్ సంస్థచే నిర్మించబడిన సాంప్రదాయ హిందూ దేవాలయం. మహంత్ స్వామి మహారాజ్ నేతృత్వంలోని స్వామినారాయణ్ సంస్థ, హిందూమతంలోని స్వామినారాయణ సంస్థకు చెందినది. ఇటాలియన్ పాలరాయి, టర్కిష్ సున్నపురాయితో చికాగో శివారు బార్ట్‌లెట్‌లో నిర్మించబడిన ఈ దేవాలయం 2004, ఆగస్టు 7న ప్రారంభించబడింది. [1] పురాతన హిందూ గ్రంథాలలో వివరించిన మార్గదర్శకాల ప్రకారం నిర్మించబడిన ఇల్లినాయిస్‌లోని అతిపెద్ద దేవాలయమిది. 27 ఎకరాలలో విస్తరించివున్న ఈ దేవాలయం ప్రాంగణంలో హవేలీ, ఒక చిన్న పుస్తక దుకాణం కూడా ఉన్నాయి. ఇక్కడ వారానికోసారి సభలు జరుగుతాయి. ప్రతిరోజూ ఆరాధనలు, సందర్శకుల కోసం ఈ దేవాలయం తెరిచే ఉంటుంది.[2] మొత్తం కాంప్లెక్స్ 27 ఎకరాల్లో ఉంది.
దేవాలయ కార్యకలాపాలు
[మార్చు]ఇక్కడ ప్రతివారం భక్తి గీతాలపన, హిందూ గ్రంథాలలోని బోధనలతో ఆధ్యాత్మిక ప్రసంగాలు నిర్వహించబడుతాయి.[2] యువతీయువకుల కోసం హిందూ మతానికి సంబంధించిన బోధనలు, భారతీయ సంగీతం, గుజరాతీ భాషా శిక్షణ వంటి అనేక రకాల కార్యకలాపాలు ఉన్నాయి.[2] యువతీయువకుల ఈవెంట్‌లను నిర్వహించడంలో సహాయం చేయడంతోపాటు భక్తి గీతాలు పాడడం, సాంప్రదాయ నృత్యాలు చేయడం, ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడం ద్వారా ప్రధాన హిందూ పండుగల వేడుకలో పాల్గొంటారు.[2] ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, శ్రీకృష్ణజన్మాష్టమి, మహాశివరాత్రి, హోలీ, వినాయకచవితి, దీపావళి మొదలైన పండుగలు నిర్వహించబడుతాయి.
దేవాలయ సంస్థ
[మార్చు]1972లో, ప్రముఖ్ స్వామి మహారాజ్ ఆదేశానుసారం, చికాగోలోని కొంతమంది హిందూ భక్తులు ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహించడానికి వారివారి ప్రాంతాలలో కలుసుకోవడం ప్రారంభించారు.[3] ప్రముఖ్ స్వామి మహారాజ్ నుండి 1974, 1977, 1980లలో చికాగో నగరాన్ని సందర్శించి, పెరుగుతున్న హిందూ జనాభాకు తగిన శాశ్వత స్థలం అవసరమని సూచించాడు. చికాగో శివారు ప్రాంతమైన గ్లెన్ ఎలిన్‌లో నాలుగు ఎకరాల భవనంలో 1984లో, ప్రముఖ స్వామి ఈ భవనంలో దేవతామూర్తులను ప్రతిష్టించి, చికాగో ప్రాంతంలో మొదటి శ్రీ స్వామినారాయణ మందిరాన్ని ప్రారంభించాడు.[3] కొన్ని సంవత్సరాలలో, గ్లెన్ ఎలిన్‌లోని మందిర్‌ను సంఘం మించిపోవడంతో 1994లో బార్ట్లెట్ కొంత భూమిని కొనుగోలు చేశారు.[3]
నిర్మాణం, ప్రారంభోత్సవం
[మార్చు]ఈ దేవాలయ కాంప్లెక్స్ నిర్మాణం వివిధ దశల్లో జరిగింది. 2000, అక్టోబరు 29న ప్రముఖ్ స్వామి మహారాజ్ హవేలీని ప్రారంభించాడు.[3]
దేవాలయ నిర్మాణంకోసం సున్నపురాయి, పాలరాయి, టర్కీ రాళ్ళు మొదలైనవి ఇటలీ నుండి భారతదేశంలోని గుజరాత్‌కు, అక్కడినుండి రాజస్థాన్‌కు రవాణా చేయబడ్డాయి. అక్కడ 2000 మంది హస్తకళాకారులు వాటిని నగీషీలుగా చెక్కారు.[3] 70,000 చదరపు అడుగుల రాయిని చెక్కి వివిధ రకాల నమూనాలు, డిజైన్‌లు రూపొందించారు. చెక్కిన 40,000 రాయి ముక్కలు చికాగోకు రవాణా చేయబడ్డాయి.[3] అక్కడ వాటిని 3డి జిగ్సా పజిల్ లాగా అమర్చారు.[3] దేవాలయ వెలుపలిభాగానికి టర్కిష్ సున్నపురాయి, లోపలిభాగానికి ఇటాలియన్ కర్రారా పాలరాయి ఉపయోగించబడింది.
దేవాలయం 22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 78 అడుగుల ఎత్తులో, 112 అడుగుల వెడల్పులో, 215 అడుగుల పొడవులో ఉంది.[4] 16 గోపురాలతో మొదటిస్థానంలో ఉంది. ఇందులో 151 స్తంభాలు, 117 తోరణాలు, ఐదు పినాకిల్స్, నాలుగు బాల్కనీలు ఉన్నాయి.[5]
16 నెలలపాటు నిర్మించిన ఈ దేవాలయాన్ని 2004, ఆగస్టు 7న ప్రముఖ్ స్వామి మహారాజ్ అధికారికంగా ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు కాంగ్రెస్ సభ్యుడు హెన్రీ హైడ్, ఇల్లినాయిస్ రాష్ట్ర ప్రతినిధి జాన్ మిల్లర్ హాజరయ్యారు.[6]
2004లో, ప్రత్యేక శైలి భారతీయ రాతి నిర్మాణం, ఇంజనీరింగ్, సాంస్కృతిక-ఆధ్యాత్మిక ప్రభావం వంటి అంశాలలో ఈ దేవాలయ కాంప్లెక్స్‌కు చికాగో బిల్డింగ్ కాంగ్రెస్ మెరిట్ అవార్డు వచ్చింది.[7] 2005లో, స్టోన్ వరల్డ్ మ్యాగజైన్‌లో ఈ దేవాలయం పురాతన వారసత్వం, సాంప్రదాయ భారతీయ దేవాలయాల నైపుణ్యానికి చిహ్నంగా గుర్తించబడింది. ఇల్లినాయిస్‌లోని 150 గొప్ప ప్రదేశాలలో ఒకటిగా అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ చే గుర్తింపు పొందింది.[7]
చిత్రమాలిక
[మార్చు]-
స్వామి నారాయణ, గుణతితానంద స్వామి
-
హరికృష్ణ మహరాజ్, రాధాకృష్ణ
-
ప్రముఖ్ స్వామి మహరాజ్
మూలాలు
[మార్చు]- ↑ Correspondent (2004-07-01). "BAPS Mandir brings peace and harmony to all". India Tribune. Community.
- ↑ 2.0 2.1 2.2 2.3 BAPS. "Activities". Archived from the original on 2014-06-04. Retrieved 2022-01-24.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 BAPS (2004). "History of Chicago congregation". Swaminarayan Bliss. 27 (9–10): 34–39.
- ↑ Reddy, Vasu (2004-08-14). "BAPS Mandir brings peace and harmony to all". India Tribune. p. 3.
- ↑ Van Matre, Lynn (2004-08-07). "Temple nears opening day in Bartlett". Chicago Tribune. Chicago. p. 14.
- ↑ Black, Mark (2004-08-09). "Temple: Project Took 2 million volunteer hours". Daily Herald. pp. 1 and 6.
- ↑ 7.0 7.1 "Media Coverage". BAPS. Archived from the original on 2014-10-06. Retrieved 2022-01-24.