Jump to content

స్వామి సుమేదానంద సరస్వతి

వికీపీడియా నుండి
స్వామి సుమేదానంద సరస్వతి
స్వామి సుమేదానంద సరస్వతి


పదవీ కాలం
1 సెప్టెంబర్ 2014 – 3 జూన్ 2024
ముందు మహదేవ్ సింగ్ ఖండేలా
తరువాత అమ్రా రామ్
నియోజకవర్గం సికర్

వ్యక్తిగత వివరాలు

జననం (1951-10-01) 1951 అక్టోబరు 1 (వయసు 73)
రోహ్తక్, పంజాబ్, భారతదేశం (ప్రస్తుత హర్యానా)
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మాయా రామ్ ఆర్య, భారతీ దేవి
నివాసం పిప్రలి, సికర్, రాజస్థాన్
పూర్వ విద్యార్థి చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం (మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ )
వృత్తి సామాజిక సేవ
మూలం [1]

స్వామి సుమేదానంద సరస్వతి (జననం 1 అక్టోబర్ 1951) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

2014 భారత సార్వత్రిక ఎన్నికలకు ముందు బాబా రామ్‌దేవ్ డిమాండ్ మేరకు సరస్వతి సికార్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఆయన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్ సింగ్ జాట్‌ను 2,39,196 ఓట్ల మెజారిటీతో ఓడించి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో 1 సెప్టెంబర్ 2014 నుండి 25 మే 2019 వరకు మానవ వనరుల అభివృద్ధిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా,  15 సెప్టెంబర్ 2014 - 25 మే 2019 వరకు నీతి కమిటీ సభ్యుడిగా, వ్యవసాయ మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా,  మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ  హిందీ సలాహ్కార్ సమితి సభ్యుడిగా పని చేశాడు.

స్వామి సుమేదానంద సరస్వతి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుభాష్ మహరియాను 2,97,156 ఓట్ల మెజారిటీతో ఓడించి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా,  15 సెప్టెంబర్ 2014 - 25 మే 2019 వరకు నీతి కమిటీ సభ్యుడిగా, వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, కన్సల్టేటివ్ కమిటీ  సభ్యుడిగా పని చేశాడు.

స్వామి సుమేదానంద సరస్వతి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సికర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఎం పార్టీ అభ్యర్థి అమ్రా రామ్ చేతిలో 72896 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  2. The Times of India (2024). "Sikar Constituency Lok Sabha Election Result" (in ఇంగ్లీష్). Retrieved 24 October 2024.
  3. Election Commision of India (8 October 2024). "Lok Sabha 2024 Election results: Sikar". Retrieved 24 October 2024.