అక్షాంశ రేఖాంశాలు: 16°6′9.18″N 78°51′42.26″E / 16.1025500°N 78.8617389°E / 16.1025500; 78.8617389

హటకేశ్వరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హటకేశ్వరం
హటకేశ్వరస్వామి దేవాలయం, శ్రీశైలం
హటకేశ్వరస్వామి దేవాలయం, శ్రీశైలం
పటం
హటకేశ్వరం is located in ఆంధ్రప్రదేశ్
హటకేశ్వరం
హటకేశ్వరం
అక్షాంశ రేఖాంశాలు: 16°6′9.18″N 78°51′42.26″E / 16.1025500°N 78.8617389°E / 16.1025500; 78.8617389
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల
మండలంశ్రీశైలం
విస్తీర్ణం0.2 కి.మీ2 (0.08 చ. మై)
జనాభా
 (2011)[1]
29
 • జనసాంద్రత150/కి.మీ2 (380/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు16
 • స్త్రీలు13
 • లింగ నిష్పత్తి813
 • నివాసాలు9
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్518102
2011 జనగణన కోడ్593973

హటకేశ్వరం, నంద్యాల జిల్లా, శ్రీశైలం మండలానికి చెందిన గ్రామం.శ్రీశైలమల్లిఖార్జున దేవస్థానానికు మూడు కి.మీ. దూరంలో కల మరొక పుణ్యక్షేత్రం హటకేశ్వరం. ఇక్కడ హటకేశ్వరాలయం ఉంది. ఈ పరిసరాలలోనే శ్రీ ఆది శంకరాచార్యులు నివసించినట్లు కథనాలు ఉన్నాయి.ఇది మండల కేంద్రమైన శ్రీశైలం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కర్నూలు నుండి 62 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 9 ఇళ్లతో, 29 జనాభాతో 20 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 16, ఆడవారి సంఖ్య 13. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 0 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 19. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593973 [2].

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 57.[3] ఇందులో పురుషుల సంఖ్య 43, మహిళల సంఖ్య 14, గ్రామంలో నివాస గృహాలు 15 ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]
హటకేస్వరస్వామివారు.

పరమశివుడు అటిక (ఉట్టి, కుండ పెంకు) లో వెలియడంతో ఈ ఆలయంలోని ఈశ్వరుని అటికేశ్వరుడు అనేవారు రానురాను అదేమెల్లగా హటికేశ్వరస్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఆప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తుల మాటగా హటకేశ్వరంగా పిలువ బడుతోంది. ఇక్కడ చెంచులు అదివాశీలు నివసిస్తున్నారు. ఈ దేవాలయ పరిసరాలలో పలు ఆశ్రమములు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చెందుకు శ్రీశైలం దేవస్థానము నుండి ప్రతి అర గంటకు బస్సులు ఉన్నాయి.

ఒక చిన్న కథ

[మార్చు]

హటకేశ్వరం క్షేత్రం గురించి చెప్పుకునేటప్పుడు ... మహాభక్తుడైన కుమ్మరి కేశప్ప గురించి కూడా తప్పని సరిగా చెప్పుకోవలసి వస్తుంది. నిస్వార్ధమైన సేవతో ... అనితర సాధ్యమైన భక్తితో సాక్షాత్తు సదాశివుడి అనుగ్రహాన్ని పొందిన కేశప్ప, శ్రీ శైలం సమీప ంలోని ఒక గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. కుమ్మరి కులానికి చెందిన కేశప్ప ... తన వృత్తిని చేసుకుంటూనే, శ్రీశైల దర్శనానికి వచ్చే భక్తులకు భోజన వసతులు ఏర్పాటు చేసేవాడు.శివయ్య దర్శనానికి వెళ్లే వారు అక్కడ భోజనాలు చేసి ఆయన సేవను కొనియాడుతూ ... దారి పొడవునా ఆయన గురించి చెప్పుకుంటూ వుండేవారు. దాంతో కుమ్మరి కేశప్ప పేరు అందరికీ సుపరిచితమైపోయింది. ఇది సహించలేకపోయిన ఇరుగుపొరుగువారు ... ఓ రాత్రి వేళ అతని కుండలను పగులగొట్టడమే కాకుండా, కుండలను తయారు చేసే 'అటికె'ను కూడా పాడు చేశారు.తెల్లారగానే జరిగింది చూసిన కేశప్ప లబోదిబోమన్నాడు. శివరాత్రి పర్వదినం రావడంతో యాత్రికుల సంఖ్య పెరిగింది. అటికే పాడైపోయినందున ఏం చేయాలో పాలుపోక కేశప్ప దిగాలు పడిపోయాడు. ఎలాగైనా అటికెను బాగు చేయాలనే ఉద్దేశంతో నానా తంటాలు పడసాగాడు. అదే అదనుగా భావించిన ఇరుగు పొరుగు వారు కావాలని చెప్పేసి భోజనం కోసం అతని ఇంటికి యాత్రికులను పంపించారు. అమ్మడానికి కుండలు లేవు ... తయారు చేయడానికి అటికే లేదు. యాత్రికులను సాదరంగా ఆహ్వానించిన కేశప్ప, ఎలా భోజనాలు ఏర్పాటు చేయాలో తెలియక పెరట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు అటికే పై శివుడు ప్రత్యక్షమై, లోపలోకి వెళ్లి యాత్రికులకు భోజనాలు వడ్డించమని చెప్పాడు. శివుడికి నమస్కరించి లోపలి వెళ్ళిన కేశప్పకి అక్కడ కుండల నిండుగా వివిధ రకాల పదార్థాలతో కూడిన భోజనం కనిపించింది. దానిని యాత్రికులకు కడుపు నిండుగా ... సంతృప్తిగా వడ్డించాడు. శివుడు అటికెలో ప్రత్యక్షమైన ఈ ప్రదేశమే 'అటికేశ్వరంగా' పిలవబడి కాలక్రమంలో 'హటకేశ్వరం'గా ప్రసిద్ధి చెందింది. సాక్షాత్తు సదాశివుడే ఆవిర్భవించేలా చేయగలిగిన మహా భక్తుడిగా కేశప్ప చరిత్రలో నిలిచిపోయాడు.

విశేషాలు

[మార్చు]
  • ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది.
  • హటకేశ్వరం దేవాలయానికి వెళ్ళే దారికి ఎదురు దారిలో పాలదార-పంచదారలు ఉన్నాయి. ఇక్కడే ఆదిశంకరాచార్యుడు చాలాకాలం తపస్సు చేసాడు. ఒక బండపై కాలిముద్రలు ఉన్నాయి.
  • ఇక్కడ వివిధ రకాల మూలికలు, తేనె, సరస్వతి ఆకు లభిస్తాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

సమీప బాలబడి, ప్రాథమిక పాఠశాల, ప్రాథమికోన్నత పాఠశాల, మాధ్యమిక పాఠశాల శ్రీశైలంలో ఉన్నాయి. ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల శ్రీశైలం ప్రాజెక్టు (RFC)లోను, ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల కర్నూలులోను, పాలీటెక్నిక్ శ్రీశైలం ప్రాజెక్టు (RFC)లోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల శ్రీశైలం ప్రాజెక్టు (RFC)లోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు కర్నూలులోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ, పశు వైద్యశాల, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

తాగు నీరు

[మార్చు]

బావుల నీరు గ్రామంలో అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

సబ్ పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. మొబైల్ ఫోన్ ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం, ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల వ్యవస్థ దుకాణం, రోజువారీ మార్కెట్, వారం వారం సంత గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఇతర పోషకాహార కేంద్రాలు ఉన్నాయి. వార్తాపత్రిక గ్రామం నుండి 5 కి.మీ.లోపు దూరంలో ఉంది. అంగన్ వాడీ కేంద్రం, ఆశా కార్యకర్త, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం, అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది.

భూమి వినియోగం

[మార్చు]

హటకేశ్వరంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 20 హెక్టార్లు

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-02.

వెలుపలి లంకెలు

[మార్చు]