Jump to content

హర్‌దీప్ సింగ్ నిజ్జర్

వికీపీడియా నుండి
హర్‌దీప్ సింగ్ నిజ్జర్
జననం(1977-10-11)1977 అక్టోబరు 11
బార్సింగ్‌పూర్‌, జలంధర్, పంజాబ్, భారతదేశం
మరణం2023 జూన్ 18(2023-06-18) (వయసు 45)
సరీ, బ్రిటీష్ కొలంబియా, కెనడా
మరణ కారణంతుపాకీ కాల్పులు
జాతీయతకెనడియన్
రాజకీయ ఉద్యమంఖలిస్తాన్

హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (1977 అక్టోబరు 11 - 2023 జూన్ 18) ఖలిస్తాన్ ఉద్యమంలో భాగమైన భారతీయ-కెనడియన్ సిక్కు వేర్పాటువాది.[1][2][3] పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో భారతదేశ చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఉగ్రవాదిగా పేర్కొనబడి, భారతీయ అధికారుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు.[4] 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలో నిజ్జర్ తుపాకీ కాల్పులకు గురై మరణించాడు.[5]

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కెనడా ప్రభుత్వం సేకరించిన రహస్య సమాచారం ప్రకారం భారత ప్రభుత్వ ఏజెంట్లు నిజ్జార్‌ను హత్యచేసినట్టు సూచిస్తోందని 2023 సెప్టెంబరు 18న ఆరోపించాడు. కెనడా విదేశాంగ వ్యవహారాల మంత్రి మెలనీ జోలీ ఒక భారత దౌత్యవేత్తను కెనడాలోని భారత నిఘా వ్యవస్థకు అధిపతి అని ఆరోపిస్తూ బహిష్కరించింది. భారత విదేశాంగ శాఖ ఈ ఆరోపణలను అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి అంటూ తిరస్కరించింది. తర్వాత, భారత ప్రభుత్వం ఒక ఉన్నతస్థాయి కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది, ఆ దౌత్యవేత్తను కొందరు సోర్సులు భారతదేశంలో కెనడియన్ నిఘా వ్యవస్థకు అధిపతి అని పేర్కొన్నారు.[6][7][8]

తొలినాళ్ళ జీవితం, కెనడాకు వలస

[మార్చు]

నిజ్జర్ పంజాబ్‌లోని జలంధర్‌ ప్రాంతంలోని బార్సింగ్‌పూర్‌ అన్న గ్రామానికి చెందినవాడు.[9][10][11] మొదట్లో వడ్రంగి పనిచేసేవాడు.[9] నిజ్జర్ 1997 ఫిబ్రవరి 10 రవిశర్మ అన్న మారుపేరుతో తప్పుడు పాస్‌పోర్టు ఉపయోగించి కెనడా చేరుకున్నాడు, శరణార్థిగా స్వీకరించమని కెనడియన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు.[12] అఫిడవిట్‌లో, తన సోదరుడు, తండ్రి, మామ అందరినీ పోలీసులు అరెస్టు చేశారని, తనను కూడా పోలీసులు హింసించారని రాశాడు. అధికారులు అతని కథ అసంభవమని భావించినందున శరణార్థిగా దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించారు.[12]

పిటిషన్ తిరస్కరణకు గురైన కొన్నాళ్ళకు నిజ్జర్ తనకు ఇమిగ్రేషన్ స్పాన్సర్ చేసిన ఒక మహిళను పెళ్ళిచేసుకున్నాడు. ఆమె 1997లో కెనడా వచ్చిందనీ, వేరే అతన్ని వివాహం చేసుకున్నదనీ గుర్తించి, నిజ్జర్‌తో జరిగిన పెళ్ళి మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ (సౌకర్యార్థం చేసుకున్న పెళ్ళి) గా సూచిస్తూ క్లెయిమ్ తిరస్కరించారు. 2001లో నిజ్జర్ ఈ తీర్పుపై చేసుకున్న అపీల్ కొట్టివేశారు.[11][12]

కెనడియన్ ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వం శాఖ మంత్రి మార్క్ మిల్లర్ ప్రకారం, నిజ్జర్‌కు 2007 మే 25న కెనడియన్ పౌరసత్వం లభించింది.[13] కెనడాలో నిజ్జర్ ఒక ప్లంబర్‌గా పనిచేయడం ప్రారంభించాడు, పెళ్ళిచేసుకున్నాడు, ఇద్దరు కుమారులు ఉన్నారు.[11] బ్రిటిష్ కొలంబియాలోని సరీ నగరంలోని సిక్ఖు దేవాలయానికి అధ్యక్షునిగా ఉండేవాడు.[10]

ఖలిస్తాన్ కార్యకలాపాలలో పాల్గొనడం

[మార్చు]

అమెరికాలో స్థాపించబడిన "జస్టిస్ ఫర్ సిఖ్స్" అన్న సిక్ఖు వేర్పాటువాద సంస్థకు చెందిన కెనడా శాఖలో నాయకునిగా వ్యవహరించాడు.[14][నోట్స్ 1] 2007లో శింగార్ సినిమాలో జరిగిన బాంబుదాడికి కుట్రదారుగా నిజ్జర్‌పై ఆరోపణలు వచ్చాయి.[12] 2014 నవంబరు 14న భారతదేశంలో అతని అరెస్టుకు వారెంట్ జారీ అయింది.[12] ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అన్న ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాద సంస్థకు నిజ్జర్ నాయకుడని భారత ప్రభుత్వం ఆరోపించింది.[10][14]

భారతదేశంలో తీవ్రవాద దాడులకు పాల్పడేందుకు వీలుగా పాకిస్తాన్ నుంచి పారాగ్లైడర్ల ద్వారా ఆయుధాలను రవాణా చేయడానికి నిజ్జర్ కెనడాలో వ్యూహాలను రచించి, తర్ఫీదుని ఇస్తున్నాడని భారత ప్రభుత్వం పేర్కొంది.[15] ఈ ఆరోపణలపై 2016లో భారతదేశం అతనిపై మరొక ఇంటర్‌పోల్ వారెంట్ జారీచేసింది.[12] తన మీద వచ్చిన ఆరోపణలు కల్పితాలనీ, వాటిని తిరస్కరించి సాయం చేయమని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకు నిజ్జర్ ఉత్తరం రాశాడు.[16] బ్రిటిష్ కొలంబియాలో మిషన్ నగరం వద్ద తీవ్రవాదుల కదలికలపై భారత నిఘా సంస్థలు కెనడా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాయన్న వార్తలపై వ్యాఖ్యానించడానికి కెనడా ప్రభుత్వం నిరాకరించింది.[17]

2018లో నిజ్జర్ గురునానక్ సిక్కు గురుద్వారా అధ్యక్షుడయ్యాడు.[12][18]

భారతదేశంలో వివిధ టార్గెటెడ్ హత్యల వెనుక నిజ్జర్ ఉన్నాడని భారత ప్రభుత్వం 2018లో ఆరోపించింది. భారత అధికారులు తనను తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికిస్తున్నారని నిజ్జర్ ఆరోపణ చేశాడు. ఫిబ్రవరిలో, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అందించిన మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో నిజ్జర్ పేరు కూడా ఉంది. అదే ఏడాది ఏప్రిల్ 13న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ వారి సరీ యూనిట్ నిజ్జర్‌ను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకుని, అతనిపై ఏ అభియోగాలు మోపకుండా 24 గంటల వ్యవధిలో విడుదల చేసింది.[19]

2019 మార్చిలో అతను సరీలో దాడికి పాల్పడ్డాడని అభియోగాలతో కేసు నమోదైంది, అయితే అదే ఏడాది డిసెంబరులో ఆ కేసుపై స్టే విధించారు.[12]

2020 జూలైలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం కింద హర్‌దీప్ సింగ్ నిజ్జర్‌ను భారతదేశం ఉగ్రవాదిగా గుర్తించింది. సెప్టెంబరులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) భారతదేశంలోని అతని ఆస్తులను స్వాధీనం చేసుకుంది.[20] పంజాబ్‌లో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడని అతనిపై ఎన్‌ఐఏ ఆరోపించింది. 2022లో, అతనిని పట్టుకోవడంలో సహాయపడే ఏదైనా సమాచారం అందించినవారికి ఎన్‌ఐఏ ₹10 లక్షలు బహుమతిని అందజేస్తామని ప్రకటించింది.[4] "శాంతికి భంగం కలిగించడానికి, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి" హిందూ పూజారిని చంపడానికి కుట్ర పన్నినట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.[21]

2021లో కెనడా వ్యాప్తంగా బయటపడ్డ గుర్తుతెలియని సమాధుల్లోని కెనడా ఆదిమ జాతుల పిల్లల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినందుకు "రాడికల్ దేశీ" అన్న వాంకోవర్‌కు చెందిన మ్యాగజైన రాడికల్ దేశీ పతకాన్ని నిజ్జర్‌కు అందించింది.[22] 2022లో గురునానక్ సిక్ఖు గురుద్వారాకు అధ్యక్షునిగా నిజ్జర్ మళ్ళీ నియమితుడయ్యాడు.[23]

మరణం

[మార్చు]
గురు నానక్ గురుద్వారా. దీని బయటే నిజ్జర్ హత్యకు గురయ్యాడు.

2022 వేసవిలోనే నిజ్జర్‌పై హత్యకు కుట్రలు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికను కెనడియన్ సెక్యూరిటీ ఇంటలిజెన్స్ సర్వీస్ అధికారులు అందించామని చెప్తున్నారు.[4] 2023 జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సరీ నగరపు గురునానక్ సిక్ఖు గురుద్వారా పార్కింగ్ ప్రదేశంలో తన ట్రక్కులో ఉండగా ముసుగులు ధరించిన ఇద్దరు హంతకులు నిజ్జర్‌ని కాల్చి చంపారు.[24][25][26] రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసుల హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు చెందిన ఇన్వెస్టిగేటర్లు వివరిస్తూ "ముఖం కనిపించకుండా మాస్కులు ధరించిన భారీ ఆకారం కల మగవాళ్ళు" ఇద్దరు ఆ ప్రదేశం నుంచి పరిగెత్తి పారిపోయారని, బహుశా దగ్గరలోనే వారి కోసం వేచిచూస్తూ ఒక వాహనం ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం మూడో నిందితుడు కూడా ఉన్నట్లు తెలిపారు.[1]

2023 సెప్టెంబరు నాటికి కెనడియన్ అధికారులు నిజ్జర్ హత్యతో సంబంధం ఉన్నవారిని ఎవ్వరినీ అరెస్టు చేయలేదు.[27] ఐహెచ్‌ఐటి వారు హత్యను దర్యాప్తు చేస్తున్నారు.[5]

తదనంతర పరిణామాలు

[మార్చు]

2023 సెప్టెంబరు 18న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యకు, భారత ప్రభుత్వానికి మధ్య విశ్వసనీయమైన సంబంధాన్ని కెనడియన్ ఇంటెలిజెన్స్ గుర్తించిందని, 2023 జీ20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయాన్ని తెలియజేసానని పేర్కొన్నాడు. హత్య దర్యాప్తు విషయంలో భారత ప్రభుత్వం సహకరించాలని అన్నాడు.[28] హత్య ఆరోపణ నేపథ్యంలో, కెనడాలోని కెనడాలోని అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్, భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కార్యకలాపాలకు నాయకత్వం వహించాడని ఆరోపిస్తూ అతని బహిష్కారానికి కెనడా విదేశాంగ మంత్రి మెలనీ జోలీ ఆదేశమిచ్చింది.[29]

భారతదేశం ఈ వాదనలను "అసంబద్ధమైనవి, ప్రేరేపితమైనవి" అని ఖండించింది. కెనడియన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త ఒలివియర్ సిల్వెస్టెరేను మరుసటి రోజు బహిష్కరించింది, అతను భారతదేశంలోని కెనడియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ స్టేషన్ చీఫ్ అని సోర్సెస్ చెబుతున్నాయి.[6][8][28] గ్లోబల్ న్యూస్ ప్రకారం, సెప్టెంబరు 1న జరగాల్సిన కెనడా-ఇండియా వాణిజ్య ఒప్పందంపై చర్చల నిలుపుదలకు ఈ వివాదం నేరుగా దారితీసింది.[30]

సెప్టెంబరు 21 వరకు, కెనడియన్ ప్రభుత్వం తన ఆరోపణకు ఎటువంటి ఆధారాలను బహిరంగంగా అందించలేదు.[31]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Singh, Kanishka (2023-09-19). "What is known about the murder of Sikh separatist leader in Canada?". Reuters. Retrieved 2023-09-19.
  2. Singh, Kanishka (2023-09-19). "Hardeep Singh Nijjar death: a timeline of recent India-Canada tensions". Reuters. Retrieved 2023-09-19.
  3. "Who was Hardeep Singh Nijjar, the Khalistani separatist that Canada's PM Trudeau says India may have got killed". indianexpress.com. 19 September 2023. Retrieved 19 September 2023.
  4. 4.0 4.1 4.2 Fife, Robert (18 September 2023). "Trudeau says intelligence shows India was behind slaying of Sikh leader in Surrey, B.C." The Globe and Mail. Retrieved 18 September 2023. Mr. Nijjar, a Canadian citizen and leader in Surrey's Sikh community
  5. 5.0 5.1 "Who is Hardeep Singh Nijjar, the Sikh leader Indian agents allegedly killed? | Globalnews.ca". Global News (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-09-20.
  6. 6.0 6.1 Mogul, Rhea; Newton, Paula (18 September 2023). "India expels Canadian diplomat in tit-for-tat move as row over assassinated Sikh activist deepens". CNN (in ఇంగ్లీష్). Retrieved 19 September 2023.
  7. Austen, Ian (18 September 2023). "Justin Trudeau Accuses India of a Killing on Canadian Soil". The New York Times. The New York Times. Retrieved 19 September 2023. Mélanie Joly, the foreign minister, later announced that Canada had expelled an Indian diplomat whom she described as the head of India's intelligence agency in Canada.
  8. 8.0 8.1 "Expelled diplomat headed Canadian intelligence in India: Sources". 19 September 2023.
  9. 9.0 9.1 "'ఖలిస్తాన్' ఉద్యమానికి కెనడా ఎందుకు కేంద్రంగా మారింది? హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు? విదేశాల్లోని సిక్కులపై భారత్ ఎలా ఒత్తిడి పెంచుతోంది?". BBC News తెలుగు. 2023-09-21. Retrieved 2023-09-21.
  10. 10.0 10.1 10.2 Jain, Bharti; Rana, Yudhvir (20 June 2023). "Khalistan Tiger Force chief Hardeep Singh Nijjar shot dead in Canada". The Times of India.
  11. 11.0 11.1 11.2 Raj, Suhasini (2023-09-19). "Who Was the Man Whose Killing Canada Says India Instigated?". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2023-09-20.
  12. 12.0 12.1 12.2 12.3 12.4 12.5 12.6 12.7 Bell, Stewart (2023-06-22). "Murder at the temple: The conflicting legacies of a B.C. Sikh leader". Global News. Retrieved 2023-09-20.
  13. Marc Miller (politician) [@MarcMillerVM] (September 20, 2023). "Mr. Nijjar became a Canadian citizen on May 25, 2007, earlier than I stated below. The error in dates is my responsibility to assume. Again, nothing justifies the killing of Mr. Nijjar" (Tweet) – via Twitter.
  14. 14.0 14.1 "Punjab police busts two ISI-backed terror modules operating from Canada". The Indian Express (in ఇంగ్లీష్). 2022-10-04. Retrieved 2023-09-19.
  15. Chan, Cheryl (2016-05-29). "Surrey man accused of running 'terror camp' near Mission". Vancouver Sun. Retrieved 2023-09-20.
  16. The Canadian Press (2016-06-01). "Surrey, B.C., man accused of running terrorist training camp seeks PM's help". CBC News. Retrieved 2023-09-20.
  17. The Canadian Press (2016-05-30). "Feds mum on Indian media report of Sikh terrorist camp in B.C." CBC News. Retrieved 2023-09-20.
  18. Monika Gul and Denise Wong (2019-01-11). "Man under investigation by India elected president of Surrey Sikh temple". City News Vancouver. Retrieved 2023-09-20.
  19. Anirudh Bhattacharyya (April 27, 2018). "Canadian police frees Khalistani 'separatist' Hardeep Nijjar after 24 hours in custody". Hindustan Times.
  20. "India rejects "absurd," "motivated" claims on killing of most wanted terrorist Hardeep Nijjar". ANI News. 2023-09-19. Retrieved 2023-09-19.
  21. The Hindu Bureau (2022-07-22). "NIA declares ₹10 lakh reward for information on Khalistan Tiger Force chief". The Hindu. Retrieved 2023-09-19.
  22. "Radical Desi honours Sikh temple president for standing up for Indigenous peoples". CounterCurrents.org. 2021-09-14. Retrieved 2023-09-20.
  23. Team Link (2022-10-08). "Hardeep Singh Nijjar acclaimed as President of the Guru Nanak Sikh Gurdwara Society". Link Paper.
  24. "Khalistan Tiger Force chief Hardeep Nijjar shot dead in Canada". Economic Times. 19 June 2023.[permanent dead link]
  25. "Wanted Khalistan Tiger Force chief Hardeep Singh Nijjar gunned down in Canadian city Surrey". The Hindu (in Indian English). 19 June 2023.
  26. "India expels Canadian diplomat, says concerned about 'anti-India activities'". Reuters (in ఇంగ్లీష్). 2023-09-19. Retrieved 2023-09-19.
  27. Paula Newton, Rhea Mogul (2023-09-18). "India expels Canadian diplomat in tit-for-tat move as spat over assassinated Sikh activist deepens". CNN. Retrieved 2023-09-19.
  28. 28.0 28.1 Yousif, Nadine (18 September 2023). "India could be behind killing of Canadian Sikh – Trudeau". BBC News. Retrieved 18 September 2023.
  29. Tasker, John Paul (18 September 2023). "Trudeau accuses India's government of involvement in killing of Canadian Sikh leader". Canadian Broadcasting Corporation.
  30. Fife, Robert (18 September 2023). "Trudeau says intelligence shows India was behind slaying of Sikh leader in Surrey, B.C." The Globe and Mail. Retrieved 18 September 2023.
  31. Pathi, Krutika (2023-09-19). "India expels Canadian diplomat, escalating tensions after Trudeau accuses India in Sikh's killing". AP News. Retrieved 2023-09-19.

నోట్స్

[మార్చు]
  1. ఈ సంస్థ భారతదేశం నుంచి పంజాబ్ విడిపోయి ఖలిస్తాన్ ఏర్పడాలన్న వేర్పాటువాద భావనను ప్రచారం చేస్తుంది. 2019లో భారత ప్రభుత్వం ఈ సంస్థను చట్టవ్యతిరేక సంస్థగా పేర్కొంటూ నిషేధించింది.