హార్ముజ్ జలసంధి
| హార్ముజ్ జలసంధి | |
|---|---|
ఉపగ్రహ చిత్రం | |
| ప్రదేశం | పర్షియన్ సింధుశాఖ – ఒమన్ సింధుశాఖ |
| అక్షాంశ,రేఖాంశాలు | 26°34′N 56°15′E / 26.567°N 56.250°E |
| రకం | జలసంధి |
| ప్రవహించే దేశాలు | ఒమన్, ఇరాన్, యు.ఎ.ఇ |
| కనిష్ట వెడల్పు | 21 nautical miles (39 km) |
| ద్వీపములు | హార్ముజ్ ద్వీపం కెష్మ్ ద్వీపం |
| ప్రాంతాలు | బందర్ అబ్బాస్ ఖసబ్ |
హార్ముజ్ జలసంధి, పర్షియన్ సింధుశాఖకు, ఒమన్ సింధుశాఖకూ మధ్య ఉన్న జలసంధి. ఇది పర్షియన్ సింధుశాఖ నుండి మహాసముద్రాల్లోకి దారితీసే ఏకైక సముద్ర మార్గం. ఇది వ్యూహాత్మకంగా ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఛోక్ పాయింట్లలో ఒకటి.[1] దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముసందమ్, ఒమన్ ఎక్స్‌క్లేవ్‌లు ఉన్నాయి. ఈ జలసంధి దాదాపు 167 కి.మీ. పొడవు, 52 నుండి 21 కి.మీ. వెడల్పు ఉంటుంది.[2]
ప్రపంచంలోని ద్రవీకృత సహజ వాయువులో మూడవ వంతు, మొత్తం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 25% ఈ జలసంధి గుండా రవాణా అవుతుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక ప్రదేశం.[2][3]
నావిగేషన్
[మార్చు]ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి, జలసంధి ద్వారా ప్రయాణించే ఓడలు, ట్రాఫిక్ విభజన పథకాన్ని (TSS) అనుసరిస్తాయి. లోనికి వచ్చే ఓడలు ఒక మార్గాన్ని, బయటికి వెళ్ళే ఓడలు మరొక మార్గాన్నీ ఉపయోగిస్తాయి. ఈ మార్గాలు ఒక్కొక్కటీ రెండు మైళ్ల వెడల్పుతో ఉంటాయి. ఈ రెండు మార్గాల మధ్య దూరం రెండు మైళ్ళుంటుంది.[4]
జలసంధిని దాటడానికి, నౌకలు సముద్ర చట్టంపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం లోని ట్రాన్సిట్ పాసేజ్ నిబంధనల ప్రకారం ఇరాన్, ఒమన్‌ల ప్రాదేశిక జలాల గుండా వెళతాయి.[5] అన్ని దేశాలు ఈ ఒప్పందాన్ని ఆమోదించనప్పటికీ,[6] అమెరికాతో సహా చాలా దేశాలు,[7] ఈ ఒప్పందం లోని సాంప్రదాయిక నావిగేషన్ నియమాలను అంగీకరిస్తాయి.
1959 ఏప్రిల్‌లో ఇరాన్ తన ప్రాదేశిక జలాల పరిధిని 22 కిలోమీటర్ల వరకు విస్తరించడంతో జలసంధి చట్టపరమైన స్థితిని మారిపోయింది. కొత్తగా విస్తరించిన ప్రాంతం గుండా నిరపాయకర ప్రయాణాలను[గమనిక 1] మాత్రమే గుర్తిస్తామని ప్రకటించింది.[8] 1972 జూలైలో, ఒమన్ కూడా తన ప్రాదేశిక సముద్రాన్ని 22 కిలోమీటర్ల వరకు విస్తరించింది.[8] ఆ విధంగా, 1972 మధ్య నాటికి, ఇరాన్, ఒమన్‌ల సంయుక్త ప్రాదేశిక జలాలతో హార్ముజ్ జలసంధి పూర్తిగా "మూసుకుపోయింది". 1970వ దశకంలో, ఇరాన్, ఒమన్‌లు జలసంధి గుండా యుద్ధనౌకల ప్రయాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. అయితే 1980 లలో రెండు దేశాలు అమల్లో ఉన్న (పాత) చట్టానికి భిన్నమైన వాదనలు చేసాయి. 1989 ఆగస్టులో UNCLOS ని ఆమోదించిన తర్వాత ఒమన్, తన ప్రాదేశిక సముద్రం గుండా కేవలం నిరపాయకర ప్రయాణానికి మాత్రమే అనుమతి ఉందని 1981 నాటి రాయల్ డిక్రీని ధృవీకరిస్తూ ప్రకటనలు చేసింది. విదేశీ యుద్ధనౌకలు ఒమానీ ప్రాదేశిక జలాల గుండా వెళ్లాలంటే ముందస్తు అనుమతి అవసరమని ఆ ప్రకటనలు నొక్కిచెప్పాయి.[8] 1982 డిసెంబరులో ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఇరాన్, "లా ఆఫ్ ది సీ కన్వెన్షన్‌లో చేరిన పార్టీలు మాత్రమే అందులో పొందుపరచిన ఒప్పంద హక్కుల నుండి - అంతర్జాతీయ ప్రయాణాలకు ఉపయోగించే జలసంధుల ద్వారా రవాణా హక్కుతో సహా - ప్రయోజనం పొందేందుకు అర్హులు" అని పేర్కొంటూ ఒక ప్రకటన చేసింది. 1993 మేలో ఇరాన్, సముద్ర ప్రాంతాలపై సమగ్ర చట్టాన్ని రూపొందించింది. వీటిలో అనేక నిబంధనలు UNCLOS నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. ఇందులో యుద్ధనౌకలు, జలాంతర్గాములు, అణుశక్తితో నడిచే నౌకలు ఇరాన్ ప్రాదేశిక జలాల గుండా నిరపాయకర ప్రయాణానికి ముందస్తు అనుమతి పొందాలనే నిబంధన కూడా ఉంది. ఒమన్, ఇరాన్ చేసిన దావాలలో దేనినీ అమెరికా గుర్తించలేదు. వాటిని సవాలు చేసింది.[8]
చమురు వాణిజ్య ప్రవాహం
[మార్చు]
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ వారి 2007 నివేదిక ప్రకారం, పర్షియన్ సింధుశాఖ నుండి ప్రతిరోజూ 1.7 కోట్ల బారెళ్ళు జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇది, మొత్తం ప్రపంచ-వాణిజ్య చమురు రవాణాలో దాదాపు 40%.[9]
US ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, 2011 లో పర్షియన్ సింధుశాఖ నుండి రోజుకు సగటున 14 ట్యాంకర్లు 1.7 కోట్ల బ్యారెళ్ళ ముడి చమురు తీసుకుని జలసంధి గుండా ప్రయాణించాయి. ఇది ప్రపంచంలోని సముద్రపు చమురు రవాణాలో 35%. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో ఇది 20%. ఈ క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో 85% కంటే ఎక్కువ ఆసియా మార్కెట్లకు వెళ్లాయని, జపాన్, భారతదేశం, దక్షిణ కొరియా, చైనాలు అతిపెద్ద గమ్యస్థానాలనీ ఆ నివేదిక పేర్కొంది.[10] ఒక్క 2018 లోనే, రోజుకు 2.1 కోట్ల బ్యారెళ్ళు జలసంధి గుండా వెళ్ళాయి - అంటే 2019 సెప్టెంబరు ధరల ప్రకారం ఇది రోజుకు $1170 కోట్ల విలువైన చమురు.[11]
ఘటనలు
[మార్చు]ట్యాంకర్ యుద్ధం
[మార్చు]1984 ప్రారంభంలో ఇరాన్‌కు చెందిన ఖర్గ్ ద్వీపం వద్ద చమురు టెర్మినల్, చమురు ట్యాంకర్లపై ఇరాక్ దాడి చేయడంతో ఇరాన్-ఇరాక్ యుద్ధపు ట్యాంకర్ యుద్ధ దశ ప్రారంభమైంది.[12][13] ఇరానియన్ వ్యాపారంపై దాడి చేయడంలో సద్దాం హుస్సేన్ లక్ష్యం - ఇతర విషయాలతోపాటు, హార్ముజ్ జలసంధిని అన్ని సముద్ర ట్రాఫిక్‌లకు మూసివేయడం వంటి తీవ్ర చర్యలతో ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరానియన్లను రెచ్చగొట్టడం, తద్వారా అమెరికా జోక్యం చేసుకునే పరిస్థితి తీసుకురావడం.[14] కానీ, ఇరాన్ తన ప్రతీకార దాడులను ఇరాకీ వాణిజ్య ఓడల వరకే పరిమితం చేసి, జలసంధిని తెరిచే ఉంచింది.[15]
ఆపరేషన్ ప్రేయింగ్ మాంటిస్
[మార్చు]1988 ఏప్రిల్ 18న, US నావికాదళం జలసంధిలోను, ఆ చుట్టుపక్కల ఇరాన్ దళాలకు వ్యతిరేకంగా ఒక-రోజు యుద్ధం చేసింది. 1988 ఏప్రిల్ 14 న యుఎస్‌ఎస్ శామ్యూల్ బి. రాబర్ట్స్ నౌకను ఛానెల్‌లో ఇరాన్ వేసిన మందుపాతర వలన దెబ్బ తిన్నందుకు ప్రతీకారంగా యునైటెడ్ స్టేట్స్ ఈ యుద్ధం చేసింది. దీన్ని ఆపరేషన్ ప్రేయింగ్ మాంటిస్ అని అన్నారు. US దళాలు, ఇరాన్‌కు చెందిన ఒక ఫ్రిగేట్, ఒక గన్‌బోట్, ఆరు సాయుధ స్పీడ్ బోట్‌లను ముంచేసాయి. అలాగే మరొక ఫ్రిగేట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఇరాన్ ఎయిర్ 655 విమానం కూల్చివేత
[మార్చు]1988 జూలై 3 న, యునైటెడ్ స్టేట్స్ నేవీకి చెందిన క్రూయిజర్ USS విన్సెన్స్ (CG-49) క్షిపణి దాడి చేసి ఇరాన్ ఎయిర్‌బస్ A300 ని జలసంధిపై కూల్చివేయగా, అందులో ప్రయాణిస్తున్న 290 మంది మరణించారు. అమెరికా ఈ విమానాన్ని జెట్ ఫైటర్ అని పొరబడి ఈ దాడి చేసింది.
2008 అమెరికా-ఇరాన్ నౌకాదళ వివాదం
[మార్చు]2007 డిసెంబరు - 2008 జనవరిలో హార్ముజ్ జలసంధిలో ఇరాన్ స్పీడ్ బోట్‌లు, అమెరికా యుద్ధనౌకల మధ్య వరుసగా పలు నౌకాదళ ప్రతిష్ఠంభనలు సంభవించాయి. అమెరికా అధికారులు ఇరాన్ తమ నౌకాదళ నౌకలను వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. అయితే ఇరాన్ అధికారులు ఈ ఆరోపణలను ఖండించారు. ఇరాన్ పడవలు సమీపిస్తున్నప్పుడు అమెరికా నౌకలు కాల్పులు జరపబోయాయని పెంటగాన్ చెప్పగా, అమెరికా నేవీ ప్రాంతీయ కమాండర్, వైస్ అడ్మిరల్ కెవిన్ కాస్గ్రిఫ్, ఇరానియన్ల వద్ద "యాంటీ-షిప్ క్షిపణులు గానీ టార్పెడోలు గానీ లేవు" అని, "యుఎస్ 5వ నౌకాదళం ఈ చిన్న పడవలకు భయపడలేద"నీ అన్నాడు.[16]
2018 జలసంధి మూసివేత బెదిరింపులు
[మార్చు]2018 జూలైలో జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరించింది. సంవత్సరం ప్రారంభంలో JCPOA ఒప్పందం నుండి అమెరికా వైదొలిగిన తర్వాత, అమెరికా ఆంక్షలను ఉటంకిస్తూ ఇరాన్ ఈ ప్రకటన చేసింది.[17] అవసరమైతే చర్యలు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.[18]
2018 ఆగస్టులో ఇరాన్ ఆ సంవత్సరపు తొలి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష చేసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నౌకా విధ్వంసక ఫతే-110 మోడ్ 3, ఇరాన్ ఎడారిలోని టెస్ట్ రేంజ్‌కు హార్ముజ్ జలసంధి మీదుగా 100 మైళ్లకు పైగా దూరం ప్రయాణించింది. "ఇది తీరం నుండి తీరానికి" చేసిన ప్రయోగమని వివరిస్తూ ఒక అమెరికా అధికారి చెప్పారు.[19]
2019 జలసంధి మూసివేత బెదిరింపులు
[మార్చు]2019 ఏప్రిల్ 22 న, అమెరికా ఇరాన్‌పై విధించిన చమురు ఆంక్షలను ఎత్తివేసింది. ఆర్థిక జరిమానాలు లేకుండా ఇరాన్ నుండి చమురును దిగుమతి చేసుకోవడానికి కొంతమంది వినియోగదారులను అనుమతించింది. 2019 ఏప్రిల్‌లో జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరింపులు చేసినందున, ఇది జరిగింది.[20]
అల్‌జజీరా టీవీ, ఇరాన్ సాయుధ దళాలకు చెందిన మేజర్ జనరల్ మొహమ్మద్ బఖేరీని ఉటంకిస్తూ, "హార్ముజ్ జలసంధిని మూసివేయాలనేది మా ఉద్దేశం కాదు, కానీ శత్రువుల శత్రుత్వం పెరిగితే, మేము అలా చేయగలం" అన్నట్టు పేర్కొంది. "మా చమురు వెళ్ళకపోతే, ఇతరుల చమురు కూడా హార్ముజ్ జలసంధిని దాటదు" అని కూడా బఖేరీ అన్నాడు.
2025
[మార్చు]తన సైనిక, అణు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన దాడులకు ప్రతిస్పందనగా జలసంధిని మూసివేస్తామని జూన్ 14 న ఇరాన్ బెదిరించినట్లు సమాచారం.[21][22] ఇలాంటి చర్య వల్ల చమురు ధరలు ఇటీవలి 7-14% పెరుగుదలను దాటి, బ్యారెల్‌కు $100 నుండి $150 మించే అవకాశం ఉందని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.[23] ఇది బహుశా ప్రపంచ ద్రవ్యోల్బణాన్ని పెంచి, ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. "సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, ఇరాన్ ఎగుమతుల కోసం ఒక చిన్న మార్గంలో పూర్తిగా చిక్కుకుపోయాయి" అని పేర్కొంటూ, ప్రాంతీయ ఎగుమతిదారుల దుర్బలత్వాన్ని విశ్లేషకులు నొక్కిచెప్పారు. ఈ జలసంధి గుండా రోజుకు 18-19 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు, కండెన్సేట్లు, ఇంధనం రవాణా అవుతాయి, ఇది ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20%.[24][25] జలసంధిని అడ్డుకునే ఏ ప్రయత్నం వల్లనైనా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని విశ్లేషకులు హెచ్చరించారు. "ఇరాన్ చమురు ఎగుమతులు పూర్తిగా సముద్రం ఆధారంగా ఉన్నందున, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సముద్ర మార్గం గుండా వస్తువులు, నౌకల స్వేచ్ఛా రవాణాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది" అని జేపీ మోర్గాన్ విశ్లేషకులు వివరించారు. జలసంధిని మూసివేయడం వల్ల ఇరాన్‌కు ఏకైక ప్రధాన చమురు కొనుగోలుదారు అయిన చైనాతో కీలక ఇంధన వాణిజ్యం దెబ్బతింటుంది.[24][26] జలసంధిని మూసివేసే ప్రయత్నం చేయవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇరాన్‌ను హెచ్చరించారు, ఇరాన్ ఎగుమతులకు ఈ జలమార్గం చాలా కీలకం కాబట్టి ఇటువంటి చర్య ఇస్లామిక్ రిపబ్లిక్‌కు "ఆర్థిక ఆత్మహత్య" అవుతుందని పేర్కొన్నారు.[27] జూన్ 17 న జలసంధిలో రెండు చమురు ట్యాంకర్లు ఢీకొన్నాయి. అయితే ఆ సంఘటన భద్రతకు సంబంధించినదని నివేదికలేమీ సూచించలేదు.[28] దీనిలో ప్రమేయం ఉన్న నౌకలు ఇరాక్ నుండి చైనాకు ముడి చమురును తీసుకువెళుతున్న ఫ్రంట్ ఈగిల్, ఖాళీగా సూయజ్ కాలువ వైపు వెళుతున్న అడలిన్. రెండు నౌకల డెక్‌పై మంటలు చెలరేగాయి, కానీ చమురు లీక్ కాలేదు. అడలిన్లోని సిబ్బంది అందరినీ యూఏఈ కోస్ట్ గార్డ్ సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.[29]
జూన్ 22న ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత, జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంటు ఓటు వేసింది.[30] తుది నిర్ణయం ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చేతిలో ఉంది.[31] జాతీయ సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి, తదుపరి విదేశీ దాడులను నిరోధించడానికి "అవసరమైనప్పుడు" జలసంధి మూసివేత అమలు చేయబడుతుందని రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇస్మాయిల్ కౌసరి ధృవీకరించారు.[32][33] ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా అయ్యే ఈ జలసంధిని మూసివేయడం ప్రపంచ ఇంధన మార్కెట్లకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది. ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు, ఇతర పెట్రోలియం ఉత్పత్తులకు ఒక సముద్ర మార్గంగా జలసంధి కీలక పాత్ర పోషిస్తున్నందున, ఇటువంటి చర్య చమురు ధరల పెరుగుదలకు కారణమై ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచే ప్రమాదం ఉంది.[34] 23 జూన్ 2025 నాటికి, చమురు ధరలు మళ్లీ $70 కంటే తక్కువకు (జూన్ 20 కంటే 7% తక్కువ) పడిపోయాయి, ఇది అమెరికా దాడులను, ఇరాన్ ప్రతిస్పందనను (జలసంధి తెరిచి ఉండటం, అల్ ఉదీద్ వైమానిక స్థావరంపై 2025 ఇరాన్ దాడులు) చమురు మార్కెట్ పర్యవసానాలు లేనివిగా చూసిందని సూచిస్తుంది.[35]
2026
[మార్చు]2026 లో ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికాలు దాడులు జరపడానికి ముందు, జలసంధిని దాటేందుకు నౌకా బీమా విలువ ఒక్కో ప్రయాణానికి 0.125% నుండి 0.2%, 0.4% దాకా పెరిగింది. చాలా పెద్ద చమురు ట్యాంకర్లకు ఈ పెరుగుదల పావు మిలియన్ డాలర్ల దాకా ఉంటుంది.[36] మార్చి 9 నాటికి, మునుపటి వారంతో పోలిస్తే బీమా రేట్లు నాలుగు నుండి ఆరు రెట్లు పెరిగాయని వార్తలు వచ్చాయి. అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద ప్రమాద బీమా చట్టం కింద బీమా సంస్థలకు సహాయం చేయడం ప్రారంభించింది.[37]
2026 ఫిబ్రవరి 28 న యుద్ధంలో ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ హత్య తర్వాత, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హార్ముజ్ జలసంధి గుండా రాకపోకలకు నౌకలకు "అనుమతి లేదు" అని పేర్కొంటూ రేడియో ప్రసారాలు చేయడం ప్రారంభించింది.[38][39] ఈ మూసివేత చట్టబద్ధంగా కానప్పటికీ, భద్రతకు హామీ ఇవ్వలేమని సైనిక, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చాలా నౌకలు ఓడరేవులోనే ఉండిపోవడమో వెనక్కి మళ్ళడమో జరిగింది.[40] అయితే కనీసం 17 చమురు ట్యాంకర్లు జలసంధి గుండా ప్రయాణాన్ని కొనసాగించాయి.[41]

మార్చి 2 న హార్ముజ్ జలసంధి మూసివేయబడిందని, జలసంధిలోకి ప్రవేశించే ఏ నౌకకైనా నిప్పంటిస్తామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ అధికారికంగా ధృవీకరించింది. హార్ముజ్ జలసంధిలోకి వెళుతున్న నౌకలపై ఇరాన్ దాడులు చేసినట్లు పలు నివేదికలు వచ్చిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.[43] అయితే, కొన్ని నౌకలు ఎలాంటి హాని లేకుండా జలసంధిని దాటాయి.[44] మరుసటి రోజు, అమెరికా నావికాదళం "వీలైనంత త్వరగా" ట్యాంకర్లను జలసంధి గుండా సురక్షితంగా తీసుకువెళ్లడం ప్రారంభిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు.[45]
మార్చి 12న, హార్ముజ్ జలసంధిలో మూడు సరుకు రవాణా నౌకలు దాడులకు గురయ్యాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ 400 మిలియన్ బ్యారెళ్ల నిల్వ చమురును మార్కెట్ లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన రోజునే ఈ సంఘటన జరిగింది.[46] ఇరాన్, హార్ముజ్ జలసంధిలో సుమారు డజను మందుపాతరలను మోహరించిందని, తద్వారా చమురు, ఎల్ఎన్‌జీ (LNG) ఎగుమతులు జరగకుండా అడ్డుకుందని కూడా వార్తలు వచ్చాయి.[47]
సముద్ర మార్గాన్ని తాము నియంత్రిస్తున్నామని మార్చి 15 న ఇరాన్ ప్రకటించిన తర్వాత, సముద్ర ప్రయోజనాలను రక్షించడానికి ఐరోపా, ఆసియా దేశాల కూటమి అక్కడకు యుద్ధనౌకలను పంపుతుందని ట్రంప్ చెప్పాడు. అయితే, ఈ దేశాలు అటువంటి కూటమిని తిరస్కరించాయి. సంఘర్షణకు దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుకున్నాయి.[48]
హార్ముజ్ జలసంధిని రక్షించడంలో అమెరికాకు చైనా సహాయం చేయకపోతే చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ తో తలపెట్టిన శిఖరాగ్ర సమావేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ చమురులో 20% ప్రయాణించే ఈ కీలక జలమార్గం, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతరాయాలను ఎదుర్కొంటోంది. తన ఇంధన దిగుమతులలో 90% జలసంధిపై ఆధారపడే చైనా, దానిని భద్రపరచడాన్ని పూర్తిగా అమెరికాకే వదిలేయకుండా, దానిని తెరిచి ఉంచే బాధ్యతను పంచుకోవాలని ట్రంప్ నొక్కి చెప్పాడు.[49]
నౌకాయానానికి ఆటంకం కలిగించగల ఇరాన్ సామర్థ్యం
[మార్చు]మిలీనియం ఛాలెంజ్ 2002 అనేది 2002లో యునైటెడ్ స్టేట్స్ సాయుధ దళాలు నిర్వహించిన ఒక ప్రధాన యుద్ధక్రీడ. 2012 లో ది క్రిస్టియన్ సైన్స్ మానిటర్‌లో వచ్చిన కథనం ప్రకారం, జలసంధిని మూసివేయడానికి ఇరాన్ చేసిన ప్రయత్నాన్ని ఇందులో సిమ్యులేట్ చేసారు. ఈ ఊహలు, వాటి ఫలితాలూ వివాదాస్పదమయ్యాయి. ఇరాన్ వ్యూహం భౌతికంగా ఉన్నతమైన US సాయుధ దళాలను ఓడించిందని ఆ వ్యాసంలో రాసారు.[50]
ఇంటర్నేషనల్ సెక్యూరిటీలో 2008లో వచ్చిన ఒక కథనం, జలసంధిలో ఒక నెలపాటు ట్రాఫిక్‌ను ఇరాన్ మూసివేయవచ్చని లేదా అడ్డుకోవచ్చని, దానిని తిరిగి తెరవడానికి అమెరికా చేసే ప్రయత్నంలో సంఘర్షణ పెరిగే అవకాశం ఉందనీ రాసింది.[51] అయితే, ఆ తరువాతి సంచికలో, పత్రిక ప్రచురించిన ఒక ప్రతిస్పందనలో, ఈ వ్యాసంలో ఉన్న కొన్ని కీలకమైన అంచనాలను ప్రశ్నించారు. తిరిగి తెరవడానికి చాలా తక్కువ సమయం పడుతుందని కూడా ఆ స్పందనలో రాసారు.
2011 డిసెంబరులో, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ నౌకాదళం జలసంధి వెంట అంతర్జాతీయ జలాల్లో పదిరోజుల కసరత్తు ప్రారంభించింది. ఇరానియన్ రియర్ అడ్మిరల్ హబిబొల్లా సయ్యారీ ఈ కసరత్తుల సమయంలో జలసంధి మూసివేమని చెప్పాడు. ఇరాన్ దళాలు ఆ పనిని సులభంగా చేయగలవనీ, అయితే అలాంటి నిర్ణయం రాజకీయ స్థాయిలో తీసుకోవాలనీ అతడు చెప్పాడు.[52][53]
అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ అయిన జనరల్ మార్టిన్ డెంప్సే 2012 జనవరిలో, ఇరాన్ "వాస్తవానికి, హార్ముజ్ జలసంధిని కొంత కాలం పాటు నిరోధించగల సామర్థ్యాన్ని సాధించింది" అని అన్నాడు. "అదే జరిగితే, మేము దానిని ఓడించగలమని నిర్ధారించుకునేందుకు అవసరమైన సామర్థ్యాన్ని మేము సాధించాం" అని కూడా అతను పేర్కొన్నాడు.[54]
ప్రత్యామ్నాయ మార్గాలు
[మార్చు]
జూన్ 2012లో, సౌదీ అరేబియా, సౌదీ అరేబియా - ఇరాక్ పైప్‌లైన్‌ను తిరిగి తెరిచింది. దీన్ని 2001లో ఇరాక్ నుండి సౌదీ అరేబియా జప్తు చేసింది. ఇరాక్ నుండి సౌదీ అరేబియా మీదుగా ఎర్ర సముద్రపు ఓడరేవుకు ఈ పైపులైను ప్రయాణిస్తుంది. దీని ద్వారా రోజుకు 16.5 లక్షల బ్యారెళ్ల రవాణా చెయ్యగల సామర్థ్యం ఉంది.[55]
2012 జూలైలో, UAE అబుదాబిలోని హబ్షాన్ క్షేత్రాల నుండి ఒమన్ సింధుశాఖ లోని ఫుజైరా ఆయిల్ టెర్మినల్ వరకు కొత్త హబ్షాన్-ఫుజైరా చమురు పైప్‌లైన్‌ను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది హార్ముజ్ జలసంధిని తప్పిస్తుంది. 2012 లో రోజుకు 20 లక్షల బ్యారెల్స్ సామర్థ్యమున్న UAE ఉత్పత్తిలో ఇది మూడు వంతుల కంటే ఎక్కువ. UAE ఫుజైరా లోని నిల్వ, ఆఫ్-లోడింగ్ సామర్థ్యాలను కూడా పెంచుతోంది.[56][57] ప్రపంచ చమురు వాణిజ్య స్థావరంగా ఫుజైరా అభివృద్ధిని పెంపొందించడానికి UAE 1.4 కోట్ల బ్యారెళ్ళ నిల్వ సామర్థ్యంతో ఫుజైరాలో ప్రపంచంలోనే అతిపెద్ద ముడి చమురు నిల్వ కేంద్రాన్ని నిర్మిస్తోంది.[58] హబ్షాన్ - ఫుజైరా మార్గం UAE యొక్క ఇంధన భద్రతను పెంపొందిస్తుంది. చమురు రవాణాలో చౌకైన రూపంగా భూమార్గ చమురు పైప్‌లైనును పరిగణిస్తారు. చమురు ట్యాంకర్లు పర్షియన్ సింధుశాఖ లోకి వెళ్ళే అవసరం లేనందున బీమా ఖర్చులు కూడా తగ్గుతాయి.[59]
ఇవి కూడా చూడండి
[మార్చు]గమనికలు
[మార్చు]- ↑ నిరపాయ ప్రయాణం అనేది సముద్ర చట్టంలోని ఒక భావన. ఏదైనా దేశం తన ప్రాదేశిక జలాల గుండా అంతర్జాతీయ నౌకలు ప్రయాణించడాన్ని, కొన్ని షరతులకు లోబడి అనుమతించవచ్చు. దీన్ని నిరపాయకర ప్రయాణం అంటారు.
మూలాలు
[మార్చు]- ↑ Viktor Katona. "How Iran Plans To Bypass The World's Main Oil Chokepoint". Oilprice.com. Archived from the original on 11 September 2018. Retrieved 2018-09-11.
- ↑ 2.0 2.1 "The Strait of Hormuz is the world's most important oil transit chokepoint". U.S. Energy Information Administration. 4 January 2012. Archived from the original on 11 September 2018. Retrieved 11 September 2018.
- ↑ "2 oil tankers were damaged in possible attacks in the Gulf of Oman". Vox. 13 June 2019.
- ↑ "World Oil Transit Chokepoints" (PDF). U.S. Energy Information Administration. 25 July 2017. Retrieved 13 June 2019.
- ↑ Alejandra Roman & Administration. "Strait of Hormuz". The Encyclopedia of Earth. Retrieved 2015-06-02.
- ↑ "Chronological lists of ratifications of, accessions and successions to the Convention and the related Agreements as at 26 October 2007". Division for Ocean Affairs and the Law of the Sea. UN.
- ↑ . "Presidential Proclamation 5030".
- ↑ 8.0 8.1 8.2 8.3 Groves, Steven (2011-08-24). "Accession to the U.N. Convention on the Law of the Sea Is Unnecessary to Secure U.S. Navigational Rights and Freedoms". The Heritage Foundation. Retrieved 2017-04-09.
- ↑ Anthony H. Cordesman (26 March 2007). "Iran, Oil, and the Strait of Hormuz" (PDF). Center for Strategic and International Studies. Archived from the original (PDF) on 19 మార్చి 2012. Retrieved 14 జూన్ 2022.
- ↑ Alejandra Roman & Administration. "Strait of Hormuz". The Encyclopedia of Earth. Retrieved 2015-06-02.
- ↑ "The Strait of Hormuz Explained". Archived from the original on 2022-06-14. Retrieved 2022-06-14.
{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Karsh, Efraim (25 April 2002). The Iran–Iraq War: 1980–1988. Osprey Publishing. pp. 1–8, 12–16, 19–82. ISBN 978-1-84176-371-2.
- ↑ "Strait of Hormuz - Tanker War". The Strauss Center (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-06.
- ↑ Karsh, Efraim (25 April 2002). The Iran–Iraq War: 1980–1988. Osprey Publishing. pp. 1–8, 12–16, 19–82. ISBN 978-1-84176-371-2.
- ↑ Karsh, Efraim (25 April 2002). The Iran–Iraq War: 1980–1988. Osprey Publishing. pp. 1–8, 12–16, 19–82. ISBN 978-1-84176-371-2.
- ↑ Isenberg, David (10 January 2008). "A game of chicken in the, Persian Gulf". Asia Times Online. Archived from the original on 14 May 2008. Retrieved 8 January 2012.
- ↑ Dehghan, Saeed Kamali (5 July 2018). "Iran threatens to block Strait of Hormuz over US oil sanctions". the Guardian (in ఇంగ్లీష్).
- ↑ "Iran's Guards say Strait of Hormuz is for all or". Reuters. Reuters. Retrieved 6 July 2018.
- ↑ "Iran test-fires ballistic missile for first time in 2018, officials say". FoxNews. Retrieved 12 August 2018.
- ↑ |https://www.aljazeera.com/news/2019/04/iran-business-usual-strait-hormuz-blacklisting-190428133314213.htmlAljazeera.|Aljazeera . "Business as usual in Strait of Hormuz after blacklisting". Aljazeera, 2019.
- ↑ Altman, Howard (14 June 2025). "Could Iran Carry Out Its Threat To Shut Down The Strait Of Hormuz?". The War Zone (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 June 2025.
- ↑ "Oil settles up 7% as Israel, Iran trade air strikes". Arab News (in ఇంగ్లీష్). 14 June 2025. Retrieved 15 June 2025.
- ↑ "Prediksi Harga Minyak Dunia Jika Iran Tutup Selat Hormuz". Liputan6. 23 June 2025. Retrieved 24 June 2025.
- ↑ 24.0 24.1 Seba, Erwin (13 June 2025). "Oil settles up 7% as Israel, Iran trade air strikes". Reuters (in ఇంగ్లీష్). Retrieved 15 June 2025.
- ↑ Tett, Gillian (14 June 2025). "Oil in the new age of volatility". Financial Times. Retrieved 15 June 2025.
- ↑ Wearden, Graeme (13 June 2025). "Oil surges after Israel's attack on Iran, risking 'stagflationary shock' – as it happened". the Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 15 June 2025.
- ↑ "Harga Minyak Mentah Justru Anjlok 7% Usai Iran Gempur Pangkalan Militer AS". Liputan6. 24 June 2025. Retrieved 24 June 2025.
- ↑ "Ships collide in Hormuz Strait in shadow of Israel-Iran war". Al Jazeera (in ఇంగ్లీష్). Retrieved 18 June 2025.
- ↑ "2 Kapal Tanker Minyak Tabrakan di Selat Hormuz, 24 Orang Dievakuasi". Liputan6. 18 June 2025. Retrieved 24 June 2025.
- ↑ "Iran's top security body to decide on Hormuz closure after parliament approval". Al Arabiya English (in ఇంగ్లీష్). 22 June 2025. Retrieved 22 June 2025.
- ↑ "Parlemen Iran Sepakat Tutup Selat Hormuz Pasca Serangan Amerika?". Liputan6. 23 June 2025. Retrieved 24 June 2025.
- ↑ "Live: US bases used to strike Iran are 'legitimate' targets, Khamenei's advisor says". France 24. 22 June 2025. Retrieved 22 June 2025.
- ↑ Cleave, Iona; Crilly, Rob; Smith, Benedict; Kelly, Kieran; Hymas, Charles; Henderson, Cameron (22 June 2025). "US-Iran attack latest: Operation Midnight Hammer inflicted 'extreme damage and destruction'". The Telegraph (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0307-1235. Retrieved 22 June 2025.
- ↑ "Iran to block Strait of Hormuz after US strikes. Why it matters". India Today (in ఇంగ్లీష్). 22 June 2025. Retrieved 23 June 2025.
- ↑ Sheikhlar, Shahriar (23 June 2025). "Oil Prices Crash After Iran Strikes U.S. Bases". OilPrice.com (in ఇంగ్లీష్).
- ↑ "AIS Ship Tracking in the Strait of Hormuz: Inside the Crisis Shutting Down Global Oil". Worldwide AIS Network (in ఇంగ్లీష్). 28 February 2026.
- ↑ Brewer, Contessa (9 March 2026). "There's another big reason why shipping companies and insurers aren't willing to risk the Strait of Hormuz". CNBC News. Retrieved 11 March 2026.
- ↑ "Iran's revolutionary guards tell ships passage through Strait of Hormuz 'not allowed', EU naval mission official says". Reuters. 28 February 2026. Retrieved 28 February 2026.
- ↑ "Iran: Ships' passage through Strait of Hormuz 'not allowed'". The Jerusalem Post (in ఇంగ్లీష్). 2026-02-28. ISSN 0792-822X. Retrieved 2026-02-28.
- ↑ "Iran closes Strait of Hormuz after US-Israel strikes, reports say". The Independent (in ఇంగ్లీష్). 28 February 2026.
- ↑ "Oil Tankers Avoiding Vital Hormuz Strait After U.S. Bombs Iran | SupplyChainBrain". www.supplychainbrain.com (in ఇంగ్లీష్). 28 February 2026.
- ↑ "Trade disruptions in the Strait of Hormuz due to attacks on commercial ships". PortWatch. International Monetary Fund. Retrieved 14 March 2026.
- ↑ "Iran says will attack any ship trying to pass through Strait of Hormuz". Al Jazeera (in ఇంగ్లీష్). Archived from the original on 2026-03-09. Retrieved 2026-03-13.
- ↑ Slav, Irina (6 March 2026). "Daily Ship Traffic in Strait of Hormuz Plummets From 138 to Just 2". OilPrice.com (in ఇంగ్లీష్). Retrieved 2026-03-07.
- ↑ "BBC Audio | World Business Report | Trump: US Navy could escort tankers through Hormuz". www.bbc.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2026-04-10.
- ↑ "Ships hit in Strait of Hormuz as countries agree to release emergency oil reserves". www.bbc.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2026-03-11. Retrieved 2026-03-12.
- ↑ "Iran has laid about a dozen mines in Strait of Hormuz, sources say". The Straits Times (in ఇంగ్లీష్). 2026-03-12. ISSN 0585-3923. Retrieved 2026-03-12.
- ↑ "European Allies Talk With Iran to Seek Safe Passage Through Hormuz: Report" newsweek.com. Accessed 15 Mar 2026.
- ↑ "No help, no meeting: Trump warns Xi summit at risk if China doesn't help keep Hormuz open". Firstpost. 2026-03-16.
- ↑ Peterson, Scott (26 January 2012). "How Iran could beat up on America's superior military". csmonitor.com.
- ↑ Closing Time: Assessing the Iranian Threat to the Strait of Hormuz Archived 21 ఆగస్టు 2008 at the Wayback Machine, by Caitlin Talmadge, International Security, Harvard Kennedy School
- ↑ "Iranian navy begins exercise in waters near strategic oil route". China Daily. 26 December 2011. Retrieved 8 January 2012.
- ↑ "Shutting Off Gulf 'Very Easy': Iran Navy Chief". CNBC. Reuters. 28 December 2011. Archived from the original on 24 September 2015. Retrieved 8 January 2012.
- ↑ Hunter, Kathleen; Gienger, Viola (8 January 2012). "Iran Has Ability to Block Strait of Hormuz, U.S. General Dempsey Tells CBS". Bloomberg. Retrieved 9 January 2012.
- ↑ Luft, Gal (19 July 2012). "Choke Point". foreignpolicy.com. Archived from the original on 23 జూలై 2012. Retrieved 6 August 2012.
- ↑ Luft, Gal (19 July 2012). "Choke Point". foreignpolicy.com. Archived from the original on 23 జూలై 2012. Retrieved 6 August 2012.
- ↑ "New UAE pipeline bypasses Strait of Hormuz". aljazeera.com. 15 July 2012. Retrieved 27 July 2012.
- ↑ "World's largest crude oil storage facility to be built in UAE". Khaleej Times. 27 February 2019.
- ↑ Gulf News (6 March 2019). "The UAE's longer term approach on energy security".