హిందువుల పండుగలు (పుస్తకం)
హిందువుల పండుగలు | |
హిందువుల పండుగలు పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | వ్యాసాల సంకలనం |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | వ్యాసాలు |
ప్రచురణ: | తెలంగాణ సాహిత్య అకాడమీ (ఏడవ ముద్రణ) |
విడుదల: | అక్టోబరు, 2019 |
పేజీలు: | 190 |
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): | 978-93-8922835-9 |
హిందువుల పండుగలు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకం. హైదరాబాద్ కొత్వాలు రాజాబహద్దూర్ వెంకట్రామిరెడ్డి కోరిక మేరకు సురవరం ప్రతాపరెడ్డి 1930లో ఈ పుస్తకాన్ని రచించాడు.[1][2]
పుస్తక నేపథ్యం
[మార్చు]ఇందులో 54 ముఖ్య హిందూ పండుగల గురించి వివరణ ఇవ్వబడింది. ఈ పండుగల గురించి రాయడానికి పురాణేతిహాసాల్ని, భారతీయ భాషల్లో వచ్చిన మత సంబంధ గ్రంథాల్ని అధ్యయనం చేయబడ్డాయి. ఆయా పండుగలను జరుపుకోవడానికి అనూచానంగా వస్తున్న కథలను, విశ్వాసాలను ఈ పుస్తకంలో వివరించబడ్డాయి.[3]
ముద్రణ వివరాలు
[మార్చు]ఈ పుస్తకం తొలిసారిగా 1931లో ప్రచురించబడింది. 1938లో రెండవ ముద్రణ, 1953లో మూడవ ముద్రణ (కర్నూల్ బాలనాగయ్యసెట్టికి చెందిన బాలసరస్వతి బుక్ డిపో) ప్రచురించబడ్డాయి. ఆ తరువాత సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్టు ఆధ్వర్యంలో మూడు ముద్రణలు (ఐదవ ముద్రణ 2004) జరుపుకుంది.[4] 2019 అక్టోబరులో తెలంగాణ సాహిత్య అకాడమీ ఏడవ ముద్రణ చేసింది.
విషయసూచిక
[మార్చు]- వ్రతమనగానేమి?
- దీపావళి
- విజయదశమి
- ఉగాది
- శ్రీరామనవమి
- హనుమజ్జయంతి
- భీష్మైకాదశి
- మహాలయపక్షము
- దత్తాత్రేయ జయంతి
- కూర్మ జయంతి
- నృసింహ జయంతి
- వామన జయంతి
- తులసీ వ్రతము
- కపిలాషష్టి
- సూర్య చంద్ర గ్రహణములు
- బుషి పంచమి
- సత్యనారాయణ వ్రతము
- శ్రావణపూర్ణిమ
- సంక్రాంతి
- అనంతచతుర్దశి
- రథసప్తమి
- నవరాత్రులు
- అక్షయతృతీయ
- గణేశ చతుర్థి
- చాతుర్మాస్య వ్రతము
- పరశురామజయంతి
- బుద్ధజయంతి
- హోలీ
- నాగపంచమి
- ఏకాదశి
- శీతలాసప్తమి
- వసంత పంచమి
- మహాశివరాత్రి
- హరితాళిక
- దూర్వాష్టమి
- చంపాషష్ఠి
- స్కంద షష్ఠి
- గౌరీ తృతీయ
- దశహర
- ఆదివార వ్రతము
- సోమవార వ్రతము
- మంగళవార వ్రతము
- బుధవార వ్రతము
- శుక్రవార వ్రతము
- శనివార వ్రతము
- భక్తేశ్వర వ్రతము
- కేదారేశ్వర వ్రతము
- యమద్వితీయ - భ్రాతృద్వితీయ
- అముక్తాభరణము
- సంకష్ట హరణ చతుర్థి
- వటసావిత్రి వ్రతము
- ఏరువాక పున్నమ
- పండుగల పట్టి
- పండుగల అకారాది విషయ సూచిక
మూలాలు
[మార్చు]- ↑ "హిందువుల పండుగలు (పుస్తకం)" (PDF). www.suravaramprathapreddy.com. Retrieved 2021-11-09.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "తెలంగాణలో తెలుగుకి అండ.. సురవరం ప్రతాపరెడ్డి". TeluguOne Sahityam (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-09. Archived from the original on 2020-04-27. Retrieved 2021-11-09.
- ↑ సాగి మనోహరి. "తెలంగాణ సమున్నత శిఖరం సురవరం | Telangana Magazine". magazine.telangana.gov.in. Archived from the original on 2021-01-28. Retrieved 2021-11-09.
- ↑ "హిందువుల పండుగలు సురవరం ప్రతాపరెడ్డి | PDF". Scribd (in ఇంగ్లీష్). Retrieved 2021-11-09.