హుజూరాబాద్ రెవెన్యూ డివిజను
హుజూరాబాద్ రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ |
హుజారాబాద్ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కరీంనగర్ జిల్లాలోవున్న రెండు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 6 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం హుజూరాబాద్లో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలోని, హుజూరాబాద్ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.
వివరాలు
[మార్చు]ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]
జనాభా గణాంకాలు
[మార్చు]ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 3,48,969 మంది జనాభా ఉన్నారు.
పరిపాలన
[మార్చు]హుజూరాబాద్ డివిజనులోని మండలాలు:[4]
క్ర.సం | హుజూరాబాద్ రెవెన్యూ డివిజను | మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య |
---|---|---|
1 | హుజూరాబాద్ మండలం | 12 రెవెన్యూ గ్రామాలు |
2 | వీణవంక మండలం | 14 రెవెన్యూ గ్రామాలు (ఒక నిర్జన గ్రామం) |
3 | వి.సైదాపూర్ మండలం | 14 రెవెన్యూ గ్రామాలు |
4 | జమ్మికుంట మండలం | 9 రెవెన్యూ గ్రామాలు |
5 | శంకరపట్నం మండలం | 17 రెవెన్యూ గ్రామాలు |
6 | ఇల్లందకుంట మండలం | 10 రెవెన్యూ గ్రామాలు |
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-03-24.
- ↑ "Administrative Setup | Karimnagar | India". Archived from the original on 2022-01-27. Retrieved 2022-03-24.
- ↑ "కరీంనగర్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-02-24.