హైడ్రోజన్ అయోడైడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హైడ్రోజన్ అయోడైడ్
Hydrogen iodide
Hydrogen iodide
పేర్లు
IUPAC నామము
Hydrogen iodide
ఇతర పేర్లు
hydroiodic acid
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10034-85-2]
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య MW3760000
ధర్మములు
HI
మోలార్ ద్రవ్యరాశి 127.904 g/mol
స్వరూపం Colorless gas
సాంద్రత 2.85 g/mL (−47 °C)
ద్రవీభవన స్థానం −50.80 °C (−59.44 °F; 222.35 K)
బాష్పీభవన స్థానం −35.36 °C (−31.65 °F; 237.79 K)
approximately 245 g/100 ml
ఆమ్లత్వం (pKa) −10 (in water, estimate)[1]

2.8 (in acetonitrile)[2]

నిర్మాణం
Terminus
ద్విధృవ చలనం
0.38 D
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు Toxic, corrosive, Harmful and Irritant
భద్రత సమాచార పత్రము hydrogen iodide
hydroiodic acid
R-పదబంధాలు R20, R21, R22, R35
S-పదబంధాలు మూస:S7, S9, S26, S45
జ్వలన స్థానం {{{value}}}
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
☒N verify (what is checkY☒N ?)
Infobox references

హైడ్రోజన్ అయోడైడ్ ఒక ద్విపరమాణుక అణువు (diatomic molecule) నిర్మాణం కలిగిన రసాయన సంయోగ పదార్థం. హైడ్రోజన్ అయోడైడ్ యొక్క సజల ద్రావణాలను హైడ్రో అయోడిక్ ఆమ్లం లేదా హైడ్రియోడిక్ ఆమ్లం అని అంటారు.ఇది ఒక బలమైన ఆమ్లం.హైడ్రోజన్ అయోడైడ్ రసాయన సంకేత పదం HI. హైడ్రోజన్, అయోడిన్ మూలకాల పరమాణు సంయోగం వలన హలైడ్ సంయోగ పదార్థం ఏర్పడినది.ఇది ఒక బలమైన ఆమ్లం.అయితే హైడ్రోజన్ అయోడైడ్, హైడ్రియోడిక్ ఆమ్లం రెండు కుడా భిన్నమైనవి. హైడ్రోజన్ అయోడైడ్ ప్రామాణికపరిస్థితులలో వాయువు రూపంలో ఉండగా, ఆమ్లం ద్రవరూపంలో ఉండును.ఈ రెండు ఒకదాని నుండి మరొకటిగా మారును. హైడ్రోజన్ అయోడైడ్ ని సేంద్రియ, అకర్బన రసాయన పదార్ధాల సంశ్లేషణలో, ప్రాథమిక అయోడిన్ వనరుగా, క్షయికరణ కారకంగా ఉపయోగిస్తారు.

హైడ్రోజన్ అయోడైడ్ ధర్మాలు[మార్చు]

హైడ్రోజన్ అయోడైడ్ రంగులేని వాయువు.ఆక్సిజన్ తో చర్య వలన నీటిని, అయోడిన్ ను ఏర్పరచును.తేమ/చెమ్మ కల్గిన గాలితో సంపర్కం, చర్య వలన మంచువంటి దట్టమైన పొగలను వెలువరచు హైడ్రో అయోడిక్ ఆమ్లాన్ని ఏర్పరచును. హైడ్రోజన్ అయోడైడ్ నీటిలో సులభంగా అధికప్రమాణంలో కరగి హైడ్రోఅయోడిక్ ఆమ్లాన్ని ఏర్పరచును.ఒక లీటరు నీటిలో 425 లీటర్ల హైడ్రోజన్ అయోడైడ్ వాయువు కరుగును.అత్యంత గాదట కల్గిన హైడ్రోఅయోడిక్ ఆమ్లంలో ఒక అణువు హైడ్రోజన్ అయోడైడ్ కేవలం నాలుగు నీటి అణువులను మాత్రమే కల్గిఉండును.

ఇతర భౌతిక లక్షణాలు[మార్చు]

అణుభారం[మార్చు]

హైడ్రోజన్ అయోడైడ్ అణుభారం 127.904 గ్రాములు/మోల్

సాంద్రత[మార్చు]

హైడ్రోజన్ అయోడైడ్ సాంద్రత 2.85 గ్రాములు/మి.లీ (-47 °C) వద్ద.

ద్రవీభవన ఉష్ణోగ్రత[మార్చు]

హైడ్రోజన్ అయోడైడ్ యొక్క ద్రవీభవన స్థానం −50.80 °C (−59.44 °F; 222.35 K)

సాంద్రత[మార్చు]

హైడ్రోజన్ అయోడైడ్ సాంద్రత 2.85 గ్రాములు/మి.లీ (-47 °C) వద్ద.

బాష్పీభవన ఉష్ణోగ్రత[మార్చు]

హైడ్రోజన్ అయోడైడ్ యొక్క బాష్పీభవన స్థానం −35.36 °C (−31.65 °F; 237.79 K)

హైడ్రోఅయోడిక్ ఆమ్లం(Hydroiodic acid)[మార్చు]

రసాయన పరంగా సంబంధించి నప్పటికీ హైడ్రియోడిక్ ఆమ్లం శుద్ధమైన హైడ్రోజన్ అయోడైడ్ కాదు.కాని ఆమ్లం హైడ్రోజన్ అయోడైడ్ ను కల్గిన మిశ్రమ ద్రావణం.57%హైడ్రోజన్ అయోడైడ్, 43% నీటిని కల్గిన ఆమ్లం అజియోట్రోపి స్థితిలో 127 °C వద్ద బాష్పీకరణ చెందును.అయోడిన్ అయాన్ మిగతా సాధారణ హలైడ్స్ కన్న పరిమాణంలో పెద్దదిగా ఉండును.ఈ కారణంగా ఋణాత్మకతను అధిక ప్రాంతంపై చూపును . హైడ్రోజన్ అయోడైడ్లో H+•••I మధ్య నున్న బలహీనమైన అంతర్గత చర్యాశీలత వలన, అనయాన్ నుండి ప్రోటాన్ విడిపోవడం వలన హైడ్రియోడికఆమ్లం, మిగతా హైడ్రోహలైడ్స్ కన్న బలమైన ఆమ్ల గుణాలను కల్గిఉన్నది.

HI(g) + H2O(l) → H3O+(aq) + I− (aq)Ka ≈ 1010
HBr(g) + H2O(l) → H3O+(aq) + Br− (aq)Ka ≈ 109
HCl(g) + H2O(l) → H3O+(aq) + Cl− (aq)Ka ≈ 106

సంశ్లేషణ[మార్చు]

వ్యాపార స్థాయిలో హైడ్రాజీన్తో అయోడిన్‌తో చర్యచెందించి హైడ్రోజన్ అయోడైడ్‌ను ఉత్త్పత్తి చేయుదురు. ఈ ప్రక్రియలో నైట్రోజన్ వాయువు కూడా ఉత్పత్తి అగును.

2 I2 + N2H4 → 4 HI + N2

ఈ ప్రక్రియను నీటిలో జరిపినపుడు, హైడ్రోజన్ అయోడైడ్ను స్వేదన క్రియ (డిస్టిలెసన్) ద్వారా వేరు చేయాలి.మరొక విధానంలో సోడియం అయోడైడ్ లేదా ఇతర క్షార అయోడైడ్‌లను ఫాస్పారిక్ ఆమ్లంతో కలిపి బాష్పీ కరించడం/స్వేదన క్రియకు వలనవలన హైడ్రోజన్ అయోడైడ్‌ను ఉత్పత్తి చేయుదురు. (కాని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం అయోడైడ్‌లను ఆమ్లికరించుటకు పని చేయదు.గాఢ ఆమ్లం అయోడైడ్ను మూలకఅయోడైడ్‌గా ఆక్సీకరించును.

మరొక ప్రక్రియలో హైడ్రోజన్ సల్ఫైడ్ ఆవిరులను సజల అయోడిన్ ద్రావణంలో బబ్లింగు (బుడగలుగా ప్రసరింప చేయుట) వలన హైడ్రోఅయోడిక్ ఆమ్లం, మూలక సల్ఫర్ ఏర్పడును.ఏర్పడిన సల్ఫర్ ను ఒడబొయుట/వడగట్టుట (filter) ద్వారా వేరు పరచెదరు.

H2S + I2 → 2 HI + S

ఇంకొక సమాన్య పద్ధతిలో హైడ్రోజన్, అయోడిన్ లను కలపడం ద్వారా కూడా హైడ్రోజన్ అయోడైడ్సంయోగ పదార్థాన్ని ఉత్పత్తి చేయ వచ్చును

H2 + I2 → 2 HI

ఈ సంశ్లేషణ పద్ధతిని అత్యంత శుద్ధమైన హైడ్రోజన్ అయోడైడ్ ను ఉత్పత్తి చేయుటకు ఉపయోగిస్తారు.ప్రయోగ శాలల్లో ఫాస్పరస్ ట్రైఅయోడైడ్ ను జలవిశ్లేషణ కావించడం వలన హైడ్రోజన్ అయోడైడ్ ను ఉత్పత్తి చేయుదురు. ఈ పద్ధతిలో మొదట అయోడిన్ (I2 ) ఫాస్పరస్‌తో చర్య వలన ఫాస్పరస్ ట్రైఅయోడైడ్ ఏర్పరచును, ఏర్పడిన ఫాస్పరస్ ట్రైఆయోడైడ్ నీటితో చర్య జరపడం వలన హైడ్రోజన్ అయోడైడ్, ఫాస్పరస్ ఆమ్లం ఏర్పడును.

3 I2 + 2 P + 6 H2O → 2 PI3 + 6 H2O → 6 HI + 2 H3PO3

ముఖ్య మైన రసాయన చర్యలు[మార్చు]

హైడ్రియోడిక్ ఆమ్లాన్ని గాలిలో స్వేచ్ఛగా/బయట ఉంచిన ఆక్సీకరణచెంది హైడ్రోజన్ ట్రైఅయోడైడ్ ఏర్పడును.

4 HI + O2 → 2 H2O + 2 I2
HI + I2 → HI3

హైడ్రోజన్ ట్రైఅయోడైడ్ ముదురు గోధుమరంగులో ఉండును. అందువలన ఎక్కువ కాలం నిల్వఉన్న హైడ్రోజన్ అయోడైడ్ ద్రావణాలు ముదురురంగులో కనపడును.

హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ క్లోరైడ్‌ల వలె హైడ్రోజన్ అయోడైడ్ ఆల్కిన్స్ తో సంపర్కం చెందును.

HI + H2C=CH2 → H3CCH2I

హైడ్రోజన్ అయోడైడ్‌ను సేంద్రియ రసాయనశాస్త్రం పరిధిలో ప్రాధిమిక ఆల్కహాల్‌లను ఆల్కైల్ హైలైడు లుగా పరివర్తించుటకు ఉపయోగిస్తారు .ఈ రసాయన చర్య SN2 ప్రత్నామ్యాయ చర్య.ఈ చర్యలో అయోడిన్ ఆయాన్ ఆక్టివేటేడ్ హైడ్రోక్సిల్ సమూహాన్ని (నీరు) తొలగిస్తుంది.

అల్కైల్ హైలైడ్ తయారీలోఇతర హైడ్రోజన్ హలైడ్ లకన్నా, హైడ్రోజన్ అయోడైడ్ ను వినియోగించుటకు కారణం, అయోడిన్ అయాన్ బ్రోమైడ్ లేదా క్లోరైడ్ అయాన్ లకన్నఎక్కువ న్యూక్లియోపిల్ (nucleophile) గుణం కల్గి ఉంది.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. Bell, R.P. The Proton in Chemistry. 2nd ed., Cornell University Press, Ithaca, NY, 1973.
  2. Raamat, E.; Kaupmees, K.; Ovsjannikov, G.; Trummal, A.; Kütt, A.; Saame, J.; Koppel, I.; Kaljurand, I.; Lipping, L.; Rodima, T.; Pihl, V.; Koppel, I. A.; Leito, I. "Acidities of strong neutral Brønsted acids in different media." J. Phys. Org. Chem. 2013, 26, 162-170. doi:10.1002/poc.2946