హ‌న్మంతు షిండే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హన్మంతు షిండే
హ‌న్మంతు షిండే


పదవీ కాలం
2009 - 2018, 2014 - 2018, 2018 - ప్రస్తుతం
ముందు సౌదాగర్ గంగారాం
నియోజకవర్గం జుక్కల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఆగస్టు 14, 1966
దోన్‌గావ్, జుక్కల్ మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు మహాదప్ప, నాగమ్మ
జీవిత భాగస్వామి శోభావతి
సంతానం ముగ్గురు కుమారులు

హ‌న్మంతు షిండే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున జుక్కల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]

జననం, విద్య[మార్చు]

హన్మంత్ 1966, ఆగస్టు 14న మహాదప్ప, నాగమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, జుక్కల్ మండలంలోని దోన్‌గావ్ గ్రామంలో జన్మించాడు. 1988లో ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బిఈ) పూర్తి చేశాడు.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

హన్మంత్ కు శోభవతితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు.

రాజకీయ విశేషాలు[మార్చు]

తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హన్మంత్, ఆ పార్టీ తరపున 2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన సౌదాగర్ గంగారాం చేతిలో 1241 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత 2009లో జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి సావిత్రిబాయిపై విజయం సాధించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

2013 డిసెంబరులో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[4] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సౌదాగర్ గంగారాంపై 35,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5] 2016 మే 26 నుండి 2018, సెప్టెంబరు 6 వరకు తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై జుక్కల్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంగారాం సౌదగర్ పై 35,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[6]

మూలాలు డి[మార్చు]

  1. "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Retrieved 2021-08-25.
  2. "Hanmanth Shinde MLA of Jukkal (SC) Telangana contact address & email". nocorruption.in (in ఇంగ్లీష్). Retrieved 2021-08-25.
  3. "Hanmanth Shinde | MLA | Jukkal | Kamareddy | Telangana | TRS". the Leaders Page (in ఇంగ్లీష్). 2020-04-21. Retrieved 2021-08-25.
  4. Mohan, P. Ram (2013-12-17). "MLA Hanmanth Shinde all set to quit TDP". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2021-08-25.
  5. "Hanmanth Shinde(TRS):Constituency- JUKKAL(NIZAMABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-25.
  6. "Hanmanth Shinde wins the battle". www.timesnownews.com. Retrieved 2021-08-25.