Jump to content

1973 ముంబై నర్సు అరుణా షాన్‌బాగ్ పై అత్యాచారం

వికీపీడియా నుండి
అరుణా షాన్‌బాగ్
జననం
అరుణా రామచంద్ర షాన్‌బాగ్

(1948-06-01)1948 జూన్ 1
హల్దీపూర్, కర్ణాటక, భారతదేశం
మరణం2015 మే 18(2015-05-18) (వయసు 66)
కింగ్‌ ఎడ్వర్డ్‌ హాస్పిటల్, ముంబై, మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతభారతీయురాలు
వృత్తినర్సింగ్ ఆఫీసర్

అరుణా రామచంద్ర షాన్‌బాగ్ (1948 జూన్ 1 - 2015 మే 18), లైంగిక వేధింపుల కారణంగా 42 సంవత్సరాల పాటు కోమాలో జీవితం గడిపిన భారతీయ నర్సు.[1][2]

మహారాష్ట్ర ముంబైలోని కింగ్‌ ఎడ్వర్డ్‌ అసుపత్రిలో 1967లో 25 ఏళ్ల వయసులో అరుణా షాన్‌బాగ్‌ నర్సుగా చేరింది. అక్కడే పనిచేస్తున్న డాక్టర్‌ సందీప్‌ సర్దేశాయ్‌ తో నిశ్చితార్థం చేసుకుని మరో ఏడాదిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అంతలోనే 1973 నవంబరు 27న, రాత్రి సోహన్‌లాల్‌ అనే వార్డుబాయ్‌ చేతిలో ఆమె లైంగిక దాడికి గురయ్యింది. ఈ క్రమంలోనే ఆమె కోమాలోకి వెళ్లిపోయింది.[3]

2011 జనవరి 24న, అంటే అరుణా షాన్‌బాగ్ 37 సంవత్సరాల పాటు ఈ స్థితిలో ఉన్న తర్వాత, జర్నలిస్ట్ పింకీ విరానీ దాఖలు చేసిన కారుణ్య మరణం పిటిషన్‌పై భారత సుప్రీంకోర్టు స్పందించింది, ఆమెను పరీక్షించడానికి ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. 2011 మార్చి 7న కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.[4] 42 సంవత్సరాల పాటు అలాగే జీవచ్ఛవంలా గడిపిన ఆమె 2015లో మే 18న కన్నుమూసింది.[2][5]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అరుణా షాన్‌బాగ్ 1948లో కర్ణాటకలోని ఉత్తర కన్నడలోని హల్దీపూర్‌లో కొంకణి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది.[6][7][8] ఆమె ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేసింది. దాడి సమయంలో, ఆమెకు అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు సందీప్‌ సర్దేశాయ్‌ తో నిశ్చితార్థం జరిగింది.[9]

లైంగిక దాడి

[మార్చు]

1973 నవంబరు 27న, అరుణా షాన్‌బాగ్ పై ఆమె విధులు నిర్వర్తిస్తున్న కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్‌లోనే పురుష స్వీపర్ చేత లైంగిక వేధింపులకు గురయ్యింది. ఆసుపత్రి బేస్‌మెంట్‌లో ఆమె దుస్తులు మార్చుకుంటుండగా ఈ దాడి జరిగింది. కుక్క గొలుసుతో ఆమె గొంతు నులిమి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె మెదడుకు ఆక్సిజన్‌ను అందలేదు, ఫలితంగా మెదడు పనితీరు దెబ్బతింది, గర్భాశయం గాయపడింది, అంధత్వం ఏర్పడింది. ఆమె మరుసటి రోజు ఉదయం 7:45 గంటలకు ఒక క్లీనర్ ద్వారా కనుగొనబడింది.[10]

మరణం

[మార్చు]

అరుణా షాన్‌బాగ్ మరణానికి కొన్ని రోజుల ముందు, ఆమెకి న్యుమోనియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమెను ఆసుపత్రిలోని మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎంఐసియు)కి తరలించి వెంటిలేటర్‌పై ఉంచారు. ఆమె 2015 మే 18న ఉదయం మరణించింది.[11] ఆమె అంత్యక్రియలను ఆసుపత్రి నర్సులు, ఇతర సిబ్బంది నిర్వహించారు.[12]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Aruna Shanbaug: ఎవరీ అరుణా షాన్‌బాగ్‌..? సుప్రీం కోర్టు ప్రస్తావించిన ఆ కేసు ఏమిటీ? | what-is-aruna-shanbaug-case-why-supreme-court-discussed". web.archive.org. 2024-08-20. Archived from the original on 2024-08-20. Retrieved 2024-08-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "Aruna Shanbaug: Brain-damaged India nurse dies 42 years after rape". BBC News. BBC. Archived from the original on 18 May 2015. Retrieved 18 May 2015.
  3. Malavika Karlekar. "Review: Ten Minutes To Hell". Outlook India. Archived from the original on 23 May 2015. Retrieved 24 May 2015.
  4. "India joins select nations in legalising "passive euthanasia"". The Hindu. 7 March 2011. Archived from the original on 11 March 2011. Retrieved 11 March 2011.
  5. "Raped Indian nurse dies after 42 years in coma". The Guardian. Associated Press. Archived from the original on 19 May 2015. Retrieved 18 May 2015.
  6. "KEM nurses, dean celebrate Aruna Shanbaug's birthday". Hindustan Times. 2 June 2011. Archived from the original on 18 May 2015. Retrieved 18 May 2015.
  7. "KEM Hospital celebrates Aruna Shanbaug's 64th birthday". The Times of India. 2 June 2012. Archived from the original on 10 January 2017. Retrieved 18 May 2015.
  8. "KEM celebrates Aruna Shanbaug's 65th birthday". DNA India. 2 June 2013. Archived from the original on 21 September 2022. Retrieved 18 May 2015.
  9. "Rebirth for Aruna, say joyous Mumbai hospital staff". Deccan Herald. 7 March 2011. Archived from the original on 28 June 2011. Retrieved 11 March 2011.
  10. "Aruna Ramchandra Shanbaug v. Union Of India [2011 (4) SCC 454] (Euthanasia case)". 1, Law Street. Supreme Court of India. 7 March 2011. Archived from the original on 19 May 2015. Retrieved 18 May 2015.
  11. "1973 Sexual Assault Victim Aruna Shanbaug passes away in Mumbai". news.biharprabha.com. 18 May 2015. Archived from the original on 18 May 2015. Retrieved 18 May 2015.
  12. "Funeral of Aruna Shanbaug performed at KEM Hospital in Mumbai". news.biharprabha.com. 18 May 2015. Archived from the original on 21 May 2015. Retrieved 18 May 2015.