Jump to content

2024 కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార ఘటన

వికీపీడియా నుండి
2024 కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య సంఘటన
తేదీ9 ఆగస్టు 2024 (2024-08-09)
ప్రదేశంఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, బెల్గాచియా, కోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఇలా కూడా అంటారుకోల్‌కతా వైద్యురాలిపై హత్యాచార కేసు
ఆర్‌జీకార్‌ మెడికల్‌ కళాశాల విద్యార్థినిపై అత్యాచారం, హత్య
మరణాలుఒక వైద్య విద్యార్థిని[1]
అరెస్టులు1[2] (ప్రాథమిక నివేదికల మేరకు)

2024 ఆగస్టు 9న, భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లో కోల్‌కతా ఆర్. జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య చేయబడింది. అదే క్యాంపస్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ సంఘటన భారతదేశంలో మహిళలు, వైద్యుల భద్రత గురించి చర్చను విస్తృతం చేసింది. ఇది గణనీయమైన ఆగ్రహాన్ని, దేశవ్యాప్త నిరసనలకు దారితీసింది. సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్లను రేకెత్తించింది.[3][4]

దేశం నలుమూలల లోనే కాక ఈ సంఘటనపై అంతర్జాతీయంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్,[5][6][7] యునైటెడ్ స్టేట్స్‌లలో ఆందోళనలు జరిగాయి.[8][6][9]

సంఘటన

[మార్చు]

2024 ఆగస్టు 9న, సదరు ట్రైనీ డాక్టర్ తప్పిపోయినట్లు సహోద్యోగులు నివేదించారు. సుమారు ఉదయం 11:30 గంటలకు,[10] ఆమె మృతదేహం కళాశాల సెమినార్ రూమ్‌లో కళ్లు, నోరు, జననాంగాలు రక్తస్రావంతో పాక్షిక నగ్న స్థితిలో కనుగొనబడింది. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ప్రకటించారు.

విచారణ

[మార్చు]

శవపరీక్ష నివేదిక

[మార్చు]

శవపరీక్షలో ఆమెపై అత్యాచారం చేసి, గొంతుకోసి చంపే ముందు లైంగికంగా వేధించాడని తేలింది. నాలుగు పేజీల నివేదికలో ఆమె జననేంద్రియ మార్గము, పెదవులు, ఎడమ కాలు, కుడి చేయి, ఉంగరపు వేలు, మెడ, ముఖంపై బలమైన గాయాలను సైతం గుర్తించారు. నిందితుడి చేతిగోళ్ల వల్ల మహిళ ముఖంపై గీతలు పడి ఉండవచ్చని నివేదిక వెల్లడించింది. నివేదిక ప్రకారం, ఆమె నోరు, గొంతుపై ఒత్తిడి విధించబడింది. ఆమె గొంతు కోసి చంపబడింది, ఫలితంగా థైరాయిడ్ మృదులాస్థి పగుళ్లు ఏర్పడింది. ఆమె కన్నులు, నోరు, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం జరిగినట్లు నివేదిక పేర్కొంది, ఆమె జననేంద్రియ ప్రాంతంలో గాయాలు "వికృతమైన లైంగికత", "జననేంద్రియ హింసకు" కారణమయ్యాయి. ఆమె కళ్లకు గాయాలు కావడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.[11][12]

జననాంగాలలో సుమారు 150 మిల్లీ గ్రాముల వీర్యం కనుగొనబడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది.[13][14] దీంతో, శవపరీక్ష చేసిన వైద్యులు, బాధితురాలి తల్లిదండ్రులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తపరిచారు.[12] [13] కోల్‌కతా పోలీసులు అటువంటి వాదనలను పుకార్లుగా తోసిపుచ్చారు.[15]

నిందుతుడి అరెస్టు

[మార్చు]

విచారణ తరువాత, కోల్‌కతా పోలీసు విపత్తు నిర్వహణ దళానికి చెందిన పౌర వాలంటీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు, అతను మెడికల్ కాలేజీ సమీపంలోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో నియమించబడ్డాడు.అతను స్త్రీవాద, గృహహింసకుడిగా అభివర్ణించబడ్డాడు.కోల్‌కతా పోలీసుల కథనం ప్రకారం,అతను నేరం అంగీకరించాడు.[16][17][18]

కేసు సీబీఐకి బదిలీ

[మార్చు]

2024 ఆగష్టు 13న, కలకత్తా హైకోర్టు, పోలీసుల దర్యాప్తు తీరుతో సంతృప్తి చెందలేదు, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించింది.[19] రాష్ట్ర పోలీసులు తమ విచారణను కొనసాగిస్తే సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని వారు ధ్వజమెత్తారు.[20] ఆగస్టు 18న సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది.[21][22][23]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Go on leave: Court to Kolkata college ex-principal amid doctor murder protests". India Today (in ఇంగ్లీష్). 2024-08-13. Retrieved 2024-08-15.
  2. "RG Kar doctor death: Post mortem confirms sexual assault, 1 arrested; doctors association threatens shutdown unless…". livemint. 10 Aug 2024. Archived from the original on 11 August 2024. Retrieved 11 August 2024.
  3. Roy, Suryagni; Roy, Anirban Sinha (9 August 2024). "Woman trainee doctor found dead in seminar hall of Kolkata hospital". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 14 August 2024. Retrieved 14 August 2024.
  4. "No country for women". The Business Standard (in ఇంగ్లీష్). 2024-08-15. Archived from the original on 15 August 2024. Retrieved 2024-08-17.
  5. "Kolkata doctor murder-rape case: UK, Germany, Bangladesh and other countries hold protest to show solidarity". The Economic Times. 2024-08-17. ISSN 0013-0389. Archived from the original on 17 August 2024. Retrieved 2024-08-18.
  6. 6.0 6.1 "Kolkata doctor rape-murder case: From New York City to London, demand for justice blurs borders". The Times of India. 2024-08-17. ISSN 0971-8257. Archived from the original on 19 August 2024. Retrieved 2024-08-18.
  7. "Kolkata RG Kar horror: Pakistan, Bangladesh and Australia join global protests to express solidarity". The Times of India. 2024-08-18. ISSN 0971-8257. Archived from the original on 19 August 2024. Retrieved 2024-08-18.
  8. "US, UK to Germany, outrage over RG Kar horror spreads in Bengali diaspora huddles, gatherings, protests". The Telegraph. 19 August 2024. Archived from the original on 17 August 2024. Retrieved 18 August 2024.
  9. Khanna, Aditi (2024-08-17). "Indian doctors in UK pen open letter to demand justice in Kolkata rape case". ThePrint (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 19 August 2024. Retrieved 2024-08-18.
  10. Saha, Rajesh (12 August 2024). "Kolkata doctor rape-murder: Plea filed at Calcutta High Court seeking CBI probe". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 13 August 2024. Retrieved 13 August 2024.
  11. Saha, Rajesh; Roy, Suryagni (13 August 2024). "Kolkata doctor's autopsy reveals she was throttled to death, genital torture". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 14 August 2024. Retrieved 14 August 2024.
  12. 12.0 12.1 "Kolkata rape and murder: Parents suspect gang rape, claim 150 mg of semen found in victim's body". Livemint. 14 August 2024. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  13. 13.0 13.1 "Kolkata rape-murder case: 150 mg of semen found in doctor's body, doctors say it could be gang rape". Business Today (in ఇంగ్లీష్). 14 August 2024. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  14. Yengkhom, Sumati; Chakrabarty, Sanjib (15 August 2024). "150 mg semen in Kolkata doctor's body: 'It's not rocket science to suspect involvement of more than one person'". The Times of India. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  15. "Kolkata doctor rape-murder: Post-mortem report highlights brutal assault, confirms multiple injuries, signs of struggle". The Times of India. 15 August 2024. Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024. a police officer said, "It is impossible to distinguish semen from three individuals with the naked eye during an autopsy."
  16. Bhattacharya, Ravik; Mitra, Atri (14 August 2024). "Kolkata doctor's rape-murder: Accused's wife complained of assault twice, police took no action". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 15 August 2024. Retrieved 15 August 2024.
  17. Saha, Rajesh (13 August 2024). "Kolkata murder: Accused confessed to violence against mother, sister, say sources". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 14 August 2024. Retrieved 15 August 2024.
  18. "Kolkata doctor rape-murder case: All you need to know". Deccan Herald (in ఇంగ్లీష్). 16 August 2024. Archived from the original on 13 August 2024. Retrieved 15 August 2024.
  19. "Timeline: 2024 RG Kar Medical College and Hospital rape and murder". OrissaPOST (in అమెరికన్ ఇంగ్లీష్). 2024-08-18. Retrieved 2024-08-19.
  20. Bose, Saikat Kumar (14 August 2024). "Why Kolkata Doctor's Rape-Murder Case Went To CBI: Court's Tough Remarks". NDTV. Archived from the original on 15 August 2024. Retrieved 14 August 2024.
  21. "kolkata rape and murder case: హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం | supreme-court-took-suo-moto-cognizance-of-kolkata-rape-and-murder-case". web.archive.org. 2024-08-20. Archived from the original on 2024-08-20. Retrieved 2024-08-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  22. Rajagopal, Bindu Shajan Perappadan & Krishnadas (2024-08-18). "Kolkata doctor rape-murder case: Supreme Court takes suo motu cognisance of the case, hearing on August 20". The Hindu (in Indian English). ISSN 0971-751X. Archived from the original on 19 August 2024. Retrieved 2024-08-18.
  23. "Kolkata rape-murder case: SC takes suo motu cognisance of incident at RG Kar Medical College Hospital; hearing on August 20". The Economic Times. 2024-08-18. ISSN 0013-0389. Archived from the original on 19 August 2024. Retrieved 2024-08-18.