Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

2022 ఫిఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ

వికీపీడియా నుండి

2022 FIFA ప్రపంచ కప్ నాకౌట్ దశ, గ్రూపు దశ తర్వాత వచ్చే రెండవ, చివరి దశ. ఇది డిసెంబరు 3న రౌండ్ 16తో ప్రారంభమై, డిసెంబరు 18 న లుసైల్‌లోని లుసైల్ ఐకానిక్ స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. [1] ప్రతి గ్రూపు నుండి మొదటి రెండు జట్లు (మొత్తం పదహారు జట్లు) టోర్నమెంట్‌లో నాకౌట్ దశకు చేరుకుంటాయి. సెమీ-ఫైనల్‌లో ఓడిన రెండు జట్ల మధ్య మూడో స్థానం కోసం పోటీ జరుగుతుంది. [2]

అన్ని సమయాలు స్థానిక AST ( UTC+3 ). [1]

పద్ధతి

[మార్చు]

నాకౌట్ దశలో, సాధారణ ఆట సమయం 90 నిమిషాలు ఉంటుంది. ఆ సమయానికి స్కోరు సమంగా ఉంటే, అదనపు సమయం (ఒక్కొక్కటి 15 నిమిషాల చొప్పున రెండు పీరియడ్‌లు) ఆడతారు. అదనపు సమయం తర్వాత కూడా స్కోరు సమంగానే ఉంటే, విజేతలను నిర్ణయించడానికి పెనాల్టీ షూట్-అవుట్ ఆడతారు. [2]

అర్హత సాధించిన జట్లు

[మార్చు]

ఎనిమిది గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. [2]

గ్రూప్ విజేతలు రన్నర్స్-అప్
 నెదర్లాండ్స్  సెనెగల్
బి  ఇంగ్లాండు  యు.ఎస్.ఏ
సి  అర్జెంటీనా  పోలండ్
డి  ఫ్రాన్స్  ఆస్ట్రేలియా
 జపాన్  స్పెయిన్
ఎఫ్  మొరాకో  క్రొయేషియా
జి  బ్రెజిల్   స్విట్జర్లాండ్
హెచ్  పోర్చుగల్  దక్షిణ కొరియా


నాకౌట్ ముఖ చిత్రం

[మార్చు]
 
రౌండ్ 16క్వార్టర్ ఫైనల్స్సెమీ ఫైనల్స్ఫైనల్
 
              
 
డిసెంబరు 3 – ఖలీఫా
 
 
 నెదర్లాండ్స్3
 
డిసెంబరు 9 – లుసాయ్
 
 యు.ఎస్.ఏ1
 
 నెదర్లాండ్స్2 (3)
 
డిసెంబరు 3 – అహ్మద్ బిన్ అలీ
 
 అర్జెంటీనా (పె)2 (4)
 
 అర్జెంటీనా2
 
డిసెంబరు 13 – లుసాయ్
 
 ఆస్ట్రేలియా1
 
 అర్జెంటీనా3
 
డిసెంబరు 5 – అల్ జనూబ్
 
 క్రొయేషియా0
 
 జపాన్1 (1)
 
డిసెంబరు 9 – అల్ రయ్యాన్
 
 క్రొయేషియా (పె)1 (3)
 
 క్రొయేషియా (పె)1 (4)
 
డిసెంబరు 5 – స్టేడియం 974
 
 బ్రెజిల్1 (2)
 
 బ్రెజిల్4
 
డిసెంబరు 18 – లుసాయ్
 
 దక్షిణ కొరియా1
 
 అర్జెంటీనా3 (4)
 
డిసెంబరు 4 – అల్ ఖోర్
 
 ఫ్రాన్స్3 (2)
 
 ఇంగ్లాండు3
 
డిసెంబరు 10 – అల్ ఖోర్
 
 సెనెగల్0
 
 ఇంగ్లాండు1
 
డిసెంబరు 4 – అల్ తుమామా
 
 ఫ్రాన్స్2
 
 ఫ్రాన్స్3
 
డిసెంబరు 14 – అల్ ఖోర్
 
 పోలండ్1
 
 ఫ్రాన్స్2
 
డిసెంబరు 6 – అల్ రయ్యాన్
 
 మొరాకో0 మూడో స్థానం కోసం పోటీ
 
 మొరాకో (పె)0 (3)
 
డిసెంబరు 10 – అల్ తుమామాడిసెంబరు 17 – ఖలీఫా
 
 స్పెయిన్0 (0)
 
 మొరాకో1 క్రొయేషియా2
 
డిసెంబరు 6 – లుసాయ్
 
 పోర్చుగల్0  మొరాకో1
 
 పోర్చుగల్6
 
 
  స్విట్జర్లాండ్1
 

రౌండ్ 16

[మార్చు]

నెదర్లాండ్స్ vs అమెరికా

[మార్చు]
నెదర్లాండ్స్ 3-1 యు.ఎస్.ఏ
  • మెంఫిస్ డిపే 10'
  • డాలే బ్లిండ్ 45+1'
  • డెంజెల్ డమ్‌ఫ్రీస్ 81'
Report
  • హాజీ రైట్ 76'
ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ రయ్యాన్
ప్రేక్షకులు: 44,846

అర్జెంటీనా vs ఆస్ట్రేలియా

[మార్చు]
అర్జెంటీనా 2-1 ఆస్ట్రేలియా
Report
అహ్మద్ బిన్ ఆలీ స్టేడియం, అల్ రయ్యాన్
ప్రేక్షకులు: 45,032

ఫ్రాన్స్ vs పోలండ్

[మార్చు]
ఫ్రాన్స్ 3-1 పోలండ్
  • ఒలీవియర్ గిరో 44'
  • కైలియన్ ఎంబాపే 74', 90+1'
Report
  • రాబర్ట్ లెవాండోవ్‌స్కీ 90+9' (పెనా.)
అల్ తుమామా స్టేడియం, దోహా
ప్రేక్షకులు: 40,989

ఇంగ్లాండ్ vs సెనెగల్

[మార్చు]
ఇంగ్లాండు 3-0 సెనెగల్
  • జోర్డాన్ హెండర్సన్ 38'
  • హ్యారీ కేన్ 45+3'
  • బుకాయో సాకా 57'
Report
అల్ బాయ్‌త్ స్టేడియం, అల్ ఖోర్
ప్రేక్షకులు: 65,985

జపాన్ vs క్రొయేషియా

[మార్చు]
జపాన్ 1-1 క్రొయేషియా
  • డైజెన్ మయేడా 43'
Report
  • ఇవాన్ పెరిసిచ్ 55'
పెనాల్టీలు
  • టకుమి మినామినో soccer ball with red X
  • కవోరు మిటోమా soccer ball with red X
  • టకుమా అసానో soccer ball with check mark
  • మాయా యోషిడా soccer ball with red X
1–3
  • soccer ball with check mark నికోలా వ్లాసిచ్
  • soccer ball with check mark మార్సెలో బ్రొజోవిచ్
  • soccer ball with red X మార్కో లివాజా
  • soccer ball with check mark మారియో పసాలిచ్
అల్ జనోబ్ స్టేడియం, అల్ వక్రా

బ్రెజిల్ vs దక్షిణ కొరియా

[మార్చు]
బ్రెజిల్ 4-1 దక్షిణ కొరియా
  • వినీషియస్ జూనియర్ 7'
  • నేమార్ 13' (పెనా.)
  • రిచార్లిసన్ 29'
  • లూకాస్ పకేటా 36'
Report
  • పైక్ సియంగ్-హో 76'
ప్రేక్షకులు: 43,847

మొరాకో vs స్పెయిన్

[మార్చు]
మొరాకో 0-0 (a.e.t.) స్పెయిన్
Report
పెనాల్టీలు
  • అబ్దెల్ హమీద్ సబిరి soccer ball with check mark
  • హకీం జియెక్ soccer ball with check mark
  • బద్ర్ బెనూన్ soccer ball with red X
  • అచ్రాఫ్ హకీమి soccer ball with check mark
3–0
  • soccer ball with red X పాబ్లో సరాబియా
  • soccer ball with red X కార్లోస్ సోలర్
  • soccer ball with red X సెర్జియో బస్క్వెట్స్
ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, అల్ రయ్యాన్
ప్రేక్షకులు: 44,667

పోర్చుగల్ vs స్విట్జర్లాండ్

[మార్చు]
పోర్చుగల్ 6-1  స్విట్జర్లాండ్
  • గొంకాలో రామోస్ 17', 51', 67'
  • పేపె 33'
  • రఫేల్ గెర్రీరో 55'
  • రఫేల్ లియావో 90+2'
Report
  • మాన్యుయెల్ అకంజీ 58'
లూసాయ్ ఐకానిక్ స్టేడియం, లూసాయ్
ప్రేక్షకులు: 83,720

క్వార్టర్ ఫైనల్స్

[మార్చు]

క్రొయేషియా vs బ్రెజిల్

[మార్చు]

ఈ ప్రపంచ కప్‌ ముందు వరకు క్రొయేషియా, బ్రెజిల్‌లు నాలుగు సార్లు తలపడగా 3 మ్యాచ్‌లలో బ్రెజిల్ గెలిచింది, ఒకటి డ్రా అయింది. వీటిలో ప్రపంచ కప్‌లో జరిగిన మ్యాచ్‌లు రెండు. ఈ రెంటిలోనూ బ్రెజిల్ గెలిచింది. 2006 లో 1-0 తో గెలవగా, 2014 లో 3-1 తో గెలిచింది.[3]

ఈ మ్యాచ్ మొదటి 90 నిమిషాల సమయంలో 0-0 తో సమంగా నిల్కవడంతో అదనపు సమయం ఆడారు. అద్నపు సమయపు తొలి అర్ధ భాగంలో ంబేమార్ బ్రెజిల్‌కు తొలి గోలు సాధించాడు. రెండో సగంలో బ్రూనో పెట్కోవిచ్ చేసిన గోలుతో క్రౌయేషియా స్కోరును సమం చేసింది. విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్‌ను జరిపారు. ఇందులో క్రొయేషియా 4-2 తో గెలిచింది. దీంతో క్రొయేషియా వరసగా రెండోసారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. మొత్తమ్మీద వారికి సెమీఫైనల్స్ ఆడడం ఇది మూడోసారి. 2002 ప్రపంచ కప్ ఫైనల్స్ లో జర్మనీని ఓడించాక, బ్రెజిల్ ఐరోపా జట్టు చేతుల్లో ఓడి కప్పునుండి బయటికి పోవడం ఇది వరసగా ఐదోసారి.[4] ఈ( పోటీలో గ్రీజ్‌మాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. [5]

క్రొయేషియా 1-1 బ్రెజిల్
Report
పెనాల్టీలు
  • నికోలా వ్లాసిచ్ soccer ball with check mark
  • లోవ్రో మాజెర్ soccer ball with check mark
  • లూకా మోడ్రిచ్ soccer ball with check mark
  • మిస్లావ్ ఆర్సిచ్ soccer ball with check mark
4-2
  • soccer ball with red X రోడ్రిగో
  • soccer ball with check mark కాసెమిరో
  • soccer ball with check mark పెడ్రో
  • soccer ball with red X మార్కిన్హోస్
ఎడ్యుకేషన్ సిటీ స్టేడియం, అల్ రయ్యాన్
ప్రేక్షకులు: 43,893

నెదర్లాండ్స్ vs అర్జెంటీనా

[మార్చు]

ఈ ప్రపంచ కప్‌ ముందు వరకు నెదర్లాండ్స్ అర్జెంటీనాలు మొత్తం 9 సార్లు తలపడగా, నెదర్లాండ్స్ నాలుగుసార్లు, అర్జెంటీనా 2 సార్లు గెలవగా, 3 సార్లు డ్రా అయింది. ఈ 5 ముఖాముఖీ పోటీల్లో 5, ప్రపంచ కప్‌లో జరిగాయి. 1974 లో నెదర్లాండ్స్ 4–0 తో గెలిచింది. 1978 లో అర్జెంటీనా 3-1 తో గెలిచింది. 1998 లో నెదర్లాండ్స్ 2-1 తో గెలిచింది. ఆ తరువాత 2006 లో, 2014 లో జరిగిన రెండు పోటీలు డ్రా అయ్యాయి. 2014 లో జరిగిన పోటీ నాకౌట్ దశలో కావడంతో, ఇందులో పెనాల్టీ షూటౌట్ జరిగింది. అందులో అర్జెంటీనా గెలిచింది.[6]

ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా రెండు గోల్‌లు చేసి ఆధిక్యం లోకి వెళ్ళగా, ఆట రెండో సగంలో సబ్‌స్టిట్యూటుగా దిగిన వూట్ వెఘ్రోస్ట్ వరసగా రెండు గోల్‌లు చేసి స్కోరును సమం చేసాడు. దాంతో ఆట అదనపు సమయానికి, ఆ తరువాత పెనాల్టీ షూటౌట్‌కూ వెళ్ళింది. అక్కడ అర్జెంటీనా 4-3 తో గెలిచి సెమీ ఫైనల్సు లోకి ప్రవేశించింది[7]

ఈ మ్యాచ్‌లో మొత్తం 18 యెల్లో కార్డులు చూపించారు. 2006 లో నెదర్లాండ్స్ పోర్చుగల్ మ్యాచ్‌లో నెలకొల్పిన 16 యెల్లో కార్డుల రికార్డును ఈ మ్యాచ్ ఛేదించింది. [8] ఈ విషయంలో రిఫరీల నిర్ణయాలు కొన్ని విమర్శకు గురయ్యాయి.[9] [10]

ఈ మ్యాచ్ ముగింపులో ఉండగా గ్రాంట్ వాల్ అనే క్రీడా రచయిత, ప్రెస్‌బాక్సులో గుండెపోటుతో మరణించాడు.[11][12]

నెదర్లాండ్స్ 2-2 అర్జెంటీనా
Report
పెనాల్టీలు
  • విర్గిల్ వాన్ డియ్‌క్ soccer ball with red X
  • స్టీవెన్ బెర్ఘూయిస్ soccer ball with red X
  • టియున్ కూప్‌మీనర్స్ soccer ball with check mark
  • వూట్ వెఘోర్స్ట్ soccer ball with check mark
  • లూక్ డి జోంగ్ soccer ball with check mark
3-4
  • soccer ball with check mark లియోనెల్ మెస్సి
  • soccer ball with check mark లియాండ్రో పరేడెస్
  • soccer ball with check mark గొంజాలో మోంటియెల్
  • soccer ball with red X ఎంజో ఫెర్నాండెజ్
  • soccer ball with check mark లాటారో మార్టినెజ్
లుసైల్ ఐకానిక్ స్టేడియం, లుసైల్
ప్రేక్షకులు: 88,235

మొరాకో vs పోర్చుగల్

[మార్చు]

మొరాకో క్వార్టర్ ఫైనల్సుకు చేరడం ఇదే తొలిసారి. క్వార్టర్ ఫైనల్సుకు చేరిన తొలి అరబ్బు దేశం మొరాకోయే, నాలుగో ఆఫ్రికా దేశం కూడా. గతంలో 1990 లో కామెరూన్, 2002 లో సెనెగల్, 2010 లో ఘనా ఈ దశకు చేరాయి. మొరాకో, పోర్చుగల్‌లు ఈ ప్రపంచ కప్‌ ముందు వరకు రెండు సార్లు తలపడగా చెరొకటి గెలిచాయి. ఈ రెండూ ప్రపంచ కప్‌లో జరిగిన పోటీలే. 1986 లో మొరాకో 3-1 తో గెలవగా, 2018 లో పోర్చుగల్ 1-0 తో గెలిచింది.[13]

ఈ మ్యాచ్‌లో యూసెఫ్ ఎన్-నేసిరి చేసిన గోలుతో మొరాకో పోర్చుగల్‌పై 1-0 తో గెలిచింది. ఆ గోలు కొట్టాక, పోర్చుగల్ తమ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోను ఆట లోకి సబ్‌స్టిట్యూటుగా దింపినప్పటికీ ఫలితం లేకపోయింది. మొరాకో, ప్రపంచ కప్పు సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించిన తొలి ఆఫ్రికా దేశం, తొలి అరబ్బు దేశమూ అయింది.[14]

మొరాకో 1-0 పోర్చుగల్
  • యూసెఫ్ ఎన్-నేసిరి 42'
Report
అల్ తుమామా స్టేడియం, దోహా
ప్రేక్షకులు: 44,198

ఇంగ్లాండ్ vs ఫ్రాన్స్

[మార్చు]

ఈ ప్రపంచ కప్‌ ముందు వరకు ఇంగ్లాండు ఫ్రాన్సులు మొత్తం 31 సార్లు తలపడగా, ఇంగ్లాండు 17 సార్లు, ఫ్రాన్సు 9 సార్లు గెలిచాయి. 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఈ పోటీల్లో ప్రపంచ కప్‌లో జరిగినవి రెండే. ఈ రెండు సార్లూ ఇంగ్లాండే గెలిచింది. 1996 లో 2-0 తో గెలవగా, 1982 లో 3-1 తో గెలిచింది. [15]

ఇంగ్లాండుతో జరిగిన ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆరేలియెన్ చామాని, ఒలీవియెర్ గిరోలు చేసిన గోల్‌లతో ఫ్రాన్స్ మ్యాచ్‌ను గెలుచుకుని సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించింది. ఇంగ్లాండు తరపున హ్యారీ కేన్ చేసిన గోలు వలన మ్యాచ్ 2-1 స్కోరుతో ముగిసింది. ఇంగ్లాండుకుకు లభించిన పెనాల్టీ కిక్ అవకాశాన్ని ఫ్రాన్స్ గోల్ కీపరు విజయవంతంగా అడ్డుకోవడంతో స్కోరును సమం చేసే అవకాశాన్ని ఇంగ్లాండు కోల్పోయింది. [16] 1998 లో బ్రెజిల్ తరువాత, గత ప్రపంచ కప్ విజేత ఈసారి సెమీ ఫైనల్స్ లోకి ప్రవేశించడం ఇదే తొలిసారి.[17]


ఇంగ్లాండు 1-2 ఫ్రాన్స్
Report
  • ఆరేలియెన్ చామేని 17'
  • ఒలీవియర్ గిరో 78'
అల్ బయ్‌త్ స్టేడియం, అల్ ఖోర్
ప్రేక్షకులు: 68,895

సెమీ ఫైనల్స్

[మార్చు]

అర్జెంటీనా vs క్రొయేషియా

[మార్చు]

ఈ ప్రపంచ కప్‌ ముందు వరకు అర్జెంటీనా క్రొయేషియాతో 5 సార్లు పోటీ పడగా, 2 సార్లు గెలిచి, 2 సార్లు ఓడిపోయింది. ఒక్క మ్యాచ్ డ్రాగా ముగిసింది. వీటిలో రెండు మ్యాచ్‌లు ప్రపంచ కప్‌లో జరిగాయి. 1998 లో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 తో గెలవగా, 2018 లో జరిగిన మ్యాచ్‌లో క్రొయేషియా 3-0 తో గెలిచింది.[18]

తొలి 30 నిమిషాల్లో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడాయి. 34 వ నిమిషంలో జూలియన్ ఆల్వారెజ్‌ను క్రొయేషియా డిఫెండరు లివకోవిచ్ డీకొట్టడంతో రిఫరీ అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ ఇచ్చాడు. లియోనెల్ మెస్సీ దాన్ని గోలుగా మలచాడు. 39 వ నిమిషంలో ఆల్వారెజ్ అర్జెంటీనాకు రెండో గోలు సాధించాడు. ఆట రెండో సగంలో క్రొయేషియా కోచ్ అనేక ఆటగాళ్ళను మార్చాడు. 69 వ నిమిషంలో మెస్సి అందించిన పాస్‌ను ఆల్వారెజ్ గోలుగా మలచాడు. దాంతో అర్జెంటీనా 3-0 తో నెగ్గింది.[19] మెస్సీ చేసిన గోలుతో అతను మాజీ అర్జెంటీనా ఆటగాడు బటిస్టుటా ప్రపంచ కప్‌లో అర్జెంటీనా తరపున చేసిన అత్యధిక 10 గోల్‌ల రికార్డును ఛేదించాడు. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా జర్మను ఆటగాడు లోథార్ మాథౌస్‌తో సముడయ్యాడు. ఫైనల్ పోటీలో ఆడితే, మెస్సి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడౌతాడు.[20]

అర్జెంటీనా 3-0 క్రొయేషియా
Report
లుసైల్ ఐకానిక్ స్టేడియం, లుసైల్
ప్రేక్షకులు: 88,966


ఫ్రాన్స్ vs మొరాకో

[మార్చు]


ఈ ప్రపంచ కప్‌ ముందు వరకు ఫ్రాన్సు మొరాకోతో 7 సార్లు పోటీ పడగా, ఐదింట్లో గెలిచి, రెండింటిని డ్రా చేసుకుంది. ప్రపంచ కప్‌లో మాత్రం ఇదే వాటి తొలి పోటీ.[21]

ప్రపంచ కప్‌ సెమీఫైనల్స్‌లో ఒక ఆఫ్రికా దేశం పోటీ పడడం ఇదే తొలిసారి, ఒక అరబ్బు దేశానికి కూడా ఇదే తొలిసారి. ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలు కాకుండా వేరే ఖండానికి చెందిన దేశం సెమీఫనల్సులో ఆడడం ఇది మూడోసారి. గతంలో అమెరికా 1930 లోను, దక్షిణ కొరియా 2002 లోనూ సెమీస్‌లో ఆడాయి.

థియో హెర్నాండెన్ 4 నిమిషాల 39 సెకండ్లకు తొలి గోలు చేసి ఫ్రాన్సుకు ఆధిక్యత సంపాదించి పెట్టాడు. ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్స్‌లో ఇంత త్వరగా గోలు చెయ్యడం 1958 తరువాత ఇదే తొలిసారి. [22]79 వ నిమిషంలో సబ్‌స్టిట్యూటుగా వచ్చిన రాండ్ల్ కోలో మువాని వచ్చిన మొదటి నిమిషం లోనే గోలు చేసి ఫ్రాన్స్ ఆధిక్యతను మరింత పెంచాడూ, చివరికి ఫ్రాన్స్ 2-0 తో మొరాకోను ఓడించి వరసగా రెండో సారి ప్రపంచ కప్ ఫైనల్సుకు చేరింది. కప్పు గెలిస్తే, వరసగా రెండో సారి కప్పు గెలవడం 1962 తరువాత (1958, 1962 లలో బ్రెజిల్ కప్పు గెలుచుకుంది) ఇదే తొలిసారి అవుతుంది. [23]

ఫ్రాన్స్ 2-0 మొరాకో
  • థియో హెర్నాండెజ్ 5'
  • రాండాల్ కోలో మువాని 79'
Report
అల్ బయ్‌త్ స్టేడియం, అల్ ఖోర్
ప్రేక్షకులు: 68,294

మూడో స్థానం కోసం పోటీ

[మార్చు]

గతంలో ఈ రెండు జట్లు రెండుసార్లు (ఈ ప్రపంచ కప్ గ్రూపు దశలో ఒక పోటీతో కలిపి) పోటీపడ్డాయి.[24]

ఈ మ్యాచ్ ఏడో నిమిషంలో గోలు చేసి క్రొయేషియా ఆధిక్యం లోకి వెళ్ళినప్పటికీ, మళ్ళీ 9 వ నిమిషం లోనే మొరాకో గోలు చేసి స్కోరును సమం చేసింది.[25] మ్యాచ్ 42 వ నిమిషంలో మరొక గోలు సాధించి క్రొయేషియా, 2-1 తో మూడవ స్థానాన్ని గెలుచుకుంది. 1998 తరువాత క్రొయేషియా 3 వ స్థానంలో నిలవడం ఇదే తొలి సారి.[26]

క్రొయేషియా 2-1 మొరాకో
  • జోస్కో గ్వార్డియోల్ 7'
  • మిస్లావ్ ఓర్సిచ్ 42'
Report
  • అచ్‌రాఫ్ దారి 9'
ఖలీఫా ఇంటర్నేషనల్ స్టేడియం, అల్ రయ్యాన్
ప్రేక్షకులు: 44,137

ఫైనల్ పోటీ

[మార్చు]

2022 డిసెంబరు 18 న జరిగిన ఫైనల్ పోటీలో పాల్గొన్న రెండు జట్లూ గతంలో ప్రపంచ కప్‌ను చెరి రెండు సార్లు గెలుచుకున్నాయి. [27] ఈ మ్యాచ్‌లో 36 నిమిషాలకే అర్జెంటీనా రెండు గోల్‌లు చేసి 2-0 ఆధిక్యం లోకి వెళ్ళింది.[27][28] ఫ్రాన్స్ మొదటి సగంలో గోలు చెయ్యలేకపోయింది. రెండవ సగంలో 80 వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ ద్వారా ఎంబాపె ఫ్రాన్సుకు తొలి గోలు అందించాడు. ఆ తరువాత రెండు నిమిషాలకే మరో గోలు చేసి స్క్జోరును సమం చేసాడు. ఆట అదనపు సమయం లోకి వెళ్ళింది. 108 వ నొఇమిషంలో మెస్సి మరొక గోలు చేసి 3-2 ఆధిక్యత సాధించాడూ., మళ్ళీ ఎంబాపె పెనాల్టీ కిక్ ద్వారా ఫ్రాన్సుకు మూడవ గోలు చేసి స్కోరును సమం చేసాడు. [28] ఈ విధంగా అదనపు సమయం ముగిసేసరికి అర్జెంటీనా, ఫ్రాన్సులు 3-3 తో సమంగా నిలవడంతో పెనాల్టీ షూటౌట్‌ను నిర్వహించారు. అందులో అర్జెంటీనా 4-2 తో గెలిచి ప్రపంచ కప్‌ను మూడవసారి గెలుచుకుంది. [28] ఫ్రెంచి ఆటగాడు కైలియన్ ఎంబాపె ఫైనల్లో హ్యాట్రిక్ చేయడమే కాకుండా, టోర్నమెంటులో మొత్తం 8 గోల్‌లు చేసి అత్యధిక గోల్‌లు చేసిన ఆటగాడిగా బంగారు బూట్‌ను గెలుచుకున్నాడు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంటుగా నిలిచి బంగారు బంతిని గెలుచుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎమిలియానో మార్టినెజ్ అత్యుత్తమ గోల్‌కీపరుగా బంగారు గ్లౌజును అందుకున్నాడు. అర్జెంటీనాకే చెందిన ఎంజో ఫెర్నాండెజ్, టోర్నమెంటులో అత్యుత్తమ యువ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

అర్జెంటీనా 3-3 ఫ్రాన్స్
Report
పెనాల్టీలు
4–2
  • soccer ball with check mark కైలియన్ ఎంబాపె
  • soccer ball with red X కింగ్‌స్లే కోమన్
  • soccer ball with red X ఆరేలియన్ చామేని
  • soccer ball with check mark రాండాల్ కోలో మువాని
లుసైల్ ఐకానిక్ స్టేడియం, లుసైల్
ప్రేక్షకులు: 88,966
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్:లియోనెల్ మెస్సి (అర్జెంటీనా)[29] మ్యాచ్ నిబంధనలు [30]
  • 90 నిమిషాలు
  • 30 నిమిషాల అదనపు సమయం - అవసరమైతేనే
  • పెనాల్టీ షూట్ అవుట్ - పై రెండు దశల తరువాత, స్కోర్లు సమంగా ఉంటే
  • గరిష్ఠంగా 12 మంది ఆటగాళ్ళ మార్పు
  • మామూలు సమయంలో గరిష్ఠంగా ఐదు సార్లు ఆటగాళ్ళ మార్పు, అదనపు సమయంలో మరొక సారి [note 1]

నోట్స్

[మార్చు]
  1. Each team will be given only three opportunities to make substitutions, with a fourth opportunity in extra time, excluding substitutions made at half-time, before the start of extra time and at half-time in extra time.

మూలాలు

[మార్చు]
  1. ఇక్కడికి దుముకు: 1.0 1.1 "FIFA World Cup Qatar 2022 – Match Schedule" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. 11 August 2022. Retrieved 11 August 2022.
  2. ఇక్కడికి దుముకు: 2.0 2.1 2.2 "Regulations – FIFA World Cup Qatar 2022" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. 15 December 2021. Retrieved 30 March 2022.
  3. "Brazil national football team: record v Croatia". 11v11.com. Retrieved 5 December 2022.
  4. Hafez, Shamoon (9 December 2022). "World Cup 2022: Croatia 1-1 Brazil (4-2 pens): Tite's men knocked out". BBC Sport. Retrieved 10 December 2022.
  5. "France extinguish Morocco dream to reach World Cup final". FIFA. 14 December 2022. Retrieved 14 December 2022.
  6. "Netherlands national football team: record v Argentina". 11v11.com. Retrieved 4 December 2022.
  7. McNulty, Phil (9 December 2022). "World Cup 2022: Argentina beat the Netherlands in penalty shootout to reach semi-finals". BBC Sport. Retrieved 10 December 2022.
  8. Smith, Emma (10 December 2022). "World Cup 2022: Netherlands and Argentina descend into chaos as new yellow card record set". BBC Sport. Retrieved 10 December 2022.
  9. McNulty, Phil (10 December 2022). "World Cup 2022: Messi the master as Argentina beat Netherlands in chaotic Qatar classic". BBC Sport. Retrieved 10 December 2022.
  10. Hamilton, Tom (9 December 2022). "Argentina secure semifinal place over Netherlands after one of the wildest wins of Qatar 2022". ESPN. Retrieved 10 December 2022.
  11. Yeung, Jessie (9 December 2022). "American journalist Grant Wahl dies at Qatar World Cup". CNN.com (in ఇంగ్లీష్). Retrieved 9 December 2022.
  12. Lewis, Russell. "Longtime soccer sportswriter Grant Wahl has died covering the World Cup in Qatar". National Public Radio. Retrieved 10 December 2022.
  13. "Morocco national football team: record v Portugal". 11v11.com. Retrieved 6 December 2022.
  14. Hafez, Shamoon (10 December 2022). "World Cup 2022: Morocco 1-0 Portugal: Youssef En-Nesyri scores winner". BBC Sport. Retrieved 10 December 2022.
  15. "England national football team: record v France". www.11v11.com. Retrieved 4 December 2022.
  16. McNulty, Phil (10 December 2022). "World Cup 2022: England 1-2 France - Harry Kane misses penalty as Three Lions out". BBC Sport. Retrieved 10 December 2022.
  17. OptaJean [@OptaJean] (10 December 2022). "1 - France are the first reigning champion to reach the World Cup semi-finals since Brazil in 1998. Samba. #ENGFRA" (Tweet). Retrieved 10 December 2022 – via Twitter.
  18. "Argentina national football team: record v Croatia". 11v11.com. Retrieved 9 December 2022.
  19. "Argentina reaches World Cup final after Lionel Messi magic condemns Croatia to 3-0 defeat". ABC News (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). 13 December 2022. Retrieved 14 December 2022.
  20. McNulty, Phil (13 December 2022). "World Cup 2022: Argentina 3-0 Croatia - Messi and Alvarez put their side into World Cup final". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 14 December 2022.
  21. "France national football team: record v Morocco". 11v11.com. Retrieved 10 December 2022.
  22. "France 2-0 Morocco: Hernandez and Kolo Muani send champions through to Argentina final". BeIN Sports. 14 December 2022. Retrieved 14 December 2022.
  23. McNulty, Phil (14 December 2022). "World Cup 2022: France 2-0 Morocco - France edge past Morocco to set up Argentina final". BBC Sport. Retrieved 14 December 2022.
  24. "Morocco national football team: record v Croatia". 11v11.com. Retrieved 14 December 2022.
  25. "Croatia finish third at World Cup after Mislav Orsic's winner against Morocco". The Guardian. 17 December 2022. Retrieved 17 December 2022.
  26. "Croatia beat Morocco to finish third at World Cup". BBC Sport. 17 December 2022. Retrieved 17 December 2022.
  27. ఇక్కడికి దుముకు: 27.0 27.1 "2022 World Cup final: Argentina 3-3 France (aet, 4-2 on pens) – as it happened". The Guardian. 18 December 2022.
  28. ఇక్కడికి దుముకు: 28.0 28.1 28.2 "Argentina wins World Cup on penalty kicks over France: Live updates". NBC News.
  29. "Argentina and Messi spot on for World Cup glory". FIFA. 18 December 2022. Retrieved 18 December 2022.
  30. "Regulations – FIFA World Cup Qatar 2022" (PDF). FIFA.com. Fédération Internationale de Football Association. 15 December 2021. Retrieved 30 March 2022.