క్రికెట్ ప్రపంచ కప్
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ | |
---|---|
నిర్వాహకుడు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) |
ఫార్మాట్ | వన్ డే ఇంటర్నేషనల్ |
తొలి టోర్నమెంటు | 1975 ఇంగ్లాండ్ |
చివరి టోర్నమెంటు | 2023 భారతదేశం |
తరువాతి టోర్నమెంటు | 2027 దక్షిణాఫ్రికా - జింబాబ్వే - నమీబియా |
జట్ల సంఖ్య | 10[1] (2027 నుండి 14) |
ప్రస్తుత ఛాంపియన్ | ఆస్ట్రేలియా (6 వ టైటిల్) |
అత్యంత విజయవంతమైన వారు | ఆస్ట్రేలియా (6 టైటిళ్ళు) |
అత్యధిక పరుగులు | సచిన్ టెండూల్కర్ (2,278)[2] |
అత్యధిక వికెట్లు | గ్లెన్ మెక్‌గ్రాత్ (71)[3] |
2023 |
క్రికెట్ ప్రపంచ కప్ (అధికారికంగా ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్) ఒక అంతర్జాతీయ వన్ డే మ్యాచ్ క్రికెట్ పోటీ. దీనిని క్రికెట్ అధికారిక సంఘమైన అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసిసి) ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకులు వీక్షిస్తారు.[4] ప్రస్తుతం భారతదేశంలో 2023 ప్రపంచ కప్ జరుగుతోంది.
మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్ 1975 జూన్ లో ఇంగ్లాండులో జరిగింది. 2019 దాకా 12 సార్లు ఈ పోటీ జరిగితే 20 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా ఐదు సార్లు కప్ గెలవగా, వెస్టిండీస్, భారత్ రెండు సార్లు, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ ఒక్కోసారి కప్పు గెలిచాయి.
ప్రస్తుత విధానంలో పోటీ ముందు మూడు సంవత్సరాల కాలం అర్హత దశ ఉంటుంది. ఈ దశ నుంచి అసలైన టోర్నమెంటులో పాల్గొనే జట్లేవో నిర్ణయిస్తారు. టోర్నమెంటులో మొత్తం పది జట్లు కప్పు కోసం పోటీ పడతాయి. ఈ పది జట్లలో పోటీలకు ఆతిథ్యం ఇచ్చే జట్టుకు కచ్చితంగా పాల్గొనే అర్హత ఉంటుంది. ఆతిథ్య దేశాల్లో సుమారు నెలరోజుల పాటు వివిధ వేదికల మీద పోటీలు జరుగుతాయి. 2027 లో జరగబోయే ప్రపంచకప్ లో 14 జట్లు పాల్గొనేలా విధానాలు రూపొందిస్తున్నారు.[5]
ఆవిర్భావం
[మార్చు]1844 సెప్టెంబరు 24-25 తేదీల్లో అమెరికా, కెనడా దేశాల మధ్య మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరిగింది.[6]
చరిత్ర
[మార్చు]సంవత్సరం | ఛాంపియన్ |
---|---|
1975 | వెస్ట్ ఇండీస్ |
1979 | వెస్ట్ ఇండీస్ (2) |
1983 | భారతదేశం |
1987 | ఆస్ట్రేలియా |
1992 | పాకిస్తాన్ |
1996 | శ్రీలంక |
1999 | ఆస్ట్రేలియా (2) |
2003 | ఆస్ట్రేలియా (3) |
2007 | ఆస్ట్రేలియా (4) |
2011 | భారతదేశం (2) |
2015 | ఆస్ట్రేలియా (5) |
2019 | ఇంగ్లాండు |
2023 | ఆస్ట్రేలియా (6) |
మొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1844 24 , 1844 సెప్టెంబరు 25 లలో కెనడా, యునైటెడ్ స్టేట్స్ మధ్య జరిగింది.[7] అయితే, 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ను మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌గా గుర్తిస్తారు. తరువాతి సంవత్సరాలలో రెండు జట్లు యాషెస్ కోసం క్రమం తప్పకుండా పోటీ పడ్డాయి. 1889 లో దక్షిణాఫ్రికాకు[8] టెస్ట్ హోదా లభించింది. ఈ జట్లు ఒకదానితో ఒకటి ఆడేందుకు పర్యటనలు జరిపేవి. ఫలితంగా ద్వైపాక్షిక పోటీలు మొదలయ్యాయి. 1900 పారిస్ గేమ్స్‌లో ఒలింపిక్ క్రీడగా క్రికెట్ కూడా చేర్చారు. అప్పుడు గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలుచుకుంది.[9] వేసవి ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఉన్న ఏకైక పర్యాయం అది.[10]
అంతర్జాతీయ స్థాయిలో మొట్టమొదటి బహుపాక్షిక పోటీ 1912 లో ముక్కోణపు టోర్నమెంటుగా జరిగింది. ఆ సమయంలో ఇంగ్లండ్‌లో టెస్ట్ క్రికెట్ ఆడుతున్న మూడు దేశాలు, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య మధ్య ఈ టోర్నమెంటు జరిగింది. అయితే ఆ పోటీ విజయవంతం కాలేదు. ఆ సంవత్సరం వేసవిలో అనూహ్యంగా వర్షాలు పడి, తడిసిన పిచ్‌లపై ఆడడాం కష్టతరమైంది. ప్రేక్షకుల హాజరు కూడా తక్కువగా ఉంది.[11] అప్పటి నుండి, అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ సాధారణంగా ద్వైపాక్షిక సిరీస్‌గానే జరుగుతూ వచ్చింది. 1999లో ముక్కోణపు ఆసియా టెస్ట్ ఛాంపియన్‌షిప్ వరకు బహుపాక్షిక టెస్ట్ టోర్నమెంట్లను మళ్లీ నిర్వహించలేదు [12]
1928లో వెస్టిండీస్,[13] 1930లో న్యూజిలాండ్,[14] 1932లో భారతదేశం,[15] 1952లో పాకిస్తాన్ [16] ల చేరికతో, కాలక్రమేణా టెస్ట్ క్రికెట్ ఆడే దేశాల సంఖ్య పెరిగింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్‌ను మూడు, నాలుగు లేదా ఐదు రోజుల పాటు ద్వైపాక్షిక టెస్ట్ మ్యాచ్‌లుగానే కొనసాగించారు.
ప్రుడెన్షియల్ ప్రపంచ కప్‌లు (1975–1983)
[మార్చు]తొట్టతొలి క్రికెట్ ప్రపంచ కప్‌ను 1975లో ఇంగ్లండ్ నిర్వహించింది. ఆ సమయంలో ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించడానికి వనరులను పెట్టగలిగిన ఏకైక దేశం ఇంగ్లండ్. 1975 జూన్ 7న టోర్నమెంటు ప్రారంభమైంది.[17] మొదటి మూడు ప్రపంచ కప్‌లు ఇంగ్లాండ్‌లో జరిగాయి. అధికారికంగా వాటిని ప్రుడెన్షియల్ పిఎల్‌సి స్పాన్సర్ చేయడంతో వాటిని ప్రుడెన్షియల్ కప్ అని అంటారు. ఒక్కో జట్టుకు 60 ఓవర్‌లు ఉండేలా ఆ మ్యాచ్‌లు జరిగాయి. సంప్రదాయ రూపంలో పగటిపూట ఆడేవారు. ఆటగాళ్లు తెల్లటి దుస్తులు ధరించి, ఎరుపు రంగు బంతులను ఉపయోగించారు.[18]
మొదటి టోర్నమెంట్‌లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. అవి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, వెస్టిండీస్ (ఆ సమయంలో ఉన్న ఆరు టెస్ట్ దేశాలు), శ్రీలంక, తూర్పు ఆఫ్రికా దేశాలకు చెందిన ఒక మిశ్రమ జట్టు.[19] వర్ణవివక్ష కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధించబడిన దక్షిణాఫ్రికాకు పాల్గొనే అనుమతి లభించలేదు. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను 17 పరుగుల తేడాతో ఓడించి వెస్టిండీస్ తొలి టోర్నమెంటును గెలుచుకుంది.[19] వెస్టిండీస్‌కు చెందిన రాయ్ ఫ్రెడ్రిక్స్ 1975 ప్రపంచకప్ ఫైనల్ సమయంలో వన్‌డేలలో హిట్ వికెట్‌గా ఔటైన మొదటి బ్యాట్స్‌మెన్.[20]
1979 ప్రపంచ కప్‌లో శ్రీలంక, కెనడాలు అర్హత సాధించాయి. ప్రపంచ కప్‌కు [21] టెస్టు ఆడని జట్లను ఎంపిక చేయడానికి ICC ట్రోఫీ పోటీని ప్రవేశపెట్టారు.[22] ఆ ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను 92 పరుగుల తేడాతో ఓడించి వెస్టిండీస్ వరుసగా రెండోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ప్రపంచ కప్ తర్వాత జరిగిన సమావేశంలో, అంతర్జాతీయ క్రికెట్ కాన్ఫరెన్స్ ఈ పోటీని నాలుగేళ్ళ కొకసారి జరపాలని నిర్ణయించింది.[22]
1983 ఈవెంట్‌ను వరుసగా మూడోసారి ఇంగ్లాండ్ నిర్వహించింది. అప్పటికి, శ్రీలంక టెస్టులు ఆడే దేశంగా మారింది. జింబాబ్వే ICC ట్రోఫీ ద్వారా అర్హత సాధించింది. స్టంప్‌ల నుండి 30 yards (27 మీ.) దూరంలో ఉండే ఫీల్డింగ్ సర్కిల్‌ను ఈ కప్‌లోనే ప్రవేశపెట్టారు. దానికి లోపల నలుగురు ఫీల్డర్లు ఎల్లవేళలా ఉండాలి.[23] నాకౌట్‌లోకి వెళ్లడానికి ముందు జట్లు రెండేసి సార్లు తలపడ్డాయి. ఫైనల్‌లో వెస్టిండీస్‌ను 43 పరుగుల తేడాతో చిత్తు చేసి భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.[24][25]
విభిన్న ఛాంపియన్‌లు (1987–1996)
[మార్చు]భారత, పాకిస్తాన్‌లు సంయుక్తంగా 1987 టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. మొదటిసారిగా ఈ పోటీ ఇంగ్లండ్ వెలుపల జరిగింది. ఇంగ్లండ్ వేసవితో పోల్చితే భారత ఉపఖండంలో పగటి వేళలు తక్కువగా ఉన్నందున ఆటలు ఒక ఇన్నింగ్స్‌కు 60 నుండి 50 ఓవర్లకు తగ్గించారు. అదే ఇప్పటికీ ప్రమాణంగా ఉంది.[26] 2019 ఎడిషన్ ఇంగ్లండ్ న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[27][28]
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన 1992 ప్రపంచ కప్‌లో, రంగు దుస్తులు, తెల్లటి బంతులు, డే/నైట్ మ్యాచ్‌లు, ఫీల్డింగ్ పరిమితి నియమాలకు మార్పుల వంటి అనేక మార్పులు వచ్చాయి. వర్ణవివక్ష పాలన పతనంతో, అంతర్జాతీయ క్రీడల బహిష్కరణ ముగిసి, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు మొదటిసారి ఈ ఈవెంట్‌లో పాల్గొంది.[29] టోర్నమెంట్‌లో నిరాశాజనకమైన ఆరంభాన్ని అధిగమించిన పాకిస్తాన్, చివరికి ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను 22 పరుగుల తేడాతో ఓడించి విజేతగా నిలిచింది.[30]
1996 ఛాంపియన్‌షిప్‌ను భారత ఉపఖండంలో రెండవసారి నిర్వహించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లలో కొన్నింటికి శ్రీలంక ఆతిథ్యం ఇచ్చింది.[31] సెమీ-ఫైనల్‌లో, ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, శ్రీలంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 120 పరుగుల వద్ద ఎనిమిది వికెట్లు కోల్పోయిన దశలో భారత ప్రదర్శనకు నిరసనగా ప్రేక్షకులలో అశాంతి చెలరేగడంతో శ్రీలంకను విజేతగా ప్రకటించారు.[32] లాహోర్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాను ఏడు వికెట్ల తేడాతో ఓడించి శ్రీలంక తమ తొలి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది.[33]
ఆస్ట్రేలియా వరసగా మూడుసార్లు (1999–2007)
[మార్చు]1999లో, ఈ ఈవెంట్‌ను ఇంగ్లాండ్ నిర్వహించింది. కొన్ని మ్యాచ్‌లు స్కాట్లాండ్, ఐర్లాండ్, వేల్స్, నెదర్లాండ్స్‌లో కూడా జరిగాయి.[34][35] ప్రపంచకప్‌లో పన్నెండు జట్లు పోటీపడ్డాయి. మ్యాచ్ చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 6 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తమ లక్ష్యాన్ని చేరుకుని సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది.[36] ఆ తర్వాత వారు దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీ-ఫైనల్‌లో టై అయిన మ్యాచ్‌తో ఫైనల్‌కు చేరుకున్నారు. అక్కడ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ లాన్స్ క్లూసెనర్, అలన్ డొనాల్డ్ మధ్య భాగస్వామ్యంలో డొనాల్డ్ తన బ్యాట్‌ను వదిలివేసి మిడ్-పిచ్‌లో రనౌట్ అయ్యాడు. ఫైనల్‌లో ఆస్ట్రేలియా పాకిస్థాన్‌ను 132 పరుగులకే ఆలౌట్ చేసి 20 ఓవర్లలోపే ఎనిమిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.[37]
దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యాలు 2003 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఈవెంట్‌లో పాల్గొనే జట్ల సంఖ్య పన్నెండు నుండి పద్నాలుగుకి పెరిగింది. శ్రీలంక, జింబాబ్వేపై కెన్యా సాధించిన విజయాలు, భద్రతా కారణాల దృష్ట్యా కెన్యాలో ఆడేందుకు నిరాకరించి న్యూజిలాండ్ జట్టు ఆట వదిలేసుకోవడం వగైరాలతో కెన్యా సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఇది ఒక అసోసియేట్ సభ్య దేశం ప్రపంచ కప్‌లో సాధింంచిన అత్యుత్తమ ఫలితం.[38] ఫైనల్‌లో ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి, భారత్‌ను 125 పరుగుల తేడాతో ఓడించింది. ఫైనల్‌లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద స్కోరు.[39][40]
2007 లో, టోర్నమెంట్‌ను వెస్టిండీస్ నిర్వహించింది. పదహారు జట్లు పోటీపడ్డాయి.[41] గ్రూప్ దశలో తొలి ప్రపంచ కప్ ఆడుతున్న ఐర్లాండ్‌తో పోటీలో పాకిస్తాన్ ఓటమి పాలైన తరువాత, పాకిస్తాన్ కోచ్ బాబ్ వూల్మెర్ తన హోటల్ గదిలో శవమై కనిపించాడు.[42] జమైకా పోలీసులు మొదట్లో వుల్మెర్ మరణంపై హత్య అనే కోణంలో విచారణను ప్రారంభించారు. అయితే అతను గుండె వైఫల్యంతో మరణించాడని ధ్రువీకరించారు.[43] ఆస్ట్రేలియా, ఫైనల్‌లో శ్రీలంకను 53 పరుగుల (D/L) తేడాతో ఓడించింది. ప్రపంచ కప్‌లో తమ అజేయమైన రికార్డును 29 మ్యాచ్‌లకు విస్తరించింది. మూడు వరుస ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకుంది.[44]
ఆతిథ్య దేశాల విజయం (2011–2019)
[మార్చు]భారతదేశం, శ్రీలంక, బంగ్లాదేశ్ కలిసి 2011 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టుపై తీవ్రవాద దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆతిథ్య హక్కులను తీసేసారు. పాకిస్తాన్‌లో జరిగేలా షెడ్యూల్ చేయబడిన ఆటలను ఇతర ఆతిథ్య దేశాలకు కేటాయించారు.[45] ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను పద్నాలుగుకు తగ్గించారు.[46][47] 1999 మే 23 న మొదలై, 35 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా రికార్డు 2011 మార్చి 19 న పాకిస్తాన్‌తో జరిగిన చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ముగిసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి భారత్ తన రెండవ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుని, స్వదేశంలో ప్రపంచ కప్ గెలిచిన మొదటి దేశంగా భారత్ నిలిచింది.[46] ప్రపంచకప్ ఫైనల్‌లో రెండు ఆసియా దేశాలు తలపడడం కూడా ఇదే తొలిసారి.[48]
2015 ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చాయి. పాల్గొనేవారి సంఖ్య పద్నాలుగు. టోర్నమెంట్‌లో మొత్తం మూడు విజయాలతో ఐర్లాండ్ అత్యంత విజయవంతమైన అసోసియేట్ దేశంగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను ఓడించి తమ తొలి ప్రపంచకప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఐదోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.[49]
2019 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్, వేల్స్‌లు ఆతిథ్యం ఇచ్చాయి. పాల్గొనేవారి సంఖ్య 10కి తగ్గింది. వర్షం కారణంగా రిజర్వ్ డేకి వెళ్ళిన మొదటి సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించింది.[50] రెండో సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఫైనలిస్టులు ఎవరూ ఇంతకు ముందు ప్రపంచ కప్ గెలవలేదు. ఫైనల్‌లో, 50 ఓవర్ల తర్వాత స్కోర్లు 241 వద్ద టై అవడాంతో, మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. అక్కడ కూడా స్కోర్లు 15 వద్ద టై అయ్యాయి. ఇంగ్లండ్ బౌండరీల సంఖ్య న్యూజిలాండ్ కంటే ఎక్కువగా ఉండడంతో, ఇంగ్లండ్ ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.[51][52]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ICC announces expansion of global events". ఐసిసి. Retrieved 2 June 2021.
- ↑ "World Cup Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 6 April 2023.
- ↑ "World Cup Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 6 April 2023.
- ↑ ICC Cricket World Cup: About Archived 1 జూన్ 2013 at the Wayback Machine – International Cricket Council. Retrieved 30 June 2013.
- ↑ "The road to World Cup 2023: how teams can secure qualification, from rank No. 1 to 32". ESPN Cricinfo. Retrieved 14 August 2019.
- ↑ Martin Williamson. "The oldest international contest of them all". ESPN. Archived from the original on 15 July 2013. Retrieved 5 July 2012.
- ↑ Martin Williamson. "The oldest international contest of them all". ESPN. Archived from the original on 5 June 2013. Retrieved 5 July 2012.
- ↑ "1st Test Scorecard". ESPNcricinfo. 15 March 1877. Archived from the original on 12 February 2009. Retrieved 28 January 2007.
- ↑ "Olympic Games, 1900, Final". ESPNcricinfo. 19 August 1900. Archived from the original on 26 December 2014. Retrieved 9 September 2006.
- ↑ Purohit, Abhishek (10 August 2021). "Will Cricket Bat Again at the Olympics? Know Process for Inclusion at LA28". International Olympic Committee. Retrieved 5 December 2021.
- ↑ "The original damp squib". ESPNcricinfo. 23 April 2005. Archived from the original on 16 October 2007. Retrieved 29 August 2006.
- ↑ "The run-out that sparked a riot". ESPNcricinfo. 30 October 2010. Archived from the original on 22 October 2014. Retrieved 18 February 2015.
- ↑ "England vs West Indies Scorecard 1928 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-05.
- ↑ "New Zealand vs England Scorecard 1929/30 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-05.
- ↑ "England vs India Scorecard 1932 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-05.
- ↑ "Pakistan vs India Scorecard 1952/53 | Cricket Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-07-05.
- ↑ "The History of World Cup's". cricworld.com. Archived from the original on 13 March 2007. Retrieved 19 September 2006.
- ↑ Browning (1999), pp. 5–9
- ↑ 19.0 19.1 Browning (1999), pp. 26–31
- ↑ "50 fascinating facts about World Cups – Part 1". Cricbuzz (in ఇంగ్లీష్). 22 January 2015. Archived from the original on 21 February 2019. Retrieved 21 February 2019.
- ↑ "ICC Trophy – A brief history". ESPNcricinfo. Archived from the original on 26 November 2006. Retrieved 29 August 2006.
- ↑ 22.0 22.1 Browning (1999), pp. 32–35
- ↑ Browning (1999), pp. 61–62
- ↑ "The World Cup – A brief history". ESPNcricinfo. Archived from the original on 28 March 2008. Retrieved 7 December 2006.
- ↑ Browning (1999), pp. 105–110
- ↑ Browning (1999), pp. 111–116
- ↑ Browning (1999), pp. 155–159
- ↑ "Cricket World Cup 2003". A.Srinivas. Archived from the original on 2 October 2008. Retrieved 28 January 2007.
- ↑ Browning (1999), pp. 160–161
- ↑ Browning (1999), pp. 211–214
- ↑ Browning (1999), pp. 215–217
- ↑ "1996 Semi-final scoreboard". cricketfundas. Archived from the original on 7 November 2006. Retrieved 28 January 2007.
- ↑ Browning (1999), pp. 264–274
- ↑ Browning (1999), p. 274
- ↑ French Toast (2014). Cricket World Cup: A Summary of the Tournaments Since 1975. Smashwords. ISBN 9781311429230. Archived from the original (e-book) on 26 June 2019. Retrieved 11 December 2014.
- ↑ Browning (1999), pp. 229–231
- ↑ Browning (1999), pp. 232–238
- ↑ "Washouts, walkovers, and black armband protests". ESPNcricinfo. Archived from the original on 30 August 2015. Retrieved 30 August 2015.
- ↑ "Ruthless Aussies lift World Cup". London: BBC. 23 March 2003. Archived from the original on 28 March 2015. Retrieved 29 January 2007.
- ↑ "Full tournament schedule". London: BBC. 23 March 2003. Archived from the original on 18 February 2007. Retrieved 22 February 2007.
- ↑ "Australia triumph in a tournament to forget". ESPNcricinfo. Archived from the original on 6 February 2012. Retrieved 15 July 2014.
- ↑ "Bob Woolmer's death stuns cricket world". ESPNcricinfo. Archived from the original on 25 October 2012. Retrieved 4 December 2014.
- ↑ "Bob Woolmer investigation round-up". Cricinfo. Archived from the original on 16 May 2007. Retrieved 6 May 2007.
- ↑ "Australia v Sri Lanka, World Cup final, Barbados". Cricinfo. 28 April 2007. Archived from the original on 24 March 2008. Retrieved 6 May 2007.
- ↑ "No World Cup matches in Pakistan". BBC. 18 April 2009. Archived from the original on 18 April 2009. Retrieved 15 July 2014.
- ↑ 46.0 46.1 "India end a 28-year-long wait". ESPNcricinfo. Archived from the original on 25 August 2013. Retrieved 29 October 2014.
- ↑ "Pakistan top group after ending Australia's unbeaten World Cup streak". CNN. 20 March 2011. Archived from the original on 13 February 2015. Retrieved 13 February 2015.
- ↑ "ICC Cricket World Cup". ESPN. Retrieved 2 January 2022.
- ↑ "Cricket World Cup 2015: Australia crush New Zealand in final". BBC Sport. 29 March 2015. Archived from the original on 29 March 2015. Retrieved 29 March 2015.
- ↑ "India vs New Zealand Highlights, World Cup 2019 semi-final: Match defers to reserve day". Times of India. 9 July 2019. Archived from the original on 11 July 2019. Retrieved 15 July 2019.
- ↑ "Epic final tied, Super Over tied,England win World Cup on boundary count". 14 July 2019. Archived from the original on 15 July 2019. Retrieved 15 July 2019.
- ↑ Fordyce, Tom (14 July 2019). "England win Cricket World Cup: A golden hour ends in a champagne super over". BBC Sport. Archived from the original on 14 July 2019. Retrieved 15 July 2019.