భారతదేశానికి ఉన్న పేర్లు

వికీపీడియా నుండి
(Names for India నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
భారతీయ ఉపఖండం భౌగోళిక ప్రాంతం.

రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి,  అధికారిక, జనరంజకమై రెండు ప్రధాన పేర్లు వాడుకలో ఉన్నాయి . “ఇండియా”, “ భారత్". ఇవి రెండూ చారిత్రికంగా ప్ర్రాముఖ్యత కలిగి ప్ర్రాచుర్యంలో ఉన్నాయి. భారతదేశ రాజ్యాంగంలో మొదటి నిబంధనలో, “ఇండియా దటీస్ భారత్,.." అని చెప్తూ, “ఇండియా”, “భారత్” అనే పేర్లని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి సమానంగా అధికారిక సంక్షిప్త పేర్లుగా  చెప్పబడ్డాయి. మూడవ పేరు “హిందూస్థాన్”, కొన్నిసార్లు భారతీయులు తాము మాట్లాడే వాడుక భాషలో ఉపఖండంలోని ఆధునిక భారతీయ రాష్ట్రాల్లో అధిక భాగాలో  కలిగి ఉన్న ప్రత్యామ్నాయ పేరు. “భారత్”, “హిందూస్థాన్”; లేదా “భారతదేశం”; అనే పేర్ల వాడుక సంభాషణా సందర్భం, భాష మీద ఆధారపడి ఉంటుంది.

ఇండియాలోని చాలా భాషలలో “భారత్” అనే పేరు దుష్యంతుడి కుమారుడు భరత లేదా రిషభ కుమారుడు భరత పేరు నుండి తీసుకున్నట్టు  పేర్కొనబడింది. ఉత్తర భారతదేశంలోని గంగాతీరలోయల యొక్క పశ్చిమ భాగాని మాత్రమే “భారత్”గా ప్రస్తావించబడింది, కానీ తరువాత భారత ఉపఖండం, గ్రేటర్ ఇండియా ప్రాంతాలో “ఇండియా” పేరుతో పాటు “భారత్” మరింత విస్తృతంగా ఉపయోగించబడింది. ఈ రోజు ఇది సమకాలీన రిపబ్లిక్ అఫ్ ఇండియాని  సూచిస్తుంది. “ఇండియా “ అనే పేరు ప్రథమంగా సింధూ నది (ఇండస్ నది) పేరు నుండి ఉద్భవించింది, హెరోడోటస్ కాలం (4 వ శతాబ్దం BCE) నుండి గ్రీకులో ఉపయోగించబడింది.ఈ పదం 9 వ శతాబ్దం ప్రారంభంలో ప్రాచీన ఆంగ్లంలో కనిపించింది, 17 వ శతాబ్దంలో ఆధునిక ఆంగ్ల భాషలో పునఃముద్రించబడింది.

“ఆర్యావర్తం”ని  భారతదేశం మరొక పేరుగా అంగీకరించబడినప్పటికీ, ఇంతకు ముందు ఇది ఇండో-గంగా ప్రాంతాల పేరుగా మాత్రమే తెలుసు. మనుస్మృతి ప్రకారామ్ ఉత్తర భారతదేశంని (వింధ్యా పర్వతాలకు ఉత్తరదిశగా వున్నభారతదేశ ప్రాంతము) కూడా ఆర్యవర్తం (సంస్కృతం: आर्यावर्त, ఆర్యులు నివాసం) గా చెప్పబడినది

ఇండియా

[మార్చు]
ప్రపంచపటంలో హెరోడోటస్ దృష్టిలో భారతదేశం దిగువ ఇండస్ హరివాణం.

ఇండియా అనే పేరు ఆంగ్ల పదం,  గ్రీకు బాషా రచన “ఇండికా” (సిఫ్ మెగాస్టేన్స్ రచించిన ఇండికా) లేదా ఇండియా (Ἰνδία), లాటిన్ భాష లిప్యంతరీకరణ.

ఈ పేరు చివరకు సంస్కృత సింధు  (सिन्धु) నుండి వచ్చింది, ఇది ఇండస్ నది,  ఇండస్ బేసిన్ క్రింది భాగంలో వున్న దేశం పేరు (ఆధునిక సింధ్, పాకిస్థాన్). ప్రాచీన పర్షియన్ భాషలో సింధుకి సమానమైన పదం హిందూ. డారియస్ ఒకటి (పర్షియన్ రాజు ), 516 బిసిఈలో సింధ్ ని  స్వాధీనం చేసుకున్నాడు. అప్పటినుండి పర్షియా సమానమైన హిందూస్ అనే పేరుని దిగువ ఇండస్ బేసిన్ రాజ్యానికి ఉపయోగించారు. పెర్షియన్ చక్రవర్తికి కొరకుసింధూ నదిని అన్వేషించిన స్కైలాక్స్ అఫ్ కర్యాండా (గ్రీకు పరిశోధకుడు) బహుశా  ఈ పెర్షియన్ పేరుని గ్రీక్ భాషకి పరిచయం చేసి వుండచ్చు. ఇండోస్ అనే పేరుతో ఇండస్ నది గురించి, “ఆన్  ఇండియన్” అనే పదము హేరోడోటస్ (గ్రీకు చారిత్రకారుడు )  రచించిన భౌగోళిక శాస్త్రంలో కనిపిస్తాయి". ఆసియా మైనర్ (అంటోలియా దేశం) లో  మాట్లాడే గ్రీకు మాండలికం వలన ఒత్తుఅక్షరం (హ/హి )  / h / కోల్పోయింది. హెరాడోటస్ తనకి వున్నా పరిమిత భౌగోళిక శాస్త్ర జ్ఞానంతో, దిగువ ఇండస్ (సింధు) ప్రాంతం  నుంచి తూర్పు పర్షియా వరకు నివసిస్తున్న ప్రజలందరినీ “ఇండియన్” అనే పదంతో సర్వజనికరించాడు

అలెగ్జాండర్ కాలం నాటికి, కోయిన్  గ్రీక్ (ఒక మాండలికం) భాషలో ఇండియా, ఇండస్ తరువాతి ప్రాంతాన్ని సూచించింది. అలెగ్జాండర్ యొక్క సహచరులు, ఉత్తర భారతదేశంని గంగా డెల్టా (గంగారిదై ) వరకు గుర్తించారు. తర్వాత, మెగాస్టేన్స్ భారతదేశంకి దక్షిణ ద్వీపకల్పంని కూడా కలిపారు.

లాటిన్ పదం ఇండియా మొదట వాడినది లూసియాన్ (2వ శతాబ్దం ఏ డి). ఇండియా,  ప్రాచీన ఆంగ్ల భాషలో కింగ్ ఆల్ఫ్రెడ్ అనువదించిన పౌలస్ ఓరోసిస్ లో వాడబడింది. మధ్య ఆంగ్లంలో ఫ్రెంచ్ ప్రభావం వలన యఁడే లేక ఇండిగా పలకబడి తరువాతి ఆధునిక ఆంగ్ల భాషలో “ఇండీ”గా రూపాంతరం చెందింది. “ఇండియా” అనే పేరు 17వశతాబ్దం నుండి మళ్ళి ఆంగ్లములో వాడుకలోకి వచ్చింది. లాటిన్, స్పానిష్ లేదా పోర్చుగీస్ యొక్క ప్రభావం వలన కావచ్చు

సంస్కృత ఇన్డు "డ్రాప్ ( సోమ యొక్క )", చంద్రుడికి కూడా ఒక పదం, సంబంధంలేనిది, కానీ కొన్నిసార్లు తప్పుగా అనుసంధానించబడింది.

హిందూ / హిందూస్థాన్

[మార్చు]
𓉔𓈖𓂧𓍯𓇌



<br /> Hndw Ꜣ -y



<br /> 500 BC లో, డారియస్ I విగ్రహాన్ని ఈజిప్షియన్ హైరోగ్లిఫ్స్ లో వ్రాసిన "ఇండియా".[1]

హిందూ (పర్షియన్: هندو), హింద్ (పెర్షియన్: : هند‎) పదము ఇండో-ఆర్యన్ / సంస్కృతం సింధు నుండి వచ్చింది (సింధు నది లేదా దాని ప్రాంతం). సుమారు 516 BCE లో అకేమెనిడ్ చక్రవర్తి డారియస్ I సింధూ లోయను స్వాధీనం చేసుకున్నాడు, దానిపై సింధు  యొక్క అకేమెనిడ్ సమానం, “హిందూష్” ; ( హ్ -ఐ -దు -యూ -స్ ) దిగువ ఇండస్ బేసిన్ కొరకు ఉపయోగించబడింది. ఈ  పేరు ఈజిప్టు లోని అకేమెనిడ్ ప్రాంతంలోని  దారిస్ వన్ శిల్పంఫై చెక్కబడి ఆ ప్రాంతంలో సిర్కా 500 బి సి ఈ  నుంచి తెలిసిన పదం.

ఒకటవ శతాబ్ద సి ఈ  కాలంలో మధ్యపర్షియాలో ఒక దేశం లేక ప్రదేశము అని తెలిపే ప్రత్యయం  - స్థాన్ (పర్షియన్: ستان) చేర్చి హిందుస్థాన్ గా ఏర్పడింది. అలాగ  సింధ్ ప్రాంతాన్నిహిందుస్థాన్ అని సస్సనిద్ చక్రవర్తి, షాఫుర్ ఒకటి,  262 సి ఈలో నక్ష్-ఎ-రుస్తాం అనే శిలాశాసనంలో రాసారు.

చక్రవర్తి బాబర్ చెప్పినట్టు, "తూర్పు, దక్షిణ, పశ్చిమాన ఇది మహా సముద్రంతో సరిహద్దుగా ఉంటుంది." [2] హింద్ అనే పదాన్నిఅరబిక్ భాషలో ఒక కచ్చితమైన పద రూపం అల్-హింద్  (الهند) అని ఇండియాకి ప్రతామ్నాయంగా వాడబడింది. దీనికి ఉదాహరణ 11వ శతాబ్దంపు గ్రంథం తారిఖ్ ఆల్  - హింద్ ( ఇండియా చరిత్ర). హింద్ అనేపదాన్నిప్రాచిన పదంగా భావించినప్పటికీ భారతదేశంలో  అప్పడప్పుడు వాడుకలో, జై హింద్, హింద్ మహాసాగర్ (హిందూ మహాసముద్రానికి ప్రామాణిక హిందీ పేరు)  పదాలు వాడుకలో ఉన్నాయి.

ఈ రెండు పేర్లు 11 వ శతాబ్దపు ఇస్లామిక్ విజయాల నుండి పెర్షియన్, అరబిక్ భాషలలో ప్రస్తుతము ఉన్నాయి ఢిల్లీ సుల్తానేట్, మొఘల్ కాలపు పాలకులు ఢిల్లీ చుట్టూ కేంద్రీకృతమైన వారి భారత రాజ్య భూభాగాన్ని, “హిందూస్తాన్”; (ہندوستان; हिन्दुस्तान) అని పిలుచుకొన్నారు. సమకాలీన పెర్షియన్, ఉర్దూ భాషలో, హిందూస్తాన్ అనే పదాన్ని ఇటీవలే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనే అర్థం ఆపాదిస్తున్నారు. అరబిక్ భాష లోకూడా అల్-హింద్ ని రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు అర్థంగా చూపుతున్నారు.

"హిందూస్థాన్", హిందూ స్వయంగా, 17 వ శతాబ్దంలో ఆంగ్ల భాషలోకి ప్రవేశించింది. 19 వ శతాబ్దంలో, ఆంగ్లంలో ఉపయోగించిన పదం ఉపఖండాన్ని సూచిస్తుంది.   “హిందూస్థాన్”, “ ఇండియా” ; బ్రిటీష్ రాజ్ సమయంలో  ఏకకాలంలో ఉపయోగించబడినవి. నేడు, “హిందూస్థాన్”; భారతదేశం యొక్క అధికారిక పేరుగా ఉపయోగంలో లేదు.

ఆర్యావర్తం

[మార్చు]

ప్రాచీన సంస్కృత ఇతిహాసాల ప్రకారం ఇండో- ఆర్యన్స్ సంస్కృతి సంప్రదాయాలు పాటించే ప్రాంతం, ఉత్తర భారతదేశాన్నిఆర్యావర్త అని పిలుస్తారు. మను స్మృతి (2.22) లో,  “తూర్పు (బంగాళాఖాతం) నుండి పాశ్చాత్య సముద్రం (అరేబియా సముద్రం) వరకు హిమాలయాల నుండి వింధ్య శ్రేణుల  మధ్య ఉన్న ప్రాంతము” ఆర్యావర్తము.

భారత

[మార్చు]
శ్రావణబెళగోలాలో భరత చక్రవర్తి విగ్రహం. జైన పురాణంలో, అతను మొదటి చక్రవర్తి లేదా సార్వత్రిక చక్రవర్తి.

ఇండియా అనే దేశంకి భారత అనే పేరు 1950 [3]లో ఎంపిక చేయబడింది.

భరత లేదా భరత-వర్ష (భరత-వర్ష) అనే పేరును దుష్యాంతుడి  కుమారుడు భరత లేదా రిషభ యొక్క కుమారుడు భారత నుండి పుట్టింది. భారత అనే పేరు రిషభ కుమారుడు భారత నుండి పుట్టిందని వేర్వేరు పురాణాలు చెబుతున్నాయి. కొన్ని పురాణాత్మక గద్యాలలో భరత అనే పేరు రిషభ యొక్క పూర్వీకుడు మనువుకు మరో పేరు అని, ఆ పేరు నుండి ఉద్భవించిందని చెపుతారు. మహాభారత పురాణంలోని కొన్నిగద్యల్లో,  భారత ప్రజలు దుశ్యంతుడి కుమారుడైన భరతుడి వారసులని వర్ణించారు

ఖారవేల మహారాజు (మొదటి శతాబ్దం బిసిఈ ) హాతిగుంఫా శాసనాలలో మొట్టమొదటిసారి భారతవర్ష అనే పదం భౌగోళిక సరిహద్దు తెలుపుతూ మగధ రాజ్యం పశ్చిమాన గంగా తీరా ప్రాంతంగా చెప్పబడింది.  సంస్కృత పురాణమైన, మహాభారతంలో (200 BCE నుండి 300 CE), ఉత్తర భారతదేశంలో ఆవరించుకొన్నఒక పెద్ద ప్రాంతంని భారత వర్ష అని పిలిచారు, అయితే డెక్కన్, దక్షిణ భారతదేశం యొక్క చాలా భాగం  మినహాయించబడ్డాయి.

భారత అనే పేరు భారతీయ ఉపఖండంలోనిమరియు భారత రిపబ్లిక్  లోని కొంతమంది ప్రజల స్వీయ-పరిగణనలో ఉపయోగించబడింది. భారతదేశం యొక్క అధికారిక సంస్కృత పేరు భారత, భారత గణరాజ్యాలో కనిపిస్తుంది.ఈ పేరు పురాతన హిందూ పురాణాలలో ఒక భూభాగాన్ని భరత  వర్ష (సంస్కృతం: भारतवर्ष, lit భారత యొక్క దేశము) అని పిలుస్తూ, ఆ ప్రదేశాన్నిమిగతా రాజ్యాలు లేక ఖండాల నుండి వేరు చేసి చూపారు. ఉదాహరణకి, వాయు పురాణంలో “భారతవర్ష మొత్తం జయించేవాడు సామ్రాట్ గా ప్రసిద్ధి చెందుతాడని(వాయూ పురాణ 45, 86)” చెప్పబడింది.

సంస్కృత పదం భారత  అనేది భారత యొక్క వృద్ధి వ్యుత్పన్నం, ప్రథమంగా అగ్ని సార్థకనామము. ఈ పదం సంస్కృతం రూట్ bhr అనే శబ్ద నామవాచకం -, ”భరించడం  / మోసుకెళ్ళటం”; శబ్దార్థ ప్రకారమైన అర్థం భరించుట (అగ్నిని). రూట్ brr ఆంగ్ల భాష కుటుంబానికి చెందిన క్రియాపదము సహించు, లాటిన్ ఫెరోకు సహాయోగం.ఈ పదానికి మరో అర్థం “జ్ఞానం కోసం అన్వేషణలో నిమగ్నమైన వ్యక్తి”. భరతో, భారతదేశం యొక్క ఎస్పెరాంటో పేరు.

పురాణాలలో చెప్పబడినట్టు, ఈ దేశం భారత వర్ష అని రిషభ రాజు కుమారుడైన భరతుడి పేర పిలువబడుతుంది. విష్ణు పురాణంలో (2,1,31), వాయు పురాణం (33,52), లింగ పురాణం (1,47,23), బ్రహ్మాండ పురాణం (14,5,62), అగ్ని పురాణం (107,11- 12), స్కంద పురాణం, ఖండం  (37,57), మార్కండేయ పురాణం (50,41), అన్నిటిలో భారతవర్ష అన్నపేరుతోనే పిలవబడింది.

విష్ణు పురాణంలో వివరించినట్టు:

ऋषभो मरुदेव्याश्च ऋषभात भरतो भवेत्
भरताद भारतं वर्षं, भरतात सममतिस्त्वभूत्
మరుదేవి పుత్రుడు రిషభ, రిషభుడి  పుత్రుడు భరతుడు, భరతుడి నుండి ఉద్భవించింది భరతవర్ష , భరతుడు మంచి వంశ గౌరవముగల పురుషుడు - విష్ణు పురాణం (2,1,31)
ततश्च भारतं वर्षमेतल्लोकेषुगीयते
भरताय यत: पित्रा दत्तं प्रतिष्ठिता वनम (विष्णु पुराण, 2,1,32)
భరతుడి తండ్రి, భరతుడికి రాజ్యము అప్పగించి వనముకు వెళ్లి సన్యసించాడు. అలనాటి నుండి భరతుడి రాజ్యం భారతవర్ష అని  పిలువబడినది..[4]-విష్ణు పురాణం (2,1,32)
వుత్తరం యత్సాముద్రస్య హిమద్రేస్సైవ దక్షిణం వర్షం తద్భారతమ్ నామ భారతి యత్ర సంతతి
उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् । वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।। ఉత్తరాన సముద్రం, దక్షిణాన హిమ పర్వతాలు కలిగిన దేశం (వర్షం) భారతం, అక్కడ నివసించేవారు భరతుడి వారసులు.
- విష్ణు పురాణం

శ్రీమద్భాగవతంలో పేర్కొన్నట్టు  (ఖండ 5, అధ్యాయం 4) అతడి (రిషభ) అతని వలే వుండు నూర్గురు పుత్రులని కన్నాడు.

“అతను (భరత) ఉత్తమ లక్షణాలను కలిగి ఉన్నాడు అతని ప్రజలచే ఈ భూమిని భరత-వర్షా అని పిలవబడినది”.

భరతులు ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఒక వేద జాతి, ముఖ్యంగా పది రాజుల యుద్ధంలో పాల్గొన్నారు.

భరతుడి రాజ్యం భరతవర్ష అని మహాభారతంలో (ప్రధాన భాగాన్ని భారత అని పిలుస్తారు), తరువాతి గ్రంథాల్లో చెప్పబదినది. కొన్ని మూలగ్రంధాల ప్రకారం, దుష్యంతుడు శకుంతలల కుమారుడైన భరత అనే రాజు పేరు, వర్ష అంటే భూభాగం లేక ఒక ఖండం.

భరత ఖండ (లేదా భరత క్షేత్రం ) అనే పదం హిందూ గ్రంథాలైన వేదాలు, మహాభారతం, రామాయణం, పురాణాల్లో  భౌగోళిక ప్రాంతాన్ని, ఇప్పటి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, శ్రీ లంక, మయన్మార్-  ఇతర దక్షిణాసియా విస్తృత భాగాలు వర్ణించారు.

జంబూద్వీపం

[మార్చు]
250 BC లో సిర్కా సిస్కా అశోకా ఆఫ్ సహస్రామ్ మైనర్ రాక్ ఎడిట్లో "భారతదేశం" ( బ్రాహ్మి లిపి ) అనే పేరు కోసం జమ్బుడిపేసి అనే పేరు.[5]

జంబూద్వీపం ( సంస్కృతం : जम्बुद्वीप Jambu-dvīpa, అర్ధం "బెర్రీ ఐల్యాండ్") పురాతన గ్రంథములనులో భారతదేశం యొక్క పేరుగా భారత అధికారిక నామంగా మారింది ముందు ఉపయోగించబడింది.

జంబుద్వీప (సంస్కృతం: जम्बुद्वीप జంబు - ద్వీప, లిట్ “బెర్రీ ఐలాండ్”) పురాతన గ్రంథాలలోభారతదేశం యొక్క పేరుగా ఉపయోగించబడింది, ఇండియా దేశానికి భారత అనే పేరు అధికారిక నామం అయ్యేవరకు. ఆంగ్ల నామం అయిన ”ఇండియా” పరిచయం ముందు అనేక ఆగ్నేయ ఆసియా దేశాలలో జంబూద్వీప అనే పేరు ఉత్పన్నమై  భారతదేశం యొక్క చారిత్రక నామంగా వాడుకలో ఉంది. థాయిలాండ్, మలేషియా, జావా, బాలిలలో ఈ ప్రత్యామ్నాయ పేరు ఇప్పటికీ భారత ఉపఖండంని  వర్ణించడానికి అప్పుడప్పుడూ ఉపయోగించబడుతోంది అలాగే మొత్తం ఆసియా ఖండంని సూచిస్తుంది.

నాభివర్షం

[మార్చు]

మూలగ్రంధాల ప్రకారం భారతదేశం భారతవర్ష అని పిలువబడే ముందు నాభివర్షంగా ప్రసిద్దమైనది సంస్కృత : नाभिवर्ष, Nabhi యొక్క లిట్ భూమి). నాభి అనే రాజు భారత విశ్వసౌర్వభౌమత్వ దేశానికి  చక్రవర్తి, అరిహంత్ రిషభకి తండ్రి (జైనిజం).

తియాన్ఝు

[మార్చు]

టియాంజు, తెంజికు (చైనీస్, జపనీస్: 天竺) (ప్రథమ ఉచ్చరింపు జియాన్-ట్’ జుక్) అనే చారిత్రక పేర్లు తూర్పు ఆసియాలో భారతదేశంకి వాడుకలోవున్నాయి. ఈ  పేర్లు పర్షియన్ హిందూ (ఇది సంస్కృతం నుండి ఉద్భవించింది సింధు, సింధు నది యొక్క స్వభావికమైనా పేరు) పదానికి చైనీస్ లిప్యంతరీకరణ. సింధు జ్యూఅందు (身毒) యొక్క చైనీస్ లిప్యంతరీకరణలలో ఒకటి టియాంజు. ఈ పేరు సీమా కీయాన్ యొక్క షిజి  అండ్ టిఅన్డు (天篤) లో, హౌ హ్యాంషు (బుక్ ఆఫ్ ది లేటర్ హాన్) లలో కనిపిస్తుంది. యిన్జేజియా (印 特伽) హిందూ యొక్క మరో లిప్యంతరీకరణ అయిన కుచేయాన్ ఇన్దక నుండి వచ్చింది. ఫ్యాన్ యే (398-445) యొక్క హౌ హ్యాంషులో  “జియు జువాన్” (ఉత్తర ప్రాంతాల చరిత్ర) అనే సంకలనంలో టియాంజు గురించి చెప్పారు:

“టియాంజు ,  శెందు అని కూడా పిలువబడే దేశం యుజి కిఆగ్నేయ దిశగా కొన్నివేల మైళ్ళ దూరంలోఉంది”. దేశ ఆచారాలు యుజి దేశo మాదిరిగానే ఉంటాయి, ఇది ఒక పెద్ద నది సరిహద్దు, లోతు ప్రాంతం, తడిగా, చాలా వేడిగా ఉంటుంది. ఈ దేశీయులు యుద్ధంలో ఏనుగులపై ప్రయాణం చేస్తారు; యూజిల కన్నాబలహీనంగా ఉన్నారు.వారు ఫుటు బుద్ధుడిని అనుసరిస్తారు, ఇతరులను చంపడానికి లేదా దాడి చేయకూడదు అనేది ఒక ఆచారంగా మారింది.యుజి, గౌఫు రాష్ట్రాలకు పశ్చిమం నుండి, దక్షిణాన వున్నా ఉత్తర సముద్రం వరకు, తూర్పు రాష్ట్రము ఫాంకీ వరకు షెందు భూభాగం.షెందులో అనేక వందల వేర్వేరు పట్టణాలు ఉన్నాయి, ఒక అధిపతి ఆదీనంలో, వేర్వేరు రాష్ట్రాలు వాటి సొంత రాజుని కలిగి పదుల సంఖ్యలో ఉన్నాయి.వారిలో చిన్నచిన్నతేడాలు ఉన్నప్పటికీ అందరూ షెండు అనే ఒక పేరు క్రిందే గుర్తిపబడుతారు యుజి ఆక్రమించుకొని, వారి రాజులను హతమార్చి, వారి ప్రజలను పరిపాలించటానికి ఒక సైనికాధికారిని స్థాపించారు.ఈ భూ భాగం ఏనుగులు, ఖడ్గమృగాలు, తాబేలు షెల్, బంగారం, వెండి, రాగి, ఇనుము, సీసము, తగరాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ దేశానికి పశ్చిమా వున్నడా క్విన్ (రోమన్ సామ్రాజ్యం) తో , ఎక్సోటికా అఫ్ డా క్విన్ తో సంభందాలువున్నవి

టియాజుని ఉటియాజు (五天竺, అనగా  "ఐదు ఇండియాలు") అని చైనీస్ సూచిస్తారు.ఎందుకంటే భారత భూభాగం ఐదు భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి. మధ్య, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతదేశం. సన్యాసి జువాన్జాంగ్ ఇండియాను వూ ఇన్ యిన్  లేదా “ఫైవ్ ఇండ్స్” అని పిలిచారు.; ఈ పదాన్ని జపాన్లో కూడా ఉపయోగిస్తారు, ఇక్కడ దీనిని టెన్జికూ (天竺) అని ఉచ్ఛరిస్తారు.

విదేశీ అరువుపదాలు ఇండో (インド), భారతదేశం ( (インディア) ) కొన్ని సందర్భాల్లో కూడా ఉపయోగించబడతాయి ఆధునిక భారతదేశం కోసం ప్రస్తుత జపనీస్ పేరు విదేశీ అరువు పదం: ఇండో (イ ン ド)

భారతదేశం యొక్క ప్రస్తుత చైనీస్ పదం ఇందు  (印度), మొదట ఏడవ శతాబ్దంలో సన్యాసి, ప్రయాణికుడు జువాన్జాంగ్ ఉపయోగించేను.హిందూ, సింధూ పదాల లాగానే, యిన్ అనే పదాన్ని ఆంగ్ల భాషలో చాలావరకు సాంప్రదాయ చైనీస్ లో ఉపయోగించారు

హొడు

[మార్చు]

హొడు (హిబ్రూ: הֹדּוּ హొడ్డు) అనేది భారతదేశం యొక్క బైబిల్ హీబ్రూ పేరు, యూదు తెనాఖ్ (బైబిల్) లో, క్రిస్టియన్ ఓల్డ్ టెస్టామెంట్ - ఎస్తేర్ బుక్ లో పేర్కొన్నారు.

ఎస్తేరు 1: 1 లో ఆహాసురుస్ (క్సర్క్స్ ) అనే రాజు హోడు (భారతదేశం) నుండి ఇథియోపియా వరకు  127 దేశాలను పాలించినట్టు వర్ణించారు.

భారతదేశం యొక్క చారిత్రక నిర్వచనాలు

[మార్చు]

1500 కు ముందు కొన్ని చారిత్రక నిర్వచనాలు క్రింద ఇవ్వబడ్డాయి.[6]

Year Name Source Definition
c. 440 బి సి ఈ ఇండియా హెరోడోటస్ "భారతదేశం యొక్క తూర్పు దిశలో వున్న ప్రాంతం పూర్తిగా ఇసుక ఉంది, నిజానికి, ఆసియా వాసితులలో, ఎవరికీ తెలిసిందైన, భారతీయులు తూర్పు దిక్కుకి ఉదయించె సూర్యుని దగ్గర నివాసం ఉంటారు."
c.400-300 BCE హొదు ఎస్తేర్ బుక్ (బైబిలు) "అహష్వేరోషుల కాలంలో,అహష్వేరోషు రాజు హొదు (భారతదేశం) నుండి 127 ప్రాంతలు కుష్ (ఇథియోపియా) వరకు పాలించాడు"
300 బి సి ఈ ఆర్యావర్తం వశిష్ట, వశిష్ట ధర్మసుత్ర "పశ్చిమాన [ఆర్యవర్టా కోసం] - సరిహద్దు-నది (సింధు), తూర్పున సూర్యుడు ఉదయించె ప్రాంతము (హిమాలయాలు), చలా వరకు నల్ల జింకలు సంచరించు ప్రాంతం (ఈ రెండు పరిమితుల మధ్య) ."
c. 300 బిసి ఇండియా/ ఇంఢికా మెగస్తనిసు "భారతదేశానికి నాలుగు వైపులా ప్రణాళికలో, తూర్పు ముఖం  వైపు, దక్షిణాన, మహా సముద్రం చుట్టూ, ఆర్కిటిక్ వైపుగా హితోడస్ పర్వతంతో ఉన్న స్కైతి య నివాసితులైన సకాయ్ తెగ  నుండి పర్వత గొలుసు ద్వారా విభజించబడింది, నాల్గవ వైపు పశ్చిమ దిశగా, సింధు సరిహద్దును సూచిస్తుంది, నైలు తర్వాత అన్ని నదులలో అతి పెద్దది లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది "
200 బి సి ఈ జంబూ ద్వీపం చాణక్యుడు

అర్థశాస్త్ర

"ఈ (బ్రహ్మపుత్ర ) జంబూద్విపానికి తూర్పు సరిహద్దు, దాని పశ్చిమ సరిహద్దు సింధు నది మొదలు నుండి, దాని దక్షిణ సరిహద్దు హిందూ మహాసముద్రం లేదా రామ సేతుగా ఉండటం."
మొదటి శతాబ్దం బి సి ఈ, [7] తొమ్మిదొవ శతాబ్దం సి ఈ [8][9] మధ్యలో భరత వర్ష (భరతుడి రాజ్యము) [10][11][12] విష్ణు పురాణం "उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।

वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।" i.e."మహాసముద్రం యొక్క ఉత్తరం వైపు, మంచు పర్వతాల దక్షిణాన ఉన్న దేశం (వర్ష) భరతమ్ అని పిలుస్తారు, అక్కడ భరత యొక్క వారసులు నివసిస్తారు".

100 CE or later భారత విష్ణు పురాణం "उत्तरं यत्समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणम् ।

वर्षं तद् भारतं नाम भारती यत्र संततिः ।।" i.e. "మహాసముద్రం యొక్క ఉత్తరం వైపు, మంచు పర్వతాల దక్షిణాన ఉన్న దేశం (వర్ష) భరతము అని పిలుస్తారు, అక్కడ భరతుడి యొక్క వారసులు నివసిస్తారు."

c. 140. Indoi, Indou Arrian "The boundary of the land of India towards the north is Mount Taurus. It is not still called Taurus in this land; but Taurus begins from the sea over against Pamphylia and Lycia and Cilicia; and reaches as far as the Eastern Ocean, running right across Asia. But the mountain has different names in different places; in one, Parapamisus, in another Hemodus; elsewhere it is called Imaon and perhaps has all sorts of other names; but the Macedonians who fought with Alexander called it Caucasus; another Caucasus, that is, not the Scythian; so that the story ran that Alexander came even to the far side of the Caucasus. The western part of India is bounded by the river Indus right down to the ocean, where the river runs out by two mouths, not joined together as are the five mouths of the Ister; but like those of the Nile, by which the Egyptian delta is formed; thus also the Indian delta is formed by the river Indus, not less than the Egyptian; and this in the Indian tongue is called Pattala. Towards the south this ocean bounds the land of India, and eastward the sea itself is the boundary. The southern part near Pattala and the mouths of the Indus were surveyed by Alexander and Macedonians and many Greeks; as for the eastern part, Alexander did not traverse this beyond the river Hyphasis. A few historians have described the parts which are this side of the Ganges and where are the mouths of the Ganges and the city of Palimbothra, the greatest Indian city on the Ganges. (...) The Indian rivers are greater than any others in Asia; greatest are the Ganges and the Indus, whence the land gets its name; each of these is greater than the Nile of Egypt and the Scythian Ister, even were these put together; my own idea is that even the Acesines is greater than the Ister and the Nile, where the Acesines having taken in the Hydaspes, Hydraotes, and Hyphasis, runs into the Indus, so that its breadth there becomes thirty stades. Possibly also other greater rivers run through the land of India."
c. 650 Five Indies Xuanzang "The circumference of 五印 (Modern Chinese: Wǔ Yìn, the Five Indies) is about 90,000 li; on three sides it is bounded by a great sea; on the north it is backed by snowy mountains. It is wide at the north and narrow at the south; its figure is that of a half-moon."
c. 950. Hind Istakhri "As for the land of the Hind it is bounded on the East by the Persian Sea (i.e. the Indian Ocean), on the W. and S. by the countries of Islām and on the N. by the Chinese Empire... The length of the land of the Hind from the government of Mokrān, the country of Mansūra and Bodha and the rest of Sind, till thou comest to Kannauj and thence passest on to Tibet, is about 4 months and its breadth from the Indian Ocean to the country of Kannūj about three months."
c. 1020 Hind Al-Birūnī "Hind is surrounded on the East by Chín and Máchín, on the West by Sind (Baluchistan) and Kábul and on the South by the Sea."
Hindustan John Richardson, A Smaller Manual of Modern Geography. Physical and Political "The boundaries of Hindustan are marked on every side by natural features; e.g., the Himalayas, on the N.; the Patkoi Mountains, Tippera Hills, &c., on the N.E.; the Sea, on the E., S., and W.; and the Hala, and Sulaiman Mountains, on the N.W."[13]

మూలాలు

[మార్చు]
  1. National Museum of Iran notice
  2. P. 310 Memoirs of Zahir-ad-Din Muhammad Babur: Emperor of Hindustan By Babur (Emperor of Hindustan)
  3. Clémentin-Ojha, Catherine (2014). "'India, that is Bharat…': One Country, Two Names". South Asia Multidisciplinary Academic Journal. 10.
  4. Rishabha/ Rishabdev is First Trithankar(Teacher) of Jainism. He had two sons Bharat and Bahubali.
  5. Inscriptions of Asoka. New Edition by E. Hultzsch (in Sanskrit). 1925. pp. 169–171.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  6. "Archived copy". Archived from the original on 2012-06-28. Retrieved 2012-06-28.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  7. Wilson, H. H. (2006). The Vishnu Purana: A System of Hindu Mythology and Tradition. Cambridge: Read Country Books. p. xii. ISBN 1-84664-664-2.
  8. Rocher 1986, p. 249.
  9. Flood, Gavin (1996). An Introduction to Hinduism. Cambridge: Cambridge University Press. p. 111. ISBN 0-521-43878-0.
  10. A History of Civilization in Ancient India, Based on Sanskrit Literature. In Three Volumes. Volume 3. Buddhist and Pauranik Ages, Romesh Chunder Dutt, Publisher Elibron.com, ISBN 0-543-92939-6, ISBN 978-0-543-92939-6
  11. A Text Book of Social Sciences, Dr. N.N. Kher & Jaideep Aggarwal, Pitambar Publishing, ISBN 81-209-1466-X, ISBN 978-81-209-1466-7
  12. VISHŃU PURÁŃA, BOOK II, CHAP. I, The Vishnu Purana, translated by Horace Hayman Wilson, [1840], at sacred-texts.com
  13. P. 146 A smaller manual of modern geography. Physical and political By John Richardson (Vicar of St. Mary's Hospital, Ilford.)