చర్చ:అయోడిన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తొలగింపు ప్రతిపాదన[మార్చు]

యర్రా రామారావు గారూ, ఈ వ్యాసంలో మూలకం యొక్క లక్షణాలను తెలియజేసే సమాచారపెట్టే ఉంది కదా. మూలక లక్షణాలు తెలియుచున్నవి కదా. తొలగించే కన్నా "విస్తరణ" మూసను ఉంచితే బాగుంటుందని నా అభిప్రాయం.--కె.వెంకటరమణచర్చ 10:09, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:K.Venkataramana గారూ క్షమించాలి.ఇది ఏదైనా ఒక వస్తువు, పదార్థం, ద్రవం, ద్రావకం, ఇలాంటివాటికి చెందిఉండవచ్చు అని అనుకుంటున్నాను.ఇందులో దేనికైనా, ప్రతి దానికి దాని లక్షణాలు, దాని వలన ఉపయోగాలు, నష్టాలు, వీలుంటే పుట్టుపూర్వోత్తరాలు అనే కనీస వివరాలు (ఎందుకు,ఏమిటి ఎలా,ఎప్పుడు) ప్రతిదానికి ఉంటాయనేది మనందరకు తెలిసిన విషయమే.పైన చెప్పిన వివరాలు ఏమీ ఈ వ్యాసంలో వివరించబడలేదు.ఇలాంటివి విక్షనరీలో ఉండదగినవి.తెలుగు వికీపీడియా నియమాల ప్రకారం ఇలాంటి పేజీలు ఇంతకముందు కూడా తొలగించబడ్డాయి,తొలగించబడుతున్నాయి.ఈ పేజీ వికీ డేటా ఐటం ప్రకారం ఆంగ్ల వ్యాసం పరిశీలించగా అందులో కనీస సమాచారంతో పేజీ ఉంది.వ్యాసంలో తగిన విషయసంగ్రహం ఉన్న తరువాతనే, సమాచారపెట్టెలోని విషయాలకు ప్రాధాన్యత ఉందని నా అభిప్రాయం.ఇలాంటి వ్యాసాలు మున్ముందు కొత్త వాడుకరులకు తప్పుడు సంకేతాలుకు మనమే దారి చూపిస్తున్నామనే అభిప్రాయం కలుగుతుంది.ఏది ఏమైనా ఇలాంటి వ్యాసం పేజీలు నేను సృష్టించినా,ఇతరులు సృష్టించినా తెలుగు వికీపీడియాలో ఉండదగినవి కాదని నా అభిప్రాయం.ఇవి ఉండదగినవి అయితే,ఇంతకముందు వీటికన్నా మంచి పేజీలు తొలగించామా అనే అభిప్రాయం నాకనిపిస్తుంది.వ్యాసం పేజీని, పైన వివరింపబడిన ప్రకారం పేజీ సృష్టించిన గౌరవ వికీపీడియను దీనిపై స్పందించి, పేజీని ఒకవారం రోజులలోపు దానిని అభివృద్ధిపరచాలని కోరుచున్నాను.స్పందన లేని యెడలతొలగించటానికి ప్రతిపాదించటం సమంజసమైన చర్య అని నేను అనుకుంటున్నాను. పొనీ విస్తరణ మూస పెడదామని అనుకుందాం.ఇప్పటికి వర్గం:విస్తరణ కోరబడిన వ్యాసములు వర్గంలో 1350 పేజీలు ఉన్నవి.వీటిని ఎవరు విస్తరించాలి.ఎన్నాళ్లకు ఆ మూసను తొలగించకలుగుతామో చెప్పే పరిస్థితిలేదు.చురుకైన వాడుకరులు,నిర్వాహకులు తక్కువగా ఉన్న పరిస్థితులలో ఇదే సరైన అభిప్రాయం అని నేను భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 18:54, 12 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. రసాయన శాస్త్రంపై ఉన్న అభిమానంతో ముఖ్యమైన మూలక వ్యాసం తొలగింపుకు గురి అవుతుందని భావించినపుడు వ్యక్తిగతంగా బాధపడి పై అభిప్రాయాన్ని తెలియజేసాను. వికీ విధానాల ప్రకారం తొలగించవలసిస్నదే. ఇది వరకు 2013 ఏప్రిల్ 1 న మొలకపేజీల నియంత్రణ విధానాన్ని ఓటింగు పద్ధతిలో చర్చింది, ఆమోదించి ఒక నిర్ణయాన్ని చేసాము. కానీ ఆ విధానం అమలులోకి వచ్చిన దాఖలాలు లేవు. తరువాత అనేక మంది అనేక మొలకలను తెవికీలోకి చేర్చారు. ఇటువంటి వ్యాసాలను మొలక స్థాయి దాటించడానికి అవి సృష్టించేవారు గానీ, ఇతరులు కాని కృషి చేయ్యాలి. కానీ అలా జరగడం లేదు. అటువంటి వ్యాసాలను తొలగించనూ లేదు. ఇటువంటి ముఖ్యమైన మూలకాల విస్తరణ విషయంలో పాలగిరి ర్రామకృష్ణారెడ్డి, వేమూరి వెంకటేశ్వరరావు గార్లు కృషి చేసారు. చాలా మూలకాలు విస్తరణ చేయబడ్డాయి. సినిమా వ్యాసాల మొలకలను విస్తరించాలంటే సమాచారం లభించకపోవచ్చు! కానీ మూలకాల వ్యాసాన్ని విస్తరించాలంటే సమాచారం దొరుకుతుంది. నాకున్న వికీ అనుభవాన్ని బట్టి ఒకరు సృష్టించిన వ్యాసాన్ని మరొకరు విస్తరణ చేయడం అరుదు. పూర్వపు వాడుకరులు సమిష్టి కృషితో అలా చేసేవారు. తరువాత కాలంలో పేజీని సృష్టించి అభివృద్ధి పరచిన గుర్తింపు వారికే రావాలనే తలంపుతో అనుభవం ఉన్నా ఆ మొలకల జోలికి ఎవరూ పోవడం లేదు. ఏక వాక్యంలో ఎవరో వాడుకరి సృష్టిస్తే అనేక బైట్లను మనం చేర్చి ఆ వ్యాస సృష్టి గుర్తింపు వారి పేరుబరిలో ఉండటం కొంతమందికి ఇష్టం లేదేమోనని నా అభిప్రాయం. ప్రతీ వాడుకరీ మంచి క్రొత్త వ్యాసాన్ని రాయడానికి ఇష్టపడుతున్నాడు. శబ్దజాలంపై అధికారం లేని , భాష రాని వాడుకరులు కూడా ఒక నిమిషంలో గూగుల్ అనువాదాలను సృష్టిస్తున్నారు. వాటిని ఎలా శుద్ధిచేయాలి? ఎలా సంస్కరించాలనే తలంపుతో అనేక గంటలు నిర్వాహకుల సమయం వృధా అవుతుంది.
ఇటువంటి మూలక వ్యాసాలను మీరన్నట్లు పేజీ సృష్టించిన గౌరవ వికీపీడియను దీనిపై స్పందించి, పేజీని ఒకవారం రోజులలోపు దానిని అభివృద్ధిపరచాలని కోరుచున్నాను. స్పందన లేని యెడలతొలగించటానికి ప్రతిపాదించటం సమంజసమైన చర్య. ఆవి తొలగిస్తే వేరెవరైనా సృష్టించి అభివృద్ధి పరుస్తారేమో చూడాలి.--కె.వెంకటరమణచర్చ 00:56, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ, యర్రా రామారావు గార్లకు -మీరిద్దరూ ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చేసారు. నిజానికి అయోడిన్ పేజీలో ప్రత్యేకంగా రాసిన దేమీ లేదు. మూస:అయొడిన్ మూలకము అనే మూసను పెట్టారంతే. తొలగించాలనే మీ ఇద్దరి నిర్ణయం సబబే అని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 01:27, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ, చదువరి గారూ మీరు నా అభిప్రాయాలను క్షుణ్ణంగా ఓపికతో అర్థం చేసుకుని ఏకీభవించినందుకు ధన్యవాదాలు.చర్చలలో ఎక్కువమంది పాల్గొంటేనే రచ్చబండ కార్యక్రమానికి సరియైన అర్థం చేకూరిందని నేను నమ్ముతున్నాను.--యర్రా రామారావు (చర్చ) 10:00, 13 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]