Jump to content

చర్చ:కాల జ్ఞానం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

విలీనం గురించి

[మార్చు]
క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.

కాలజ్ఞానం అంటే కేవలం బ్రహ్మంగారు చెప్పిన తత్వాలే కాక ప్రపంచ వ్యాప్త విషయాలను ఇక్కడ రాయవచ్చు. అందుకని విలీనం అవసరం లేదనుకుంటున్నాను.--రవిచంద్ర (చర్చ) 12:42, 27 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ,ఈ పేజీ 2008 అక్టోబరులో సృష్టించబడింది.మీరు విలీనం అక్కరలేదనే అభిప్రాయం తెలిపి కూడా సుమారు 4 సంవత్సరాలకు పైన అయ్యింది.అయినా అప్పటినుండి దీనిలో సమాచారాం చేర్చటానికి ఎటువంటి ప్రయత్నాలు జరుగలేదు.అసలు దీనిలో ఉంది ఏక వాక్యం, ఇవికూడా చూడండి అనే విభాగంలో మూడు శీర్షికల లింకుల మాత్రమే ఇవ్వ బడినవి.విలీనం చేయటానికి కూడా పెద్ద విషయసంగ్రహం లేదు.ఆ ఏక వాక్యం కాలజ్ఞాన తత్వాలు లో వివరింపబడింది.అక్షరబేదాలుతో ఉన్న పేజి. కావున దారిమార్పు చేయాలి, లేదా మొలక కారణంగా తొలగించాలని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 12:25, 7 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రామారావు గారూ కాలజ్ఞానం అనే భావన భారతదేశంలోనే కాక పాశ్చాత్యులలో కూడా ఆదరణ పొందినది. అలాగని ఇదేమి సైన్సు కాదు కానీ, ఖచ్చితంగా ఇది ఉండదగ్గ వ్యాసమేనని (విషయ ప్రాముఖ్యత ప్రకారం) నా అభిప్రాయం ఇప్పటికి కూడా. నిఘంటువులో చూస్తే Prophecy అనే ఆంగ్ల పదానికి మొదటగా కాలజ్ఞానం అనే అర్థం చెప్పారు. ఆంగ్లంలో en:Prophecy అనే వ్యాసం ఉన్నది. కానీ ఇక్కడ ఎవరో ఆ వ్యాసాన్ని ప్రవచనం అనే పేరుతో రాసి ఉన్నారు. వీటిని ఎలా కలిపి రాయాలో ఆలోచించాలి. ఒక వారం సమయమిస్తే నేను కనీస సమాచారాన్ని చేర్చగలను. ఎంకెవరైనా సహాయం చేయడానికి ముందుకు వచ్చినా సంతోషమే. రవిచంద్ర (చర్చ) 07:28, 8 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు అన్నట్లు, బ్రహ్మంగారి కాలజ్ఞానం కాకుండా కాలజ్ఞానం అనే అంశానికి విడిగా వ్యాసం ఉండవచ్చు. అయితే ప్రస్తుత రూపంలో ఈ వ్యాసం ఉండి ప్రయోజనమేమీ కనిపించడం లేదు. విస్తరణ కోసం ఎదురు చూస్తాను. ప్రస్తుతం ఈ పేజీ కున్న భాషాంతర లింకులను తీసేసి బ్రహ్మంగారి కాలజ్ఞానం పేజీకి ఇచ్చాను. __చదువరి (చర్చరచనలు) 01:42, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ముందుగా ఈ వ్యాసాన్ని విస్తరిస్తానని చెప్పి ఇంతకాలం చేయనందుకు క్షంతవ్యుడను. ప్రస్తుతానికి ఈ వ్యాసాన్ని మొలక స్థాయి దాటించి, మూలాలు చేర్చాను. నిర్వహణ కోసం, భవిష్యత్తులో విస్తరించడానికి అనుగుణంగా విస్తరణ చేర్చాను. - రవిచంద్ర (చర్చ) 09:17, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసం విస్తరణ మొదలై, మొలక స్థాయి దాటినందున, ఈ వ్యాసాన్ని ఉంచాలని నిర్ణయించి, ఈ చర్చను ముగిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 09:25, 16 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.