చర్చ:హిందూ దేవాలయం
ఆర్యా....... నేను మన దేవాలయాలు" అన్న శిర్షికన మన దేవాలయాల గురించి వ్రాస్తున్నాను. అందులో కొన్ని నేను స్వయంగా చూసినవి మరియు ఆయా పత్రికలలో వచ్చిన విషయాలను లేదా రెండు కలిపి వ్రాస్తున్నాను. అలా నేను స్వంతంగా వ్రాసిన విషయం లొ ఆయా ప్రాంతాలు బౌతికంగా కనబడే విషయం నా స్వంతం. పురాణ మూలాలు, చారిత్రిక విషయాలు ఆయా పత్రికలలో వచ్చినవి. వ్యాసం రాసేటప్పుడు అది ఇదివరకే వున్నదా లేదా అనే విషయం సరిచూసుకొని., లేకుంటేనె నేను వ్రాస్తున్నాను. అలాగె చాల చారిత్రిక ప్రదేశాల వివరాలు నా వద్ద వున్నవి. చాల వరకు నేను ప్రత్యక్షంగా చూసినవి, అయినా వాటి చారిత్రిక అంశాలు ఆయా పత్రికల్లో ప్రచురితమైనవి. ఇలా నా వ్యాస పరంపర కొనసాగుతున్నది. ఈ విషయాన్ని పెద్దలు గమనించ గలరు. నా వ్యాపకం ఏ మంటే చారిత్రిక విషయాలను చూడడం , పరిశీలించడం, నా అభిప్రాయా'న్ని రాసుకోవడం. ఇది ఎప్పటి నుండో జరుగుతున్న నా వ్యాపకం. ఇప్పుడు మన వికిపీడియా లో అవ్యాసాలను చేరుస్తున్నాను అవకాశం వచ్చింది గాబట్టి. పది మందికి తెలియాలి గాబట్టి. ఈ పని స్వంత అభిరుచి మేరకు పూర్తి స్థాయి లొ మనస్పూర్తిగా చేస్తున్నాను. నాకు వేరే పని ఏ,మి లేదు. ఇది వరకు విషయ సేకరణ ఒక్కటే నా ముక్య ఉద్దేశంగా వుండేది. అవకాశం వున్నందున ఇప్పుడు వికిపీడియాలో పెడుతున్నాను., ఎందుకంటే విషయం కొందరికైనా తెలియాలి కదా. పనిలో పనిగా ఇతరుల వ్యాసాలలోని అక్షర దోషాలను సరిదిద్దు తున్నాను. నేను ఇతర భాషల వ్యాసాలను అనగా ఆంగ్ల వ్యాసాలను కూడ తెలుగు లోనికి తర్జుమా చేయగలను. ఇంతకీ అసలు విషయం ఏ మంటే........... ప్రస్తుతం నేను చేస్తున్న పని అనగా వ్యాసాలను చేర్చడం, ఇతరుల వ్యాసాలలోని అక్షర దోష నివారణ వంటివి సరైన దేనా. లేదా వృధా ప్రయాసా? తెలియజేస్తే తదనుగుణంగా నడుచుకోగలను. లేకుంటే వృధా ప్రయాసే గదా? తెలిసినవారు తగు సూచన లివ్వగలరబు నా అబ్యర్థన. ధన్యవాదాలతో ఇట్లు: 16:42, 20 సెప్టెంబర్ 2011 (UTC)Bhaskaranaidu
భాస్కర నాయుడు గారూ! నమస్కారం. మీరు వికీపీడియాలో సమాచారం చేరుస్తున్నందుకు అభినందనలు. మీరు చేసేదంతా స్వాగతింపదగిన విషయమేనండీ. మీ కృషి గురించి కొద్ది వ్యాఖ్యలను గమనించగలరు.
- ఇతర వ్యాసాలలో అక్షర దోష సవరణ అనేది వికీకి ఎంతో అవుసరమైన విషయం. మీరీ పని చేస్తున్నందుకు చాలా సంతోషం.
- ఆంగ్లంలోంచి తెలుగు లోనికి అనువదించడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఎడతెరిపి లేని పని ఉంటుంది. మీ వీలును బట్టి ఎంత వీలయితే అంత చేయు గలరు.
- ఇక "మన దేవాలయాలు" వ్యాసం గురించి. ప్రస్తుతం ఈ పని కొనసాగించండి. కాని ఈ వ్యాసాన్ని ఒక క్రమ బద్ధంగా విభజించి తీర్చిదిద్దాలి. లేకుంటే ఈ వ్యాసం చాలా పెద్దది అవుతుంది. దీనిని పరిశీలించి మరికొన్ని విషయాలు తరువాత వ్రాస్తాను. ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా అనే వ్యాసాన్ని ఒకమారు చూడండి. దానికీ, దీనికీ అనుసంధించుదాము. --కాసుబాబు 18:28, 20 సెప్టెంబర్ 2011 (UTC)
ఆర్యా......
మీరు అన్నట్టు "మన దేవాలయాలు" వ్యాసం వ్రాసు కుంటు పోతె చాల పెద్దది అవుతుంది. పైన మీరన్నట్టు ఒక్కొ ఆలయాన్ని గురించి ఆయా వూర్లకు సంబందించిన పుటలో వ్రాయడం సమంజసమే ననుపిస్తుంది. కాక పోతే మన రాష్ట్రం వెలుపల ఉన్న ఆలయాల చరిత్రను మాత్రం ఇక్కడే వుంచితే బాగుండునేమో ఆలోచించి సలహా ఇవ్వండి. అది కూడ పొడిగిస్తూ పోతె పెద్దదే అవుతుంది. కాని ఇందులో ఒక సదుపాయం వుంది. అదేమంటే అన్ని ఆలయాల చరిత్ర ఒకే చోట దొరుకుతుంది. కావలసిన ఆలయ వివరాలు ఒక్కపేజీలోనె వెతుక్కో వచ్చు. ఇకపై ఆలయాల గురించి ఆయా వూర్లకు సంబందించిన పుటలోనే వ్రాస్తాను. ఇప్పటివరకు వ్రాసిన వాటిని ఆయా వూర్ల పుటలకు తరలించండి.Bhaskaranaidu 16:46, 2 అక్టోబర్ 2011 (UTC)
భాస్కరనాయుడు గారూ| ఈ ఆలయాల సమాచారాన్ని ఆయా వూళ్ళకు సంబంధీంచిన పేజీలలో ఎక్కించగలరా? ఉదాహరణకు నేను సిద్ధేశ్వరాలయం గురించి అమరాపురం పేజీలోనికి కాపీ చేశాను గమనించండి. --కాసుబాబు 18:41, 21 సెప్టెంబర్ 2011 (UTC)
- కాసుబాబు గారన్నట్లు దేవాలయాల సమాచారం ఆయా గ్రామ/పట్టణాలకు చేర్చాలి. ఎందుకంటే దేవాలయాలకు నిర్దిష్టమైన సంఖ్య లేదు వేలు, లక్షల దేవాలయాలు చేర్చినా దానికి అంతు ఉండదు. అన్ని దేవాలయాల సమాచారం ఒకే వ్యాసంలో ఉండటం వ్యాస పరిమాణం దృష్ట్యా, పాఠకుల దృష్ట్యా ఆలోచించిననూ బాగుండదు. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు తదితర నిర్దిష్ట సంఖ్య ఉన్న దేవాలయాలను సంక్షిప్తంగా ఒక వ్యాసంలో వ్రాయడానికి, ఇలా అన్ని దేవాలయాల సమాచారం ఒకే వ్యాసంలో చేర్చడానికి తేడా ఉంటుంది. అంతేకాకుండా గ్రంథాల/పత్రికల/మేగజైన్లలో వస్తున్న దేవాలయాల సమాచారాన్ని తెవికీలో చేర్చేటప్పుడు ముఖ్య వ్యాక్యాలకు తప్పనిసరిగా రెఫరెన్స్ ఇవ్వవలసి ఉంటుంది. చాలా అధిక సమాచారం కూడా ఒకే ఆధారం నుంచి చేర్చరాదు. బాష, శైలి కూడా చాలా వరకు తెవికికి అనుగుణంగా మార్చుకోవలసి ఉంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 20:01, 2 అక్టోబర్ 2011 (UTC)
- ప్రతి దేవాలయానికి ప్రత్యేక వ్యాసంగా చేయవచ్చు. అప్పుడు పూర్తి సమాచారం కావాలంటే ఇలా జాబితాకూడా చేయ వచ్చు. లేక పుస్తకం తయారుచేయవచ్చు. ఇకనుండి కొత్తగా చేర్చే విషయాలకైనా కొత్త వ్యాసాలు ప్రారంభించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 12:21, 13 జూన్ 2012 (UTC)
ఈ వ్వాసం విషమై పలువురి సూచనలు గమనించాను. ప్రస్తుతం వ్వాసం చాల పెద్దదే కావచ్చు. కాని దాన్ని కొన్ని విభాగాలుగా చేసే ఆలోచన వున్నది. (వ్యాసం ముందరి పేరా చూడండి.) విభాగాలంటే .... వైష్ణవ ఆలయాలు శైవాలయాలు (మొదట అనుకున్నట్టు) కాకుండా.... వేంకటేశ్వరలయాలు, రామాలయాలు, అమ్మ వారి ఆలయాలు, విఘ్నేశ్వరాలయాలు, .... ..... ఇలా విబజించాలని వున్నది. అప్పటికి ఆ యా వ్వాసాలు కొంత పెద్దవిగానె వుండొచ్చు. అయినా పరవాలేదనిపిస్తుంది. పైగా... అన్ని ఆలయాల గురించి వ్రాయడం లేదు. వాటి విశేషాలు ఆ యా వూర్ల పుటలో వుంటాయి. ప్రముఖమైనవి, పురాతనమైనవి మాత్రమె వ్రాస్తున్నాను. పైగా ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయాలను ఒక విభాగంగాను, ఇతర రాష్ట్రాలలో వున్న ఆలయాలను మరొక విభాగంలోను వ్రాయ దలుచుకున్నాను. అదే విదంగా మరి కొన్ని గొప్ప ఆలయాలు ప్రస్తుతం ఆలనా పాలనా లేక నిత్య పూజాది కాలు లేక వాటి గొప్ప తనాన్ని ప్రదర్శించు కోడానికా ... అన్నటు వున్నాయి. అటు వంటి వాటిని ప్రత్యేక వర్గంగా చేర్చాలని వున్నది. ఈ విధంగా విబజిస్తే సరిపోతుంది కదా.... మరొక్క మనవి..... వ్వాసం పెద్దదయి పోతుందని కొన్నింటిని వదిలేయము గదా. కాక పోతే ... ఆయా ఆలయాలకు సంబందించిన స్థల పురాణము, చారిత్రిక అంశాలు కొంత వరకు తగ్గించ వచ్చు. అవి ఎలాగు ఆయా ఊర్ల పుటల్లో వుంటుంది. తొల్దొలుత అలాగె చేసాను. కాని సమగ్రంగా లేదని ఆ విషయాలను కూడ చేరుస్తున్నాను. ఇకపై ఆ విషయాలను కొంత తగ్గిస్తాను. ఇంకోమాట..... అన్ని ప్రధాన ఆలయాల విషయం ఒక వ్వాసంలో వుంటేనె చదువరలకు సౌలభ్యం. ఏ ఆలయం ఏ వూర్లో వుందో అందరికి తెలియదు కదా.... ఆ యా వూర్ల "పుట "కు వెళ్లి చూసుకోడానికి. ఇందులోని వివరాలు ప్రతి ఒక్కరికి నిత్యం అవసరమే. అలాంటప్పుడు పెద్దదయిందని అనుకోవడమెందుకు. వ్వాసం పెద్దదయినందున సాంకేతిక సమస్యలేమైనా వున్నాయో నాకు తెలియదు. అదే నిజమైతే..... అప్పుడు ఆలోచిద్దాము. మనకు నిత్యము అవసరము లేని, అన్య దేశాల వ్వాసాలు అతి పెద్దవైనవి చాలనె వున్నాయి. సాంకేతిక సమస్యలు లేకుంటే ఈ విషయమై చర్చకు పెట్టండి. అధికుల అభిప్రాయల మేరకు సవరిద్దాము. నేను మొదట ఈ వ్వాసాన్ని ప్రారంబించి నపుడు (తెవికి పై అంత అవగాహన లేనప్పుడు) అప్పటికే నా వద్ద నాకొరకు వ్రాసుకున్న విషయము కొంత వుండేది. దాన్నె వ్రాద్దామనుకున్నాను. అది సమగ్రంగా అనిపించ లేదు. అవసరం దృష్ట్యా అది అలా అలా పెరిగి పోతున్నది..... దీని నిడివి తగ్గించ డానికి మరో మార్గమున్నది. అదే మంటే..... ఇందులో అంతగా ప్రాముఖ్యత లేని వాటిని ఆ యా వూర్ల పుటలోనికి తరలిద్దాము. ఈ మొత్తం విషయాన్ని రేపు హైదరాబాదు లో జరగ బోయే సమావేశంలో కూడ చర్చకు పెట్టండి....... ఇట్లు. భాస్కర నాయుడు.Bhaskaranaidu (చర్చ) 04:36, 14 జూన్ 2012 (UTC)
శిర్షిక-మార్పు
[మార్చు]భాస్కర నాయుడు గారు, దేవాలయాలను గూర్చి మీరు చక్కగా వ్రాస్తున్నారు.అభినందనలు.అయితే వ్యాసం పేరు పై నాకు ఒక చిన్న సందేహం.మన దేవాలయాలు అన్నారు.ఇక్కడ మన అనగా ఆంధ్రులు లేదా బారతీయులని భావించాలి కదా.మన దేవాలయాలు వ్యాసంలో ఇంత వరకు మీరు కేవలం హిందూ మందిరాలన గురించి మాత్రమే వ్తారు .మనం అనగా హిందువులమే మాత్రం కాదుగా,ముస్లిం లు,క్రైస్తవులు,సిక్కులు,జైనులు,బౌద్ధులు, ఇలా చాలా మతాలున్నాయి.కావున ఈవ్యాసంలో ఆయా మతాల ప్రార్ధానా మందిరాలను చేర్చినప్పుడే శిర్షిక పేరుకు న్యాయం చేకూర్చినట్లు అవుతుంది.ఈ వ్యాసంలో కేవలం హిందూ దేవాలయాలను గుర్చి వ్రాసి, 'మన దేవాలయాలు అంటే, వికిపిడియను సభ్యులు,పాఠకులందురు హిందువులు మాత్రమే అనే అపోహ కలిగే ప్రమాదమున్నది.Rama krishna reddy.P (చర్చ) 06:31, 14 జూన్ 2012 (UTC)
వ్యాసాల సంకలనం
[మార్చు]ఈ వ్యాసంలోని శీర్షిలన్నీ ప్రత్యేక వ్యాసాలుగా ఉన్నాయి. ప్రత్యేక వ్యాసాలుగా ఉన్న వ్యాసాల నుంచి యధాతథంగా సమాచారం కాపీచేసి మళ్ళీ ఇక్కడ చేర్చబడింది. ఇదే విషయం ఇతర చర్చాపేజీలలో తెలుపబడిననూ మళ్ళీమళ్ళీ వ్యాసాలలోని అదే సమాచారంతో "పెద్ద వ్యాసం" తయారుచేయడానికి ప్రయత్నించడం బాగుండదు. అలా చేర్చాలంటే వందలు, వేల వ్యాసాల సమాచారం కూడా ఇందులో చేర్చవచ్చు, అలాంటప్పుడు కోట్ల బైట్ల సమాచారం చేర్చిననూ తక్కువే అవుతుంది. తెవికీలో వ్యాసాలు రచించాలి కాని వ్యాసాల సమాచారంతో వ్యాససంకలనాలు తయారుచేయరాదు. మరోవిషయం ఏమిటంటే ఇందులో చేర్చబడిన సమాచారం (ప్రత్యేక వ్యాసంనుంచి కాపీ అనుకోండి) ఈనాడు ఆదివారం అనుబంధం పుస్తకంలో నుంచే చాలా వరకు తీసుకోబడింది. ఇలా చేయడం కూడా కాపీహక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. నేను చాలా సమాచారం తొలగించి లింకులు పెట్టాను, ఇంకనూ చేయాల్సింది చాలా ఉంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:57, 18 ఫిబ్రవరి 2014 (UTC)
వ్యాస శీర్షిక
[మార్చు]ప్రముఖ హిందూ దేవాలయాలు అనే వ్యాసము జిల్లాల వారీగా ఉంటే మంచిది. జిల్లా వారీగా ఉన్నా చాలా పెద్ద వ్యాసము అయ్యేందుకు కూడా అవకాశము ఉన్నది. ప్రస్తుతానికి జిల్లా వారీగా లేదా పెద్ద ఊరు అయితే మాత్రము ఊరు పేరుతో ఉంటే బావుంటుంది అని నా మనవి. JVRKPRASAD (చర్చ) 14:02, 18 ఫిబ్రవరి 2014 (UTC)
- జిల్లాల వారీగా పుణ్యక్షేత్రాలకై ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితా చూడండి. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:58, 18 ఫిబ్రవరి 2014 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, ప్రముఖ హిందూ దేవాలయాలు అనే ఈ వ్యాసము అర్థము కావటము లేదు. ఇంత పెద్ద వ్యాసము మీరు కుదించుతున్నారు, సంతోషమే. JVRKPRASAD (చర్చ) 18:47, 18 ఫిబ్రవరి 2014 (UTC)
విలీనం గురించి
[మార్చు]ఈ వ్యాసం ప్రముఖ హిందూ దేవాలయాలు అని ఉన్నది. కనుక ఇతర దేశాలలో ఉన్న హిందూ దేవాలయాలను కూడా చేర్చవచ్చు. దీనిని భారతదేశంలోని హిందూ ఆలయాల జాబితా లోనికి విలీనం చేయరాదు.--కె.వెంకటరమణ⇒✉ 08:44, 16 ఆగష్టు 2015 (UTC)
ఇది సర్వసామాన్య శీర్షిక.జాబితా వ్యాసం కాదు
[మార్చు]ఇది సర్వసామాన్య శీర్షిక. ఇది జాబితా వ్యాసం కాదు.ఆలయాల జాబితా ఇందులో తగినది కాదు.ఇందులో తొలగించిన సమాచారం మరొక పేజీ భారతదేశ హిందూ దేవాలయాల జాబితా అనే మరొక పేజీలో ఉంది. లేని ఆలయాలను పరిశీలించి వాటిని అక్కడ చేర్చి ఇక్కడ తొలగించాను.ఈ వ్యాసం కేవలం హిందూ దేవాలయానికి గురించిన విషయసంగ్రహం మాత్రంతోనే విస్తరించాలి.జాబితా ఉంచరాదు.అవసరమైన సమాచారం ఆంగ్లవ్యాసం నుండి అనువదించి ఈ వ్యాసంలో చేర్చి విస్తరించాను యర్రా రామారావు (చర్చ) 05:00, 21 ఫిబ్రవరి 2023 (UTC)