Jump to content

వాడుకరి:Sudheer Reddy Pamireddy

వికీపీడియా నుండి

మా చెట్టు నీడ పుస్తకం [మార్చు]

[మార్చు]

తెలుగు గ్రంథ రచయిత పామిరెడ్డి సుధీర్ రెడ్డి కి సాహిత్యం ప్రపంచంలోకి సుస్థిర స్థానాన్ని సాధించిపెట్టిన తొలి అడుగు. ఈ గ్రంథం 1780 - 2020 మధ్య జరిగిన రైతు కుటుంబాల జీవన వైచిత్రిని చూపిస్తుంది. నాటి కార్య కారణాలను వివరిస్తూ సాగుతుంది. "మాచెట్టు నీడ" తెలుగులో వచ్చిన ఏడుతరాల రైతు కుటుంబాల వారసత్వపు పరిమళాల వెదజల్లు.

2020 లో రచించబడిన ఈ గ్రంథాన్ని సాహితీకారుడు డా.|| రఘు రామ్ ఆంగ్లములో ది థాట్, ఏ జర్నీ అఫ్ సెవెన్ జెనెరేషన్స్ (The Thought, A Journey of Seven Generations)గా అనువదించాడు.

పుస్తక నేపథ్యం[మార్చు]

[మార్చు]

సుధీర్ రెడ్డి పామిరెడ్డి విషయాన్వేషణ మొదలుపెట్టిన పుష్కర కాలం తర్వాతే ఆయన ఈ పరిశోధనాత్మిక గ్రంధం రాశారు. దీనిని తన నాయన్నమ్మ కస్తూరి, తాత సుబ్బారెడ్డి పామిరెడ్డి లకు అంకితం చేశారు. కస్తూరి విజయం అనే సొంత డిజిటల్ పబ్లికేషన్స్ తో ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రంథంన్ని పంపిణి చేశారు. ఈ పుస్తకం తెలుగు ఈ-ఫార్మటు, పేపర్ బ్యాక్ గా అన్ని ఆన్లైన్ లైబ్రరీలలో లభ్యం అవుతుంది.

పుస్తక సమీక్ష[మార్చు]

[మార్చు]

పాఠకునిగా ప్రముఖుల అభిప్రాయాలు.[మార్చు]

[మార్చు]

• "అవును నిజమే ఇది మరో ఏడు తరాలు"

రాచపాళం చంద్ర శేఖర్ రెడ్డి, ప్రముఖ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.[మార్చు]
[మార్చు]

• ఇది మూలాల అన్వేషణ, తెలుగు వారి నీటి పారుదల రంగదర్శిని.

ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, పద్మ శ్రీ , కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత[మార్చు]
[మార్చు]

• ఈ పుస్తక కథనం రాజకీయ బానిసత్వానికి, మధ్య తరగతి రైతు కుటుంబాల మానవత్వానికి మధ్య ఉత్కంఠ ఉద్వేగాల వైరుధ్యాలతో ముందుకు సాగుతూ.. ఉత్కృష్టమైన కృష్ణ, గోదావరి నదులతో పెనవేసుకున్న భౌగోళిక చరిత్రను, అత్యుత్తమ హైడ్రాలజీ శాస్త్ర రంగ అభివృద్ధి చిహ్నంగా మారుతున్న పోలవరం ప్రాజెక్ట్ యొక్క రెండు శతాబ్దాల చరిత్రను పాఠకుడి కళ్ళకు కడుతుంది. సామాన్యుల కోణంలో వాస్తవాలను శోధించి రాసిన ఈ రచన "మా చెట్టు నీడ, అసలేం జరిగింది".

• చారిత్రక భౌగోళిక ప్రాపంచిక వివరాల నెలవు ఈ రచన. తీరని ఆరాటం, నిబద్ధత, అనన్యమైన కృషి,అకుంఠిత దీక్ష,నిరవధిక శ్రమ, మొక్కువోని పట్టుదల సమిశ్రీత రూపం ఈ రచన. ఈ రచనలోని ప్రతి పుటలో రచయిత ఇష్టం తొంగిచూస్తూ ఉంది. రచయిత శైలి బాగుంది. పాఠకుడిని ఆకట్టుకుంటుంది. కొన్నిసార్లు కవితాత్మకంగా, కొన్నిచోట్ల నాటకీయత ఉంది.

ఆచార్య కొలకలూరి మధు జ్యోతి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి.[మార్చు]
[మార్చు]

• చరిత్రలో వక్రీకరణకు గురైన సంఘటనలెన్నింటినో మానవీయ కోణంలో వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయడం అనేది అసామాన్యమైన విషయం.

ఆచార్య సడ్మేక లలిత బెల్లంపల్లి.[మార్చు]
[మార్చు]

• ఈ విధంగా చరిత్ర అధ్యయనం గావించినప్పుడు అనేక విషయాలలో మనకు అవగాహన ఏర్పడడమే కాకుండా, స్ఫూర్తిని కలుగజేస్తాయి.

అక్కినేని భవానీ ప్రసాద్, కిసాన్ సేవ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్, విజయవాడ.[మార్చు]
[మార్చు]

• ఆకాశమే హద్దుగా చెలరేగడం ఒక రచయితకే సాధ్యం. ఈ రచయిత కలం విశ్వమంతా సంచరించింది. ప్రపంచ యుద్ధాల నుండి పోలవరం నిర్మాణం వరకు దేన్నీ వదలకుండా మన నేతల నిర్లక్ష్యపు జాడ్యాన్ని, చారిత్రక వాస్తవాల్ని మొహమాటం లేకుండా నిర్భయంగా, నిజాయితీగా వివరించారు.

ఆచార్య డా. పామిరెడ్డి దామోదర రెడ్డి, రచయిత, అనంతపురం[మార్చు]
[మార్చు]

• స్వజనం, స్వగ్రామం, స్వరాజ్యం సాధనలో పాకనాటి వంశీయుల రక్తికి ఆసక్తులను నిలిపిన దర్పణం.

ఆచార్య వంగివరపు నవీన్ కుమార్, గుడివాడ.[మార్చు]
[మార్చు]

• పుస్తకం మొదట్లోనే కుట్ర, ద్రోహం, హింస, పగతో కూడిన బాక్స్ ఆఫీస్ సినిమా స్క్రిప్ట్ లాంటి సత్యాలతో, రచయిత చేయి తిరిగిన కథనాన్ని మన ముందు ఉంచుతాడు. ఈ పుస్తకం స్థూలంగా 17 వ శతాబ్దం చివరలో మొదలై, 21వ శతాబ్దపు పోలవరం నిర్మాణం వరకు కూలంకషంగా ఆంధ్రప్రదేశ్ లోని పాకనాటి ప్రాంతం యొక్క సామాజిక, ఆర్ధిక మరియు సాంస్కృతిక చరిత్రను తెలిపే గ్రంథం.

దాసు కేశవరావు, స్వతంత్ర జర్నలిస్ట్, మాజీ డిప్యూటీ ఎడిటర్ & బ్యూరో చీఫ్, ది హిందు, హైదరాబాద్
[మార్చు]