Jump to content

అన్నవరం దేవేందర్

వికీపీడియా నుండి
అన్నవరం దేవేందర్
అన్నవరం దేవేందర్
జననందేవేందర్
(1962-10-17) 1962 అక్టోబరు 17 (వయసు 62)
పోతారం, హుస్నాబాద్ మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంకరీంనగర్, తెలంగాణ
వృత్తికవి
మతంహిందూ
భార్య / భర్తరాజేశ్వరి
పిల్లలుస్వాతి, గౌతమ్
తండ్రిదశరథం
తల్లికేదారమ్మ
ఆజాది కా కవి సమ్మేళన 2021 కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డా. మామిడి హరికృష్ణ చేత సత్కారం పొందుతున్న అన్నవరం దేవేందర్

అన్నవరం దేవేందర్‌ కవి, రచయిత, కాలమిస్ట్ ఇరవై అయిదేళ్ళుగా నిరంతరం తెలంగాణ తెలుగు పదాలతో కవిత్వం రాస్తున్నారు. ఇప్పటికి 12 కవితా సంపుటాలు 2 వ్యాస సంకలనాలు వెలువరించారు. వీరు 1986 ప్రాంతంలో వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసారు. ఇప్పటికీ కవిత్వంతో పాటు పలు పత్రికలలో కాలమ్స్ రాస్తున్నారు. మన తెలంగాణా పత్రికలో 'ఊరి దస్తూరి' కాలం చాలా విశిష్టమైనది. ఇది తెలంగాణ సంస్కృతిక చిత్రణగా పుస్తకంగా వెలువడింది. అన్నవరం కవిత్వం ఆంగ్లంలో కూడా వెలువడింది. తెలంగాణ భాషకు సాహిత్య గౌరవం తెచ్చిన వారిలో అన్నవరం ముందుంటారు.

జననం

[మార్చు]

అన్నవరం దేవేందర్ కేదారమ్మ, దశరథం దంపతులకు 1962, అక్టోబర్ 17సిద్ధిపేట జిల్లా, హుస్నాబాద్ మండలం పోతారం గ్రామంలో జన్మించారు. దశరథం ఉపాధ్యాయుడిగా పనిచేశారు.[1][2]

ప్రస్తుత నివాసం - వృత్తి/ఉద్యోగం

[మార్చు]

పంచాయితీరాజ్ శాఖ, జిల్లా ప్రజా పరిషత్, కరీంనగర్ లో చాలా కాలం పని చేసారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా పని చేసారు. అక్టోబర్ 31, 2020 న ఉద్యోగ విరమణ చేసారు.

వివాహం

[మార్చు]

ఏదునూరి రాజేశ్వరి గారితో వివాహం జరిగింది. ఈవిడ ఉపాధ్యాయురాలు. వీరికి ఒక కూతురు (స్వాతి), కుమారుడు (గౌతమ్) ఉన్నారు.

కవితల జాబితా

[మార్చు]
  1. మన సంతకం [3]
  2. ఆపతి సంపతి [4]
  3. కట్ట మైసమ్మ [5]
  4. పాత కత [6]

ప్రచురితమయిన పుస్తకాల జాబితా

[మార్చు]
తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా 2015, జూన్ 7న హైదరాబాదులోని రవీంద్రభారతిలో 400 మంది కవులచే తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన కవి సమ్మేళనంలో జూలూరు గౌరీశంకర్, నాళేశ్వరం శంకరం నుండి సత్కారం అందుకుంటున్న అన్నవరం దేవేందర్

రచయితగా

[మార్చు]
  • 2001 - తొవ్వ
  • 2002 - మరోకోణం (సామాజిక వ్యాసాలు)
  • 2003 - నడక
  • 2005 - మంకమ్మ తోట లేబర్ అడ్డా
  • 2006 - బుడ్డపర్కలు (నానీలు)
  • 2008 - బొడ్డు మల్లె చెట్టు
  • 2011 - పొద్దు పొడుపు
  • 2011 - Farmland Fragrance (Collection of poems translated by P. Jayalaxmi)
  • 2014 - పొక్కిలి వాకిళ్ల పులకరింత (కవితా సంకలనం)
  • 2016 - బువ్వ కుండ (దీర్ఘ కవిత)
  • 2016 - ఇంటి దీపం (కవిత్వం)
  • 2018 - వరి గొలుసులు (కవిత్వం)
  • 2020 - ఊరి దస్తూరి (వ్యాసాలు)
  • 2021 - గవాయి (కవిత్వం)
  • 2022 - The Unyielding Sky (Collection of Poems translated by Dr Manthani Damodara Chary)
  • 2022 - జీవన తాత్పర్యం (కవిత్వం)
  • 2022 - అన్నవరం దేవేందర్ కవిత్వం (1988 నుండి 2022 వరకు రాసిన మొత్తం కవిత్వ పుస్తకాల సంకలం) భాగం-1, భాగం-2 (కవిత్వం)
  • 2023 - సంచారం (యాత్రా వ్యాసాలు)
  • 2024 - Grain Chains (Translation of వరి గొలుసులు poems translated by Savyasaachi)
  • 2024 - అంతరంగం (వర్తమాన జీవన చిత్రణ కాలం వ్యాసాలు)

సంపాదకత్వం

[మార్చు]
  • 1997 - మేర మల్లేషం పోరాట పాటలు
  • 2010 - వల్లు బండ (తెలంగాణ ఉద్యమ కరీంనగర్ కవిత్వం)
  • 2019 - అయిదు వసంతాల అభివృద్ధికి అద్దం (కరీంనగర్ జిల్లా పరిషత్ ప్రత్యేక సంచిక)

సంపాదకవర్గ సభ్యుల్లో ఒకరుగా

[మార్చు]
  • 2001 - సిమాంట (హుస్నాబాద్ కవిగానం)
  • తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో తన కవిత్వాన్ని చదువుతున్న అన్నవరం దేవేందర్
    2006 - శతవసంతాల కరీంనగర్ (1905-2005) మానేరు టైమ్స్ ప్రచురణ
  • 2006 - మా‘నేటి’ కరీంనగర్ (శతవసంతాల ఉత్సవ కమిటి ప్రచురణ
  • 2008 - జానపద గోపురం (డా. గోపు లింగారెడ్డి అభినందన సంచిక)
  • 2010 - అక్షర (డా. ఎన్. గోపి షష్టిపూర్తి అభినందన సంచిక)
  • 2010 - ‘జాగో...జగావో’ తెలంగాణ ఉద్యమ కవిత్వం
  • 2012 - ‘కరీంనగర్ కవిత’ 2011
  • 2013 - ‘కరీంనగర్ కవిత’ 2012
  • 2013 - ‘నవనీతం’ డా. నతిమెల భాస్కర్ సాహిత్య వివేచన
  • 2013 - ‘ఉడాన్’ తెలంగాణ ఉద్యమ హిందీ అనువాద కవితా సంకలనం
  • 2014 - ‘ఎన్నీల ముచ్చట్లు- 7’ కవితా సంకలనం

పురస్కారాలు - బిరుదులు - గుర్తింపులు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]
  • 2001 - మహాత్మ జ్యోతిభా పూలే ఫెలోషిప్
  • 2004 - రంజని-కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం
  • 2006 - ఆం.ప్ర. సాంస్కృతిక శాఖ ఉగాది పురస్కారం
  • 2006 - డా. మలయశ్రీ సాహితీ పురస్కారం
  • 2006 - మారసం-రుద్ర రవి స్మారక కవితా పురస్కారం (మంకమ్మ తోట లేబర్ అడ్డా కవితా సంకలనం)
  • 2013 - అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం
  • 2013 - కవయిత్రి మొల్ల పురస్కారం
  • 2013 - తేజ సాహిత్య పురస్కారం
  • 2013 - కలహంస పురస్కారం
  • 2013 - ‘అక్షరశిల్పి’ పురస్కారం (పొద్దుపొడుపు కవితా సంకలనం)
  • 2014 - ముదుగంటి వెంకటనరసింహరెడ్డి సాహిత్య పురస్కారం
  • 2016 - తెలంగాణ రాష్ట్ర అవతరణ జిల్లా స్థాయి పురస్కారం (కరీంనగర్ జిల్లా)
  • 2017 - ఇండియా వరల్డ్ పొయెట్రీ ఫెస్టివల్ లైఫ్ టైం అఛీవ్మెంటు అవార్డు
  • 2017 - సినీవాలి పురస్కారం, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా.
  • 2018 - ఉమ్మడి శెట్టి త్రీ శతాబ్ది పురస్కారం
  • 2018 - వడ్నాల కిషన్ సాహిత్య పురస్కారం
  • 2018 - మై గిఫ్ట్ పురస్కారం
  • 2019 - తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2016 (పొక్కిలి వాకిళ్ళ పులకరింత పుస్తకానికి)[7][8]].
  • 2024 - శాలివాహన విశిష్ట ప్రతిభా పురస్కారం (శాలివాహన ఛారిటబుల్ ట్రస్ట్, హైదరాబాద్)
  • 2024 - స్టేట్ లిటరరీ అవార్డ్ -2024, బి సి రైటర్స్ వింగ్, హన్మకొండ

సాహిత్య సందర్భం

[మార్చు]
  • 2013 - ఈశాన్య దక్షిణాది రాష్ట్రాల కవితోత్సవం, బెంగళూర్ లో పాల్గొనడం (కేంద్ర సాహిత్య అకాడెమీ, న్యూడిల్లీ నిర్వహణ)
  • 1986 - ‘నూతన సాహితీ’ (కరీంనగర్ జిల్లా హుస్నాబాద్) వ్యవస్థాపకుల్లో ఒకనిగా, ప్రధాన కార్యదర్శి, అధ్యక్షునిగా బాధ్యతల నిర్వహణ
  • 1989 - ‘సాహితీ గౌతమి’ కరీంనగర్ జిల్లా సాహితీ సంస్థల సమాఖ్య వ్యవస్థాపక ఉపాధ్యక్షులుగా, సలహా మండలి సభ్యులుగా
  • 2001 - తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా,[9]
  • 2010 - ‘సాహితీ సోపతి’ వ్యవస్థాపకుల్లో ఒకనిగా
  • 2013 - వస్త్రగాలం - అన్నవరం దేవేందర్ కవిత్వం గురించి శ్రీ నగునూరి శేఖర్ సంపాదకత్వంలో వివేచన వ్యాస సంకలనం.

మూలాలు

[మార్చు]
  1. తెలుగు బడ్డీస్, ఆధునిక కవులు. "అన్నవరం దేవేందర్‌". Retrieved 27 July 2016.[permanent dead link]
  2. నవతెలంగాణ (22 June 2016). "సాహిత్యపు 'తొవ్వ' మంకమ్మతోట లేబర్‌ అడ్డా". నవతెలంగాణ-కరీంనగర్‌ ప్రతినిధి. Retrieved 27 July 2016.[permanent dead link]
  3. వన్ ఇండియా, సాహితి కవిత. "మన సంతకం". Pratap. Retrieved 23 August 2016.
  4. వన్ ఇండియా, సామితి, కవిత. "ఆపతి సంపతి". ప్రతాప్. Retrieved 23 August 2016.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  5. వన్ ఇండియా, సాహితి, కవిత. "కట్ట మైసమ్మ". ప్రతాప్. Retrieved 23 August 2016.{{cite web}}: CS1 maint: multiple names: authors list (link)
  6. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్, వివిధ. "పాత కత". Retrieved 23 August 2016.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  7. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (23 December 2018). "పది మందికి తెలుగు విశ్వవిద్యాలయ అవార్డులు". www.andhrajyothy.com. Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020.
  8. డైలీహంట్, నమస్తే తెలంగాణ (23 December 2018). "తెలుగు వర్సిటీ 2016 సాహితీ పురస్కారాలు * 2023 - సినారె కవితా పురస్కారం [". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 8 July 2020. Retrieved 8 July 2020. {{cite news}}: line feed character in |title= at position 40 (help)
  9. పోరు తెలంగాణ, TELANGANA NEWS. "తెలంగాణ రచయితల వేదిక నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక". Archived from the original on 26 July 2012. Retrieved 23 August 2016.

ఇతర లంకెలు

[మార్చు]