అబ్బూరి గోపాలకృష్ణ
అబ్బూరి గోపాలకృష్ణ | |
---|---|
జననం | మార్చి 2, 1936 |
మరణం | జనవరి 31, 2017 |
వృత్తి | ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం అధిపతి (రిటైర్డ్) |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు, చిత్రకారుడు |
జీవిత భాగస్వామి | ప్రమీల |
పిల్లలు | హరి |
తల్లిదండ్రులు |
|
అబ్బూరి గోపాలకృష్ణ (మార్చి 2, 1936 - జనవరి 31, 2017) ఆంధ్రప్రదేశ్కు చెందిన నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు, చిత్రకారుడు. ఆంధ్రా యూనివర్సిటీ నాటక విభాగం అధిపతిగా పనిచేసి 1997లో పదవీ విరమణ పొందాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]గోపాలకృష్ణ 1936, మార్చి 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని చిన్నంవారి వీధిలో జన్మించాడు.[2]
కళారంగం
[మార్చు]అంట్యాకుల పైడిరాజు ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలపాటు గోపాలకృష్ణ చిత్రలేఖనం నేర్చుకున్నాడు. హైదరాబాదులోనపి ఫైన్ ఆర్ట్ కళాశాలకు అప్లై చేస్తే సీటు రాలేదు. దాంతో గోపాలకృష్ణ అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు లేఖ రాయగా, ఆయన గోపాలకృష్ణ ప్రతిభ చూసి కళాశాలలో సీటు ఇప్పించాడు. చిత్రలేఖనం పూర్తిచేసిన తరువాత గుంటూరు జిల్లాలో ముస్సబు ఉద్యోగంలో చేరాడు. దాన్ని వదిలేసి ఆంధ్ర విశ్విద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకుడిగా చేరాడు. సెమినార్లు-పత్రికలలో 36 పరిశోధనా పత్రాలను ప్రచురించాడు. 100కి పైగా కవితలు, తొమ్మిది నాటకాలు రాశాడు. అన్నమయ్య యక్షగాన సంప్రదాయం మీద పరిశోధన చేసి పిహెచ్.డి. పట్టా పొందాడు. పదవీ విరమణ చేసిన తరువాత, కళను ప్రోత్సహించడానికి ‘అబ్బూరి కళాకేంద్రం’ను స్థాపించి, వర్ధమాన కళాకారులను ప్రోత్సహించడానికి అనేక ప్రదర్శనలను ఏర్పాటు చేశాడు.[3]
గిరీష్ కర్నాడ్ కన్నడంలో రాసిన నాటకాలను తెలుగులోకి ఆయన అనువదించి ప్రదర్శించాడు. రంగస్థల రూపకల్పన, దర్శకత్వం, పురాతత్వ పరిశోధనలో విశేష సేవలు అందించడమేకాకుండా క్షేత్రస్థాయిలో అనేకమందిని కలిసి వారి నుంచి అనేక వివరాలు తీసుకుని, అన్నమయ్య ఇలా ఉండవచ్చునని ఊహించి చిత్రం గీశాడు. తన గీసిన చిత్రాలను విశాఖ మ్యూజియానికి అందించాడు.[4]
నాటక రచనలు
[మార్చు]- త్రిజాకి యమదర్శనం
- శిరీషిక
- చీకటి చెప్పిన కథ
- లయ
- స్వాతంత్ర్యం
మరణం
[మార్చు]గోపాలకృష్ణ 2017, జనవరి 31న విశాఖపట్నంలోని తన స్వగృహంలో మరణించాడు. మరణానంతరం తన మృతదేహాన్ని ఆంధ్ర వైద్యకళాశాలకు అప్పగించాలని అబ్బూరి వీలునామా రాశాడు.
మూలాలు
[మార్చు]- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (1 February 2017). "బహుముఖ ప్రజ్ఞాశాలి అబ్బూరి మృతి". Sakshi. Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
- ↑ సాక్షి, ఆంధ్రప్రదేశ్ (29 December 2014). "ప్రధాని వచ్చినా సెక్యూరిటీ ఒక్కరే". Sakshi. Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.
- ↑ The Hindu, Visakhapatnam (1 February 2017). "Abburi Gopalakrishna passes away". Archived from the original on 25 February 2021. Retrieved 8 June 2021.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (31 January 2017). "ప్రయోగాత్మక నాటక రచయిత". www.andhrajyothy.com. Archived from the original on 8 June 2021. Retrieved 8 June 2021.