ఆత్రం సక్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆత్రం సక్కు
ఆత్రం సక్కు


పదవీ కాలం
2009–2014
2018 డిసెంబర్ 11 - 2024 డిసెంబర్ 3
ముందు కోవ లక్ష్మీ
తరువాత కోవ లక్ష్మీ
నియోజకవర్గం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1973, మార్చి 2
లక్ష్మీపూర్, గిన్నెదారి, తిర్యాని మండలం, కొమరంభీం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రాజు - మంకుబాయి
జీవిత భాగస్వామి తులసి
సంతానం ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు (దివ్య లక్ష్మీ, వినోద్‌కుమార్‌, అంకిత్‌, అన్వేశ్‌, హిమ బిందు, జంగుబాయి) [1]

ఆత్రం సక్కు తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ తరపున ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యుడిగాసేవాలందించారు.2024 లో జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుండి ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్తి పోటి చేసి ఓటమి చెందాడు .[2][3]

జననం, విద్య

[మార్చు]

సక్కు 1973, మార్చి 2న రాజు - మంకుబాయి దంపతులకు కొమరంభీం జిల్లా, తిర్యాని మండలం, గిన్నెదారి సమీపంలోని లక్ష్మీపూర్ గ్రామంలో జన్మించాడు. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నుండి 1992లో గ్రాడ్యుయేట్ పూర్తిచేశాడు.[4]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

సక్కుకు తులసితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు (వినోద్‌కుమార్‌, అంకిత్‌, అన్వేశ్‌), ముగ్గురు కుమార్తెలు (దివ్య లక్ష్మీ, హిమ బిందు, జంగుబాయి) ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

2009లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.[5][6] తరువాత 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీపై 19వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[7][8] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మీపై 171 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[9][10]అత్రం సక్కు ను 2024 మే నెలలో జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమేంటు స్థానం నుండి లోకసభ ఎంపీ అభ్యర్తిగాభారత రాష్ట్ర సమితి ఎంపిక చేసి పోటిలో దించింది.2024 జూన్ 4 వెలువడిన ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గోడం నగేష్ చేతుల్లో ఓటమి చెంచాడు.[11]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (29 April 2019). "డ్యాన్స్‌ చేస్తా.. డోలు వాయిస్తా.. : ఎమ్మెల్యే". Sakshi. Archived from the original on 7 June 2021. Retrieved 7 June 2021.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-02. Retrieved 2019-05-02.
  3. "Athram Sakku(Indian National Congress(INC)):Constituency- ASIFABAD (ST)(KUMARAM BHEEM ASIFABAD) - Affidavit Information of Candidate".
  4. "Athram Sakku | MLA | Asifabad | Komaram Bheem | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-15. Retrieved 2021-08-31.
  5. I & PR – 1999 Election Results (1999). "1999 Election Results" (PDF). Archived from the original (PDF) on 8 June 2022. Retrieved 8 June 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Eenadu (22 October 2023). "కొలువు వదిలి.. అధ్యక్షా అని పిలిచి". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
  7. "To solve Adivasi problems joining in TRS: MLA Athram Sakku".
  8. https://www.deccanchronicle.com/amp/nation/politics/030319/2-congress-mlas-to-join-telangana-rashtra-samithi.html
  9. "Athram Sakku's gain may become Rekha Naik's loss - the New Indian Express".
  10. "Asifabad Election Result 2018 Live Updates: Candidate List, Winner, MLA, Leading, Trailing, Margin".
  11. telugu, NT News (2024-03-15). "బీఆర్‌ఎస్‌ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కు". www.ntnews.com. Retrieved 2024-04-08.