ఉదయశంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉదయశంకర్
ఉదయశంకర్
జననం
వృత్తిసినిమా దర్శకుడు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1996–ప్రస్తుతం

ఉదయశంకర్, సినిమా దర్శకుడు, రచయిత. 1997లో వచ్చిన పూచుడవ అనే తమిళ సినిమాకి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఉదయశంకర్, 2000లో వచ్చిన కలిసుందాం రా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది,[1] ఉదయశంకర్ కు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు కూడా వచ్చింది.

కెరీర్

[మార్చు]

1997లో అబ్బాస్, సిమ్రాన్ జంటగా నటించిన పూచూడవ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.[2] ఆ తరువాత తెలుగులో వెంకటేష్, సిమ్రాన్ జంటగా కలిసుందాం రా సినిమా తీశాడు. 2001లో నరసింహ నాయుడు విడుదలయ్యేవరకు ఈ సినిమా, 70 సంవత్సరాలలో తెలుగు సినిమా చరిత్రలో అతిపెద్ద హిట్‌గా నిలిచింది.[3]

తరువాత ప్రేమతో రా సినిమా తీశాడు. ఇది ఆశించినంత విజయం సాధించలేదు. తమిళంలో విజయకాంత్ తో తవసి సినిమా తీశాడు, ఈ సినిమా మిశ్రమ సమీక్షలను అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది.[4] తెలుగులో తొట్టెంపూడి గోపీచంద్‌ హీరోగా రారాజు, రవితేజ హీరోగా బలాదూర్ సినిమాలకు దర్శకత్వం వహించాడు.[5][6] చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ భీమవరం బుల్లోడు సినిమా తీశాడు.

సినిమాలు

[మార్చు]

అవార్డులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "47th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2022-07-24.
  2. "Poochudava - Tamil Movie News and Reviews | Tamil Movie News and Reviews". Tamilmovienow.com. 2012-08-08. Archived from the original on 2014-03-24. Retrieved 2022-07-24.
  3. "The Leading Celebrity Profile Site on the Net". celebritiesprofile.info. Archived from the original on 2014-03-24. Retrieved 2022-07-24.
  4. "Welcome to". Sify.com. Archived from the original on 2003-11-17. Retrieved 2022-07-24.
  5. "Raraju review: Raraju (Telugu) Movie Review - fullhyd.com". Movies.fullhyderabad.com. Retrieved 2022-07-24.
  6. "Reviews : Movie Reviews : Baladoor - Movie Review". Telugucinema.com. Archived from the original on 2014-03-24. Retrieved 2022-07-24.
  7. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 2022-07-24.
"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయశంకర్&oldid=3682508" నుండి వెలికితీశారు