ఎస్.పి. సింగ్ బఘేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సత్యపాల్ సింగ్ బఘేల్‌
ఎస్.పి. సింగ్ బఘేల్


న్యాయ శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
7 జులై 2021 – 18 మే 2023
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు రాంశంకర్ కఠారియా
నియోజకవర్గం ఆగ్రా నియోజకబ్వర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1960-06-21) 1960 జూన్ 21 (వయసు 64)[1]
ఏతావా, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2014 - ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు *సమాజ్ వాది పార్టీ (1998 - 2009)
  • బహుజన్ సమాజ్ పార్టీ (2009 - 2014)
జీవిత భాగస్వామి మధు బఘేల్‌
సంతానం 1 కూతురు & 1 కుమారుడు
నివాసం ఆగ్రా
పూర్వ విద్యార్థి జీవాజి యూనివర్సిటీ
మీరట్ కాలేజీ, చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ
డా. భీంరావు అంబెడ్కర్ యూనివర్సిటీ
వెబ్‌సైటు http://www.spsinghbaghel.com

ఎస్.పి. సింగ్ బఘేల్‌ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2021 నుండి 2023 వరకు భారత కేంద్ర మంత్రిమండలి, నరేంద్ర మోదీ మంత్రివర్గంలో న్యాయ శాఖ సహాయ మంత్రిగా పనిచేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ఎస్పీ సింగ్‌ బఘేల్‌ పోలీస్‌ ఎస్‌ఐగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశాడు. ఆయన తర్వాత ఎస్పీ నుంచి మూడుసార్లు ఎంపీగా ఎన్నికై అనంతరం బీఎస్పీలో చేరి 2014లో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. ఎస్పీ సింగ్‌ బఘేల్‌ 2014లో భారతీయ జనతా పార్టీలో చేరి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తుండ్లా అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై యోగి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు. ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆగ్రా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో న్యాయ శాఖ సహా మంత్రిగా పనిచేశాడు.[2]

ఎస్పీ సింగ్‌ బఘేల్‌ 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో క‌ర్హాల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[3] ఆయన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఆగ్రా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. Lok Sabha Member (2021). "S.P. Singh Baghel". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  2. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  3. V6 Velugu (31 January 2022). "యూపీలో అఖిలేష్ ప్రత్యర్థిగా కేంద్ర మంత్రి ఎస్.పి. సింగ్ బఘేల్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Eenadu (11 June 2024). "Union Ministers porfolios: కీలక శాఖలు భాజపాకే". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.