కండువా
Jump to navigation
Jump to search
కండువా లేదా ఉత్తరీయము పురుషుల పెద్దరికానికి, హుందా తనానికి చిహ్నంగా కుర్తా పై అలంకరించుకొనే ఒక వస్త్రము. సాధారణంగా ఇది పంచె, కుర్తా ఏ రంగులో ధరించబడ్డవో అదే రంగులోనే ఉంటుంది. పంచెకు ఉన్న అంచే దీనికి కూడా ఉంటుంది. దీనిని కుడి చేత్తో ఎడమ భుజం పై వేసుకొంటారు. ఎండ, శారీరక శ్రమవలన ఏర్పడే చిరు చెమటలను తుడుచుకొనటానికి, నీటితో శుభ్రపరచిన చేతుల తడి తుడుచుకోవటానికి (టవల్ వలె) దీనిని ఉపయోగిస్తారు. అధిక శ్రమతో కూడిన పనులను చేసే సమయంలో దీనిని భుజం పై నుండి తీసివేసి తలపాగా వలె కట్టుకొంటారు.
కండువా స్థానంలో కొందరు (అసాంప్రదాయికంగా) టవళ్ళను కూడా వాడతారు.
సినిమాలలో ఉత్తరీయం
[మార్చు]- పెదరాయుడు చిత్రంలో రజినీకాంత్ కండువా రెండు చేతులతో తిప్పి భుజంపై వేసుకొనే శైలి చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలచినది.